వచ్చే సంవత్సరం జరగనున్న సీబీఎస్ఈ 10, 12వ తరగతి బోర్డు పరీక్షల షెడ్యూల్‌ను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ విడుదల చేసింది. పదోతరగతి విద్యార్థులకు ఫిబ్రవరి 15 నుంచి మార్చి 18 వరకు, 12వ తరగతి వారికి ఫిబ్రవరి 17 నుంచి ఏప్రిల్ 4 వరకు ఈ పరీక్షలు జరుగుతాయి. పూర్తి టైమ్ టేబుల్‌ను విద్యార్థులు సీబీఎస్‌ఈ అధికారిక పోర్టల్‌లో చూడొచ్చు. పదోతరగతి విద్యార్థులకు మొదటి పరీక్ష ఇంగ్లిష్. 12వ తరగతి వారికి మొదటి పరీక్ష ఫిజికల్ ఎడ్యుకేషన్.
ఒక్కో సబ్జెక్టుకు ఒక్కో కోడ్‌ను కేటాయించారు. బోర్డు పరీక్షలకు సంబంధించిన గరిష్ఠ మార్కులు, ప్రాక్టికల్స్ సమాచారం, ప్రాజెక్టు వర్క్, అంతర్గత మదింపు, ఆన్సర్ బుక్ లెట్ నమూనా వంటి సమాచారాన్ని సీబీఎస్ఈ పోర్టల్‌లో అందుబాటులో ఉంచారు. ‘సీబీఎస్‌ఈఅకడమిక్.ఎన్‌ఐసీ.ఇన్’ అనే మరో పోర్టల్‌లోకి వెళ్లి ప్రశ్నల నమూనాలు, మార్కుల కేటాయింపు, పరీక్షా పద్ధతి వంటి వివరాలన్నీ విద్యార్థులు చూడొచ్చని సీబీఎస్‌ఈ వెల్లడించింది.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- ఈసీ నిర్ణయాలు ఏకపక్షంగా ఉండొద్దు.ఎన్నికల కమిషన్ నిర్ణయాలు పారదర్శకంగా, రాజ్యాంగబద్ధంగా ఉండాలని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. ఎన్నికల ప్రక్రియలో సమిష్టి నిర్ణయాలు, ఓటర్ల జాబితాల విషయంలో పూర్తి పారదర్శకత అవసరమని పేర్కొన్నారు. ఎన్నికల కమిషన్‌లో అంతర్గత అభిప్రాయ భేదాలపై ఇటీవల వచ్చిన నివేదికల…
- బి.కొత్తకోటలో గ్యాస్ సిలిండర్ల కోసం ఆందోళన.అన్నమయ్య జిల్లా బి.కొత్తకోట పట్టణంలోని పిటియం రోడ్డులో ఉద్రిక్తత నెలకొంది. పెద్దతిప్పసముద్రం మండలంలో వంట గ్యాస్ సిలిండర్ల కోసం లబ్ధిదారులు రోడ్డెక్కారు. ఇండియన్ గ్యాస్ యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు గ్యాస్ బుక్ చేసుకున్నా.. బుకింగ్‌ను రద్దు…
- అంబటి రాంబాబుకు ఈడీ నోటీసులు.ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుకు ఈడీ నోటీసులు జారీ చేసింది. రేపు ఉదయం పదున్నర గంటలకు హైదరాబాద్‌లోని ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని ఫోన్ ద్వారా సమాచారం అందించారు. అయితే…
- కాంగ్రెస్ నేతల క్షుద్రపూజల ఆరోపణలపై కోర్టును ఆశ్రయించిన హరీష్‌రావు.తాను క్షుద్ర పూజలు చేశానంటూ తప్పుడు ప్రచారం చేసిన పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్‌లపై ఆధారాలతో క్రిమినల్ పరువు నష్టం పిటిషన్ దాఖలు చేయగా, కోర్టు విచారణకు స్వీకరించిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీష్…
- ఐ బొమ్మ రవికి నాంపల్లి కోర్టులో ఊరట.ఐబొమ్మ రవికి నాంపల్లి కోర్టులో ఊరట కలిగింది. పోలీసులు సీజ్ చేసిన రవి బ్యాంకు ఖాతాలను ఆయన తన లావాదేవీల కోసం ఉపయోగించుకోవచ్చని కోర్టు సూచించింది. ఇందుకోసం రవికి అనుమతి ఇవ్వాలని పోలీసులకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే, ఆ…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి