దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ సోమవారం అర్థరాత్రి చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. ఆయనకు గుండె సంబంధిత వైద్య పరీక్షలను షెడ్యూల్ చేసినట్లు తెలుస్తోంది. అయితే, రజనీకాంత్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఆసుపత్రి వర్గాలు చెప్పినట్లు సమాచారం. ఆయన ఆసుపత్రిలో చేరడంపై వైద్యుల నుంచి గానీ, కుటుంబ సభ్యుల నుంచి గానీ ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఇక 73 ఏళ్ల రజనీ ప్రస్తుతం రెండు చిత్రాలతో బిజీగా ఉన్నారు. దర్శకుడు జ్ఞానవేల్ రాజాతో చేస్తున్న ‘వేట్టైయాన్’ అక్టోబర్ 10 న విడుదల కానుంది. అలాగే లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో కూలీ అనే మూవీ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉంది.
ఇక దశాబ్దం క్రితం సూపర్ స్టార్ సింగపూర్‌లో కిడ్నీ మార్పిడి చేయించుకున్నారు. ఆయన ఆరోగ్య కారణాలతోనే రాజకీయాలకు కూడా దూరమయ్యారు. రాజకీయ అరంగేట్రానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్న రజనీకాంత్ చివరి నిమిషంలో వైద్యుల సలహా మేరకు తన నిర్ణయాన్ని మార్చుకున్న సంగతి తెలిసిందే.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- నీట్ నిరసన సెగ హైదరాబాద్ కు తగిలింది.నీట్ నిరసన సెగ హైదరాబాద్ కు తగిలింది. నాంపల్లి పరిసర ప్రాంతాలు బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నాయకులు నిరసనలతో హొరెత్తాయి. లోక్‌సభ ప్రతి పక్ష నాయకుడు రాహుల్‌గాంధీ అరెస్ట్ తో పాటు కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా…
- జనరిక్ మెడిసిన్ దిగుమతులపై ట్రంప్ కీలక ప్రకటన.జనరిక్ ఔషధాల దిగుమతులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఆగస్టు 1 నుంచి జనరిక్ ఔషధాలపై సుంకాలు ఉండబోవని ప్రకటించారు. అమెరికాలోకి దిగుమతి అయ్యే అన్ని జనరిక్ ఔషధాలకు సున్నా శాతం సుంకం వర్తిస్తుందని..రెండేళ్ల పాటు ఇది…
- సి.వి.రావును కలిసిన సినీ నిర్మాత, కాంగ్రెస్ నేత బండ్ల గణేష్.ప్రముఖ సినీ నిర్మాత, తెలంగాణ కాంగ్రెస్ నాయకుడు బండ్ల గణేష్ ఈరోజు ఇమేజ్ హాస్పిటళ్లు, సీవీఆర్ ఛానళ్ల ఛైర్మన్ సి.వి.రావును మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్‌లోని సీవీఆర్ న్యూస్ కార్యాలయానికి వచ్చిన బండ్ల గణేష్… తన కుమార్తె వివాహానికి హాజరుకావాలని కోరారు. చైర్మన్…
- రాహుల్ గాంధీని అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ ఆందోళన.ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన తెలుపుతున్న NSUI నాయకులు, విద్యార్థులపై పోలీసులు లాఠీఛార్జ్ చేయడాన్ని మరియు వారికి మద్దతుగా వెళ్లిన రాహుల్ గాంధీని అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో తీవ్ర నిరసన వ్యక్తమైంది. NSUI జాతీయ…
- మెయిన్ వాపస్ ఆవుంగా’ విజయోత్సవం – ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపిన ఇమ్తియాజ్ అలీ.హిందీ చిత్రం ‘మెయిన్ వాపస్ ఆవుంగా’ దేశవ్యాప్తంగా ప్రేక్షకుల ఆదరణతో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. విడుదలై ఆరు వారాలు పూర్తయినా ఈ సినిమా ఇంకా మంచి వసూళ్లతో దూసుకెళ్తోంది. ప్రస్తుతం భారతదేశంలో 450కు పైగా షోలతో పాటు విదేశాల్లోని 10 దేశాల్లో కూడా…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి





Total views : 223729