ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన వ్యక్తమవుతోంది. అమరావతిలో జరుగుతున్న కీలక కేబినెట్ సమావేశానికి హాజరైన పవన్ కళ్యాణ్, అస్వస్థత కారణంగా సమావేశం మధ్యలోనే బయటకు వెళ్లిపోయారు. వెన్నునొప్పితో ఇబ్బంది పడుతున్న ఆయన నేరుగా మంగళగిరిలోని క్యాంప్ కార్యాలయానికి వెళ్లారు. అమరావతిలో ముఖ్యమంత్రి అధ్యక్షతన జరుగుతున్న ఏపీ మంత్రివర్గ సమావేశం కొనసాగుతుండగా, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆరోగ్య సమస్యల కారణంగా అర్ధాంతరంగా సమావేశం నుంచి నిష్క్రమించారు. కొంతకాలంగా వెన్నునొప్పితో బాధపడుతున్న పవన్ కళ్యాణ్, కేబినెట్ సమావేశంలో అసౌకర్యంగా ఫీలైనట్లు సమాచారం. దీంతో సమావేశాన్ని మధ్యలోనే విడిచి వెళ్లిపోయారు. జనసేన కార్యకర్తలు, అభిమానులు డిప్యూటీ సీఎం ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే పవన్ పరిస్థితి నిలకడగానే ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.
CVR NEWS
వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుకు తెలంగాణ హైకోర్టులో తక్షణ ఊరట లభించలేదు. ప్రభుత్వ భూమి ఆక్రమణ ఆరోపణల నేపథ్యంలో దాఖలైన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు, కేసును ఈనెల 11వ తేదీకి వాయిదా వేసింది. అదే సమయంలో ప్రభుత్వం, నార్సింగి పోలీసులకు నోటీసులు జారీ చేస్తూ కీలక ఆదేశాలు ఇచ్చింది. సర్కారు భూములను అక్రమంగా ఆక్రమించారనే ఆరోపణలను ఎదుర్కొంటున్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ముందస్తు బెయిల్ కోసం తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయస్థానం వెంటనే ఎలాంటి ఉపశమనం కల్పించలేదు. ప్రభుత్వ భూముల అంశం, రాజకీయ నాయకుడి ప్రమేయం, ముందస్తు బెయిల్ పిటిషన్ వంటి అంశాలు కలవడంతో ఈ కేసు ఇప్పుడు రాజకీయ, న్యాయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ కేసులో హైకోర్టు తదుపరి విచారణను ఈనెల 11వ తేదీకి వాయిదా వేయడంతో అప్పటి వరకు ఉత్కంఠ కొనసాగనుంది.
అల్లూరి జిల్లాలో విష జ్వరాల విజృంభణ దారుణం సృష్టిస్తోంది. దారకొండ, సీలేరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఒక్కరోజే ఏడు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి . రోజుకి 40 నుంచి 50 మంది పేషెంట్లు ఓపి కింద వస్తున్నారు .కొంతమంది ఆస్పత్రిలో చేరుతున్నారు .దింతో హాస్పిటల్లో కేవలం ఆరు మంచాలు మాత్రమే ఉండటం పరిస్థితిని మరింత కష్టతరం చేస్తుంది . అత్యవసర పరిస్థితుల్లో వైద్యులు ఒక మంచానికి ఇద్దరు , ముగ్గురిని పడేసి సేవలు అందించాల్సి వస్తోంది. మెరుగైన వైద్యం కోసం చింతపల్లి ఏరియా హాస్పిటల్ కు వెళ్లాలంటే 70 కిలోమీటర్ల దూరం. దింతో గ్రామస్తులకు ఇది పెద్ద ఇబ్బందిగా మారింది . స్థానికులు, ప్రజా ప్రతినిధులు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుని, ఈ గిరిజన ప్రాంతానికి అన్ని వసతులతో పద్ధతిగా వైద్యం అందించాలని డిమాండ్ చేస్తున్నారు.
సీలేరు, దారకొండ ప్రాథమిక కేంద్రాల్లో వైద్య సదుపాయాల లోపం గిరిజనుల జీవితాన్ని కష్టతరం చేస్తోంది. హాస్పిటల్లో సరైన సిబ్బంది లేకపోవడం, ఒక్క డాక్టర్ మాత్రమే ఉండటం, అత్యవసర పరిస్థితుల్లో పేషెంట్ల కోసం సరైన వైద్యం అందకపోవడం ప్రధాన సమస్యగా మారింది. పేషెంట్లు అంబులెన్స్ కోసం గంటల తరబడి వేచిచూడాల్సి న పరిస్థితి నెలకొంది .దింతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని వైద్యులు నియమించాలని , సదుపాయాలను పెంచాలని , ప్రతి పేషెంట్‌కు తక్షణ సేవ అందించాలని స్థానికులు కోరుతున్నారు . ఇలాంటి వాటి పై తక్షణం చర్యలు తీసుకుంటే, విష జ్వర ప్రభావాన్ని తగ్గించడంతో పాటు గ్రామీణుల ఆరోగ్య భద్రతను కాపాడవచ్చని నిపుణులు అంటున్నారు .
విజయనగరం జిల్లా గరివిడి మండలంలో భారీ భూ కుంభకోణం జరిగిందన్న ఆరోపణలు సంచలనం సృష్టిస్తున్నాయి. వెదుళ్లవలస మాజీ సర్పంచ్ గుడివాడ తమ్మినాయుడు, అప్పటి తహశీల్దార్ బంగార్రాజు కుమ్మక్కై సుమారు 24 ఎకరాల ప్రభుత్వ భూమిని నకిలీ రికార్డుల ద్వారా వారి కుటుంబ సభ్యుల పేరిట నమోదు చేయించుకున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. వెదుళ్లవలస, బాగువలస రెవెన్యూ గ్రామాల పరిధిలో ఉన్న ప్రభుత్వ భూములు, కొండలు, గుట్టలను సైతం వదలకుండా 2005, 2007 సంవత్సరాల నాటి అసైన్మెంట్ పత్రాలను ఆధారంగా చూపిస్తూ అక్రమంగా మ్యుటేషన్లు చేయించి ఆన్లైన్ రికార్డుల్లో నమోదు చేసినట్లు చెబుతున్నారు.
వెదుళ్లవలస గ్రామంలో 2.54 ఎకరాలు, బాగువలస గ్రామంలో 21.55 ఎకరాలు కలిపి మొత్తం 24.09 ఎకరాల భూమి మాజీ సర్పంచ్ కుటుంబ సభ్యుల పేరిట నమోదు అయినట్లు ఆరోపణలు ఉన్నాయి. భార్య, తండ్రి, సోదరులు, సోదరీమణుల పేర్లపై ఖాతాలు సృష్టించి ప్రభుత్వ భూమిని స్వాహా చేశారంటూ స్థానికులు మండిపడుతున్నారు.ప్రభుత్వ భూముల రక్షణకు ఉన్న చట్టాలను పక్కనపెట్టి అక్రమంగా రికార్డులు మార్చారని, ఈ వ్యవహారంలో బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. జిల్లా కలెక్టర్, రెవెన్యూ ఉన్నతాధికారులు వెంటనే విచారణ జరిపి అక్రమ మ్యుటేషన్లను రద్దు చేసి ప్రభుత్వ భూమిని తిరిగి స్వాధీనం చేసుకోవాలని కోరుతున్నారు.గరివిడి మండలంలో కలకలం రేపుతున్న ఈ భూ వ్యవహారంపై అధికార యంత్రాంగం ఎలా స్పందిస్తుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
రష్యా నుంచి ఎస్-400 సుదర్శన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టం నాల్గవ స్క్వాడ్రన్ భారత్‌కు చేరుకుంది. దీంతో భారత గగనతల రక్షణ మరింత బలోపేతం కానుంది. ఎస్-400 సుదర్శన్ సుదీర్ఘ శ్రేణి ఎయిర్‌డిఫెన్స్ సిస్టం రష్యా నుంచి నౌకలో భారత్‌కు వచ్చినట్టు తెలిపాయి రక్షణ శాఖ వర్గాలు. త్వరలోనే ఆపరేషన్ ఏరియాలో దీనిని మోహరించనున్నట్టు వెల్లడించాయి. భారత్ 2018లో 35 వేల కోట్లతో 5 స్క్వాడ్రన్ల కొనుగోలుకు రష్యాతో ఒప్పందం చేసుకుంది. ఇందులో 3 స్క్వాడ్రన్లను రెండేళ్ల క్రితమే భారత్ అందుకుంది. నాల్గవది తాజాగా భారత్ చేరుకుంది. మరి కొద్ది నెలల్లోనే 5వ స్క్వాడ్రన్ కూడా భారత్‌కు చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు.
ఆపరేషన్ సిందూర్ సమయంలో పాక్ జరిపిన డ్రోన్, క్షిపణులను ఎస్-400 సుదర్శన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అత్యంత సమర్ధవంతంగా కూల్చివేసింది. ఏకకాలంలో 300 లక్ష్యాలను ట్రాక్ చేసి, 40 నుంచి 400 కిలోమీటర్ల దూరంలోని శత్రు క్షిపణులను, డ్రోన్లు, స్టెల్త్ ఫైటర్ జెట్లను ఈ ఎయిర్ డిఫెన్స్ సిస్టం సమర్ధవంతంగా తిప్పికొట్టగలదు. ఐతే భారత్ సైతం రష్యా సిస్టమ్ తరహాలోనే శత్రువిమానాలను కుప్పకూల్చే డిఫెన్స్ సిస్టమ్ ‘కుషా’ను స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేస్తోంది. దీని అభివృద్ధి, ఉత్పత్తిలో భాగస్వామిగా ఇండియన్ డిఫెన్స్ మేజర్ సోలార్ ఇండస్ట్రీలు భాగస్వామిగా వ్యవహరిస్తున్నాయి. రష్యా నుంచి ప్రస్తుతం అందుకున్న ఎస్-400 సుదర్శన్ ఎయిర్ డిఫెన్స్‌ను పశ్చిమబెంగాల్లో మోహరించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
తెలంగాణ-కర్ణాటక సరిహద్దుల్లో చెత్త సెగలు రేపుతోంది.. కర్ణాటకలోని బీదర్ మున్సిపాలిటీ చెత్త తెలంగాణ సరిహద్దు ప్రజల ప్రాణాల మీదకు తెస్తోంది..ఆ చెత్త కంపు వల్ల రోగాల బారిన పడుతున్నామని తెలంగాణ సరిహద్దు గ్రామస్తులు రోడ్డెక్కి నిరసన తెలపాల్సిన పరిస్థితి.. కర్ణాటక-తెలంగాణ సరిహద్దుల్లో నెలకొన్న డంపింగ్ యార్డ్ ఇష్యూపై సివిఆర్ న్యూస్ స్పెషల్ ఫోకస్…
తెలంగాణ-కర్ణాటక బోర్డర్లోని న్యాల్కల్ మండలం మల్గి గ్రామ సరిహద్దులో గాలి పీల్చాలంటేనే స్థానికులు భయపడిపోతున్నారు..గత కొన్ని రోజులుగా కంటి నిండా నిద్రలేదు.. ఒంటి నిండా రోగాలతో సరిహద్దు ప్రాంతంలో ఉన్న ప్రజలు అల్లాడిపోతున్నారు. సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండల పరిధిలోని మల్గి గ్రామస్తులు గత కొద్ది రోజులుగా నరకం చూస్తున్నారు.. కర్ణాటక రాష్ట్రంలోని బీదర్ నగరం నుంచి వందలాది టన్నుల వ్యర్థాలను తెలంగాణ సరిహద్దు గ్రామాలకు ఆనుకుని ఉన్న సుల్తాన్పూర్ డంపింగ్ యార్డ్‌లో పారబోస్తుండటంతో పర్యావరణం కలుషితమవుతోందనీ స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.. కర్ణాటకలోని బీదర్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రతిరోజూ తరలిస్తున్న టన్నుల కొద్దీ చెత్తతో ఈ ప్రాంతం డెత్ జోన్‌గా మారుతోంది.
బీదర్ నగరానికి చెందిన సుల్తాన్పూర్ డంపింగ్ యార్డ్ సరిగ్గా తెలంగాణ బోర్డర్ గ్రామాలకు ఆనుకుని ఉంటుంది. నిబంధనల ప్రకారం రీసైక్లింగ్ చేయాల్సిన మున్సిపాలిటీ.. ఇక్కడ బహిరంగంగా చెత్తను తగలబెడుతోంది..ఆ విషపూరిత పొగ,దుర్వాసన న్యాల్కల్ మండలంలోని గ్రామాలను కమ్మేస్తోంది..ఈగలు, దోమల తాకిడి పెరిగి చిన్నపిల్లలు, వృద్ధులు ఆస్పత్రుల పాలవుతున్నారు. ప్రతిరోజూ బీదర్ మున్సిపాలిటీ నుంచి సుమారు 40 టన్నులకు పైగా చెత్త సేకరించి సరిహద్దు గ్రామమైన సుల్తాన్పూర్ డంపింగ్ యార్డ్‌కు తరలిస్తారు. అయితే, ఈ వాహనాలన్నీ తెలంగాణ పరిధిలోని మల్గి గ్రామం మీదుగానే వెళ్లాల్సి వస్తోంది. తరలింపు సమయంలో వాహనాల నుంచి కుళ్ళిన మురుగునీరు రోడ్లపై కారుతూ తీవ్ర దుర్వాసన వెదజల్లుతోంది. దీనికి తోడు, సుల్తాన్పూర్ డంపింగ్ యార్డులో నిబంధనలకు విరుద్ధంగా చెత్తను తగలబెడుతుండటంతో ఆ విషపూరితమైన పొగ మల్గి పరిసర గ్రామాలను పూర్తిగా కమ్మేస్తోంది…
గత వారం రోజులుగా మల్గి గ్రామస్తులు ఈ దారి గుండా ఒక్క చెత్త బండిని కూడా పోనివ్వకుండా రోడ్డు పై బైఠాయించి నిరసన తెలుపుతున్నారు..బీదర్ మున్సిపాలిటీ వ్యర్థాల రీసైక్లింగ్ కోసం సుల్తాన్పూర్ లో వేస్ట్ ప్రాసెసింగ్ యూనిట్ నిర్మిస్తామని ఏళ్ల క్రితం ప్రకటించినా,అది నేటికీ పూర్తిస్థాయిలో కార్యరూపం దాల్చలేదు..ఫలితంగా పొరుగు రాష్ట్రం చేస్తున్న పర్యావరణ నేరానికి తెలంగాణ సరిహద్దు ప్రజలు బలిపశువులవుతున్నారు. ఇప్పటికైనా సంగారెడ్డి జిల్లా ఉన్నతాధికారులు, తెలంగాణ ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని కర్ణాటక ప్రభుత్వంతో చర్చలు జరపాలని, మల్గి గ్రామం మీదుగా చెత్త తరలింపును శాశ్వతంగా అడ్డుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు..
తెలంగాణ ప్రభుత్వం భూములు, ప్లాట్లు, ఫ్లాట్ల మార్కెట్ విలువల సవరణకు ఆమోదం తెలిపింది. కొత్త మార్కెట్ విలువలు ఈ నెల 5వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమల్లోకి రానున్నాయి. క్షేత్రస్థాయి అధ్యయనం, మార్కెట్ ధరలు, రిజిస్ట్రేషన్ల ధోరణి, డిమాండ్ వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. రాష్ట్రంలోని 144 సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో భూముల మార్కెట్ విలువలు పెరిగాయి. ఔటర్ రింగ్ రోడ్ రీజినల్ రింగ్ రోడ్ , అభివృద్ధి కారిడార్లు వంటి ప్రాజెక్టుల ప్రభావాన్ని కూడా ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంది. ఈ ప్రాంతాల్లో భూముల విలువలు గణనీయంగా పెరిగిన నేపథ్యంలో మార్కెట్ విలువలను సవరించింది. ఫ్లాట్ల మార్కెట్ విలువల్లో ఉన్న అసమానతలను తొలగించేందుకు హేతుబద్ధీకరణ చేపట్టింది. కొన్ని ప్రాంతాల్లో అన్ని అంతస్తుల ఫ్లాట్లకు ఒకే మార్కెట్ విలువను అమలు చేయాలని నిర్ణయించింది. అలాగే HMDA, CURE, ఇతర ప్రాంతాలకు కనీస ప్రాథమిక మార్కెట్ రేట్లను నిర్ణయించింది.
వ్యవసాయ భూములు, ప్లాట్లు, ఫ్లాట్లకు కొత్త కనీస మార్కెట్ విలువలను ఖరారు చేయడంతో పాటు నిర్మాణ సామగ్రి ధరల పెరుగుదలను దృష్టిలో ఉంచుకుని నిర్మాణ రేట్లను కూడా సవరించింది. ఆర్సీసీ, నాన్-ఆర్సీసీ నిర్మాణాలకు సంబంధించిన విలువల్లో మార్పులు చేసింది. భూ లావాదేవీల్లో పారదర్శకతను పెంచడం, మార్కెట్ ధరలకు అనుగుణంగా రిజిస్ట్రేషన్ విలువలను నిర్ణయించడం ఈ సవరణల ప్రధాన లక్ష్యమని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.
ఉమ్మడి పాలమూరు జిల్లా సాగునీటి ప్రాజెక్టులకు మరింత వేగం తీసుకురావాలనే లక్ష్యంతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ, రేపు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో విస్తృత పర్యటన చేపట్టనున్నారు. రెండు రోజుల పాటు కొనసాగే ఈ పర్యటనలో పలు ఎత్తిపోతల పథకాలు, రిజర్వాయర్లు, పంప్‌హౌస్‌లు, ప్రతిపాదిత బ్యారేజీలను క్షేత్రస్థాయిలో పరిశీలించడంతో పాటు అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశాలు నిర్వహించనున్నారు. రాష్ట్రంలో ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంతో పాటు ఇతర కీలక సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై సీఎం ప్రత్యేక దృష్టి సారించనున్నారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. జడ్చర్లలోని కల్వకుర్తి ఎక్స్ రోడ్ వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్, భద్రతా ఏర్పాట్లను పర్యాటక, సాంస్కృతిక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ విప్ యెన్నెం శ్రీనివాస్ రెడ్డి, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డితో కలిసి పరిశీలించారు. సీఎం పర్యటన విజయవంతం అయ్యేలా అన్ని ఏర్పాట్లను వేగంగా పూర్తి చేస్తున్నారు.
మేడ్చల్ జిల్లా మేడిపల్లి పిఎస్ పరిధి బోడుప్పల్ లో పాత కక్షల నేపథ్యంలో ఓ యువకుడిపై కొందరు బ్లేడ్‌తో దాడి చేసిన ఘటన కలకలం రేపింది. ఇందిరానగర్‌కు చెందిన మంద సాయి కుమార్ తన స్నేహితులతో కలిసి ఓ వైన్స్‌లో మద్యం సేవించి బయటకు వస్తున్న సమయంలో ఈ సంఘటన చోటుచేసుకుంది .ఆ సమయంలో చిలుకానగర్ వైపు నుంచి బైక్‌పై వచ్చిన జాన్, పవన్ తో పాటు మరికొందరు సాయి కుమార్‌ను అడ్డగించి వాగ్వాదానికి దిగారు. మాటామాటా పెరగడంతో సాయి కుమార్ ఎదురుతిరగగా జాన్ తన వద్ద ఉన్న పదునైన బ్లేడ్‌ను తీసి సాయి కుమార్ మెడపై దాడి చేసినట్లు తెలుస్తుంది. దాడిలో సాయి కుమార్ మెడకు తీవ్ర గాయమై రక్తస్రావం కావడంతో అతడిని వెంటనే బోడుప్పల్ లోని ఓ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.పాత కక్షలే దాడికి కారణమని తెలుస్తోంది .దాడికి పాల్పడిన పవన్,, బాధితుడు సాయి కుమార్ ఇద్దరు బోడుప్పల్ ఇందిరా నగర్ ప్రాంతానికి చెందిన వారే. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
గత ప్రభుత్వం రాష్ట్రాన్ని ‘నిరుద్యోగ ఆంధ్రప్రదేశ్’గా మార్చిందన్న టీఎన్ఎస్ఎఫ్.
గత ప్రభుత్వం రాష్ట్రాన్ని ‘నిరుద్యోగ ఆంధ్రప్రదేశ్’గా మార్చితే, ప్రస్తుత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే ‘ఉద్యోగాల ఆంధ్రప్రదేశ్’గా తీర్చిదిద్దుతోందని టీఎన్ఎస్ఎఫ్ పేర్కొంది . విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో కూటమి విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది.
ఎన్నికల హామీ మేరకు ఇప్పటికే మెగా డీఎస్సీని నిర్వహించామని, ఐటీ సహా అనేక రంగాల్లో ప్రపంచస్థాయి పెట్టుబడులను రాష్ట్రానికి రప్పిస్తున్నామని కూటమి కూటమి విద్యార్థి విభాగం నేతలు వెల్లడించారు . ఉద్యోగ కల్పన కోసం కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే వాటిని అడ్డగించేందుకు వైసిపి కోర్టుకు వెళుతుందన్నారు. రాయలసీమ వంటి ప్రాంతాల్లో పరిశ్రమలను ఏర్పాటు చేసి, వలసలను నివారించడమే కాకుండా ఇతర ప్రాంతాల వారు ఇక్కడికి ఉద్యోగాల కోసం వచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుదన్నారు .





Total views : 141538