Friday, July 17, 2026
News Navigation
Friday, July 17, 2026
News Navigation

Breaking

Friday, July 17, 2026
Home Telangana భూ కబ్జా కేసులో.. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే

భూ కబ్జా కేసులో.. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే

by Rama
భూ కబ్జా కేసులో.. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే

బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ పై మరో కేసు నమోదు అయ్యింది. తమ భూమిని ఆక్రమణకు గురి చేశారని ఓ మహిళ హనుమకొండలోని సుబేదారి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. హంటర్ రోడ్డు దుర్గాదేవి కాలనీలో 500 గజాల స్థలాన్ని మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్, అతని అనుచరులు ఆక్రమణకు ప్రయత్నిస్తున్నారని చెప్పారు.తనకు పసపు కుంకుమల కింద వచ్చిన ఇంటి స్థలాన్ని మాజీ ఎమ్మెల్యే అనుచరులు కబ్జాకు ప్రయత్నించడమే గాక.. ఇదేమిటని అడిగిన తమపై దాడి చేసి, లక్ష ఇరవై వేల రూపాయల ఫోన్లు లాక్కొని, చంపుతామని బెదిరించి వెళ్లారని తెలిపారు. అంతేగాక ఆక్రమణకు గురి చేసిన స్థలంలో ఉన్న 3 లక్షల విలువ చేసే కంటైనర్ హోమ్ తో పాటు ఇతర వస్తువులు దొంగిలించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇక శంకర్ నాయక్, అతని అనుచరుల నుంచి తమకు ప్రాణహాని ఉందని వెంటనే వారిపై తగు చర్యలు తీసుకోవాలని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా బీఆర్ఎస్ హయాంలో ఎమ్మెల్యే గా ఉన్న శంకర్ నాయక్ భూకబ్జాలకు పాల్పడ్డారనే ఆరోపణలతో ఇదివరకే పలు కేసులు నమోదు అయ్యాయి.

FOLLOW US ON : FACE BOOKINSTAGARAMYOU TUBE, GOOGLE NEWS

  • చైనాపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన ఆరోపణలు.
    అమెరికా ఎన్నికల వ్యవస్థలో చైనా భారీగా జోక్యం చేసుకుందని, ఏకంగా 22 కోట్ల మంది ఓటర్ల డేటాను దొంగిలించిందని సంచలన ఆరోపణలు చేశారు US ప్రెసిడెంట్‌ డొనాల్డ్ ట్రంప్. అమెరికా చరిత్రలోనే ఇది అతిపెద్ద ఎన్నికల డేటా చౌర్యం అని ఆరోపించారు.…
  • అన్నమయ్య జిల్లాలో ఘనంగా విరుపాక్షమ్మ తల్లి పుష్కరోత్సవాలు.
    అన్నమయ్య జిల్లా చిన్నమండెం మండలం బోరెడ్డిగారిపల్లిలోని శ్రీ విరుపాక్షమ్మ తల్లి ఆలయంలో పుష్కరోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయ నిర్మాణానికి 12 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా నిర్వహిస్తున్న ఈ ఉత్సవాల్లో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి దంపతులు ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.మూడు…
  • దేశంలో పట్టాలెక్కిన తొలి హైడ్రోజన్ రైలు.
    భారత రైల్వే చరిత్రలో నూతన శకం ఆరంభమైంది. రైల్వే రంగంలో పర్యావరణహిత విధానాలను ప్రవేశపెట్టే దిశగా కీలక ముందడుగు పడింది. దేశంలోనే తొలిసారిగా హైడ్రోజన్‌తో నడిచే రైలు పట్టాలెక్కింది. హర్యానాలోని జింద్‌ రైల్వే స్టేషన్‌లో ప్రధాని మోదీ జెండా ఊపి ప్రారంభించారు.…
  • పశ్చిమ బెంగాల్‌లో రైలు ప్రమాదం.
    పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్‌లో విషాదం నెలకొంది. స్కూల్ బస్సును రైలు ఢీకొట్టిన ఘటనలో ముగ్గురు మృతి చెందగా పలువురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. ఉదయం 7 గంటల ప్రాంతంలో ఓ స్కూల్ బస్సు కర్ణసుబర్ణ రైల్వే క్రాసింగ్ దగ్గర పట్టాలు దాటుతుండగా…
  • ఇరాన్‍పై మరోసారి అమెరికా దాడులు.
    పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు మరింత ఉధృతమయ్యాయి. ప్రపంచ చమురు రవాణాకు గుండెకాయ వంటి హర్మూజ్ జలసంధి కేంద్రంగా అమెరికా, ఇరాన్ దేశాల మధ్య భీకర దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా ఇరాన్‌లోని బ్రిడ్జిలు, రవాణా మార్గాలపై అమెరికా వైమానిక దాడులను మరింత తీవ్రతరం…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Our Visitor

040963
Total views : 212536

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: