Sunday, September 13, 2026
News Navigation
Sunday, September 13, 2026
News Navigation

Breaking

Sunday, September 13, 2026
Home Telangana మంత్రి సీతక్క ను అవమానించిన బండి సంజ‌య్

మంత్రి సీతక్క ను అవమానించిన బండి సంజ‌య్

by Rama
మంత్రి సీతక్క ను అవమానించిన బండి సంజ‌య్

తెలంగాణ కేబినెట్ లో మాజీ మావోయిస్టులున్నారని కేంద్ర మంత్రి బండి సంజ‌య్ చేసిన వ్యాఖ్యల‌పై మంత్రి సీతక్క ఫైర్ అయ్యారు. అట్టడుగు స్థాయి నుంచి ఎదిగొచ్చిన ఆదివాసి బిడ్డను అవ‌మాన ప‌రిచే కుట్ర జ‌రుగుతోంద‌ని సీతక్క భావోద్వేగానికి గురయ్యారు. కేబినెట్ లోనక్సలైట్ బ్యాగ్రౌండ్ నుంచి వ‌చ్చింది తానొక్కరే అని, అంత మాత్రానా మొత్తం క్యాబినెట్ కు న‌క్సలైట్ ముద్ర ఆపాదించ‌డం సరికాదని మండిపడ్డారు. 2004 లో మొద‌టిసారి తాను ఎమ్మెల్యేగా పోటిచేసిన‌ప్పుడు బీజేపీ నాకు మ‌ద్దతిచ్చి ప్రచారం చేసిందని, అప్పుడు నా బ్యాక్ గ్రౌండ్ బీజేపీ నేత‌ల‌కు తెలియ‌దా? అని ప్రశ్నించారు. జ‌న‌జీవ‌న స్రవంతిలో కలిసాక..న‌ల్లకోటు వేసుకుని లాయర్ గా ప్రజల ప‌క్షనా ఎన్నో కేసులు వాదించానని, భారత రాజ్యాంగం క‌ల్పించిన హ‌క్కుల‌తోనే మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నిక‌య్యానని తెలియజేశారు. బండి సంజ‌య్ త‌న వ్యాఖ్యల‌ను త‌క్షణం వెన‌క్కు తీసుకోవాలని సీతక్క డిమాండ్ చేశారు.

FOLLOW US ON : FACE BOOKINSTAGARAMYOU TUBE, GOOGLE NEWS

  • శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్‌రెడ్డి.
    హైదరాబాద్ ఉప్పల్ భగాయత్‌లో ఆర్యవైశ్య ఆత్మగౌరవ భవన్‌కు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య సేవలను సీఎం రేవంత్‌రెడ్డి గుర్తు చేసుకున్నారు. ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చినా.. రోశయ్య మాత్రం తన ప్రత్యేకతను…
  • ‘మండాడి’ని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన తెలుగు ఆడియెన్స్‌కి థాంక్స్..
    ‘మండాడి’ని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన తెలుగు ఆడియెన్స్‌కి థాంక్స్.. యునానిమస్ బ్లాక్ బస్టర్ సెలెబ్రేషన్స్‌‌లో హీరో సూరి మంచి విజయాన్ని ఇచ్చిన ఆడియెన్స్‌కి థాంక్స్.. ‘మండాడి’ యునానిమస్ బ్లాక్ బస్టర్ సెలెబ్రేషన్స్‌‌లో హీరో సుహాస్ ఎల్రెడ్ కుమార్ సమర్పణలో ఆర్ఎస్…
  • నడ్డాకు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు.
    ఏపీలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా పర్యటిస్తున్నారు. విజయవాడకు చేరుకున్న కేంద్రమంత్రికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ఘన స్వాగతం పలికారు. రాష్ట్రంలో వైద్య మౌలిక వసతులను మరింత బలోపేతం చేసే దిశగా కీలక కార్యక్రమాలకు నడ్డా…
  • మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో మోదీ భేటీ.
    బ్రిక్స్ ఇండియా 2026 సదస్సు నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ, మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం మధ్య కీలక ద్వైపాక్షిక భేటీ జరిగింది. న్యూఢిల్లీలో జరిగిన ఈ సమావేశంలో భారత్‌–మలేషియా సంబంధాలకు సంబంధించిన పలు అంశాలపై ఇరువురు నేతలు చర్చించారు.…
  • ఏడేళ్ల తరువాత భారత్ కు చైనా అధ్యక్షుడు జిన్ పింగ్.
    ఏడేళ్ల తర్వాత చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ భారత్‌ పర్యటనకు రానున్నారు. గాల్వాన్ వ్యాలీ ఘటన తర్వాత తొలిసారిగా భారత్‌కు వస్తున్న జిన్‌పింగ్‌ పర్యటనపై అంతర్జాతీయంగా ఆసక్తి నెలకొంది. మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రత్యేక విమానంలో ఢిల్లీకి చేరుకోనున్న జిన్‌పింగ్‌తో పాటు…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: