Friday, July 10, 2026
News Navigation
Friday, July 10, 2026
News Navigation

Breaking

Friday, July 10, 2026
Home Andhra PradeshChittoor సొంత పార్టీపై తీవ్ర ఆగ్రహం.. ఎమ్మెల్యే ఆదిమూలం

సొంత పార్టీపై తీవ్ర ఆగ్రహం.. ఎమ్మెల్యే ఆదిమూలం

by Satya
MLA Adimulam

చిత్తూరు జిల్లా సత్యవేడు వైసీపీ ఎమ్మెల్యే ఆదిమూలం సొంత పార్టీపైనే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సత్యవేడు నియోజకవర్గ ఆత్మీయ సమావేశాన్ని మంత్రి పెద్దిరెడ్డి ఇంట్లో నిర్వహిస్తారా అంటూ ప్రశ్నించారు. తనకు ఇష్టం లేకపోయినా తిరుపతి ఎంపీ స్థానం ఇన్ ఛార్జిగా ప్రకటించారన్నారు. చెవిరెడ్డి, కరుణాకర్ రెడ్డి, రోజా స్థానాల్లో ఇలా ప్రకటించగలరా అంటూ నిలదీశారు. తనకు ఎమ్మెల్యే టికెట్ రాకుండా చేసింది పెద్దిరెడ్డినే అని ఇటీవల సీఎం తనను పిలిపించి ఎంపీగా పోటీ చేయాలని తెలిపారన్నారు. అందుకు తాను ఏం తప్పు చేశానని ఎందుకు ఎంపీగా పంపుతున్నారని అడిగానన్నారు. ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోవడానికి రెండు కారణాలను చెప్పాలని అడిగానన్నారు.

Advertisements

You may also like

Our Visitor

039479
Total views : 197058

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: