శ్రీ కామాక్షింబ సమేత పరాశర్వేశ్వర స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి ఉత్సవాలు మూడు రోజులు పాటు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు చైర్మన్ శ్రీధర్ రెడ్డి తెలిపారు. ఆలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశాంలో స్వామి అమ్మవార్లకు సంబంధించిన కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, తుడా చైర్మన్ మోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో సర్పంచ్ రామచంద్రారెడ్డి సూచనలతో మహాశివరాత్రి ఉత్సవాలను ఆలయంలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అదే విధంగా మహాశివరాత్రి రోజు ఉదయం రెండు గంటల 30 నిమిషాలకు ప్రత్యేక అభిషేకం నిర్వహిస్తామని, స్వామి అమ్మవార్లను సర్వాంగ సుందరంగా పూలతో అలంకరించిన, అనంతరం ఐదు గంటలకు సర్వదర్శనం, మధ్యాహ్నం రెండు గంటల నుండి నాలుగు గంటల వరకు ప్రత్యేక ప్రదోష అభిషేకం ఉంటుందని, కావున భక్తులందరూ స్వామి, ఆమ్మవారిని దర్శించుకొని, వారి కృపకు పాత్రులు కావాలని కోరారు. అలాగే స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు అన్నప్రసాదాలను మంచి నీటి సదుపాయాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
chittoor district news
శ్రీనివాసమంగాపురం శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి విశేషమైన గరుడ వాహనసేవ రాత్రి 7 గంటల నుండి అత్యంత వైభవంగా జరిగింది. స్వామివారు నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా, భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, కేరళ కళాకారులవాయిద్యాలు, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలలో గరుడ వాహనోత్సవం అతి ముఖ్యమైనది. గరుడ వాహనంపై ఉన్న శ్రీవారిని దర్శిస్తే మోక్షం సిద్ధిస్తుందని భక్తుల నమ్మకం. వాహనసేవలో పెద్ద సంఖ్యలో భక్తులు, టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, జేఈవో వీరబ్రహ్మం దంపతులు పాల్గొన్నారు.
Bhumana Abhinay :
భూమన అభినయ్ కి తిరుపతిలో బలిజ కులస్థులంతా అండగా ఉండాలని ఏకగ్రీవంగా తీర్మానించారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో భూమన అభినయ్ కి బలిజ కులస్థులంతా ఓట్లు వేసి భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని నిర్ణయించారు. గతంలో తమ కులానికి చెందిన ప్రజా ప్రతినిధులు, టీటీడీ చైర్మన్ లు కూడా తమకు న్యాయం చేయలేదని, భూమన కరుణాకర రెడ్డి, భూమన అభినయ్ ఆధ్వర్యంలో బలిజ కులస్థులకు న్యాయం చేశారని కొనియాడారు. బలిజ కులస్థులను ఇంతగా ఆదరించిన వారు లేరన్నారు. బలిజ కులస్థులుగా తమపై భూమన కుటుంబం ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా, భూమన అభినయ్ విజయం కోసం అంకిత భావంతో కృషి చేద్దామని పిలుపు నిచ్చారు. తిరుపతి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భూమన అభినయ రెడ్డి మాట్లాడుతూ మా కుటుంబాన్ని కాపు గాచిన కాపు సామాజిక వర్గ ప్రజలను ఎన్నటికీ మరవను అని మీరు చూపిన ప్రేమ, ఆదరణాభిమానాలు అంతా ఇంతా కాదు అని, మీకు ఎంత చేసినా మీ రుణాన్ని ఎన్నటికీ తీర్చుకోలేను అని భూమన అభినయ్ అన్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
మన అభిమాన నాయకుడు భూమన కరుణాకర రెడ్డి విజయంలో మీరు కీలక పాత్ర పోషించారు. ఈ ఎన్నికల్లో నాకు మీ అందరి మద్దతు ఇవ్వమని నేను అభ్యర్థిస్థున్నా అందరి సహకారంతో తిరుపతిలో 18 మాస్టర్ ప్లాన్ రోడ్లు వేసి, అభివృద్ధి చేశాం. తిరుపతి ని మరింతగా మారుస్తానని మీకు హామీ ఇస్తున్నా అన్నారు. నా వైపు నిలబడమని విజ్ఞప్తి చేస్తున్నాను. నా గురించి నలుగురికి చెప్పండి, నా గెలుపు కోసం కృషి చేయండి. మీకు రుణ పడి ఉంటానని అభినయ రెడ్డి అన్నారు. భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ భూమన అభినయ్ విజయం ఆకాంక్షించి, బలిజ సామాజిక వర్గమంతా ఏక తాటిపై నిలబడుతున్నందుకు సంతోషంగా ఉందని, నేడు జరిగిన బలిజ కులస్థుల ఆత్మీయ సమావేశంలో అంత చక్కటి ప్రసంగాలతో మా పై ఉన్న అభిమానాన్ని మరో సారి చాటుకున్న ప్రతి ఒక్కరికీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి కృతజ్ణతలు తెలిపారు.
భూమన అభినయ్ కి మద్ధతుగా నిలబడి, ఎన్నికల్లో ఓట్లు వేసి గెలిపించాలని ప్రజలంతా కలిసి ఉంటే ఎలా మంచి జరుగుతుంది అనేందుకు తిరుపతి అభివృద్ధి చక్కటి ఉదాహరణ అన్నారు. 75 ఏళ్లలో జరగని అభివృద్ధి, జగనన్న చొరవ, ఈ రోజు మీ అందరి సహకారం తోనే జరిగిందన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా నియమితులైనప్పటి నుంచి ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చానని, అటు ఉద్యోగులు, ఇటు భక్తులు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా కృషి చేశానని, ఇన్ని ఆలోచనలు ఉన్న నా కంటే మన భూమన అభినయ్ ఇంకా గొప్పగా ఆలోచించ గలవాడు, భూమన అభినయ్ ని ఎమ్మెల్యే గా గెలిపించుకుంటే నా కంటే గొప్పగా ప్రజలకు సేవ చేయగలడు అని అన్నారు. ఈ కార్యక్రమంలో నీలం బాలాజి, తిరుమల నిర్వాసితులు చిన్నమని, బెల్లం రమేష్, ప్రవీణ్ రాయల్, ప్రవీణ్, చంద్ర రాయల్, రాము తదితర తిరుమల నిర్వాసితులు, తిరుపతి బలిజ సంఘం నాయకులు, మహిళలు పాల్గొన్నారు.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
రేణిగుంట మండలానికి చెందిన ప్రజలకు 70% ఏర్పేడు మండలం చిందేపల్లి జగనన్న ఇంటి పట్టాలను కేటాయించారు. అయితే ఆ భూముల పైన అక్కడి రైతులు సరైన నష్టపరిహారం చెల్లించలేదని కోర్టుకు పోయారు. దీంతో అక్కడ ఇంటి పట్టాలు ఇచ్చిన లబ్ధిదారులకు ఇప్పటి వరకు ఇంటి స్థలాలు చూపించలేదు. దీంతో మొదటి నుండి రేణిగుంట మండలం వామపక్ష పార్టీ నాయకులు నిరసన తెలియజేస్తూ వచ్చారు. అయితే ఒక నెల క్రితం కరకంబాడి పంచాయతీ పరిధిలోని సర్వేనెంబర్ 153 లోని 125 ఎకరాల ప్రభుత్వ భూములో నీ 44 ఎకరాల్లో ఎర్రగుట్ట పైన వామపక్ష నాయకులు ఆధ్వర్యంలో లబ్ధిదారులతో కలిసి ఆక్రమించుకొని గుడారాలు నిర్మించుకున్నారు. అప్పటి నుంచి పలు దఫాలుగా రెవెన్యూ శాఖ, పోలీసులు ఆ స్థలాన్ని ఖాళీ చేపించేందుకు ప్రయత్నం చేసిన విఫలం చెందారు. కడకు వామపక్ష నాయకులతో రెవిన్యూ శాఖ చర్చలు జరిపిన వారు మాట వినకపోవడంతో మంగళవారం తెల్లవారుజామున 4 గంటలకు భారీ ఎత్తున పోలీసులు, రెవెన్యూ శాఖ, అగ్నిమాపక సిబ్బంది. ఆక్రమించుకున్న ప్రాంతాన్ని చుట్టుముట్టి బలవంతంగా కాళీ చేయించారు. కాళీ చేపించే సమయంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా కట్టుదిట్టమైన భద్రతను పోలీసులు ఏర్పాటు చేశారు. దీనిపై సిపిఎం నాయకులు వైసీపీ ప్రభుత్వం చేసిన పనిని ఖండిస్తూ, ఆ పార్టీ పై దుమ్మెత్తి పోశారు.
Intinti Telugudesam program :
గంగవరం మండలంలో ఇంటింటి తెలుగుదేశం కార్యక్రమంలో మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి పాల్గొన్నారు. గంగవరం మండలంలో పండుగ వాతావరణం నెలకొంది మాజీ మంత్రి అమర్నాథరెడ్డి రాకతో ఇంటింటి దగ్గర హారతులు చేపట్టారు. తమ బాధను కష్టాలను మాజీ మంత్రి అమర్నాథరెడ్డికి ప్రజలు చెప్పుకున్నారు. గంగవరం రైతులు సెరికల్చర్ పైన ఆధారపడి బతికే వాళ్ళు ఉన్నారు అంటూ అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రైతులని ఆదుకున్నాడని మీకు గుర్తు చేస్తున్నానని ఆయన అన్నారు. ఈ నాలుగున్నర సంవత్సరంలో సెరికల్చర్ ద్వారా రైతుకు రావాల్సిన ఇన్పుట్ సబ్సిడీ కానీ మేపుకునే దానికి మందులు కానీ బిల్డింగ్స్ గాని ఈ ప్రభుత్వం ఆదుకోలేదని రైతులను చిన్నచూపు చూస్తా ఉందని అన్నారు. సెరికల్చర్ రైతులు డ్రిప్పు పైన ఆధారపడతారు నాలుగు ముఖాల సంవత్సరాలుగా డ్రిప్పు పైపులు ఇవ్వని ఈ ప్రభుత్వం రైతులను ఎలా ఆదుకుంటుందని అన్నారు.
Follow us on : Facebook, Instagram & YouTube.
గంగవరం ప్రాంతంలో ఆటోనగర్ కావాలని చిన్న చిన్న ఇండస్ట్రీలు వస్తే ఈ గ్రామ పంచాయతీలో ఉండే యువకులకు ఉపాధి అవకాశాలు వస్తాయని గత ప్రభుత్వంలోనే ఒక సంవత్సరంలోనే చేశాను. ఈరోజు బైపాస్ పక్కలో ఆటోనగర్ ఉంది అక్కడ ఉపాధి అవకాశాలు వస్తున్నాయా లేదా కండ్లకు కట్టినట్లు కనిపిస్తా ఉందని అన్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత బెదిరించడం భయపెట్టడం కేసులు పెట్టడం తప్పిస్తే ప్రజలకు చేసింది ఏమీ లేదని అన్నారు. మళ్లీ రాష్ట్రానికి యువతల భవిష్యత్తు కోసం చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అధికారాన్ని తీసుకొని రావాలి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని అన్నారు. మీరు ఓట్లు వేసి గెలిపించి అక్కడ చంద్రబాబు నాయుడుని ముఖ్యమంత్రి చేయాలి ఇక్కడ నన్ను శాసనసభ్యుడుగా గెలిపించాలి అంటూ అమర్నాథరెడ్డి ప్రసంగించారు.
ఈ 40 సంవత్సరాల కాలంలో కుప్పం ప్రాంతానికి చంద్రబాబు నాయుడు చేసింది ఏం లేదని, విమర్శించారు. అనేక సంక్షేమ పథకాలు పేదలకు అందజేయాలనే ఉద్దేశంతో వైయస్ జగన్మోహన్ రెడ్డి ఎంతో కృషి చేస్తుంటే అన్నిటికీ ఆటంకాలు చంద్రబాబు నాయుడు కలిగిస్తున్నారని చిత్తూరు ఎంపీ రెడ్డప్ప విమర్శలు చేశారు. హంద్రీనీవా ద్వారా కుప్పం ప్రాంతానికి నీళ్లు రాకుండా చేసిన ఘనత చంద్రబాబునాయుడునె, పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం పెట్టకుండా చేసిన ఘనత కూడా చంద్రబాబునాయుడు అని విమర్శించారు.
రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదని, అందుకే మేమంతా కాంగ్రెస్ పార్టీని వీడి వైయస్ జగన్మోహన్ రెడ్డి వైయస్సార్ పార్టీలో చేరామని, కాంగ్రెస్ పార్టీకు అనేక సేవలు అందించిన వైయస్ రాజశేఖర్ రెడ్డి గారిని ఆయన చనిపోయిన తర్వాత అనేక నింధలు వేశారని, అలాంటి పార్టీలో చేరిన వైఎస్ షర్మిలమ్మ జగన్మోహన్ రెడ్డిని విమర్శనం సరికాదని అన్నారు. కేవలం వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి కూతురు కావడంతో, మేమంతా ఆమెను విమర్శించకుండా పోతున్నామని తెలిపారు.
Jagan Mohan Reddy :
శాంతిపురం మండలంలో ఈ నెల 26 న రాష్ట్ర ముఖ్యమంత్రి కుప్పం నియోజక వర్గం శాంతిపురం మండల పర్యటనను ప్రతిష్టాత్మకంగా తీసుకుని అధికారులు విధులు నిర్వహించాలి. రాష్ట్ర విద్యుత్, అటవీ, పర్యావరణ మరియు శాస్త్ర సాంకేతిక, భూగర్భ గనుల శాఖా మంత్రి…. రాష్ట్ర ముఖ్యమంత్రి శాంతిపురం పర్యటనకు అధికారులు సమిష్టి గా బాధ్యత తో పనిచేయండి. మంగళ వారం రాష్ట్ర ముఖ్య మంత్రి పర్యటన నిమిత్తం ముందస్తు ఏర్పాట్లు పై శాంతిపురం మండలం ఎస్ ఎల్ వి కళ్యాణ మండపం లో రాష్ట్ర విద్యుత్, అటవీ, పర్యావరణ మరియు శాస్త్ర సాంకేతిక శాఖామాత్యులు డా పెద్దిరెడ్డి రామ చంద్రారెడ్డి, చిత్తూరు ఎం పి ఎన్ రెడ్డప్ప, జెడ్ పి చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు, జిల్లా కలెక్టర్ ఎస్ షణ్మోహన్, ఎస్.పి జాషువా, రాష్ట్ర ముఖ్య మంత్రి పర్యటన ల సలహాదారులు తలశీల రఘురాం, ఎమ్మెల్సీ భరత్ లతో కలసి సమీక్ష నిర్వహించారు.
Follow us on : Facebook, Instagram & YouTube.
ఈ సందర్భంగా మంత్రి డా పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి కుప్పం నియోజక వర్గం శాంతిపురం పర్యటన సoదర్భంగా అధికారులు బాధ్యతతో పనిచేసి విజయవoతం చేయాలని సూచించారు. జిల్లా ఉన్నతాధికారుల సూచనలను తప్పక పాటించాలనన్నారు. కుప్పం కు కృష్ణా జలాలను హంద్రీ నీవా కాలువ ద్వారా నీరు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నదని, పనులు పూర్తి చేస్తున్నామని, ముఖ్య మంత్రి గారి చేతుల మీదుగా రామకుప్పం రాజ్ పేట వద్ద హంద్రీ నీవా కాలువ వద్ద కానీ శాంతి పురం మండలం గుండ్లశెట్టి పల్లి వద్ద కానీ పూజ చేయించి ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు. పరమ సముద్రం వద్ద చెరువుల కు నీరు అందించేందుకు మరియు 55 చెరువులకు నీరు అందించేందుకు గేట్ లు పెట్టి తూములు ఏర్పాటు చేయడం లైనింగ్ చేయడం జరిగందన్నారు. నీరు రావడం జరుగుతుందని తెలిపారు. జిల్లా కలెక్టర్ ఎస్ షణ్మోహన్ మాట్లాడుతూ ఈనెల 26న గౌరవ రాష్ట్ర ముఖ్య మంత్రి కుప్పం నియోజక వర్గం శాంతి పురం పర్యటనను అధికారులందరూ సమష్టి గా పని చేసి విజయవంతం చేయాలన్నారు.
ఈ సమావేశమునకు ముందుగా శాంతిపురం మండలం గుండు శెట్టిపల్లి వద్ద బహిరంగ సభ, రామ కుప్పం మండలం రాజ్ పేట వద్ద హంద్రీ నీవా కాలువను, హెలిప్యాడ్, పార్కింగ్ ఏర్పాటుకు స్థల పరిశీలన చేశారు.
ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల ఐక్య కార్యాచరణ సమితి పిలుపు మేరకు పలమనేరు ఎన్జీవో హోం ఆవరణలో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. తాలూకా ఏపీజేఏసీ చైర్మన్ కె ఆనందబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో ఉద్యోగులకు రావాల్సిన 25500 కోట్ల బకాయిలు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. 30% మద్యంతర భృతి మంజూరు చేసి 12 వ పిఆర్సి ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులు దాచుకున్న ఏపీజిఎల్ఐ, జిపిఎఫ్ సొమ్ములు కూడా తిరిగి చెల్లించడం లేదని వాపోయారు. జనరల్ సెక్రెటరీ సిపి ప్రకాష్ మాట్లాడుతూ సరెండర్ లీవులు చెల్లించకపోవడం దారుణమన్నారు. యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి జివి రమణ మాట్లాడుతూ అప్రెంటిస్ విధానాన్ని తిరిగి తెచ్చే ప్రయత్నం సరికాదన్నారు. హెల్త్ కార్డులు ఈ ప్రభుత్వ హయాంలో ఎందుకు కొరగాకుండా పోయాయన్నారు. ఎస్ టి యు నాయకులు విజయ్ కుమార్ మాట్లాడుతూ ఒకటో తేదీన జీతాలు పెన్షన్లు ఇవ్వకపోవడం అనారోగ్య ఆర్థిక విధానాలకు నిదర్శనమన్నారు. ఎన్జీవో సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు లక్ష్మీపతి యాదవ్ మాట్లాడుతూ ఉద్యోగుల పట్ల ప్రభుత్వ వైఖరి చాలా గర్హనీయమన్నారు సమస్యల పరిష్కారం పట్ల ప్రభుత్వ స్పందన శూన్యమన్నారు. వాయిదాలు తప్ప ఫలితం లేదన్నారు.
Follow us on : Facebook, Instagram & YouTube.
ఎన్జీవో సంఘం కార్యదర్శి జయమ్మ మాట్లాడుతూ ఏఎన్ఎం లను ప్రభుత్వం అనేక యాప్ లను ప్రవేశపెట్టి వేధిస్తోందన్నారు. క్షేత్రస్థాయి సిబ్బందికి బయోమెట్రిక్ హాజరు నుంచి మినహాయించాలని డిమాండ్ చేశారు. పెన్షనర్ల సంఘం వెంకటకృష్ణ మాట్లాడుతూ విశ్రాంత ఉద్యోగులకు అదనపు క్వాంటం ఆఫ్ పెన్షన్ తగ్గించి వేయడం దారుణం అన్నారు. తిరిగి మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. బకాయి పడ్డ పీఆర్సీ డిఏ బకాయిలను వెంటనే చెల్లించాలని పేర్కొన్నారు. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు హరి మాట్లాడుతూ సచివాలయ ఉద్యోగులని సాధారణ ప్రభుత్వ ఉద్యోగులుగా చూడకుండా కొంతమంది అధికారులు అణచివేతకు గురి చేయడం సరికాదన్నారు. వేధింపులు ఆపి సహచర ఉద్యోగులుగా చూడడం నేర్చుకోవాలని పేర్కొన్నారు. ఏపీటీఎఫ్ నాయకులు సుదర్శనాచారి మాట్లాడుతూ వారం రోజుల్లో సిపిఎస్ రద్దు అని మాట ఇచ్చి ఐదు సంవత్సరాలు కావస్తున్నా మాట తప్పడం సరికాదన్నారు. గ్రామ వార్డు సచివాలయం సంఘం జిల్లా అధ్యక్షుడు రమణ మాట్లాడుతూ సచివాలయ ఉద్యోగుల హేతుబద్ధీకరణ జీవోని ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. పెన్షనర్ల సంఘం నాయకులు కృష్ణమూర్తి మాట్లాడుతూ పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు గ్రాట్యూటీ కమిటేషన్ బిల్లులు చెల్లించకుండా బాండ్లను జారీ చేయడం దారుణమన్నారు.
సిపిఎస్ సంఘం కన్వీనర్ శశి మాట్లాడుతూ ఉద్యోగులు మినహాయించిన 10 శాతం చందా ప్రభుత్వం వేయాల్సిన 10 శాతం చందా రెండూ కూడా ఉద్యోగుల ఖాతాలో జమ చేయక, ఆ నిధులు ఎక్కడికి మళ్ళించారని ప్రశ్నించారు. సమావేశానికి హాజరైన ఎన్నికల విధులు నిర్వర్తిస్తున్న బి.ఎల్. ఒ.లు మాట్లాడుతూ, నియోజక వర్గం లో అన్ని మండలాల నుండి బి.ఎల్.ఓ లు పలమనేరు లో ఉన్న ఆర్డీఓ కార్యాలయానికి రోజూ హాజరు కావాలని ఒత్తిడి చేస్తున్నారని, ఇందువల్ల తీవ్ర ఒత్తిడి, వ్యయ ప్రయాసలు పడాల్సి వస్తుందన్నారు. సంబంధిత తహసీల్దార్ కార్యాలయంలో క్లెయిమ్ లు అందజేయడానికి ఆర్డీఓ గారు చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వం వెంటనే ఉద్యోగ సంఘాలతో సమావేశమై సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసి న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఈనెల 20వ తారీఖున జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద ధర్నా, 27వ తారీఖున చలో విజయవాడ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో వినోద ఎంటీజీ ప్రసాద్, యాసిన్ షరీఫ్, మురళి, లక్ష్మీనారాయణ నరసింహులు, నారాయణ, దేవా, పలువురు ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లు పాల్గొన్నారు.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
చిత్తూరు జిల్లా పలమనేరు 2019 లో జరిగిన ఎన్నికల్లో ఏ మాత్రం రాజకీయ అనుభవం లేని యువకుడు రాష్ట్ర వ్యాప్తంగా వీచిన ఫ్యాన్ గాలితో వెంకట్ గౌడ గెలిచి అప్పట్లో రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాడు. జిల్లా మంత్రి పెద్దిరెడ్డికి సన్నిహితుడుగా మెలుగుతూ రాజకీయాలు సాగించాడు. అప్పటినుండి గడపగడపకు వైయస్సార్ కార్యక్రమంలో నియోజకవర్గంలోని ప్రతి గడపను చేరుకుని ప్రత్యర్థులను పలమనేరు ఎమ్మెల్యే వెంకట్ గౌడ ముప్పు తిప్పలు పెట్టాడు. వెంకట్ గౌడ రాబోయే ఎన్నికలకు వైసీపీ అభ్యర్థి తనే అంటూ సీటు పక్కా అనే సంకేతాలు ఇస్తూ ప్రత్యామ్యాయం లేకుండా చేసుకున్నాడు. అక్కడే డామిట్ కథ అడ్డం తిరిగింది. నియోజకవర్గ ప్రజలకు దగ్గర ఉంటూనే అధిష్టానానికి దూరంగా ఉండడం ఉమ్మడి చిత్తూరు జిల్లాకు ముఖ్యమంత్రి వచ్చినా… సన్నాహాక సమావేశాలు జరిగిన కనిపించని ఎమ్మెల్యే తీరు జిల్లాలోని పెద్దాయనకు తలనొప్పిగా మారాడు. ఇదే సమయంలో అధికార పార్టీ ఎమ్మెల్యే అయిన సొంత పార్టీలో అసంతృప్తులను బుజ్జగించడంలో విఫలమయ్యారని చర్చ కూడా నడుస్తుంది.
నియోజకవర్గం లోని పార్టీ సీనియర్ నాయకులైన పెద్ద పంజాని విజయభాస్కర్ రెడ్డి, సివి కుమార్, రాకేష్ రెడ్డికి వంటి వారు పార్టీకి దూరమయ్యారు. సొంత పార్టీ నేతలతోను ఎమ్మెల్యేకు సఖ్యత లేకపోవడం పెద్ద దెబ్బె.. ముఖ్యంగా సొంత మండలమైన వి.కోటలో జెడ్పి చైర్మన్ శ్రీనివాసులుతో ప్రతి విషయంలో బహిరంగంగానే వెంకట్ గౌడ విభేదిస్తూ వస్తున్నారు. ప్రతి మండలంలోనూ ఎమ్మెల్యే వ్యతిరేక వర్గం ఉంది అనడం లో సందేహం లేదు. దీనికి తోడు ఎమ్మెల్యే తన నుండి బలవంతంగా క్వారీ లాక్కున్నాడన్న జనార్ధన నాయుడు అనే వ్యక్తి ఆరోపణలు చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కుప్పంలో జరిగిన చంద్రబాబు యాత్రలో వెంకట్ గౌడ గురించి తనకు జరిగిన అన్యాయాన్ని బహిరంగంగా ప్రజలకు తెలిపారు జనార్ధన నాయుడు. ఎమ్మెల్యే అనుచరుల, కౌన్సిలర్ల భూకబ్జాలు, ఇసుక దందాలు వంటి ఆరోపణలతో నిత్యం వార్తలలో నిలిచారు గౌడ. టిడిపి అభ్యర్థి మాజీ మంత్రి అమర్నాథరెడ్డి వెంకట్ గౌడ ఆగడాలను, వారి అనుచరులు చేస్తున్న అరాచకాలను ప్రజలకు వివరించే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో సిట్టింగ్ ఎమ్మెల్యే వెంకట్ గౌడకు మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి ల మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లు జరిగాయి. వీటన్నింటిని చూస్తున్న ప్రజలు విసిగిపోయారు. ఈ నేపథ్యంలో టీడీపీ సీనియర్ నాయకుడు ఆర్వీ సుభాష్ చంద్రబోస్ వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు, ఆయన ప్రభావం పెద్దగా నియోజకవర్గంలో ఉండదని పలమనేరు ప్రజలు అభిప్రాయపడుతున్నారు.
మండల స్థాయిలో జరుగుతున్న జగనన్న ఆసరా కార్యక్రమాన్ని కూడా అర్ధాంతరంగా నిలిపివేసిన ఎమ్మెల్యే ప్రవర్తన నాయకులకు ఆశ్చర్యం కలిగిస్తుంది. నియోజకవర్గ నాయకులకు కూడా ఎమ్మెల్యే అందుబాటులో లేకపోవడం పలు అనుమానాలకు తావిస్తుంది. ఎమ్మెల్యే గౌడ వ్యవహారాన్ని గమనిస్తున్న పెద్దాయన ప్రాతన్యాయంపై ఆలోచిస్తున్నారంటూ పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. నియోజకవర్గంలో తను చేసిన కాంట్రాక్టులకు నిధులను మంజూరు చేయాలంటూ కూడా అధిష్టానం వద్ద తన వాయిస్ వినిపించినట్టుగా పలమనేరు పట్టణంలో పెద్ద చర్చ జరుగుతుంది. ఇప్పటివరకు టికెట్టు నాది అని చెప్పుకుంటున్న వెంకట్ గౌడ రానున్న ఎన్నికల బరిలో దిగుతాడా లేదా అన్న విషయం నియోజకవర్గంలో ప్రశ్నగా మారింది.
