ఉమ్మడి చిత్తూరు జిల్లా వైసిపి ఎమ్మెల్యేలు, మంత్రులలో భయం మొదలైంది…ఈ సారి 2024 ఎన్నికల్లో అభ్యర్థుల పనితీరు బట్టి సీట్లు కేటాయించబోతున్నట్లు సియం జగన్ ఇప్పటికే ఎమ్మెల్యేలకు స్పష్టం చేశారు. ఓ సర్వే సంస్థ ఇచ్చిన సర్వేల ఆధారంగా ఈ సారి 2024 ఎన్నికల్లో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మొత్తం 14 నియోజకవర్గాల్లో సగం మందికి పైగా కొత్త వారికే అవకాశం వచ్చేటట్లు ఉంది. పుంగునూరు నుండి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తంబళ్లపల్లి నుండి పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి, చంద్రగిరి నుండి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తనయుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి, తిరుపతి నుండి భూమన కరుణాకర్ రెడ్డి కుమారుడు అభినయ్ రెడ్డికి, కుప్పంలో ఎమ్మెల్సీ భరత్ కు బెర్తులు కన్ఫర్మ్ అయ్యాయి. మిగిలిన 9 నియోజకవర్గాల్లో మూడు ఎస్సీ ఎస్టీ, ఒక మైనార్టీ, ఒక బిసి, ఒక బలిజ సామాజిక వర్గానికి చెందిన వారు ఉన్నారు. మిగిలిన 7 చోట్లు సియం జగన్ సామాజిక వర్గానికి చెందిన రెడ్లు ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. 2019 ఎన్నికల్లో మొత్తం 14 నియోజకవర్గాల్లో ఒక కుప్పం మినహాయిస్తే మిగిలిన 13 చోట్ల వైసిపి ఫ్యాన్ గాలి వీసింది. కాని ఈ సారి మూడు రిజర్వడ్ నియోజకవర్గాలైన సత్యవేడు, గంగాధర నెల్లూరు, పూతలపట్టు నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్పు చేసే ఆలోచనలో సియం జగన్ ఉన్నట్లు సమాచారం.
సత్యవేడు ఎమ్మెల్యే అదిమూలం పై అటు ప్రజల్లో ఇటూ సొంత పార్టీ నాయకుల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. ఈ నేపథ్యంలో ఈ సారి అక్కడ అయనను తప్పించి కొత్తవారికి అవకాశం ఇవ్వాలనే ఆలోచనలో అధిష్టానం ఉన్నట్లు సమాచారం. 2024 ఎన్నికల్లో సత్యవేడు నుంచి తిరుపతి ఎంపీ గురుమూర్తిని కాని డ్యీపుటి సీఎం నారాయణస్వామి కుమార్తె కృపాలక్ష్మి లేకపోతే టిడిపి నుంచి సీటు రాక నిరాశతో ఉన్న ఒక మాజీ ఎమ్మెల్యేతోపాటు మరో మాజీ ఎమ్మెల్యే కుమారుడు వైసిపి సీటు రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా ప్రస్తుతం గంగాధర నెల్లురు ఎమ్మెల్యేగా ఉన్న ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామికి ఈ సారి స్థాన చలనం తప్పేట్టు లేదు. ఆయనను అక్కడనుండి తప్పించి చిత్తూరు ఎంపీ గానో లేకపోతే తిరుపతి ఎంపి గానో పోటి చేయించే అవకాశం ఉన్నట్లు సమాచారం. నారాయణ స్వామికి గంగాధర్ నెల్లూరు నియోజకవర్గ ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత, చిత్తూరు మాజీ ఎంపి జ్ఞానేంద్ర రెడ్డి వర్గీయులు తో వైరం తో 2024 ఎన్నికల్లో అతన్ని ఓడించి తీరుతామని బహిరంగంగా పార్టీ నాయకులే అంటుండటంతో పార్టీ అధిష్టానం ఆ సీటు ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి కి కేటాయించాలా వద్దా అన్న సమాలోచనలు జరుపుతున్నారు. ఇప్పటికే పలుమార్లు అక్కడ ఇక్కడ రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వారిపై నోరు అదుపు తప్పడం పార్టీ హై కామెండ్ నోటీసులో ఉనట్లు సమాచారం. ఇక పూతలపట్టు నియోజవర్గంలో ఎమ్.ఎస్ బాబు పనితీరు అంతంత మాత్రమే, ఈయనపై ఇప్పటికే పూతలపట్టు నియోజకవర్గంలోని ముఖ్య నాయకులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కి అనేకమార్లు ఫిర్యాదు చేశారు. ఈ సారి ఎమ్.ఎస్ బాబుకు టికెట్ ఇస్తే మాత్రం కచ్చితంగా ఎవరూ పనిచేయామని తేల్చి చెప్పారు. సర్వలేలలో బాబు పనితీరు పూర్తిగా బాగోలేదని సర్వే సంస్థ ఇచ్చిన ఆధారంగా అయినను తప్పించి కొత్తవారికి అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో సి.యం.జగన్ ఉన్నట్లు సమాచారం. పూతలపట్టు సిట్టింగ్ ఎమ్మెల్యే ఎమ్మెస్ బాబు ఒక అడుగు ముందుకు వేసి మీడియా సమావేశం నిర్వహించి సంచలన వ్యాఖ్యలు చేసారు. సర్వే సంస్థలకు డబ్బిస్తే ఎవరి పేరైనా చెప్తాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. అయినా జిల్లాలో ముఖ్య నాయకులు చెప్పినట్లే చేసానని, అయినా జిల్లాలో ఎస్సీ నాయకులను చిన్నచూపు చూస్తున్నారని ఆరోపించారు. అయినా వైసిపి తనకే టికెట్ ఇస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ప్రధానంగా చిత్తూరు జిల్లాలో సగం పైగా నియోజకవర్గంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆశీస్సులు ఉన్నవారికే సీటు దక్కుతుందని పబ్లిక్ టాక్.. ఇక పీలేరు లో ప్రస్తుతం చింతల రామచంద్రారెడ్డి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. నియోజకవర్గ పరిధిలో చింతల పనితీరు పై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొని ఉందని సర్వే సంస్థ ఇచ్చిన రిపోర్ట్స్ ఆధారంగా ఈ సారి ఆయనను తప్పించి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబంలోని ఆయన తమ్ముడు కుమారుడు సుధీర్ రెడ్డికి అవకాశం ఇవ్వాలనే ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. సియం జగన్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే టిడిపి అభ్యర్థి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి పై పోటీకి సుధీర్ రెడ్డిని నిలిపి తన రాజకీయ బద్ద శత్రువైన నల్లారి కుటుంబాన్ని ఓడించాలని రాజకీయ ఎత్తుగడలు వేస్తున్నట్లు రాజకీయ విశ్లేషకుల్లో జోరుగా ప్రచారం నడుస్తోంది. ఇక నగరిలో మంత్రి ఆర్కే రోజాకు ఇంటాబయటా పోరు తప్పెట్లు లేదు అన్నట్టు సొంత పార్టీ నేతలే ఆమెకు వ్యతిరేకంగా పని చూస్తున్నారు. ఈ సారి ఎన్నికల్లో రోజాకు సీటు గాని కేటాయిస్తే మేమెవరం ఆమె గెలుపుకు కృషి చెయ్యబోమని నగరి నేతలు అమ్ములు, కే.జే.కుమార్, రెడ్డి వారి చక్రపాణి రెడ్డితో పాటు మరో మండల అధ్యక్షుడు ఉన్నట్లుగా పార్టీ హై కమాండ్ గుర్తించింది. దీంతో ఆమెను ఈ సారి ఎన్నికల్లో తప్పించి, బదులుగా ఏదైనా నామినేటెడ్ పోస్టులు గాని ఎమ్మెల్సీతో గాని సరిపెట్టాలని సియం జగన్ ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. ఇక నగరి నుండి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆశీస్సులతో కె.జే.కుమార్ సతీమణి శాంతిని గాని శ్రీశైలం బోర్డు చైర్మన్ రెడ్డి వారి చక్రపాణి రెడ్డికి గాని టికెట్టు ఇచ్చే ఆలోచనలో జగన్ ఉన్నట్లుగా సమాచారం. ఇక శ్రీకాళహస్తి నియోజకవర్గం బియ్యపు మధుసూదన్ రెడ్డి పై సర్వే నెగిటివ్ టాక్ రావడంతో సి యం జగన్ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చినట్లు పబ్లిక్ లో టాక్ నడుస్తుంది. కాని సియం జగన్ అత్యంత ఆప్తుడులో ఒకరు బియ్యపు మధుసూదన్ రెడ్డి. అందుకే జగన్ ముందుగానే హెచ్చరించి మిగిలిన ఈ మూడు నెలలు నియోజకవర్గం పై ప్రత్యేక దృష్టి సారించి గెలుపు కోసం కృషి చేసుకోవాలంటూ క్లాస్ పీకి సీటు కన్ఫర్మ్ చేయ్యబోతున్నట్లు సమాచారం. మూడు నెలలు తర్వాత అతని పనితీరు తో పాటు, సర్వే సంస్థ ఇచ్చె గ్రాఫ్ పైన సీటు ఫైనల్ అవుతుందని పార్టీ వర్గాల నుండి వినపడుతున్న మాట. అయినా మరోపక్క శ్రీకాళహస్తి ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ అంజూరు శ్రీనివాస్ పేరు కూడా పరిశీలనలో ఉన్నత సమాచారం. ఇక మదనపల్లి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో రాజకీయం శరవేగంగా మారుతుంది. కొత్త అభ్యర్థులు రంగంలోకి వస్తున్నారు .ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉండటం, అక్కడ ఓక్క అభివృద్ధి పనికూడా నోచుకోకపోవడం తో అక్కడి ప్రజలు తీవ్ర అసహనానికి గురౌతున్నారని సంస్థ నివేదిక ఇచ్చినట్లు సమాచారం.
ఇప్పటివరకు శాసనసభ్యుడిగా ఉన్న నవాజ్ అహమ్మద్ కు టికెట్ రాదని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ ఎమ్మెస్ దేశాయ్ తిప్పారెడ్డి, పంచాయతీరాజ్ రిటైర్డ్ డి ఈ నిస్సార్ అహ్మద్, వైసీపిలో మరో వ్యాపారవేత్త మల్లెల పవన్ కుమార్ రెడ్డి పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు అభ్యర్థుల ఖరారు విషయమై అధికారిక సమాచారం లేదు. ఇక చిత్తూరు లో ఆరని శ్రీనివాస్ ను తప్పించి ఆయన స్థానంలో ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ విజయానంద రెడ్డికి సీటు ఇచ్చే అవకాశం కనపడుతుంది. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆశీస్సులతో విజయానంద రెడ్డికి లైన్ క్లియర్ అవకాశం స్పస్టంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే విజయానంద రెడ్డి సొంత ట్రస్ట్ ద్వారా నియోజకవర్గం లో పలు సేవా కార్యక్రమాలు చేస్తుండటం, అలాగే జగన్మోహన్ రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా ఎనిమిది కోట్ల రూపాయలతో 53 వేల మందికి వస్త్రాలు బహుకరించారు. అంతే కాకుండా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించి చిత్తూరులో తనదైన శైలిలో వైసిపి పార్టీ తరుపున సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో విజయానంద రెడ్డికి సీటు కేటాయిస్తే చిత్తూరు అసెంబ్లీని వైసీపీ ఖాతాలో వేసుకోవచ్చని అధిష్టానం భావిస్తున్నట్లు సమాచారం. ఏపీలో మరో రెండు,మూడు నెలల్లో అసెంబ్లీ ఎన్నికల నగరా మోగనున్న నేపథ్యంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా నాయకులకు గుండెల్లో దడ మొదలై మొదలైంది.
cm jagan
రాష్ట్ర ప్రభుత్వం అట్టహాసంగా ప్రారంభించిన ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం ఉమ్మడి పశ్చిమగోదావరి లో అస్తవ్యస్తంగా మారింది. ఏలూరు ఇండోర్ స్టేడియంలో గత మూడు రోజులుగా తూతూ మంత్రంగా క్రీడా పోటీలు నిర్వహిస్తున్నారు. కనీసం క్రీడాకారులకు క్రికెట్ కి సంబంధించిన క్రీడ పరికరాలు అందజేయకుండా క్రీడలు నిర్వహిస్తున్నారు. కొన్ని ప్రదేశాలలో ప్రభుత్వం ఇచ్చినటువంటి క్రీడ పరికరాలు నాసిరకంగా ఉండటం వల్ల క్రీడాకారులే తమ క్రీడ పరికరాలను ఏర్పాటు చేసుకోవడం తో పలు విమర్శలు కు తావిస్తున్నాయి. క్రీడలను నిర్వహిస్తున్న అధికారులను వివరణ అడగగా పొంతనలేని సమాధానం చెబుతూ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. ఆడుదాం ఆంధ్ర క్రీడల పేరుతో ప్రభుత్వం కోట్లాది రూపాయలు ప్రజా ధనం దుర్వినియోగం చేస్తుందని పలువురు ఆరోపణలు గుప్పిస్తున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాంబాబు ఏలూరు ఇండోర్ స్టేడియం నుంచి అందిస్తారు.
కాకినాడ, సీఎం వీడియో కాన్ఫరెన్స్ కి దూరంగా పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు. సెక్రటేరియట్ నుంచి పాల్గొన్న సీఎం జగన్. జనవరి నెలలో అమలు చేసే పధకాలకి సంబంధించి వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న జిల్లా ఎమ్మెల్యేలు, మంత్రి దాడిశెట్టి రాజా. పిఠాపురం లో పలు అభివృద్ధి కార్యక్రమాలు లో పాల్గొన్న ఎమ్మెల్యే దొరబాబు కి పిఠాపురం సీటు నిరాకరించిన సీఎం, అప్పటి నుంచి పార్టీకి దూరంగా ఉంటూ సొంత వర్గాన్ని మెయింటైన్ చేస్తున్న దొరబాబు. అధికారులు నుంచి సమాచారం వచ్చిన స్పందించని ఎమ్మెల్యే.
తిరుపతి, టిటిడి కేటాయిస్తున్న ఇళ్ల పట్టాలపై జగన్మోహన్ రెడ్డి ఫోటోను వ్యతిరేకిస్తున్న విపక్షాలు. పట్టా పంపిణీ కార్యక్రమాన్ని అడ్డుకుంటారని ఎక్కడికక్కడ నాయకులను హౌస్ అరెస్టు చేసిన పోలీసులు. మహతి ఆడిటోరియం లో పట్టా పంపిణీ కార్యక్రమంలో భారీ పోలీసు బందోబస్తు. తిరుపతిలో టిడిపి, జనసేన, సిపిఎం నాయకులను హౌస్ అరెస్టు చేసిన పోలీసులు. టిటిడి ఉద్యోగస్తులకు పట్టాల పంపిణీని స్వాగతిస్తున్నాం అని, కానీ పట్టాలపై ఓపక్క వెంకటేశ్వర స్వామి ఫోటో, మరోపక్క జగన్మోహన్ రెడ్డి ఫోటో వేయడాన్ని వ్యతిరేకిస్తున్నామని అన్నారు టిడిపి సీనియర్ నాయకులు వూకా విజయ కుమార్. టిడిపి నాయకులను జనసేన నాయకులను హౌస్ అరెస్టు చేయడంపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. ఈరోజు ఇంటి పట్టాలపై వేసిన ఫోటోలు రేపు సేవా టికెట్లపై అలాగే టిటిడి సంబంధించిన వెబ్సైట్లో కూడా జగన్ ఫోటో పెడతారా అంటూ టిటిడిఈఓ ధర్మారెడ్డిని, చైర్మన్ కరుణాకర్ రెడ్డిని సూటిగా ప్రశ్నిస్తున్నామని అన్నారు. ప్రభుత్వం ద్వారా గాని టీటీడీ నిధులు తో గాని ఇవ్వనప్పుడు జగన్మోహన్ రెడ్డి ఫోటోను ఎలా వేస్తారంటూ ప్రశ్నించారు. టిటిడి ఉద్యోగస్తులు వారి సొంత డబ్బుతో కొనుక్కుంటున్న జగన్మోహన్ రెడ్డి పెత్తనం ఏమిటని ప్రశ్నించారు. కేవలం కరుణాకర్ రెడ్డి తన కొడుకు అభినయ రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించుకోవడం కోసమే ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా కచ్చితంగా ప్రజలు బుద్ధి చెబుతారని,ప్రజాస్వామ్యంలో నిరసన తెలియజేయడానికి కూడా వీలు లేకుండా పోలీసులతో హౌస్ అరెస్టు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది మంచిది కాదని త్వరలోనే ప్రజలు బుద్ధి చెప్పే రోజులు వస్తాయని హెచ్చరించారు.
తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగులకు అందిస్తున్న ఇంటి స్థలాల ప్రొసీడింగ్స్ పై ఒకవైపున టిటిడి ఎంబ్లం తో కూడిన వెంకటేశ్వర స్వామి బొమ్మ, మరోవైపున జగన్మోహన్ రెడ్డి బొమ్మను పెట్టి ప్రొసీడింగ్స్ ఇవ్వడం అభ్యంతరకరమని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి ఓ ప్రకటనలో తీవ్రంగా విమర్శించారు. టీటీడీ ఉద్యోగులకు ఇచ్చే ఇళ్ల స్థలాల ప్రొసీడింగ్స్ లోను రాజకీయ పార్టీ నేతల బొమ్మలను ప్రచురించడం తిరుమల తిరుపతి దేవస్థానం చరిత్రలో ఇదే మొదటిసారి అని వ్యాఖ్యానించారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ ప్రచార ఖండూతికి ఇది పరాకాష్టగా ఆయన అభివర్ణించారు. ఇప్పటివరకు సైన్ బోర్డులు, వైఎస్ఆర్ కిట్లు, జగనన్న విద్యా దీవెన, జగనన్న పథకాలకు తన ఫోటోను తగిలించి సంబరపడిపోతున్న ముఖ్యమంత్రి ఆఖరుకు తిరుమల వెంకటేశ్వర స్వామి తో సమానంగా తన ఫోటోను ముద్రించి ఇవ్వడం భక్తుల మనోభావాలతో చెలగాట మాడటమేనని ఆయన అన్నారు. తక్షణం ప్రొసీడింగ్స్ పై ఫోటోలను తీసి వేయాలని టిటిడి యాజమాన్యానికి ఆయన సూచించారు. కందారపు మురళి సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కడప జిల్లా పర్యటనలో ఉన్నారు. ఈరోజు క్రిస్మస్ పర్వదినం సందర్భంగా సీఎం జగన్ పులివెందులలోని సీఎస్ఐ చర్చిలో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా 2024 నూతన సంవత్సర క్యాలెండర్ను సీఎం జగన్, వైఎస్ విజయమ్మ ఆవిష్కరించారు. వారితోపాటు ఎంపీ అవినాష్ రెడ్డి, డిప్యూటి సీఎం అంజాద్ బాషా, మంత్రి అదిమూలపు సురేష్ కార్యక్రమానికి హాజరైయ్యారు. సీఎస్ఐ చర్చిలో ప్రార్థనల అనంతరం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్ర ప్రజలందరికీ క్రిస్మస్ పండగ శుభాకాంక్షలు తెలియజేశారు.
Read Also..
Read Also..
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలపై ఏపీ కీలక నేత, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కీలక వ్యాఖ్యాలు చేశారు. ప్రస్తుతం తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు బాగా జరుగుతున్నాయని అన్నారు. కానీ ఏపీ అసెంబ్లీ అలాంటి పరిస్థితి లేదని తెలిపారు. ఏపీలోనూ కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటుందని తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రభావం ఏపీలో కనిపిస్తోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ కలవడం వల్ల టీడీపీకి బలం పెరిగినట్లే అని అభిప్రాయపడ్డారు. త్యాగాలు చేయడానికి ఎవరూ రాజకీయాల్లోకి రారని చెప్పారు. సీటు లేదని చెప్పాలంటే చాలా అనుభవం ఉండాలని అలాంటి అనుభవం సీఎం జగన్ కు ఉందని తాను అనకోవడం లేదని అన్నారు.
జగన్ మాటలు వింటుంటే జబర్దస్త్ షో లో బిల్డప్ బాబాయ్ గుర్తొస్తాడు – లోకేష్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మరోమారు తీవ్ర విమర్శలతో విరుచుకుపడ్డారు. జగన్ మాటలను దగ్గరగా చూస్తే జబర్దస్ షోలోని బిల్డప్ బాబాయి గుర్తొస్తారని పేర్కొన్నారు. ఆయన మాటలు కోటలు దాటుతాయని, పనులు మాత్రం గడపదాటవన్నారు. జగన్ తన సొంత ఇలాకా కడప జిల్లాలో మూడేళ్లలో స్టీల్ ప్లాంట్ నిర్మాణం పూర్తిచేస్తానని చెప్పి తొలి శిలాఫలకం వేసి నాలుగేళ్లు అయిందని గుర్తు చేశారు. రూ. 15 వేల కోట్లతో ఉక్కు పరిశ్రమ నిర్మించి 25 వేల మందికి ఉద్యోగం ఇస్తానని నాడు కోతలు కోశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
నేడు కడప జిల్లా రానున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మూడు రోజులపాటు జిల్లాలో పర్యటించనున్న ముఖ్యమంత్రి జగన్. జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించినున్న ముఖ్యమంత్రి. ఈరోజు ఉదయం 10:30కు కడపకు చేరుకొని అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో బద్వేల్ నియోజకవర్గం లోని గోపవరం మండలంలో సెంచరీ ప్లైవుడ్ ఇండస్ట్రీని ప్రారంభించి. హై పవర్ లామినేషన్ ప్లాంట్ కు శంకుస్థాపన చేయనున్న సీఎం. అనంతరం12 గంటల 45 నిమిషాలకు కడప రిమ్స్ ఆసుపత్రికి చేరుకొని సుమారు 300 కోట్లతో నిర్మించిన డాక్టర్ వైఎస్ఆర్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ ఆసుపత్రి, క్యాన్సర్ ఆసుపత్రి, ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రులతోపాటు… వైయస్ రాజారెడ్డి క్రికెట్ స్టేడియం ప్రారంభం. మధ్యాహ్నం అంబేద్కర్ జంక్షన్ వద్ద రోడ్డు విస్తరణ పనులను, కోటిరెడ్డి సర్కిల్లో విగ్రహాలు ఆవిష్కరణ. మున్సిపల్ స్టేడియంలో ఇంటర్నేషనల్ హాకీ కోర్టుకు శిలాఫలకం వేసి అనంతరం ఇడుపుల పాయ చేరుకొని అక్కడే రాత్రి బస చేయనున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.
పవన్, లోకేష్, చంద్రబాబు నిన్న చేసింది పిల్లి మెడలో గంట కట్టే ప్రయత్నమే అని యువగళం విజయోత్సవ సభపై మాజీ మంత్రి కొడాలి నాని విమర్శించారు. 12 ఏళ్ల క్రితం యుద్ధభేరి మోగించిన సీఎం జగన్, సోనియాను కూకటి వేళ్లతో పెకిలించి చంద్రబాబును భూస్థాపితం చేసి పవన్ కళ్యాణ్ ను రెండు చోట్ల చిత్తుచిత్తు చేస్తూ మంగళగిరిలో లోకేష్ కు సమాధి కట్టాడన్నారు. పవన్ ,లోకేష్, చంద్రబాబు ఇప్పుడు గంటల మోగిస్తూ యుద్ధభేరి మొదలు పెట్టిన జగన్ జైత్రయాత్ర పరంపరను ఆపలేరని, ఎమ్మెల్యేలకు ట్రాన్స్ ఫర్లు ఉంటాయా అంటూ చంద్రబాబు విచిత్రంగా మాట్లాడుతున్నాడన్నారు. 30 ఏళ్ల క్రితమే చంద్రబాబు చంద్రగిరి నుండి కుప్పం ట్రాన్స్ ఫర్ అయ్యాడన్నారు. లోకేష్ పుట్టింది మంగళగిరిలోనా అని, పవన్ కళ్యాణ్ భీమవరం, గాజువాకలో గోలీలు ఆడుకున్నాడా అని ప్రశ్నించారు. తండ్రి, కొడుకు ,పార్ట్నర్ ముగ్గురు వలస వెళ్లిన వాళ్లేనని, వీళ్లు మొదలుపెట్టిన యుద్ధభేరితో సీఎం జగన్ చిటికెన వేలిని కూడా కదపలేరన్నారు.
Read Also..
Read Also..




Total views : 141713