అనంతపురం జిల్లా కేంద్రంలో ఈ నెల 26న నిర్వహిస్తున్న కాంగ్రెస్ బహిరంగ సభకు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఖడ్గరే, ఆంధ్ర రాష్ట్ర అధ్యక్షురాలు వైయస్ షర్మిల హాజరవుతున్న కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ మాజీ పిసిసి చీఫ్ సాకే శైలజానాథ్ పిలుపునిచ్చారు. అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని ఎన్జీవో భవనంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశ రాష్ట్ర ఉజ్వల భవిష్యత్తు కోసం కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అనంతపురం జిల్లాలో చేపట్టేటటువంటి అభివృద్ధి కార్యక్రమాలపై బహిరంగ సభలో ప్రకటించడం జరుగుతుందని తెలిపారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనంతపురం జిల్లాకు చేసిన అభివృద్ధి శూన్యమని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాలనలో జిల్లాలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని పేర్కొన్నారు. జిల్లాకు సాగునీరు తాగునీరు అందించేందుకు శాయశక్తుల కృషి చేశామన్నారు. హంద్రీనీవా పథకం, కస్తూరిబా పాఠశాలలు నిర్మించామన్నారు. ముఖ్యంగా రాప్తాడు ముఖ్యమంత్రి సభలో ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ కృష్ణ పై జరిగిన దాడి అమానుషమని పేర్కొన్నారు. పాత్రికేయులపై దాడులను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. హింసను ప్రేరేపించే ప్రసక్తే లేదని పేర్కొన్నారు. ఫోటోగ్రాఫర్ జర్నలిస్ట్ పై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
ananthapuram district news
అనంతపురం జిల్లా గుత్తి మండలం బసీనేపల్లి గ్రామ సమీపంలోని కొండపై వెలసిన శ్రీ గదేరాళ్ల తిమ్మప్ప స్వామి కళ్యాణోత్సవం ఆలయ ప్రధాన అర్చకుడు రవి ప్రకాష్ రావు, సుధీంద్రనాథ్ ఆధ్వర్యంలో కన్నుల పండువగా సాగింది. ముందుగా ఆలయంలోని స్వామివారి మూలవిరాట్ కు వేకువజామున సుగంధద్రవ్యాలు, పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. అనంతరం స్వామివారిని ప్రత్యేక పుష్పాలతో అలంకరించి తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గద్దెరాళ్ళ తిమ్మప్ప స్వామికి కళ్యాణ మహోత్సవం జరిగింది. వివిధ ప్రాంతాల నుంచి భక్తాదులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారిని దర్శించుకుని తమ మొక్కుబడులను చెల్లించుకున్నారు. శ్రీగద్దెరాళ్ళ తిమ్మప్ప స్వామి నామస్మరణతో ఆలయం మారుమోగింది. ఆలయ కమిటీ సభ్యులు వచ్చిన భక్తులకు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వదించారు. ఆలయ ప్రాంగణంలో భక్తాదుల కోసం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.
పంటలు సాగు చేసేందుకు ఓ యువరైతు వరుసగా నాలుగు బోరు బావులు తవ్వించినా చుక్క నీరు పడకపోవడంతో అప్పులు తీర్చే మార్గం కనిపించక బలవన్మరణం చెందిన సంఘటన శ్రీ సత్యసాయి జిల్లా ఓబుల దేవర చెరువు మండలం మల్లాపల్లిలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన లక్కసముద్రం ఆంజనేయులు కుమారుడు** అజయ్*” వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించేవాడు. గతేడాది వర్షాభావ పరిస్థితుల వల్ల గతంలో వేసిన బోరు నుంచి నీరు రాకపోవడంతో ఇటీవల వరుసుగా నాలుగు బోరు బావులు తవ్వించాడు. చుక్కనీరు కూడా పడలేదు.సాగుచేసిన వేరుశనగ పంట నిట్ట నిలువునా ఎండిపోవడం చూసి రైతు కలత చెందేవాడు. చేసిన అప్పులు కూడా పెరిగిపోవడంతో వాటిని ఎలా తీర్చాలో తెలియక మనస్థాపానికి గురై వ్యవసాయ పొలంలోనే చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పుట్టపర్తి వైసీపీలో వర్గ విబేధాలు తారాస్థాయికి చేరాయి. ఎన్నికల సమయం దగ్గర పడే కొద్ది రోజురోజుకూ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డిని వ్యతిరేకిస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి ని లక్ష్యంగా చేసుకుని ఆయన సొంత మండలంలో వైసీపీ కీలక నేతలు సమావేశం నిర్వహించడం నియోజక వర్గ వైసీపీలో కలకలం రేపుతోంది. ఈ అసమ్మతి నేతల సమావేశానికి వైసీపీ సీఈసీ సభ్యులు… కొత్తకోట సోమశేఖర్ రెడ్డి, వైసీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి లోచర్ల విజయ భాస్కర్ రెడ్డి, ఎంపీటీసీ పాముదూర్తి, ఎంపీటీసీ ఇంద్రజిత్ రెడ్డి నాయకత్వం వహించడం కొస మెరుపుగా నిలుస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డికి టికెట్ ఇస్తే మూకుమ్మడిగా కలసి ఓడించి తీరతామని ప్రతిన బూనడం కొసమెరుపు జగనన్న ముద్దు…. దుద్దుకుంట వద్దు అన్న నినాదాలతో సమావేశంలో హోరెత్తించారు. పార్టీ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన ఎమ్మెల్యే వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కార్యకర్తలను అస్సలు పట్టించుకోవడం లేదన్నారు. సొంత పార్టీ కార్యకర్తలనే ఎమ్మెల్యే ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. సమిష్టిగా అందరూ కలిసికట్టుగా గత ఎన్నికల్లో టిడిపి తరఫున బలమైన టిడిపి అభ్యర్థి రఘునాథరెడ్డిని ఓడించామని, ఇప్పుడు శ్రీధర్ రెడ్డికి మాత్రం టికెట్ ఇవ్వకూడదని అందరూ అధిష్టానానికి ఫిర్యాదు చేస్తామన్నారు. ఆయనకు టికెట్ ఇస్తే వైసీపీలో ఎవరు సహకరించే పరిస్థితిలో లేరన్నారు. స్థానికంగా అందుబాటులో ఉంటూ ప్రజాసేవ చేస్తున్న ఏ ఒక్కరికి టికెట్ ఇచ్చినా గెలిపించుకొని సీఎం జగన్ కు కానుకగా ఇస్తామన్నారు.
కొసమెరుపు :
అసమ్మతి నేతలందరూ నల్లమాడ మండల కేంద్రంలోని ఓ సమావేశ భవనంలో సభ నిర్వహిస్తుండగా పోలీసు అధికారులు రంగప్రవేశం చేసి ఇక్కడ ఎందుకు సమావేశం నిర్వహిస్తున్నారో కాస్త వివరణ ఇవ్వాలని అసమ్మతి నేతలను అడ్డుకున్నారు. పోలీసులతో కొద్దిసేపు వాగ్వాదానికి దిగి సమావేశాన్ని యథాతథంగా నిర్వహించారు.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి కుటుంబానికి ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్యే టికెట్ కేటాయించనున్నట్లు జెసి ప్రభాకర్ రెడ్డి పరోక్షంగా చెప్పారు. అనంతపురం జిల్లా యాడికి మండల కేంద్రంలో ఆయన చేపట్టిన బస్సు యాత్ర ముగింపు సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా జేసీ కుటుంబానికి ఎన్ని టికెట్లు అని మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ కుటుంబానికి ఒకటే అని నా దగ్గర అధినేత చంద్రబాబు చెప్పలేదని స్పష్టం చేశారు. మిగతా చాలామంది నేతలకు ఆ విషయం చెప్పిండోచ్చేమో అన్నారు. అనంతపురం పార్లమెంట్ స్థానంతో పాటు తాడిపత్రి ఎమ్మెల్యే టికెట్ తమకు కేటాయించాలని అధిష్టానానికి చెప్పగా సానుకూల సంకేతాలు వచ్చినట్లు ఆయన పరోక్షంగా వెల్లడించారు. జగన్ ప్రభుత్వంలో ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నట్లు ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు. యాడికి మండల వ్యాప్తంగా మహిళలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అలాగే రైతాంగం సాగునీరు లేక ఇబ్బందులు పడుతున్నట్లు తన దృష్టికి వచ్చిందని ఆయన చెప్పారు.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




Total views : 91110