తనకు వ్యక్తిగత భద్రత తగ్గించారని, సీఎంగా ఉన్నప్పటి సెక్యూరిటీని ఇవ్వాలంటూ మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ పోలీసులు శాఖ స్పందించింది. ప్రస్తుతం ఆయనకు జడ్ ప్లస్ సెక్యూరిటీ కొనసాగుతోందని, భద్రత తగ్గించారనే వాదనలో నిజం లేదని రాష్ట్ర పోలీసుశాఖ, ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. మాజీ సీఎం హోదాలో జగన్‌కు నిబంధనల మేరకే భద్రతా సిబ్బందిని కేటాయించామని ఆయా వర్గాలు పేర్కొంటున్నాయని సమాచారం.
చంద్రబాబు మాజీ సీఎంగా ఉన్నప్పుడు ఆయనకు అందించిన భద్రతనే ప్రస్తుతం జగన్‌కు కూడా కొనసాగిస్తున్నట్టు ఏపీ పోలీసుశాఖ వర్గాలు అంటున్నాయి. జగన్ సీఎంగా ఉన్న సమయంలో ఆ హోదాను బట్టి అదనంగా కల్పించిన భద్రతను మాత్రమే తగ్గించామని, ప్రస్తుతం మాజీ సీఎం కావడంతో ముఖ్యమంత్రి స్థాయి భద్రత కల్పించడం సాధ్యంకాదని ఏపీ పోలీసు వర్గాలు అంటున్నాయి. కాగా జూన్ 3 నాటికి తనకున్న భద్రతను పునరుద్ధరించాలని కోరుతూ ఏపీ హైకోర్టులో మాజీ సీఎం జగన్ పిటిషన్ దాఖలు చేశారు. జగన్ భద్రతకు సంబంధించిన వివరాలను ఏపీ పోలీసు వర్గాలు పంచుకున్నాయి. ఇన్‌స్పెక్టర్ స్థాయి అధికారిని భద్రత ఇన్‌ఛార్జిగా పెట్టామని చెప్పారు. ప్రస్తుతం జగన్‌కు 58 మంది సిబ్బందితో భద్రత కల్పిస్తున్నామని, ఆయన ఇంటి వద్ద 10 మంది సాయుధ గార్డులు ఉంటున్నారని, షిఫ్టుకు ఇద్దరు చొప్పున మొత్తం ఆరుగురు పీఎస్‌వోలు 24 గంటల పాటు భద్రత కల్పిస్తారని చెప్పారు. నిరంతరం అందుబాటులో ఉండేలా ఆరుగురు డ్రైవర్లను జగన్‌కు కేటాయించామని వివరించారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- ఐఐటి ఫలితాలలో విశ్వభారతి విజయకేతనం.ఐఐటి ఫలితాలలో కృష్ణాజిల్లా గుడివాడ విశ్వభారతి విద్యాసంస్థలు విజయకేతనం ఎగురవేశాయి. ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్ సాధించిన తోట సాయి వినీల్ కు పాఠశాల చైర్మన్ పొట్లూరి శ్రీమన్నారాయణ శుభాకాంక్షలు తెలియజేశారు. తమ పాఠశాలలో ఎనిమిదవ తరగతి నుండి పదవ తరగతి…
- హైదరాబాద్ ఉప్పల్ లో కాంగ్రెస్ నేత దౌర్జన్యం.హైదరాబాద్ ఉప్పల్ లో అమానవీయ ఘటన వెలుగుచూసింది. చిన్నారులు ఇంటి ముందు క్రికెట్ ఆడారని అధికార పార్టీ నాయకుడు పిల్లల తల్లిదండ్రుల పట్ల అమానుషంగా ప్రవర్తించిన ఘటన వీడియో వైరల్ అయింది. తల్లిదండ్రులపై దాడి చేయడమే కాకుండా తన అధికార బలంతో…
- జనసేన అధినేత పవన్‌కల్యాణ్ సంచలన నిర్ణయం.ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు, సేనా గళం పేరుతో కొత్త కమిటీ ఏర్పాటు చేశారు.అమరావతిలో జనసేన ముఖ్య నేతలతో సమావేశమయ్యారు పవన్ కళ్యాణ్. వివిధ అంశాలపై చర్చించారు. అనంతరం సేనా గళం పేరుతో…
- అమెరికాలో ఓ భారత సంతతి కుటుంబంలో విషాదం.అమెరికాలో ఓ భారత సంతతి కుటుంబంలో పెళ్లి సంబరాలు విషాదంగా మారాయి. వివాహం జరిగిన కొద్ది గంటల్లోనే వరుడు హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో ఇరు కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. జార్జియాలో జరిగిన ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. కేరళ…
- శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తుల సందడి..నంద్యాల జిల్లా శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తులు సందడి నెలకొంది. వేసవి సెలవులు కావడంతో భక్తులు భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనానికి పోటెత్తారు. క్యూలైన్లన్నీ భక్తులతో నిండిపోయాయి. భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో అలంకార దర్శనానికి అనుమతినిచ్చారు. ముందుగా ఆన్లైన్లో బుక్…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి






Total views : 90627