Monday, June 1, 2026
News Navigation
Monday, June 1, 2026
News Navigation

Breaking

Monday, June 1, 2026
Home Telangana మద్యం మత్తులో మందుబాబు … ట్రాఫిక్ పోలీసులకు చుక్కలు

మద్యం మత్తులో మందుబాబు … ట్రాఫిక్ పోలీసులకు చుక్కలు

by Rama
మద్యం మత్తులో మందుబాబు … ట్రాఫిక్ పోలీసులకు చుక్కలు

హైద‌రాబాద్ లోని చంపాపేట్‌లో శ‌నివారం రాత్రి మద్యం సేవించి ఓ వ్యక్తి స్కూటీపై వచ్చాడు. చెకింగ్ చేస్తున్న మీర్చౌక్ పోలీసులు అతన్ని ఆపారు. బ్రీత్ ఎనలైజర్ పరీక్షలో మద్యం మత్తులో ఉన్నట్లు నిర్దారించారు. దీంతో ట్రాఫిక్ పోలీసులకు డ్రంకెన్ డ్రైవ్ కేసులో అతగాడు దొరికిపోయాడు. పోలీసులు అతడి స్కూటీని సీజ్ చేసేందుకు ప్రయత్నించగా.. ఆ మందు బాబు పోలీసులపై చిందులేశాడు . చొక్కా విప్పి రచ్చరచ్చ చేశాడు. రోడ్డుపై బీభత్సం సృష్టించాడు. దీంతో ట్రాఫిక్ సిబ్బంది అతడిని అదుపు చేసేందుకు ప్రయత్నించారు.

ఈ క్రమంలో ఆ మందుబాటు చేతిలో పెద్ద బండరాయి తీసుకుని పోలీసులపై దాడికి దిగాడు. ఆ వ్యక్తి తన స్కూటీకి నిప్పు పెట్టేందుకు కూడా ప్రయత్నించాడు. వెంటనే పోలీసులు అత‌న్ని అదుపులోకి తీసుకుని పోలీసు స్టేష‌న్‌కు త‌ర‌లించారు. అనంతరం ట్రాఫిక్ పోలీసులు వాహనాన్ని సీజ్ చేసి, పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

FOLLOW US ON : FACE BOOKINSTAGARAMYOU TUBE, GOOGLE NEWS

  • ఐఐటి ఫలితాలలో విశ్వభారతి విజయకేతనం.
    ఐఐటి ఫలితాలలో కృష్ణాజిల్లా గుడివాడ విశ్వభారతి విద్యాసంస్థలు విజయకేతనం ఎగురవేశాయి. ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్ సాధించిన తోట సాయి వినీల్ కు పాఠశాల చైర్మన్ పొట్లూరి శ్రీమన్నారాయణ శుభాకాంక్షలు తెలియజేశారు. తమ పాఠశాలలో ఎనిమిదవ తరగతి నుండి పదవ తరగతి…
  • హైదరాబాద్ ఉప్పల్ లో కాంగ్రెస్ నేత దౌర్జన్యం.
    హైదరాబాద్ ఉప్పల్ లో అమానవీయ ఘటన వెలుగుచూసింది. చిన్నారులు ఇంటి ముందు క్రికెట్ ఆడారని అధికార పార్టీ నాయకుడు పిల్లల తల్లిదండ్రుల పట్ల అమానుషంగా ప్రవర్తించిన ఘటన వీడియో వైరల్ అయింది. తల్లిదండ్రులపై దాడి చేయడమే కాకుండా తన అధికార బలంతో…
  • జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ సంచలన నిర్ణయం.
    ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు, సేనా గళం పేరుతో కొత్త కమిటీ ఏర్పాటు చేశారు.అమరావతిలో జనసేన ముఖ్య నేతలతో సమావేశమయ్యారు పవన్ కళ్యాణ్. వివిధ అంశాలపై చర్చించారు. అనంతరం సేనా గళం పేరుతో…
  • అమెరికాలో ఓ భారత సంతతి కుటుంబంలో విషాదం.
    అమెరికాలో ఓ భారత సంతతి కుటుంబంలో పెళ్లి సంబరాలు విషాదంగా మారాయి. వివాహం జరిగిన కొద్ది గంటల్లోనే వరుడు హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో ఇరు కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. జార్జియాలో జరిగిన ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. కేరళ…
  • శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తుల సందడి..
    నంద్యాల జిల్లా శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తులు సందడి నెలకొంది. వేసవి సెలవులు కావడంతో భక్తులు భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనానికి పోటెత్తారు. క్యూలైన్లన్నీ భక్తులతో నిండిపోయాయి. భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో అలంకార దర్శనానికి అనుమతినిచ్చారు. ముందుగా ఆన్లైన్లో బుక్…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Our Visitor

019341
Total views : 90432

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.