గోదావరి నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఎగువ నుంచి భారీగా వరద వస్తుండడంతో క్షణక్షణానికీ ప్రవాహం పెరుగుతోంది. ఏపీలోని ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద నీటి మట్టం 14.20 అడుగులకు చేరింది. దీంతో అధికారులు అన్ని గేట్లు ఎత్తి 13.27 లక్షల క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. బుధవారం రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. గోదావరి ఉగ్ర రూపం దాల్చడంతో పాపికొండల యాత్రను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని పలు లంక గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. పి.గన్నవరం మండలం, మామిడికుదురు మండలాల్లో కాజ్ వేలు నీట మునిగాయి చింతూరు మండలంలో 22 గ్రామాలు జలదిగ్బంధంలో ఉన్నాయి. వీఆర్ పురం మండలంలోని ప్రధాన రహదారులను వరద ముంచెత్తడంతో 30 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. తూర్పుగోదావరి, అల్లూరి, అంబేద్కర్ కోనసీమ జిల్లాల కలెక్టర్లు అప్రమత్తమయ్యారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో కంట్రోల్ రూమ్‌లను, పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. సీతానగరం మండలంలోని ములకల్లంక, రాజమండ్రి అర్బన్ మండలం బ్రిడ్జిలంక, కేతవారిలంక, వెదురు లంక ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ వచ్చేనెలలో భారత్‌కి వచ్చే ఛాన్స్.దాదాపు ఏడేళ్ల తర్వాత చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ భారత్‌లో పర్యటించే అవకాశం కనిపిస్తోంది. వచ్చే నెల 12, 13 తేదీల్లో ఢిల్లీలో జరగనున్న బ్రిక్స్ సదస్సులో ఆయన పాల్గొనే అవకాశమున్నట్లు సమాచారం. 2019లో చివరిసారిగా భారత్‌కు వచ్చిన షీ జిన్‌పింగ్,…
- పశ్చిమగోదావరి జిల్లా సముద్రంలో బోటు బోల్తా.పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మండలం చిన్నలంక వద్ద సముద్రంలో బోటు బోల్తా పడిన ఘటన కలకలం రేపింది. సముద్ర వేటకు వెళ్లిన బోటు.. ఇసుకదిబ్బను ఢీకొనడంతో ఒక్కసారిగా బోల్తా పడింది. బోటులో ఉన్న ఏడుగురు మత్స్యకారులు సముద్రంలోకి దూకి.. ఈదుకుంటూ ఒడ్డుకు…
- 22ఏపై బీజేపీ దీక్షలు.భూ భారతి పేరుతో పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నాయని బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. సెక్షన్ 22ఏ కింద లక్షలాది ఎకరాల భూములను ప్రొహిబిటెడ్ జాబితాలో చేర్చి రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని విమర్శించారు. ధరణి పోర్టల్‌పై నిర్వహించిన…
- సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.సూర్యాపేట జిల్లా కోదాడ మండలం ద్వారకుంట సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి ఏలూరు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు.. ముందు వెళ్తున్న కంటైనర్‌ను అత్యంత వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందగా..…
- భారత సైన్యం చేతికి ‘షేర్’.. ఏకే-203 రైఫిళ్లు రెడీ.రక్షణ రంగంలో ఆత్మనిర్భరత దిశగా భారత్ మరో కీలక ముందడుగు వేసింది. ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ జిల్లా కోర్వాలోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో దేశీయంగా తయారైన ఏకే-203 అసాల్ట్ రైఫిళ్లు భారత సైన్యానికి అందించేందుకు సిద్ధమయ్యాయి. త్వరలోనే వీటి డెలివరీ ప్రారంభం కానుంది. అత్యాధునికమైన…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి