ఎన్నికల కోడ్ (Election Code) :
రాష్ట్రంలో గత నెల 16 నుంచి ఎన్నికల కోడ్ (Election Code) అమల్లోకి వచ్చిన నేపథ్యంలో, ఈసీ తన పని తాను చేసుకుపోతోంది. ఇప్పటికే ఏపీలో పలువురు ఉన్నతాధికారులు ఈసీ ఆగ్రహానికి గురయ్యారు. తాజాగా రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై వేటు పడింది.
వెంకట్రామిరెడ్డి ఉద్యోగ రీత్యా పంచాయతీరాజ్ విభాగంలో అసిస్టెంట్ సెక్రటరీగా పనిచేస్తున్నారు. కొన్నిరోజుల కిందట వెంకట్రామిరెడ్డి వైసీపీకి అనుకూలంగా ఎన్నికల ప్రచారం చేసినట్టు వెల్లడైంది.
ఇది చదవండి : నంద్యాలలో టీడీపీకీ భారీ షాక్ తగిలే అవకాశం..!
కడప జిల్లా బద్వేలులో ఆర్టీసీ ఉద్యోగులతో సమావేశమై వైసీపీకి అనుకూలంగా ఓటు వేయాలని వెంకట్రామిరెడ్డి ప్రచారం చేశారని టీడీపీ నేతలు ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లారు. ఈ ఫిర్యాదును పరిశీలించిన ఈసీ… కడప జిల్లా కలెక్టర్ తో నివేదిక తెప్పించుకుంది. వెంకట్రామిరెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నట్టు నిర్ధారణ కావడంతో అతడిపై చర్యలు తీసుకోవాలని ఈసీ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించిది. ఈసీ ఆదేశాలతో వెంకట్రామిరెడ్డిపై రాష్ట్ర ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. హెడ్ క్వార్టర్స్ దాటి ఎక్కడికీ వెళ్లరాదని స్పష్టం చేసింది.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- సెప్టెంబర్ 2న పాయకరావుపేటకు చంద్రబాబు.ఉత్తరాంధ్ర జిల్లాల సాగు, తాగునీటి కష్టాలను శాశ్వతంగా దూరం చేసే బృహత్తర సంకల్పం సాకారమవుతోంది. పోలవరం ప్రాజెక్టు ఎడమ ప్రధాన కాలువ ద్వారా జీవనది గోదావరి జలాలను విశాఖపట్నం, అనకాపల్లి సహా ఉత్తరాంధ్ర ప్రాంతాలకు తరలించే ప్రక్రియకు సీఎం చంద్రబాబు సెప్టెంబర్…
- నేపాల్లో ఏపీ యాత్రికుల భద్రతపై 24 గంటల పర్యవేక్షణనేపాల్లో ఆకస్మిక వరదల్లో చిక్కుకున్న ఏపీ యాత్రికుల భద్రతపై రాష్ట్ర ప్రభుత్వం 24 గంటలూ పర్యవేక్షణ కొనసాగిస్తోంది. సీఎం చంద్రబాబు ఆదేశాలతో మంత్రి నారా లోకేష్ సూచనల మేరకు ఆర్టీజీఎస్ అధికారులు సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. తిరుపతి నుంచి కైలాస మానససరోవర్…
- అనకాపల్లి జిల్లాలో కీలక నిర్ణయం.పర్యావరణ పరిరక్షణ, చారిత్రక సంపద రక్షణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అనకాపల్లి జిల్లాలోని ఆధ్యాత్మిక, చారిత్రక ప్రాధాన్యం ఉన్న పంచధారల కొండల ప్రాంతాన్ని ‘నో మైనింగ్ జోన్’గా ప్రకటించింది. దీంతో ఈ ప్రాంతంలో తవ్వకాలు, క్వారీ పనులపై పూర్తి…
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి: ఈసీ ఆగ్రహానికి వెంకట్రామిరెడ్డిపై వేటు…