Thursday, August 27, 2026
News Navigation
Thursday, August 27, 2026
News Navigation

Breaking

Thursday, August 27, 2026
Home National నితీశ్ రాజీనామా పై స్పందించిన ఖర్గే

నితీశ్ రాజీనామా పై స్పందించిన ఖర్గే

by Satya
Mallikarjuna Kharge

బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ రాజీనామాపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఘాటుగా స్పందించారు. దేశంలో ఆయా రామ్, గయా రామ్‌లాంటి రాజకీయ నేతలు ఎక్కువైపోయారని పరోక్షంగా నితీశ్‌ని ఉద్దేశించి అన్నారు. మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్, డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్‌ తనతో నితీశ్ వెళ్లిపోతున్నారని చెప్పారు. ఈ విషయం తనకు ముందే తెలుసన్నారు. ఇండియా కూటమికి అంతరాయం కలగకుండా ఉండేందుకు ఈ విషయాన్ని బయటకి చెప్పలేదన్నారు. అలా చెబితే ప్రత్యర్థులు ప్రజల్లోకి తప్పుడు సంకేతాన్ని పంపుతారని ఖర్గే అన్నారు. కాగా, జనతాదళ్ జాతీయ అధ్యక్షుడు, సీఎం నితీశ్ కుమార్ రాజ్‌భవన్‌‌లో గవర్నర్ రాజేంద్ర అర్లేకర్‌కు తన రాజీనామాను అందజేశారు. బీజేపీ శాసనసభాపక్ష సమావేశం పట్నాలోని పార్టీ కార్యాలయంలో జరుగుతోంది. జేడీయూ బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఈ మేరకు ఇవాళ రాష్ట్రానికి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తదితర అగ్రనేతలు రానున్నారు. కూటమి ఏర్పాటు అనంతరం మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై వీరు చర్చించనున్నారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: