జిల్లా కలెక్టర్లతో ఏపీ సీఎం చంద్రబాబు నేడు విస్తృత సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. తన ఆలోచనలు, కూటమి ప్రభుత్వ విధానాలను వారికి వివరించి దిశానిర్దేశం చేయనున్నారు. గత ప్రభుత్వ వైఫల్యాలను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి, ప్రజాసంక్షేమం కోసం అమలు చేయాలనుకున్న బహుముఖ వ్యూహాన్ని కలెక్టర్లు, ఆయా శాఖల ముఖ్య కార్యదర్శులతో చర్చించి దాని అమలుకు కార్యాచరణను ఇవ్వనున్నారు. ముఖ్యమంత్రిగా 1995 నాటి మోడల్‌ను అమలు చేస్తానని ఇప్పటికే చంద్రబాబు పలుమార్లు ప్రకటించారు.నేడు కలెక్టర్లతో సీఎం చంద్రబాబు సమావేశం. ఈ నేపథ్యంలో పరిపాలనలో గుణాత్మకమైన మార్పు తీసుకురావాలని ఆయన భావిస్తున్నారు. చంద్రబాబు అంటే కేవలం అభివృద్ధికే ప్రాధాన్యం ఇస్తారన్న విమర్శలకు దీటుగా బదులివ్వడానికి సన్నద్ధమవుతున్నారు. పేదలే లక్ష్యంగా సంక్షేమం అందించేలా ఇప్పటికే సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తున్నారు. ప్రతీ పేద కుటుంబంలోని లబ్ధిదారులకు ఒకటో తేదీనే ఫించను సొమ్ము అందేలా కూటమి ప్రభుత్వం కృషి చేస్తోంది. ఇలా కుటుంబంలో వ్యక్తిని ఒక యూనిట్‌గా తీసుకొని అభివృద్ధి పథంలోకి తీసుకువచ్చేలా సంక్షేమ కార్యాచరణను రూపొందించారు. సంక్షేమంతో పాటు అభివృద్ధికీ ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- ఏలూరు జిల్లా నూజివీడులో ప్రతిభావంతులైన విద్యార్థులకు మంత్రి సత్కారం..రాష్ట్ర ప్రభుత్వం విద్యాభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారధి తెలిపారు. ఏలూరు జిల్లా నూజివీడులోని బాలికల ఉన్నత పాఠశాలలో కొలుసు పెద్దరెడ్డయ్య చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో…
- శ్రీకాళహస్తిలో నూతన టూ టౌన్ పోలీస్ స్టేషన్ భవనం ప్రారంభం..శ్రీకాళహస్తి నియోజకవర్గ ప్రజలకు పోలీస్ సేవలు మరింత చేరువయ్యాయి. పట్టణంలో నూతనంగా నిర్మించిన టూ టౌన్ పోలీస్ స్టేషన్ భవనాన్ని రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత, జిల్లా ఇన్చార్జ్ మంత్రి అనగాని సత్యప్రసాద్ కలిసి ఘనంగా ప్రారంభించారు.దాదాపు రూ.2 కోట్ల…
- భారతీయ వ్యాపార దిగ్గజం, అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ, ఆయన మేనల్లుడు సాగర్ అదానీకి అమెరికాలో భారీ ఉపశమనం లభించింది..భారతీయ వ్యాపార దిగ్గజం, అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ, ఆయన మేనల్లుడు సాగర్ అదానీకి అమెరికాలో భారీ ఉపశమనం లభించింది. న్యూయార్క్‌లో కొనసాగుతున్న హై-ప్రొఫైల్ సెక్యూరిటీస్, వైర్ ఫ్రాడ్ కేసులో ఉన్న అన్ని క్రిమినల్ ఆరోపణలను అమెరికా న్యాయ శాఖ…
- చీర కట్టు, నుదుటన బొట్టుతో ఓ భారత నటి ప్రతిష్టాత్మక కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో అదరగొట్టింది.చీర కట్టు, నుదుటన బొట్టుతో ఓ భారత నటి ప్రతిష్టాత్మక కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో అదరగొట్టింది. ప్రముఖ మహారాష్ట్ర నటి ప్రజక్తా మాలి కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో తన సాంప్రదాయిక లుక్‌తో అందరినీ మంత్రముగ్ధులను చేసింది. పాశ్చాత్య దుస్తుల హడావుడి…
- దేశం రవాణా రంగంలో విప్లవాత్మక మార్పునకు నాంది పలుకుతూ.దేశం రవాణా రంగంలో విప్లవాత్మక మార్పునకు నాంది పలుకుతూ.. కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ దేశంలోనే మొట్టమొదటి బుల్లెట్ రైలు కు సంబంధించిన అధికారిక ‘ఫస్ట్ లుక్’ వీడియోను విడుదల చేసింది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, ఏరోడైనమిక్ డిజైన్‌తో మెరిసిపోతున్న ఆ…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి





Total views : 80624