Saturday, May 2, 2026
News Navigation
Saturday, May 2, 2026
News Navigation

Breaking

>
Saturday, May 2, 2026
Home Andhra Pradesh పలమనేరు వైసీపీ అభ్యర్థి ఎవరు?

పలమనేరు వైసీపీ అభ్యర్థి ఎవరు?

by Prakash
పలమనేరు

చిత్తూరు జిల్లా పలమనేరు 2019 లో జరిగిన ఎన్నికల్లో ఏ మాత్రం రాజకీయ అనుభవం లేని యువకుడు రాష్ట్ర వ్యాప్తంగా వీచిన ఫ్యాన్ గాలితో వెంకట్ గౌడ గెలిచి అప్పట్లో రాజకీయాల్లో చర్చనీయాంశంగా ‌మారాడు. జిల్లా మంత్రి పెద్దిరెడ్డికి సన్నిహితుడుగా మెలుగుతూ రాజకీయాలు సాగించాడు. అప్పటినుండి గడపగడపకు వైయస్సార్ కార్యక్రమంలో నియోజకవర్గంలోని ప్రతి గడపను చేరుకుని ప్రత్యర్థులను పలమనేరు ఎమ్మెల్యే వెంకట్ గౌడ ముప్పు తిప్పలు పెట్టాడు. వెంకట్ గౌడ రాబోయే ఎన్నికలకు వైసీపీ అభ్యర్థి తనే అంటూ సీటు పక్కా అనే సంకేతాలు ఇస్తూ ప్రత్యామ్యాయం లేకుండా చేసుకున్నాడు. అక్కడే డామిట్ కథ అడ్డం తిరిగింది. నియోజకవర్గ ప్రజలకు దగ్గర ఉంటూనే అధిష్టానానికి దూరంగా ఉండడం ఉమ్మడి చిత్తూరు జిల్లాకు ముఖ్యమంత్రి వచ్చినా… సన్నాహాక సమావేశాలు జరిగిన కనిపించని ఎమ్మెల్యే తీరు జిల్లాలోని పెద్దాయనకు తలనొప్పిగా మారాడు. ఇదే సమయంలో అధికార పార్టీ ఎమ్మెల్యే అయిన సొంత పార్టీలో అసంతృప్తులను బుజ్జగించడంలో విఫలమయ్యారని చర్చ కూడా నడుస్తుంది.

నియోజకవర్గం లోని పార్టీ సీనియర్ నాయకులైన పెద్ద పంజాని విజయభాస్కర్ రెడ్డి, సివి కుమార్, రాకేష్ రెడ్డికి వంటి వారు పార్టీకి దూరమయ్యారు. సొంత పార్టీ నేతలతోను ఎమ్మెల్యేకు సఖ్యత లేకపోవడం పెద్ద దెబ్బె.. ముఖ్యంగా సొంత మండలమైన వి.కోటలో జెడ్పి చైర్మన్ శ్రీనివాసులుతో ప్రతి విషయంలో బహిరంగంగానే వెంకట్ గౌడ విభేదిస్తూ వస్తున్నారు. ప్రతి మండలంలోనూ ఎమ్మెల్యే వ్యతిరేక వర్గం ఉంది అనడం లో సందేహం లేదు. దీనికి తోడు ఎమ్మెల్యే తన నుండి బలవంతంగా క్వారీ లాక్కున్నాడన్న జనార్ధన నాయుడు అనే వ్యక్తి ఆరోపణలు చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కుప్పంలో జరిగిన చంద్రబాబు యాత్రలో వెంకట్ గౌడ గురించి తనకు జరిగిన అన్యాయాన్ని బహిరంగంగా ప్రజలకు తెలిపారు జనార్ధన నాయుడు. ఎమ్మెల్యే అనుచరుల, కౌన్సిలర్ల భూకబ్జాలు, ఇసుక దందాలు వంటి ఆరోపణలతో నిత్యం వార్తలలో నిలిచారు గౌడ. టిడిపి అభ్యర్థి మాజీ మంత్రి అమర్నాథరెడ్డి వెంకట్ గౌడ ఆగడాలను, వారి అనుచరులు చేస్తున్న అరాచకాలను ప్రజలకు వివరించే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో సిట్టింగ్ ఎమ్మెల్యే వెంకట్ గౌడకు మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి ల మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లు జరిగాయి. వీటన్నింటిని చూస్తున్న ప్రజలు విసిగిపోయారు. ఈ నేపథ్యంలో టీడీపీ సీనియర్ నాయకుడు ఆర్వీ సుభాష్ చంద్రబోస్ వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు, ఆయన ప్రభావం పెద్దగా నియోజకవర్గంలో ఉండదని పలమనేరు ప్రజలు అభిప్రాయపడుతున్నారు.
మండల స్థాయిలో జరుగుతున్న జగనన్న ఆసరా కార్యక్రమాన్ని కూడా అర్ధాంతరంగా నిలిపివేసిన ఎమ్మెల్యే ప్రవర్తన నాయకులకు ఆశ్చర్యం కలిగిస్తుంది. నియోజకవర్గ నాయకులకు కూడా ఎమ్మెల్యే అందుబాటులో లేకపోవడం పలు అనుమానాలకు తావిస్తుంది. ఎమ్మెల్యే గౌడ వ్యవహారాన్ని గమనిస్తున్న పెద్దాయన ప్రాతన్యాయంపై ఆలోచిస్తున్నారంటూ పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. నియోజకవర్గంలో తను చేసిన కాంట్రాక్టులకు నిధులను మంజూరు చేయాలంటూ కూడా అధిష్టానం వద్ద తన వాయిస్ వినిపించినట్టుగా పలమనేరు పట్టణంలో పెద్ద చర్చ జరుగుతుంది. ఇప్పటివరకు టికెట్టు నాది అని చెప్పుకుంటున్న వెంకట్ గౌడ రానున్న ఎన్నికల బరిలో దిగుతాడా లేదా అన్న విషయం నియోజకవర్గంలో ప్రశ్నగా మారింది.

ఈ నేపథ్యంలోనే పలమనేరు నియోజకవర్గంలో రాజకీయం ఆసక్తికరంగా మారింది. పలమనేరు అసెంబ్లీ అభ్యర్థిగా తనకు అధిష్టానం అవకాశం ఇస్తే పోటీ చేస్తానని జడ్పీ చైర్మన్ శ్రీనివాసులు మంగళవారం తెలిపారు. ప్రస్తుతం ఎమ్మెల్యేగా వున్న వెంకట్ గౌడను మార్చాలని, ఆయన స్థానంలో పోటీ చేయాలని అధిష్ఠానం నిర్ణయిస్తే కచ్చితంగా పోటీ చేసి గెలిచి పలమనేరు నియోజకవర్గాన్ని వైసీపీ ఖాతాలో వెస్తాను అంటే నిలబెడతానంటున్నారు జడ్పీ చైర్మన్ శ్రీనివాసులు. తన అభ్యర్థిత్వానికి పలమనేరు మున్సిపల్ చైర్ పర్సన్ చాముండేశ్వరి సుధ, మార్కెట్ కమిటీ చైర్మన్ హేమంత్ రెడ్డి, పెద్దపంజాణి, బైరెడ్డిపల్లి, పలమనేరు, గంగవరం ఎంపీపీలు రెడ్డెప్ప, రెడ్డెప్ప, శ్రీదేవి, మురళీమోహన్ రెడ్డి తదితరులు మద్దతు ఇస్తున్నారన్నారు. పలమనేరు స్థానానికి పోటీ చేసే విషయమై అంతకుముందు ఆయన తన అనుచరులతో కూడా మంతనాలు చేశారు. దీంతో పాటు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆశీర్వచనం ఉండడంతో ఈసారి కచ్చితంగా జడ్పీ చైర్మన్ శ్రీనివాసులకి టికెట్ వస్తుందని పలమనేరు నియోజకవర్గ ప్రజలు ఆశిస్తున్నారు. మొత్తం మీద రాబోయే 2024 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి, మాజీమంత్రి అమరనాథ రెడ్డి పై వైసిపి అధిష్టానం ఎవరిని అభ్యర్థిగా నిర్ణయిస్తుందో అని పలమనేరు నియోజకవర్గ ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Read Also…

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow us on : Facebook, Instagram & YouTube.

Advertisements

You may also like

Our Visitor

009422
Total views : 62335

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.