రాజ్యాంగం అంటే సంఘ్ విధాన్ కాదని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ అన్నారు. రాజ్యాంగాన్ని ఆమోదించుకుని 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా జరిగిన చర్చలో ప్రియాంక పార్లమెంట్లో తొలిసారి ప్రసంగించారు. ఎన్డీయే నేతృత్వంలోని బీజేపీ సర్కార్ రాజ్యాంగాన్ని బలహీనపర్చేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. న్యాయం, భావప్రకటన, ఐకమత్యానికి రాజ్యాంగం సురక్షా కవచ్ లా పనిచేస్తోందన్నారు. అయితే గత పదేళ్లుగా రాజ్యాంగాన్ని పరిరక్షిస్తున్నామని చెప్పేవాళ్లు దాన్ని ధ్వంసం చేస్తున్నారని మండిపడ్డారు. అదానీ పేరును ప్రస్తావించకుండానే.. ఒక్కరికి ప్రయోజనం చేసేందుకు 142 కోట్ల ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారని ధ్వజమెత్తారు. వ్యాపారాలు, వనరులు, డబ్బులు కేవలం ఒక వ్యక్తి చేతిలో ఉన్నాయన్నారు.
పోర్టులు, ఎయిర్ పోర్టులు, మైన్స్, పబ్లిక్ సెక్టార్ కంపెనీలు ఒక్కరి చేతిలో పెట్టారని బీజేపీపై ఫైర్ అయ్యారు. ప్రభుత్వ రంగంలో ప్రైవేటీకరణ, రిజర్వేషన్ కోటాలను నిర్వీర్యం చేయడం ద్వారా రాజ్యాంగంలో పొందుపర్చిన సామాజిక న్యాయ సూత్రాలను బీజేపీ అణగదొక్కుతోందన్నారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు బీజేపీకి పూర్తి స్థాయిలో అనుకూలంగా వచ్చి ఉంటే ఇప్పటికే వారు రాజ్యాంగాన్ని మార్చే ప్రక్రియను ప్రారంభించి ఉండేవారని ఆరోపించారు. గెలిచినా ఓడినంత పని కావడంతో రాజ్యాంగ మార్పు ఈ దేశంలో సాధ్యం కాదని బీజేపీకి అర్థమైందన్నారు. కులగణన చేపట్టాలని రాహుల్ గాంధీ అంటుంటే బీజేపీ మాత్రం తమ వైఖరిని దాటవేస్తోందన్నారు. కులగణన గురించి ప్రతిపక్ష నేతలు మాట్లాడుతుంటే వారు మాత్రం మంగళసూత్రాన్ని అపహరించుకుపోతారని అంటున్నారని ప్రధాని మోడీపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- నీట్ పేపర్ లీక్‌పై పోరాడుతున్న సోనమ్ వాంగ్‌చుక్.సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ ఢిల్లీలో చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష 19వ రోజుకు చేరుకుంది. ఈ నేపథ్యంలో ఆయన ఆరోగ్యంపై ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆయన ప్రాణాలను కాపాడేందుకు అవసరమైన వైద్య చర్యలన్నీ తీసుకోవాలని ప్రభుత్వానికి…
- పాకిస్తాన్లో మరోసారి రెచ్చిపోయిన ఉగ్రవాదులు.పాకిస్థాన్‌లో మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. బన్ను జిల్లాలో ఉన్న మిర్యాన్ పోలీస్ స్టేషన్‌పై ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు.భారీ పేలుడుతో పోలీస్ స్టేషన్ పరిసరాలు ఒక్కసారిగా దద్దరిల్లిపోయాయి. ఈ ఘటనలో పలువురు పోలీసులు అక్కడికక్కడే మృతి చెందగా..డజన్ల సంఖ్యలో భద్రతా సిబ్బంది…
- విశాఖ సముద్రంలో ఫిషింగ్ బోటు బోల్తా.విశాఖపట్నంలో సముద్రం ఒక్కసారిగా ఉగ్రరూపం దాల్చడంతో పెను ప్రమాదం తప్పింది. చేపల వేటకు వెళ్లిన మత్స్యకారుల బోటు బోల్తాపడగా… ఏడుగురు మత్స్యకారులు మృత్యువు అంచుల వరకు వెళ్లి ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడగా, బోటు, వల పూర్తిగా…
- రాజన్న సిరిసిల్ల జిల్లా మున్సిపల్ కార్యాలయం ఎదుట బీజేపీ ధర్నా.రాజన్న సిరిసిల్ల జిల్లాలో బీజేపీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ నిరసన వ్యక్తం చేశారు.మున్సిపల్ ఎన్నికల సమయంలో ప్రజలకు అండగా ఉంటానని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే కేటీఆర్.. ప్రస్తుతం…
- డిసెంబర్ 3న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న రెబల్ స్టార్ ప్రభాస్ “ఫౌజీ”.ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులు ఎదురుచూస్తున్న మూవీ రెబల్ స్టార్ ప్రభాస్ “ఫౌజీ”. ఈ క్రేజీ మూవీ రిలీజ్ డేట్ ను ఈ రోజు మేకర్స్ అనౌన్స్ చేశారు. అజాతపర్వం ముగిసింది, ది రెబలియన్ ప్రారంభమైంది అంటూ డిసెంబర్ 3న ఫౌజీ సినిమాను…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి



Total views : 212335