Saturday, August 15, 2026
News Navigation
Saturday, August 15, 2026
News Navigation

Breaking

Saturday, August 15, 2026
Home International ఇజ్రాయెల్‍పై ఇరాన్ క్షిపణి దాడులు …

ఇజ్రాయెల్‍పై ఇరాన్ క్షిపణి దాడులు …

by CVR NEWS

పశ్చిమాసియాలో ఇజ్రాయెల్‌–అమెరికా, ఇరాన్‌ నడుమ యుద్ధం తీవ్రస్థాయిలో కొనసాగుతూనే ఉంది. కువైట్‌ అంతర్జాతీయ విమానాశ్రయంపై ఇరాన్‌ దాడులకు దిగింది. అక్కడి ఇంధన నిల్వ ట్యాంకులనే లక్ష్యంగా చేసుకుని డ్రోన్లు ప్రయోగించింది. ఒక ట్యాంక్‌ పేలిపోయి విమానాశ్రయంలో భారీగా మంటలు చెలరేగినట్టు కువైట్‌ న్యూస్‌ ఏజెన్సీ పేర్కొంది. ఖతర్‌ తీర సమీపంలో ఆ దేశానికి చెందిన ఓ చమురు నౌకపై కూడా ఇరాన్‌ క్రూయిజ్‌ క్షిపణితో దాడి చేసింది. దాంతో అందులోని 21 మంది సిబ్బందిని హుటాహుటిన ఖాళీ చేయించారు. యూఏఈలోని ఫుజైరాలో డ్రోన్‌ శకలాలు తాకి ఒక వ్యక్తి మరణించాడు. బహ్రెయిన్‌పై కూడా ఇరాన్‌ క్షిపణులు, డ్రోన్లతో దాడులకు దిగింది. పలు క్షిపణులు, డ్రోన్లను నేలకూల్చినట్టు జోర్డాన్, సౌదీ అరేబియా ప్రకటించాయి. యూఏఈలోని ఉమ్‌ అల్‌ థౌబ్‌ పారిశ్రామిక ప్రాంతంపై ఇరాన్‌ జరిపిన డ్రోన్‌ దాడిలో ఒక భారతీయుడు గాయపడ్డాడు. బంగ్లాదేశ్‌కు చెందిన వ్యక్తి మరణించాడు. తన ప్రధాన శత్రువైన ఇజ్రాయెల్‌పై కూడా ఇరాన్‌ భారీ స్థాయిలో విరుచుకుపడింది. దేశవ్యాప్తంగా పలు నగరాలపై క్షిపణులు, డ్రోన్ల వర్షం కురిపించింది. దాంతో ఎక్కడ చూసినా సైరన్ల మోత విన్పించింది. ఐదుగురికి పైగా గాయపడ్డట్టు సమాచారం.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: