రాష్ట్రంలో రైతులు పండించిన పత్తినంతా సీసీఎల్ కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకుంటామని రాష్ట్ర వ్యవసాయ, జౌళి శాఖ మంత్రులు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. రాష్ట్రంలో పత్తి సాగు, ఉత్పత్తి పెరగడంతో పాటు రైతులకు ఆర్థిక భరోసా కలిగేలా నూతన వంగడాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని అన్నారు. రాష్ట్రంలో రైతుల దగ్గర పత్తి కొనుగోలు చేస్తేనే సెస్ తొలగిస్తామని పత్తి స్పిన్నింగ్, జిన్నింగ్ వ్యాపారులకు మంత్రులు స్పష్టం చేశారు. పత్తి రైతుల దగ్గర మొత్తం పంట కొనుగోలు చేసేలా సీసీఎల్ కు, కేంద్రానికి లేఖ రాయనున్నట్లు వెల్లడించారు. ఈ క్రాప్‌లో తప్పనిసరిగా పత్తి రైతులు తమ పేర్లు నమోదు చేసుకోవాలని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. ఈ క్రాప్‌లో నమోదు చేసిన పంటనంతా సీసీఐ కొనుగోలు చేయాలని ఆ సంస్థ ప్రతినిధికి స్పష్టం చేశారు. అదే సమయంలో ఈ క్రాప్‌లో నమోదు వల్ల ప్రభుత్వం అందించే ఫలాలతో లబ్ధిపొందొచ్చునని రైతులకు అవగాహన కల్పించాలన్నారు.పత్తి రైతులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.పత్తి సేకరణలో ప్లాస్టిక్ వినియోగంపై నివారణకు జిన్నింగ్, స్పిన్నింగ్ మిల్లర్లు ముందుకు రావాలన్నారు. ప్లాస్టిక్ సంచుల్లో వచ్చే పత్తిని కొనుగోలు చేయబోమని రైతులకు తేల్చి చెప్పాలన్నారు. ప్రభుత్వం కూడా ప్లాస్టిక్ వినియోగంపై ఉక్కుపాదం మోపుతుందన్నారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- ఈసీ నిర్ణయాలు ఏకపక్షంగా ఉండొద్దు.ఎన్నికల కమిషన్ నిర్ణయాలు పారదర్శకంగా, రాజ్యాంగబద్ధంగా ఉండాలని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. ఎన్నికల ప్రక్రియలో సమిష్టి నిర్ణయాలు, ఓటర్ల జాబితాల విషయంలో పూర్తి పారదర్శకత అవసరమని పేర్కొన్నారు. ఎన్నికల కమిషన్‌లో అంతర్గత అభిప్రాయ భేదాలపై ఇటీవల వచ్చిన నివేదికల…
- బి.కొత్తకోటలో గ్యాస్ సిలిండర్ల కోసం ఆందోళన.అన్నమయ్య జిల్లా బి.కొత్తకోట పట్టణంలోని పిటియం రోడ్డులో ఉద్రిక్తత నెలకొంది. పెద్దతిప్పసముద్రం మండలంలో వంట గ్యాస్ సిలిండర్ల కోసం లబ్ధిదారులు రోడ్డెక్కారు. ఇండియన్ గ్యాస్ యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు గ్యాస్ బుక్ చేసుకున్నా.. బుకింగ్‌ను రద్దు…
- అంబటి రాంబాబుకు ఈడీ నోటీసులు.ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుకు ఈడీ నోటీసులు జారీ చేసింది. రేపు ఉదయం పదున్నర గంటలకు హైదరాబాద్‌లోని ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని ఫోన్ ద్వారా సమాచారం అందించారు. అయితే…
- కాంగ్రెస్ నేతల క్షుద్రపూజల ఆరోపణలపై కోర్టును ఆశ్రయించిన హరీష్‌రావు.తాను క్షుద్ర పూజలు చేశానంటూ తప్పుడు ప్రచారం చేసిన పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్‌లపై ఆధారాలతో క్రిమినల్ పరువు నష్టం పిటిషన్ దాఖలు చేయగా, కోర్టు విచారణకు స్వీకరించిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీష్…
- ఐ బొమ్మ రవికి నాంపల్లి కోర్టులో ఊరట.ఐబొమ్మ రవికి నాంపల్లి కోర్టులో ఊరట కలిగింది. పోలీసులు సీజ్ చేసిన రవి బ్యాంకు ఖాతాలను ఆయన తన లావాదేవీల కోసం ఉపయోగించుకోవచ్చని కోర్టు సూచించింది. ఇందుకోసం రవికి అనుమతి ఇవ్వాలని పోలీసులకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే, ఆ…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి