దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక తొలి ఓట్ చోరీ కాంగ్రెస్ పార్టీ చేసిందని మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఆరోపించారు. నాటి ప్రధాని నెహ్రూ విషయంలోనే ఓట్ చోరీ జరిగిందన్నారు. కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే… 12 ఏళ్ల మోదీ పాలనపై చర్చకు రావాలని సవాల్ విసిరారు. కుటుంబ పార్టీకి భజన చేయడం మినహా… దేశం కోసం చేసి కాంగ్రెస్ పార్టీ చేసిందేమి లేదన్నారు. కరోనా లాంటి సమయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా పాలన చేసిన ఘనత ప్రధాని మోదీది అన్నారు. మోదీ ఏం చేసినా వ్యతిరేకించాలనే అజెండాతో కాంగ్రెస్ పనిచేస్తుందని ఎద్దేవా చేశారు రఘునందన్ రావు.
Politics
ప్రభుత్వ సేవలను ఆన్లైన్లో పొందేందుకు ప్రత్యేక యాప్ అందుబాటులోకి తెస్తున్నామని ప్రకటించారు సీఎం చంద్రబాబు. ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో RTGS సేవలపై సమీక్ష నిర్వహించిన సీఎం చంద్రబాబు..ప్రజలకు అందించే ప్రభుత్వ సేవల్లో ఎలాంటి ఇబ్బందులూ ఎదురవకుండా చూడాలన్నారు. ప్రభుత్వం అందించే అన్ని సేవలనూ ఆన్లైన్ చేశామని తెలిపారు. మన మిత్ర వాట్సాప్ ద్వారా ఆన్లైన్లో ప్రభుత్వ సేవలను వినియోగించుకునేందుకు అవగాహన పెంచాలని ఆదేశించారు. ఆన్లైన్లో ప్రభుత్వ సేవలను వినియోగించుకునేలా ఆన్లైన్ యాప్‌ను రూపొందించాలని ఆదేశించారు. పట్టణ ప్రాంతాల తరహాలోనే గ్రామీణ ప్రాంతాల్లోనూ అదే తరహా సేవలు అందించాలన్నారు. ప్రజలకు తాగునీటి సదుపాయాలను మెరుగుపరచాలని సూచించారు. రక్షిత మంచినీటి ట్యాంకులు, పైపులైన్ల ద్వారా సరఫరా చేస్తున్న మంచినీటి శాంపిళ్లను ప్రతిరోజూ పరీక్షించాలని స్పష్టం చేశారు. రక్షిత నీటి సరఫరాలో అశ్రద్ధ ఉండొద్దని..మంచినీటి సరఫరా పరిసర ప్రాంతాల్లో పరిశుభ్రత ఉండాలన్నారు. ప్రజల్లో అవగాహన వస్తేనే క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాలను విజయవంతం చేయగలమని చెప్పారు. ప్రకృతి, పరిసరాల శుభ్రత పట్ల ప్రజల్లో అవగాహన పెంచేలా వినూత్న కార్యక్రమం చేపట్టాలని సూచించారు. జలధార కార్యక్రమం ఫలితాలు కనిపించాలని, చెరువులన్నీ నిండేలా చర్యలు చేపట్టాలన్నారు. వర్షపు నీటిని ఒడిసిపట్టాలని, ప్రతి కుంట, ప్రతి చెరువులోని నీటి నిల్వను ఆన్లైన్లో సమీక్షించాలని నిర్దేశించారు. అనంతపురం జిల్లాలో ఆన్లైన్ పరిశీలనా విధానాన్ని అమలు చేయాలన్నారు. మహిళలపై నేరాలను అరికట్టాలని, గంజాయిని అరికట్టేందుకు మూలాల్లోకి వెళ్లాలని ఆదేశించారు. మహిళలపై దాడులు చేయాలంటేనే భయపడేలా శిక్షలు ఉండాలని స్పష్టం చేశారు.
ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఇవాళ ఢిల్లీలో జరగనున్న ఎన్డీఏ ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రుల సమావేశానికి ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హాజరుకానున్నారు. మోదీ ప్రభుత్వానికి రెండేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో, ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. త్వరలో జరగబోయే కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణపై కూడా చర్చించే అవకాశం ఉందని సమాచారం.
ఏలేశ్వరంలో ముద్రగడ గిరి ఆధ్వర్యంలో చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లుపై సమావేశం.
ప్రత్తిపాడు నియోజకవర్గ వైసీపీ ఇంచార్జ్ ముద్రగడ గిరిబాబు అద్వర్యంలో
ఏలేశ్వరంలో వైసీపీ నియోజకవర్గ స్థాయి సమావేశం నిర్వహించారు.
చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లుపై నిర్వచించన ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిధిలో పార్టీ నేతలు, పలు అనుబంధ కమిటీల సభ్యులు పాల్గొన్నారు.
చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన రెండేళ్ల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఎరువుల కష్టాలు, మహిళలపై అఘాయిత్యాలు, అన్నదాద పోరువైసీపీ నాయకులపై హత్యలు, వైద్యం, లా అండ్ ఆర్డర్, విద్యా,తదితర అంశాలపై ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఇన్చార్జ్ గిరిబాబు మాట్లాడుతూ చంద్రబాబు రెండేళ్ల పాలనలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలను వెన్నుపోటు పొడిచారని దూయబెట్టారు. ఈ రెండు సంవత్సరాల కాలంలో ఒక్క నూతన పింఛన్ ఇచ్చిన దాఖలాలు లేవని విమర్శించారు. మద్యం అధిక ధరలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారని విమర్శించారు. చంద్రబాబు ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని బలపరిచే వరకూ ప్రతి వైసీపీ కార్యకర్త పనిచేయాలని సూచించారు.
వచ్చే 12వ తేదీ ప్రత్తిపాడు లో చేపట్టనున్న ర్యాలీని జయప్రదం చేయాలని వైసిపి పార్టీ శ్రేణులకు ముద్రగడ గిరిబాబు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తుని నియోజకవర్గ పరిశీలకులు వాసిరెడ్డి జమీలు, ఏలేశ్వరం పత్తిపాడు శంకవరం రౌతులపూడి పార్టీ అధ్యక్షులు గొల్లపల్లి సురేష్, రామిశెట్టి బుల్లి రామకృష్ణ, నరాల శ్రీను, కాకి సత్యన్నారాయణ, ప్రత్తిపాడు రౌతులపూడి జడ్పిటిసి గొల్లు చిన్న దివాణం, బెహరా రాజేశ్వరి దొరబాబు, సుంకర రాంబాబు, సామంతుల సూర్య కుమార్,అడపా సోమేష్, సకురు గుర్రాజు, బీశెట్టి అప్పలరాజు గౌతు స్వామి, బదిరెడ్డి వెంకటరమణ, సఖిరెడ్డి బుజ్జి, ఓలేటి చంటిబాబు, గొంతిరెడ్డి సతీష్, వాగు బలరాం, బులిపే దేవి, అల్లం ఆదినారాయణ, పలువురు వైసిపి నాయకులు పాల్గొన్నారు…
ప్రపంచ చెస్ వేదికపై భారత కీర్తిని మరింత ఎత్తుకు తీసుకెళ్లిన గ్రాండ్‌మాస్టర్ ఆర్. ప్రజ్ఞానందకు తమిళనాడు ప్రభుత్వం ఘన సన్మానం నిర్వహించింది. నార్వే చెస్ 2026 సిరీస్‌లో విజేతగా నిలిచిన ప్రజ్ఞానంద, ఈ ఘనత సాధించిన తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టించారు.ఈ సందర్భంగా తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ ప్రజ్ఞానందను అభినందించి సత్కరించారు. అనంతరం ప్రజ్ఞానందతో సరదాగా చెస్ ఆడి అందరి దృష్టిని ఆకర్షించారు.ప్రజ్ఞానంద సాధించిన విజయం దేశ యువతకు స్ఫూర్తిదాయకమని సీఎం విజయ్ పేర్కొన్నారు. అంతర్జాతీయ స్థాయిలో భారతదేశానికి గౌరవం తీసుకొచ్చిన ప్రజ్ఞానంద భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.ఈ సందర్భంగా ఆయనకు 50 లక్షల రూపాయల నగదు పురస్కారాన్ని అందజేశారు.
పశ్చిమ గోదావరి జిల్లాలో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటించారు. సిద్ధాంతం గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం, గత వైసీపీ ప్రభుత్వం భూసర్వే పేరుతో భారీ అవకతవకలకు పాల్పడిందని ఆరోపించారు. భూ రికార్డులు మార్చి ప్రజల భూములను దోచుకోవాలని ప్రయత్నించారని విమర్శించారు. రైతుల హక్కులను కాపాడడమే తమ ప్రభుత్వ లక్ష్యమని, భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం కోసం చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
పశ్చిమగోదావరి జిల్లా సిద్ధాంతం గ్రామంలో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటించారు. ముగ్గురు రైతులతో వ్యవసాయ క్షేత్రంలో చంద్రబాబు నేరుగా మాట్లాడారు. CVR న్యూస్ తో రైతులు చంద్రబాబు నాయుడుని కలవడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. ముఖ్యమంత్రిని కలుస్తామని ఏనాడు ఊహించలేదని అన్నారు. పొలంలోకి వచ్చి మాతో మాట్లాడడం ఆశ్చర్యంగా ఉందని… వ్యవసాయానికి సంబంధించి కొన్ని ఇబ్బందులు ఉంటే వాటిని ఆయనకు చెప్పామన్నారు. త్వరలోనే సీఎం పరిష్కరిస్తామన్నారని రైతులు తెలిపారు. సిద్ధాంతం గ్రామంలో ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు జరిపిన పర్యటన, క్షేత్రస్థాయిలో రైతుల సాధకబాధకాలను తెలుసుకోవాలనే ఆయన నిరంతర ప్రయత్నానికి నిదర్శనమన్నారు.కార్యాలయాలకే పరిమితం కాకుండా నేరుగా ప్రజల వద్దకు, రైతుల పొలాల్లోకి వెళ్లడం ద్వారా క్షేత్రస్థాయి వాస్తవాలు పాలకులకు స్పష్టంగా తెలుస్తాయి. వ్యవసాయ రంగానికి ఉన్న ప్రాధాన్యత ఈ పర్యటన ద్వారా కూటమి ప్రభుత్వం వ్యవసాయ రంగానికి, రైతు సంక్షేమానికి ఇస్తున్న ప్రాధాన్యత స్పష్టమవుతోంది. ముఖ్యమంత్రి స్వయంగా రైతుల సమస్యలను నోట్ చేసుకోవడం అధికారులపై కూడా సానుకూల ఒత్తిడిని పెంచుతుంది.
జనసేన రాజ్యసభ అభ్యర్థిగా పారిశ్రామిక వేత్త లింగమనేని రమేశ్ పేరు ఖరారైంది. రాజ్యసభ అభ్యర్థిత్వంపై పార్టీ అధినేత పవన్ కల్యాణ్ నిర్ణయం తీసుకున్నట్లు జనసేన ప్రకటించింది. ఈ మేరకు పవన్ రాజకీయ కార్యదర్శి హరిప్రసాద్ వెల్లడించారు. ‘‘లింగమనేని రమేశ్‌కు 2015 నుంచి జనసేనతో అనుబంధం ఉంది. రాష్ట్రం అభివృద్ధి చెందాలనే పవన్ ఆలోచనలకు ఆయన ఆకర్షితులయ్యారు. శనివారం మధ్యాహ్నం రమేశ్ నామినేషన్ వేస్తారు’’అని హరిప్రసాద్ పేర్కొన్నారు. రాష్ట్రం నుంచి ఖాళీ అయిన నాలుగు రాజ్యసభ స్థానాల్లో మూడు టీడీపీ, ఒకటి జనసేన తీసుకోవాలని నిర్ణయించారు
కర్ణాటకలో డీకే శివకుమార్ సర్కార్‌కు ఆదిలోనే కుదుపు ఎదురైంది. ప్రమాణస్వీకారం చేసిన మంత్రి రామలింగారెడ్డి రాజీనామా చేశారు. ఇష్టం లేని శాఖను కేటాయించారని అసహనం వ్యక్తం చేస్తూ రామలింగారెడ్డి నీటిపారుదల శాఖ మంత్రి బాధ్యతల నుంచి వైదొలిగారు. నగరాభివృద్ధి శాఖ ఇవ్వాలని విన్నవించినా.. తనకు అవగాహన లేని నీటిపారుదల శాఖ ఇచ్చారని అసంతృప్తి వ్యక్తంచేశారు. జూన్ 3న డీకే శివకుమార్ సీఎంగా ప్రమాణస్వీకారం చేయగా.. 13 మందితో కొత్త మంత్రివర్గం కొలువుదీరింది. అయితే, మంత్రుల్లో రామలింగారెడ్డి ఒకరు. శాఖ కేటాయింపుల విషయంలో అసంతృప్తితో ఉన్న ఆయన బెంగళూరులో మీడియా ఎదుట తన రాజీనామా లేఖపై సంతకం చేశారు. తాను ముఖ్యమంత్రిని ఏ శాఖ అడగలేదని… ఆయనే నాకు నగరాభివృద్ధి శాఖను ప్రతిపాదించారు… కానీ తర్వాత నీటిపారుదల శాఖను కేటాయించారు. అది తనకు ఆమోదయోగ్యం కాదన్నారు . అందుకే తాను మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్టు రామలింగారెడ్డి స్పష్టం చేసారు. ఇక తాను ఏ మంత్రిత్వ శాఖను ఆఫర్ చేసినా తీసుకోనని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌తోనే ఉంటానని, ఎమ్మెల్యేగానే కొనసాగుతానన్నారు.
