ప్రధాని నరేంద్ర మోదీ ఒక విజనరీ లీడర్ అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ కొనియాడారు. తక్షణ సవాళ్లను అధిగమించగల సామర్థ్యం కలిగిన వారని అన్నారు. దేశాన్ని మంచి భవిష్యత్తు వైపు నడిపించే శక్తి కలవారని, వివిధ రంగాల్లో పరివర్తనాత్మక మార్పును తీసుకురాగలరని చెప్పారు. దేశాన్ని ఐక్యంగా ఉంచగల సమర్థులు అని అన్నారు. మోదీ విజన్ 2047 సాకారమయ్యేందుకు బీజేపీకి, ప్రధానికి జనసేన పూర్తి మద్దతిస్తుందని చెప్పారు. ఇప్పటికే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో జనసేన పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే. రెండు పార్టీలు కలిసి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి. జనసేనకు బీజేపీ 8 స్థానాలకు కేటాయించింది. తమ అభ్యర్థులకు పవన్ కల్యాణ్ బీఫామ్ లను కూడా అందించారు.
Tag:
నరేంద్ర మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు లేఖ రాశారు. తనపై కస్టోడియల్ హింసకు పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. తనను హింసించిన వారిలో ఇద్దరు ఐపీఎస్లు ఉన్నారని వివరించారు. పీవీ సునీల్ కుమార్, పీఎస్ఆర్ ఆంజనేయులు హింసించారని తెలిపారు. వారిపై సీబీఐ లేదా ఎన్ఐఏతో దర్యాప్తు చేయించాలని ప్రధానికి రాసిన లేఖలో రఘురామ కోరారు. రాష్ట్ర ప్రభుత్వంపై విద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారంటూ ఏపీ సీఐడీ గతంలో రఘురామను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. పోలీసు కస్టడీలో తనను హింసించినట్లు అప్పట్లోనే ఆయన ఆరోపించారు. ఈ నేపథ్యంలో తాజాగా ఇద్దరు అధికారులపై చర్యలు తీసుకోవాలంటూ ప్రధానికి రఘురామ లేఖ రాశారు.