ఈ నేపథ్యంలోనే పలమనేరు నియోజకవర్గంలో రాజకీయం ఆసక్తికరంగా మారింది. పలమనేరు అసెంబ్లీ అభ్యర్థిగా తనకు అధిష్టానం అవకాశం ఇస్తే పోటీ చేస్తానని జడ్పీ చైర్మన్ శ్రీనివాసులు మంగళవారం తెలిపారు. ప్రస్తుతం ఎమ్మెల్యేగా వున్న వెంకట్ గౌడను మార్చాలని, ఆయన స్థానంలో పోటీ చేయాలని అధిష్ఠానం నిర్ణయిస్తే కచ్చితంగా పోటీ చేసి గెలిచి పలమనేరు నియోజకవర్గాన్ని వైసీపీ ఖాతాలో వెస్తాను అంటే నిలబెడతానంటున్నారు జడ్పీ చైర్మన్ శ్రీనివాసులు. తన అభ్యర్థిత్వానికి పలమనేరు మున్సిపల్ చైర్ పర్సన్ చాముండేశ్వరి సుధ, మార్కెట్ కమిటీ చైర్మన్ హేమంత్ రెడ్డి, పెద్దపంజాణి, బైరెడ్డిపల్లి, పలమనేరు, గంగవరం ఎంపీపీలు రెడ్డెప్ప, రెడ్డెప్ప, శ్రీదేవి, మురళీమోహన్ రెడ్డి తదితరులు మద్దతు ఇస్తున్నారన్నారు. పలమనేరు స్థానానికి పోటీ చేసే విషయమై అంతకుముందు ఆయన తన అనుచరులతో కూడా మంతనాలు చేశారు. దీంతో పాటు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆశీర్వచనం ఉండడంతో ఈసారి కచ్చితంగా జడ్పీ చైర్మన్ శ్రీనివాసులకి టికెట్ వస్తుందని పలమనేరు నియోజకవర్గ ప్రజలు ఆశిస్తున్నారు. మొత్తం మీద రాబోయే 2024 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి, మాజీమంత్రి అమరనాథ రెడ్డి పై వైసిపి అధిష్టానం ఎవరిని అభ్యర్థిగా నిర్ణయిస్తుందో అని పలమనేరు నియోజకవర్గ ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో పుత్తూరు మున్సిపాలిటీ 17వ వార్డు కౌన్సిలర్ దళిత మహిళ భువనేశ్వరి మీడియా ముందు మాట్లాడారు. పుత్తూరు మున్సిపల్ ఎన్నికల్లో తాను 17వ వార్డు నుంచి ఇనామనస్ గా కౌన్సిలర్ గా ఎన్నికయ్యానని తెలియజేశారు.. 40 లక్షలు ఇస్తే తనకు మున్సిపల్ చైర్మన్ పదవి ఇస్తానని మంత్రి రోజా తమ్ముడు కుమారస్వామి తెలిపారని పేర్కొన్నారు. తాను మూడు విడతలుగా ఆయనకు 40 లక్షల రూపాయలు అందజేశానని వివరించారు. అయితే తనకు ఇప్పటివరకు పదవి ఇవ్వకపోగా తాను ఇచ్చిన డబ్బులను కూడా తిరిగి ఇవ్వనంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి న్యాయం చేయాలని వేడుకున్నారు. తన డబ్బులు ఇవ్వకుంటే మంత్రి రోజా ఇంటి ముందు ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించారు.






Total views : 89640