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన వ్యక్తమవుతోంది. అమరావతిలో జరుగుతున్న కీలక కేబినెట్ సమావేశానికి హాజరైన పవన్ కళ్యాణ్, అస్వస్థత కారణంగా సమావేశం మధ్యలోనే బయటకు వెళ్లిపోయారు. వెన్నునొప్పితో ఇబ్బంది పడుతున్న ఆయన నేరుగా మంగళగిరిలోని క్యాంప్ కార్యాలయానికి వెళ్లారు. అమరావతిలో ముఖ్యమంత్రి అధ్యక్షతన జరుగుతున్న ఏపీ మంత్రివర్గ సమావేశం కొనసాగుతుండగా, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆరోగ్య సమస్యల కారణంగా అర్ధాంతరంగా సమావేశం నుంచి నిష్క్రమించారు. కొంతకాలంగా వెన్నునొప్పితో బాధపడుతున్న పవన్ కళ్యాణ్, కేబినెట్ సమావేశంలో అసౌకర్యంగా ఫీలైనట్లు సమాచారం. దీంతో సమావేశాన్ని మధ్యలోనే విడిచి వెళ్లిపోయారు. జనసేన కార్యకర్తలు, అభిమానులు డిప్యూటీ సీఎం ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే పవన్ పరిస్థితి నిలకడగానే ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.
తెలుగు రాష్ట్రాల ఆవిర్భావానికి 12 ఏళ్లు పూర్తికావడం చారిత్రాత్మక ఘట్టం…
తెలుగు రాష్ట్రాల ఆవిర్భావానికి 12 ఏళ్లు పూర్తికావడం ఓ చారిత్రక ఘట్టమని రాష్ట్రాలుగా విడిపోయినప్పటికీ, తెలుగు జాతి హృదయం ఎప్పటికీ ఒకటే. పరిపాలనా హద్దులు మారినప్పటికీ, మన సంస్కృతి, మన గౌరవం ఎప్పటికీ తగ్గదని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. ప్రతి తెలుగు కుటుంబానికి నాణ్యమైన వైద్యం, మెరుగైన జీవన ప్రమాణాలు అందేలా చేయడం లక్ష్యమన్నారు. హైదరాబాద్ మరింత అంతర్జాతీయ ఖ్యాతిని గడించాలనీ.. అమరావతి నూతన భారతానికి ప్రతీకగా ప్రపంచ స్థాయి రాజధానిగా అవతరించాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆశాభావం వ్యక్తం చేశారు.
వికసిత్ భారత్-2047 సాధనలో తెలుగు రాష్ట్రాలు మార్గదర్శక శక్తులుగా ఎదగాలని పిలుపు ఇచ్చారు. తెలుగు జాతి ఐక్యత, కృషి, జ్ఞానం, సంకల్పమే మన భవిష్యత్తు విజయాలకు పునాది అన్నారు. తెలుగు గౌరవాన్ని, సంస్కృతిని, అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉన్నదన్నారు.



Total views : 221439