కడప జిల్లా.. రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడి కార్యకర్తల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏఐటీయూసీ, సిఐటియు ఆధ్వర్యంలో ప్రొద్దుటూరు తహసిల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియాన్ల నాయకులు మాట్లాడుతూ.. అంగన్వాడి కార్యకర్తలకు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం 26 వేలు వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోవడం వల్లే అంగన్వాడి కేంద్రాలను మూసివేసి ఈరోజు రోడ్డుపైకి వచ్చామని దీనికి కారణం ప్రభుత్వమేనని చెప్పారు. 30 ఏళ్లుగా అంగన్వాడీ కార్యకర్తలుగా పనులు చేస్తున్నామని కేవలం 11 వేల రూపాయల జీతంతో ఎలా మా కుటుంబాలు పోషించుకోవాలని ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వం కంటే వెయ్యి రూపాయలు అదనంగా వేతనం ప్రభుత్వం ఇవ్వాలని డిమాండ్ చేశారు. స్టోర్ డీలర్లు పౌష్టికాహారాన్ని అంగన్వాడీ కేంద్రాల వద్ద దించకుండా వీధుల వెంట పరిగెత్తిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం స్పందించేంత వరకు ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరించారు. అంగన్వాడీలు చేస్తున్న ఆందోళనకు ప్రజా సంఘాలు మద్దతు తెలిపారు.
business
అన్నమయ్య జిల్లా.. రాయచోటి.. ఎడవ వేతన కమిటిలో అమలు కాని అంశములపై తఫాల శాఖ ఉన్నత అధికారులు చర్చల పేరుతో కాలయాపన చేస్తున్నందుకు నిరసనగా జిడీఎస్, పిజేసిఎ కేంద్ర సంఘాల పిలుపు మేరకు అన్నమయ్య జిల్లా రాయచోటి తఫాల శాఖ కార్యాలయం వద్ద గ్రామీణ తఫాల శాఖ ఉద్యోగులు నిరవధిక సమ్మెను చేపట్టడం జరిగింది. ఈ సమ్మె ప్రదానంగా ఎనిమిది డిమాండ్లతో సమ్మెను కొనసాగిస్తున్నారు. ప్రధానమైన డిమాండ్లు సివిల్ సర్వెంట్ హోదా వెంటనే కల్పించి 8 గంటల పని భారం ఉండేలా అమలు చేయాలన్నారు. 12, 24, 36 అదనపు సర్వీసెస్ ఇంక్రిమెంట్లు మంజూరు తో పాటు గ్రూప్ ఇన్సూరెన్స్ ఐదు లక్షలకు పెంచి రిటైర్మెంట్ గ్రాడ్యువిటీ 5 లక్షలకు పెంచాలన్నారు. కుటుంబ సభ్యులతో సహా వైద్య సౌకర్యం కల్పించాలి. కమలేష్ చంద్ర కమిటీ సిఫార్సు చేసిన ప్రతి అంశాన్ని అమలు చేయాలి. జిడిఎస్ కాంట్రిబ్యూషన్ 10 శాతం, డిపార్ట్మెంట్లో 10% కాంట్రిబ్యూషన్ ను అందజేయలన్నారు. తాత్కాలిక పెన్షన్ సదుపాయం కల్పించి, రెగ్యులర్లు సెలవులు పెట్టినప్పుడు వర్క్ లోడ్ తో సంబంధం లేకుండా అదనపు వ్యక్తిని నియమించుకునే విదంగా అనుమంతిన్చాలన్నారు. ఇన్సెంటివ్ కమిషన్ పద్ధతి రద్దు చేసి మరి అన్ని రకాల ఐపిపిబి, ఆర్ పి ఎల్ ఐ, పి ఎల్ ఐ,యాన్ ఆర్ ఈ జి ఎస్, సేవింగ్స్ ను పనిభారంలోని తీసుకోవాలన్నారు. ఏడవ వేతన కమిటీలు అమలుకాని అన్ని అంశాలను వెంటనే అమలు చేయాలి, టార్గెట్స్ మేళా రూపంలో జిడిఎస్ ఉద్యోగులు ఎదుర్కొంటున్న అన్ని రకాల వేధింపులను నిలుపుదల చెయ్యాలని వారు ఈ సందర్బంగా డిమాండ్ చేశారు. ఈ సమ్మెలో బిపిఎం, ఏబిపిఎం లు సద్దాం, ఇస్మాయిల్ జమిలుల్లా, రామ మోహన్ రెడ్డి, వెంకటరమణ తదితరులు హాజరయ్యారు.
Read Also…
Read Also…
తక్షణ మానవతావాద సాయం కోసం గాజాలో ఇజ్రాయెల్- హమాస్ కాల్పుల విరమణకు డిమాండ్ చేస్తూ ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ముసాయిదా తీర్మానానికి భారత్ అనుకూలంగా ఓటు వేసింది. హమాస్ చెరలో ఉన్న బందీలందరినీ బేషరతుగా విడుదల చేయాలని ఈ తీర్మానంలో పొందుపరిచారు. అల్జీరియా, బహ్రెయిన్, ఇరాక్, కువైట్, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియా, యూఏఈ, పాలస్తీనాతోపాటు అనేక దేశాలు స్పాన్సర్ చేసిన ఈ తీర్మానంపై మంగళవారం ఓటింగ్ జరిగింది. అమెరికా, ఇజ్రాయెల్ సహా పది దేశాలు వ్యతిరేకంగా ఓటు వేశాయి. మరో 23 దేశాలు ఓటింగ్‌కు దూరంగా ఉన్నాయి. ముసాయిదా తీర్మానంలో హమాస్‌ను ప్రస్తావించకపోవడంపై అమెరికా, ఇజ్రాయెల్ సహా పలు దేశాలు తప్పుబట్టాయి. అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌లో హేయమైన ఉగ్రవాద దాడులను ఖండించాలని, బందీల విడుదలను పేర్కొంటూ తీర్మానానికి సవరణ చేయాలని డిమాండ్ చేశాయి. జనరల్ అసెంబ్లీ నుంచి వెలువడిన శక్తిమంతమైన సందేశం పరంగా ఇదొక చారిత్రాత్మకమైన రోజు అని ఐరాసలోని పాలస్తీనా రాయబారి రియాద్ మన్సూర్ వ్యాఖ్యానించారు.
పుంగనూరు మేలుపట్ల కు చెందిన లతీఫ్ (28) కుటుంబ ఆర్థిక పరిస్థితి సరిగా లేనందున ప్రతిరోజూ కూలి పనులుకు వెళ్లేవారు. రోజు మాదిరిగా ఉదయం స్థానికంగా రాయల్ పేట రోడ్డు లో రేకులు షెడ్ వేయుటకు వెళ్లినట్లు లతీఫ్ కుటుంబ సభ్యులు తెలిపారు. రేకుల షెడ్ పనులు చేస్తున్న సమయంలో షెడ్ పై పోతున్న 11 కెవి విద్యుత్ వైర్లు ప్రమాద వశాత్తు తగిలి కాలినట్లు స్థానికులు సమాచారం. హుటాహుటిన విద్యుత్ సరఫరా నిలిపివేసి అతన్ని పుంగనూరు ఏరియా ఆస్పత్రికి తరలించి ప్రధమ చికిత్స వైద్యులు అందించారు. మెరుగైన వైద్యం కొరకు తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించినట్లు వైద్యులు వెల్లడించారు.
సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఏపీ ప్రభుత్వం భూ హక్కు చట్టం తీసుకురావడం దారుణమని న్యాయవాది వంగర వెంకటాచార్యులు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ఏపీ భూహక్కు చట్టం 27/2023ను రద్దు చేయాలని కోరుతూ న్యాయవాదుల సంఘము ఆధ్వర్యంలో అఖిలపక్షం ధర్నా నిర్వహించింది. అనంతరం ఆర్ డీవో అచ్యుత్ అంబరీష్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా న్యాయవాదులు మాట్లాడుతూ భూ హక్కు చట్టం కబ్జాదారులకు వరంగా మారనున్నదన్నారు. ఇది ఒక చీకటి చట్టం అన్నారు. రెవెన్యూశాఖ పాదాల చెంతకు ప్రజల ఆస్తి హక్కులును ప్రభుత్వం పెట్టిందన్నారు. మన హక్కులు కూడా డబ్బు పెట్టి కొనుక్కొనే చట్టం అన్నారు. ఇప్పటికే రెవెన్యూశాఖ లో రెడ్ టేపిజం, లంచగొండితనం పెరిగి పోయిందన్నారు. అధికారులు ఉత్తర్వులు ఇస్తే జిల్లా, రాష్ట్ర ట్రిబ్యునల్ దానికే మద్దతు ఇస్తుందన్నారు. అధికారులు ఇచ్చిన తీర్పును హైకోర్టులో పెట్టాలి. ఇప్పటికే హైకోర్టులో పని భారం పెరిగి పోయిందన్నారు. ఈ చీకటి చట్టాన్ని రద్దు చేసే వరకు ప్రజలు అందరూ వ్యతిరేకించాలని కోరారు.
విజయవాడ.. కనకదుర్గమ్మను దర్శించుకునేందుకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరావు ఇంద్రకీలాద్రికి చేరుకున్నారు. వైఎస్ఆర్సిపి ఎంపీ మిధున రెడ్డి, కాపు కార్పొరేషన్ చైర్మన్ శేషు, కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షుడు రుద్రరాజు, ఏపీ కాంగ్రెస్ నేతలు పొంగులేటి ను రిసీవ్ చేసుకున్నారు. ఆలయ మర్యాదలతో తెలంగాణ మంత్రికి అధికారులు, అర్చకులు స్వాగతం పలికారు. దర్శనానంతరం రోడ్డు మార్గాన గన్నవరం విమానాశ్రయం చేరుకొని హైదరాబాద్ కు బయలుదేరారు. గన్నవరం విమానాశ్రయంలో పొంగులేటి శ్రీనివాస్ రావు కు సుంకర పద్మశ్రీ వీడ్కోలు పలికారు.
శ్రీకాళహస్తి ఆలయానికి విచ్చేసి స్వామి అమ్మవారిని మంత్రి నగిరి ఎమ్మెల్యే RK రోజా దర్శించుకున్నారు. ఆలయ అధికారులు మరియు శ్రీకాళహస్తి ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు బోర్డు మెంబర్లు మంత్రి రోజాకి కుంభ స్వాగతం పలికారు, స్వామి అమ్మవార్ల దర్శనానికి ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం శ్రీకాళహస్తి శాసనసభ్యులు, YCP నాయకులు లోకేష్ యాదవ్ ఇతర నాయకులు మరియు ఆలయ అధికారులు మంత్రి రోజాకి శ్రీకాళహస్తి స్వామి అమ్మవార్ల చిత్రపటాన్ని, ప్రసాదాలను అందజేశారు.
తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సుబ్బారెడ్డి నగర్ లో అర్ధరాత్రి ఘటన ఓ చోటుచేసుకుంది. మృతుడు రౌడీ షీటర్ కిషోర్ గా పోలీసులు గుర్తించారు. హత్యకు కారణం తోటి స్నేహితుల మధ్య జరిగిన వివాదమే.., కత్తితో పొడిచి హతమార్చినట్టు సమాచారం. సంఘటన స్థలానికి చేరుకున్న ఈస్ట్ సి ఐ మహేశ్వర్ రెడ్డి అలిపిరి సిఐ అబ్బన్న బృందంతో విచారణ ముమ్మరం చేశారు.
Read Also..
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గం లో ఎమ్మెల్యే గడ్డం వినోద్ మహాలక్ష్మి పథకం, మహిళలకు ఉచిత బస్ ప్రయాణం, ఆరోగ్యశ్రీ పెంపు ద్వారా 10 లక్షల రూపాయల వరకు వైద్య సేవల పథకాలను ప్రారంభించారు. ఎమ్మెల్యే చేతుల మీదుగా వంద పడకల హాస్పిటల్ లో రిబ్బన్ కట్ చేశాడు. ప్రమాణ స్వీకారం అనంతరం గడ్డం వినోద్ నియోజవర్గం లో మొదటి పర్యటన సందర్బంగా భారీగా నాయకులు, కార్యకర్తలు శాలువాలతో, పూలమాలాలు వేసి సన్మానించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ప్రజల తన పై విశ్వాసం తో గెల్పించారని.. బెల్లంపల్లి నియోజకవర్గం అభివృద్ధి, సంక్షేమం కోసం అహర్నీశలు కృషి చేస్తా అని తెలిపారు.
జగన్ పాలనలో ప్రజలు అష్ట కష్టాలు పడి బ్రతుకు పోరాటానికి నానా తిప్పలు పడుతున్నారని మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి ధ్వజమెత్తారు. వచ్చే ఎన్నికల్లో జగన్ ప్రభుత్వానికి ప్రజలే తగిన గుణపాఠం చెప్పి చంద్రబాబుకు పట్టం కడతారని ఆయన స్పష్టం చేశారు. ఇందులో భాగంగా ఉడి చెరువు మండల కేంద్రంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులతో కలిసి ఓడి చెరువు నుంచి మద్దకవారిపల్లి వరకు20 కిలోమీటర్ల బైక్ ర్యాలీని నిర్వహించారు. ప్రజా కురుక్షేత్రంలో జగన్ ప్రభుత్వానికి ఓటమి తప్పదని మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి పేర్కొన్నారు. అన్నివర్గాల ప్రజలను నట్టేట ముంచి పైశాచిక ఆనందం పొందడంలో జగన్ కు సాటి మరెవరూ లేరని పల్లె విరుచుకుపడ్డారు. జనరంజక పాలనకు చంద్రబాబు రాష్ట్రానికి శరణ్యం అని పల్లె ఆశాభవం వ్యక్తం చేశారు. రాష్ట్రం పురోగమన దిశగా ముందుకు పోవాలంటే భావితరాలు పది కాలాలపాటు చల్లగా ఉండాలంటే ముఖ్యమంత్రిగా చంద్రబాబును రాష్ట్ర ప్రజలు గెలిపించాలని పల్లె పిలుపునిచ్చారు. అనంతరం మద్దుగవారిపల్లికి చెందిన 200 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలోకి చేరారు వారికి తెలుగుదేశం పార్టీ కండువా కప్పి మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి సాదరంగా ఆహ్వానించారు.





Total views : 89168