మాజీ మంత్రి, వైసీపీ లీడర్ పేర్ని నాని సతీమణి పేర్ని జయసుధపై కేసు నమోదైంది. రేషన్ బియ్యం అక్రమాలపై సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ కృష్ణాజిల్లా అసిస్టెంట్ మేనేజర్ కోటిరెడ్డి ఫిర్యాదు మేరకు మచిలీపట్నం పోలీసులు కేసు నమోదు చేశారు. 185 టన్నుల పీడీఎఫ్ బియ్యం మాయమైనట్లు పౌరసరఫరాల శాఖ అధికారి కోటిరెడ్డి తేల్చారు. అయితే వేబ్రిడ్జి సరిగా పనిచేయడం లేదంటూ.. తప్పించుకునేందుకు వైసీపీ నేత పేర్ని నాని యత్నించారు. గత వైసీపీ ప్రభుత్వంలో మాజీ మంత్రి పేర్ని నాని తన సతీమణి జయసుధ పేరిట బందరు మండలం పొట్లపాలెంలో గోడౌన్‌ను నిర్మించారు. దానిని సివిల్ సప్లయిస్‌కు బఫర్ గోడౌన్‌గా అద్దెకు ఇచ్చారు. గత పది రోజుల క్రితం వార్షిక తనిఖీల్లో భాగంగా పేర్ని నాని గోడౌన్‌ను సివిల్ సప్లయిస్ అధికారులు తనిఖీ చేశారు. తనిఖీల్లో భాగంగా స్టాక్‌లో తీవ్ర వ్యత్యాసాన్ని అధికారులు గుర్తించారు. 185 టన్నుల పీడీఎఫ్ బియ్యం మాయమైనట్టు మాయమైనట్లు తేల్చారు.
పౌరసరఫరాల శాఖ అధికారి కోటిరెడ్డి ఫిర్యాదు మేరకు పేర్ని నాని సతీమణిపై కేసు నమోదైంది. పేర్ని నాని సతీమణి జయసుధతో పాటు గోడౌన్ మేనేజర్ మానస తేజపై కూడా ఫిర్యాదు నమోదైంది. వేబ్రిడ్జి సరిగ్గా పని చేయడం లేదని పేర్ని నాని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. వేబ్రిడ్జి సరిగ్గా పని చేయకపోవడం వల్ల షార్టేజీ వచ్చిందని సివిల్ సప్లయిస్ అధికారులకు పేర్ని నాని సతీమణి జయసుధ లేఖ రాశారు. షార్టేజీకి సంబంధించిన ధాన్యం విలువ ప్రభుత్వానికి చెల్లిస్తామని లేఖలో పేర్కొన్నారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- చైనాపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన ఆరోపణలు.అమెరికా ఎన్నికల వ్యవస్థలో చైనా భారీగా జోక్యం చేసుకుందని, ఏకంగా 22 కోట్ల మంది ఓటర్ల డేటాను దొంగిలించిందని సంచలన ఆరోపణలు చేశారు US ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్. అమెరికా చరిత్రలోనే ఇది అతిపెద్ద ఎన్నికల డేటా చౌర్యం అని ఆరోపించారు.…
- అన్నమయ్య జిల్లాలో ఘనంగా విరుపాక్షమ్మ తల్లి పుష్కరోత్సవాలు.అన్నమయ్య జిల్లా చిన్నమండెం మండలం బోరెడ్డిగారిపల్లిలోని శ్రీ విరుపాక్షమ్మ తల్లి ఆలయంలో పుష్కరోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయ నిర్మాణానికి 12 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా నిర్వహిస్తున్న ఈ ఉత్సవాల్లో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి దంపతులు ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.మూడు…
- దేశంలో పట్టాలెక్కిన తొలి హైడ్రోజన్ రైలు.భారత రైల్వే చరిత్రలో నూతన శకం ఆరంభమైంది. రైల్వే రంగంలో పర్యావరణహిత విధానాలను ప్రవేశపెట్టే దిశగా కీలక ముందడుగు పడింది. దేశంలోనే తొలిసారిగా హైడ్రోజన్‌తో నడిచే రైలు పట్టాలెక్కింది. హర్యానాలోని జింద్ రైల్వే స్టేషన్లో ప్రధాని మోదీ జెండా ఊపి ప్రారంభించారు.…
- పశ్చిమ బెంగాల్లో రైలు ప్రమాదం.పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్‌లో విషాదం నెలకొంది. స్కూల్ బస్సును రైలు ఢీకొట్టిన ఘటనలో ముగ్గురు మృతి చెందగా పలువురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. ఉదయం 7 గంటల ప్రాంతంలో ఓ స్కూల్ బస్సు కర్ణసుబర్ణ రైల్వే క్రాసింగ్ దగ్గర పట్టాలు దాటుతుండగా…
- ఇరాన్‌పై మరోసారి అమెరికా దాడులు.పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు మరింత ఉధృతమయ్యాయి. ప్రపంచ చమురు రవాణాకు గుండెకాయ వంటి హర్మూజ్ జలసంధి కేంద్రంగా అమెరికా, ఇరాన్ దేశాల మధ్య భీకర దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా ఇరాన్‌లోని బ్రిడ్జిలు, రవాణా మార్గాలపై అమెరికా వైమానిక దాడులను మరింత తీవ్రతరం…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి





Total views : 212535