Wednesday, June 3, 2026
News Navigation
Wednesday, June 3, 2026
News Navigation

Breaking

Wednesday, June 3, 2026
Home Andhra Pradesh కుటాలపల్లి హత్య కేసును ఛేదించిన పోలీసులు..

కుటాలపల్లి హత్య కేసును ఛేదించిన పోలీసులు..

by Prakash
Murder Case


శ్రీ సత్య సాయి జిల్లా నల్లమాడ మండలం కుటాలపల్లి లో వ్యక్తి దారుణ హత్య కేసు (Murder Case) ఛేదించిన పోలీసులు. కేసు వివరాలు వెల్లడించిన ఎస్పీ..

శ్రీ సత్య సాయి జిల్లా నల్లమాడ మండలం కుటాలపల్లిలో వ్యక్తి దారుణ హత్యకు (Murder Case) గురయిన అమర్నాథరెడ్డి కేసును పోలీసులు ఛేదించారు. పుట్టపర్తి ఎస్పీ కార్యాలయంలో కేసు వివరాలను ఎస్పీ మాధవరెడ్డి వెల్లడించారు. కుటాలపల్లి గ్రామానికి చెందిన అమర్నాథరెడ్డి కి బంధువు అయిన దుద్దుకుంట శ్రీనివాస రెడ్డి కి కుటాలపల్లి తండాకి చెందిన ఓ మహిళతో వివాహేతర సంబంధం ఉంది. ఇటీవల కాలంలో అమర్నాథ్ రెడ్డి ఆ మహిళతో సన్నిహితంగా ఉండడం వల్ల శ్రీనివాస్ రెడ్డి – అమర్నాథ్ రెడ్డి మధ్య వాగ్వివాదాలు చోటు చేసుకున్నాయి.

Follow us on : FacebookInstagramYouTube & Google News

అమర్నాథ్ రెడ్డి అడ్డు తొలగించుకోవాలనుకున్న శ్రీనివాస్..

ఎంత చెప్పినా వినకుండా అమర్నాథ్ రెడ్డి ఆ మహిళతో సన్నిహితంగా ఉంటున్నాడని, ఎలాగైనా సరే అమర్నాథ్ రెడ్డి అడ్డు తొలగించుకోవాలనుకున్న శ్రీనివాస్ రెడ్డి కుటాలపల్లికి చెందిన వీరారెడ్డి, చౌటుకుంటపల్లి గ్రామానికి చెందిన మల్లెల వినోద్ కుమార్ సహకారంతో ఈ నెల 24 న ఆదివారం రాత్రి అమర్నాథ్ రెడ్డి మామిడి తోటలో నిద్రిస్తుండగా మల్బరీ ఆకులు కత్తిరించే పదునైన కత్తితో నరికి హత్య చేశారు. ఘటన స్థలాన్ని పరిశీలించి సేకరించిన ఆధారాల ప్రకారం నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు చేసిన ముగ్గురు నిందితులను కోర్టుకు ప్రవేశపెట్టనున్నట్లు ఎస్పీ వెల్లడించారు.

Follow us on: Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


ఐఐటి ఫలితాలలో విశ్వభారతి విజయకేతనం.
ఐఐటి ఫలితాలలో కృష్ణాజిల్లా గుడివాడ విశ్వభారతి విద్యాసంస్థలు విజయకేతనం ఎగురవేశాయి. ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్ …
జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ సంచలన నిర్ణయం.
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు, సేనా గళం …
గుంటూరు జిల్లా తాడేపల్లిలో 92 ఎకరాల భూ వివాదం.
కోట్ల రూపాయల విలువైన భూములను కాజేసేందుకు భారీ కుట్ర జరిగిందంటూ గుంటూరు జిల్లా తాడేపల్లిలో రైతులు …

CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

019584
Total views : 91177

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.