Monday, June 1, 2026
News Navigation
Monday, June 1, 2026
News Navigation

Breaking

Monday, June 1, 2026
Home Andhra Pradesh రేపు టీడీపీలో చేరనున్న జంగా కృష్ణమూర్తి…

రేపు టీడీపీలో చేరనున్న జంగా కృష్ణమూర్తి…

by Prakash
Janga Krishnamurthy


టిడిపిలో చేరనున్న జంగా కృష్ణమూర్తి (Janga Krishnamurthy).. కండువా కప్పనున్న చంద్రబాబు నాయుడు

రేపు టీడీపీలో జంగా కృష్ణమూర్తి (Janga Krishnamurthy) చేరనున్నారు. పల్నాడు ప్రజలకు , ఇప్పటి దాకా నా వ్యక్తిగతంగా, పార్టీల పరంగా నా అభివృద్ధికి సహకరించిన మిత్రులకు, బడుగు బలహీన వర్గాల వారికీ, విన్నపం. 38 ఏళ్ళ నా రాజకీయ జీవితం… మీ అందరి భాగస్వామ్యంతో నడిచిన విషయం విధితమే.. కార్మిక నాయకునిగా నా ప్రస్థానం మొదలుపెట్టి, రెండుసార్లు ఎమ్మెల్యేగా, వైఎస్ఆర్సిపి బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షునిగా, ఎమ్మెల్సీగా మీ అందరి అభిమానంతో, సంఘటిత కృషితో మన పల్నాడు ప్రాంతాన్ని అనేక విధాలుగా అభివృద్ధి చేసుకున్నాము. గత నాలుగేళ్లుగా రాష్ట్రంలో, నియోజకవర్గంలో చోటు చేసుకున్న సంఘటనలు నా మనసును కలిసి వేశాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల ఆత్మగౌరవం పూర్తిగా దెబ్బ కొట్టిన సంఘటనలు కోకొల్లలు…బడుగు బలహీనులకు నామమాత్రపు పదవులు అయితే ఇచ్చారు కానీ…అధికారం మాత్రం పెత్తందారుల చేతుల్లో పెట్టారు.

సత్తెనపల్లిలో చేరికకు రంగం సిద్ధం…

నామమాత్రపు పదవుల పొందిన బడుగు బలహీనులు మరియు వైయస్సార్సీపీకి ఓటు వేసిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు… సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నియోజకవర్గంలో నాయకులు, కార్యకర్తలు వారికి జరిగిన అన్యాయం చెబుతుంటే…. నా మనస్సు క్షోభకు గురైంది. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అభిప్రాయం మేరకు, నా శ్రేయోభిలాషులు, సూచనల మేరకు ఒకటికి రెండుసార్లు ఆత్మగౌరవ సభలు ఏర్పాటు చేసి వారందరి అభిప్రాయాలు తీసుకున్నాను. వారందరూ ఇచ్చిన సూచనల మేరకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఆత్మాభిమానాన్ని కాపాడాలంటే టిడిపిలో చేరాలని నిర్ణయించుకున్నాను. ఈనెల 6వ తేదీన సత్తెనపల్లిలో నిర్వహించే ప్రజా గళం సభలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో పార్టీలో చేరడం జరుగుతుంది .

ఇది చదవండి : హ‌సీన్ దిల్‌రుబ‌ సినిమా తరహాలో.. మరిదితో కాపురం చేసిన వదిన..

కావున ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలు, నా శ్రేయోభిలాషులు, మిత్రులు, అభిమానులు సహకరించాలని… నా చేరికను జయప్రదం చేయాలని విన్నవించుకుంటున్నాను.

Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


ఐఐటి ఫలితాలలో విశ్వభారతి విజయకేతనం.
ఐఐటి ఫలితాలలో కృష్ణాజిల్లా గుడివాడ విశ్వభారతి విద్యాసంస్థలు విజయకేతనం ఎగురవేశాయి. ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్ …
జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ సంచలన నిర్ణయం.
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు, సేనా గళం …
గుంటూరు జిల్లా తాడేపల్లిలో 92 ఎకరాల భూ వివాదం.
కోట్ల రూపాయల విలువైన భూములను కాజేసేందుకు భారీ కుట్ర జరిగిందంటూ గుంటూరు జిల్లా తాడేపల్లిలో రైతులు …

CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

019341
Total views : 90432

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.