RBI కొత్త గవర్నర్‌గా సంజయ్ మల్హోత్రా నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన పదవీకాలం మూడేళ్లు ఉంటుందని కేంద్రం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రస్తుత గవర్నర్ శక్తికాంత దాస్ మంగళవారం పదవీ విరమణ చేయనుండగా… మల్హోత్రా పదవీ కాలం 11వ తేదీ నుంచి అమల్లోకి రానుంది. కాగా, మల్హోత్రా రాజస్తాన్ క్యాడర్ కు చెందిన ఐఏఎస్ అధికారిగా పని చేశారు. 1990 లో ఐఏఎస్ సర్వీస్‌కు ఎంపికయ్యారు. ఈయన.. పవర్, ఫైనాన్స్, టాక్సేషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, గనులు మొదలైన అనేక రంగాలలో పనిచేశారు. భారత ప్రభుత్వంలోని ఆర్థిక మంత్రిత్వ శాఖ కింద ఆర్థిక సేవల విభాగంలో కార్యదర్శి పదవిని నిర్వహించారు. ప్రస్తుతం మల్హోత్రా ఆర్థిక మంత్రిత్వ శాఖలో రెవిన్యూ కార్యదర్శిగా పదవిలో ఉన్నారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- అమెరికాలో ఓ భారత సంతతి కుటుంబంలో విషాదం.అమెరికాలో ఓ భారత సంతతి కుటుంబంలో పెళ్లి సంబరాలు విషాదంగా మారాయి. వివాహం జరిగిన కొద్ది గంటల్లోనే వరుడు హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో ఇరు కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. జార్జియాలో జరిగిన ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. కేరళ…
- శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తుల సందడి..నంద్యాల జిల్లా శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తులు సందడి నెలకొంది. వేసవి సెలవులు కావడంతో భక్తులు భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనానికి పోటెత్తారు. క్యూలైన్లన్నీ భక్తులతో నిండిపోయాయి. భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో అలంకార దర్శనానికి అనుమతినిచ్చారు. ముందుగా ఆన్లైన్లో బుక్…
- జగిత్యాల రూరల్ మండలం మోరపెల్లి గ్రామంలో విషాదం.జగిత్యాల రూరల్ మండలం మోరపెల్లి గ్రామంలో ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న థార్ కారు అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న బావిలోకి దూసుకెళ్లింది. ప్రమాదం జరిగిన వెంటనే గ్రామస్తులు అప్రమత్తమై సహాయక చర్యలు చేపట్టారు. కారులో ఉన్న ఇద్దరు…
- గుజరాత్ టైటాన్స్ ఆటగాళ్లకు తప్పిన ప్రమాదం.గుజరాత్ టైటాన్స్ ఆటగాళ్లకు ప్రమాదం తప్పింది. వారు ప్రయాణిస్తున్న బస్సులో మంటలు చెలరేగిన ఘటన ఆదివారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. దీంతో వెంటనే ఆటగాళ్లు, సహాయక సిబ్బంది బస్సులో నుంచి దిగిపోయారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా తొలుత పొగలు వచ్చాయి. వెంటనే…
- ప్రముఖ నేపథ్య గాయని సుమన్ కళ్యాణ్‌పూర్ కన్నుమూత.భారతీయ సినీ సంగీత ప్రపంచంలో ఓ మధుర స్వరం మూగబోయింది. తన గానామృతంతో కోట్లాది మంది సంగీతాభిమానులను అలరించిన ప్రముఖ నేపథ్య గాయని సుమన్ కళ్యాణ్‌పూర్ కన్నుమూశారు. ఆరు దశాబ్దాలకు పైగా సాగిన ఆమె సంగీత ప్రస్థానం ఎన్నో అజరామర గీతాలను…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




Total views : 90416