Tuesday, June 30, 2026
News Navigation
Tuesday, June 30, 2026
News Navigation

Breaking

Tuesday, June 30, 2026
Home Andhra Pradesh ఘనంగా యూత్ డే వేడుకలు..

ఘనంగా యూత్ డే వేడుకలు..

by Rama
TDP Trally

పల్నాడు జిల్లా.. నరసరావుపేటలో టీడీపీ పార్లమెంటు కార్యాలయ ఆవరణలో నేషనల్ యూత్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా టీడీపీ యువనేత కడియాల లలిత్ చిరు వ్యాపారులు 8మందికి తోపుడు బండ్లను పంపిణీ చేశారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో పేదల బ్రతుకు బాగుందని.. వైసీపీ ప్రభుత్వ హయాంలో పేదలు మరింత పేదరికంతో అల్లాడిపోతున్నారన్నారు. సీఎం జగన్ నేరుగా పేదల ఖాతాల్లో నగదు జమ చేస్తున్నామని చెబుతున్నా.. వారి బ్రతుకులలో మాత్రం అభివృద్ధి అనేది కనపడటం లేదన్నారు. వైసీపీ ప్రభుత్వం ఎప్పుడు పోతుందా అని ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ పార్టీ అఖండ విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామన్నారు. మరోసారి చంద్రబాబుని సీఎంగా చూడాలని రాష్ట్ర ప్రజలు ఆకాంక్షిస్తున్నారని తెలిపారు.

Advertisements

You may also like

Our Visitor

036133
Total views : 180974

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.