వరంగల్, ములుగు జిల్లాలో నేడు మంత్రుల పర్యటన. రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖా మంత్రి కొండా సురేఖ, రాష్ట్ర పంచాయతీ రాజ్ గ్రామీణ అభివృద్ధి సంస్థ, స్త్రీ-శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క మేడారం పర్యటన. మొదట గట్టమ్మ వద్ద మొక్కులు. గట్టమ్మ దేవాలయం దర్శనం అనంతరం మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర పనులను పరిశీలించి, జాతర ఏర్పాట్ల పై అధికారులతో సమీక్షా సమావేశం. అధికారులకు దిశ నిర్దేశం చేయనున్న మంత్రులు.
Crime news*
కాకినాడ, ముద్రగడ ను కలిసిన జనసేన నేత బొలిశెట్టి శ్రీనివాస్. పవన్ కళ్యాణ్ నాలుగు రోజుల క్రితం రాసిన లేఖ అంశాన్ని ముద్రగడ దగ్గర ప్రస్తావించిన బొలిశెట్టి. పవన్ రాసిన లేఖను స్వాగతిస్తున్నానని, కాపు జాతి కలిసి పని చేయాల్సిన అవసరం ఉందని చెప్పిన ముద్రగడ. పవన్ కళ్యాణ్ మా ఇంటికి వస్తే ఆహ్వానిస్తానని బొలిశెట్టి కి చెప్పిన ముద్రగడ. త్వరలో జనసేనలోకి ముద్రగడ చేరే అవకాశము.
విజయనగరం జిల్లా, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు జిల్లా పర్యటన. బొబ్బిలి వేదికగా బహిరంగ సభ. తెలుగు తమ్ముళ్లలో నూతనుత్తేజం కనిపిస్తోంది. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఈరోజు జిల్లాకు రానున్నారు. బొబ్బిలిలోని రాజా కాలేజి మైదానంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొననున్నారు. ఇందుకు ఆ పార్టీ నాయకులు భారీ ఏర్పాట్లు చేశారు. తెలుగు తమ్ముళ్లను భారీగా తరలించేందుకు పార్టీ నాయకులు సన్నాహాలు చేశారు. ఇప్పటికే గ్రామ స్థాయిలో ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేసుకున్నారు. ఎన్నికల వాతావరణం దగ్గరపడడంతో ప్రచారం ముమ్మరం చేయనున్నారు. ఇందులో భాగంగానే ‘రా… కదిలి రా’ అనే కార్యక్రమంలో భాగంగా అధినేత చంద్రబాబు మరోసారి జిల్లాకు వస్తున్నారు. ఇటీవలే భోగాపురం మండలం పోలిపల్లిలో నిర్వహించిన యువగళం విజయోత్సవ సభకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో కలిసి ఎన్నికల శంఖారావం పూరించారు. ఈసారి బొబ్బిలి వేదికగా విజయనగరం – పార్వతీపురం మన్యం జిల్లాల కేడర్‌కు బాబు దిశానిర్థేశం చేయనున్నారు. బొబ్బిలి కేంద్రం ఈ రెండు జిల్లాలకు సమాంతర దూరంలోనూ, పార్టీకి కాస్త బలమైన నియోజకవర్గంగాను గుర్తించిన పార్టీ ఇక్కడ సభ నిర్వహించేందుకు నిర్ణయించినట్టుగా టిడిపి నాయకులు చెబుతున్నారు. బాబు వరుస పర్యటనలతో టిడిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానుల్లో జోష్ కనిపిస్తోంది. విజయనగరం, బొబ్బిలి, రాజాం, చీపురుపల్లి నియోజకవర్గాల్లో సీట్ల కేటాయింపునకు సంబంధించి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. గజపతినగరం, నెల్లిమర్ల, ఎస్.కోట నియోజకవర్గాల టికెట్ల పై కూడా కసరత్తు ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో ఆయా నియోజకవర్గాల్లోని ఆశావహులు తమ వంతు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. బహిరంగ సభకు వస్తున్న నేపథ్యంలో బాబు దృష్టిలో పడేందుకు కూడా తహతహలాడుతున్నారు. గత నెల 20న పోలిపల్లి బహిరంగ సభ మాదిరిగానే దారిపొడవునా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. నేడు జరగనున్న బహిరంగ సభల్లో కేడర్‌ను ఎన్నికలకు సమాయత్తం చేయడం, వైసిపిలోనూ, ప్రభుత్వంలోనూ లోపాలను, వైసిపి ప్రభుత్వం చేపడుతున్న ప్రజా వ్యతిరేక విధానాలను, అమలుకాని హామీలను ఎత్తి చూపడమే బాబు ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది.
బుధవారం ఉదయం 10.15గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్టులో బయలుదేరి, 11గంటలకు విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి బొబ్బిలి రాజా కాలేజీ మైదానానికి 11.40గంటలకు చేరుకుంటారు. 12గంటలకు సభ ప్రారంభమై 1.30గంటలకు ముగుస్తుంది. అనంతరం 2.30గంటలకు తిరుగు ప్రయాణమవుతారు. మిగిలిన గంట వ్యవధిలో పార్టీ కీలక నాయకులు, కార్యకర్తలతో జిల్లాలోని రాజకీయ పరిస్థితులపై చర్చించే అవకాశం ఉంది. బహిరంగ సభ ఏర్పాట్లును మంగళవారం టిడిపి నాయకులు కిమిడి కళా వెంకటరావు, మాజీ మంత్రి సుజరుకృష్ణరంగారావు, నియోజకవర్గ ఇన్చార్జి బేబినాయన, కూన రవికుమార్ తదితరులు పరిశీలించారు..
విజయవాడ, ఏపీలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల నిర్వహణ పై రెండో రోజు కేంద్ర ఎన్నికల సంఘం సమీక్ష. నిన్న గుర్తింపు పొందిన పార్టీల నుండి వినతుల స్వీకరణ చేపట్టిన సీఈసీ రాజీవ్ కుమార్. విడతలవారీగా కలెక్టర్లు, ఎస్పీలు , ఉన్నతాధికారులతో సమావేశం ఏర్పాటు చేసిన కేంద్ర ఎన్నికల సంఘం. ఎన్నికల సన్నద్దత పై అధికారులకు దిశానిర్దేశం చేసిన సీఈసీ. నేడు పార్టీలు ఇచ్చిన వినతులు, ఫిర్యాదుల పై, ఎన్నికలకు అధికార యంత్రాంగం ఉన్నతస్దాయి చర్చ జరుపనున్న కేంద్ర ఎన్నికల సంఘం బృందం.
కోవూరు మండలం పడుగుపాడు పంచాయతీ పరిధిలోని చంద్రమౌళి నగర్ కాలనీలో ఎలక్షన్ ప్రచారం ప్రారంభించిన కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి. కోవూరు నియోజకవర్గంలో మొట్టమొదటి ఎన్నికల ప్రచారం ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… జరగబోవు ఎన్నికల్లో పడుగుపాడు పంచాయతీలో అత్యధిక మెజార్టీ రావాలని నాయకులకు సూచించారు. అనునిత్యం భగవంతుని ఆశీర్వాదం ప్రజల ఆశీర్వాదం దివంగత నేత రాజశేఖర్ రెడ్డి ఆశీర్వాదం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఉంది మరలా మరలా ఈ రాష్ట్రానికి కాబోయే సీఎం జగన్ మోహన్ రెడ్డి. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన వెంటనే ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు ఇచ్చినటువంటి ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ప్రజలు అడగకపోయినా మీ బిడ్డగా ప్రతి సంక్షేమ పథకం మీకు అందే విధంగా చేపడుతున్న ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఈ నాలుగు సంవత్సరాల 8 నెలల కాలంలో రాష్ట్రంలో సంక్షేమ పథకాలకు రెండు లక్షల 70వేల కోట్లు అందించిన ఘనత జగన్మోహన్ రెడ్డిదే. ప్రజలకు జగన్ మోహన్ రెడ్డి అందించిన సంక్షేమ పథకాలే మరలా సీఎం కుర్చీలో కూర్చోబెట్టబోతున్నాయి. ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా జగన్మోహన్ రెడ్డిని ప్రజలు సీఎం కుర్చీలో కూర్చోబెట్టబోతున్నారు. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సొంత నిధులతో ఆరు లక్షలతో సిమెంట్ రోడ్డు నిర్మాణంకు నాలుగు లక్షలతో గుడి దగ్గర మండపం కి నిధులు ఇచ్చారని తెలిపారు. చంద్రమౌళి నగర్ కాలనీకి నిధులు అందించిన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. మొట్టమొదటిగా కోవూరు నియోజకవర్గంలోనే పడుగుపాడు పంచాయతీలో పారిశుద్ధ్య సమస్యలు తాగునీటి సమస్యలు వీధిలైట్లు సమస్యలు ఎలాంటి సమస్యలపై అయినా ప్రజల కొరకు టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేయడం జరిగింది. పడుగుపాడు పంచాయతీకి చెందిన టోల్ ఫ్రీ నెంబర్ 9117499117 కు కాల్ చేసి సమస్యలు తెలపండి. ఈ టోల్ ఫ్రీ నెంబర్ కి ప్రజలు సమస్యలపై ఫోన్ చేస్తే తక్షణమే పంచాయతీ పాలకవర్గం చర్యలుచేపడుతుంది అని ఆయన వెల్లడించారు.
అమరావతి, నేడు కేంద్ర ఎన్నికల సంఘ ప్రతినిధులను కలవనున్న చంద్రబాబు పవన్ కళ్యాణ్. ఎన్నికలలో వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగులను వాడకూడదని ఫిర్యాదు. ఇప్పటికే టీడీపీ, జనసేన సానుభూతిపరుల ఓట్ల తొలగింపు పై ఫిర్యాదు చేసిన ప్రతిపక్షాలు. ఫిర్యాదులు పరిష్కరించినట్టుగా టీడీపీకి లేఖ రాసిన ఈసి. మరి కొన్ని ఫిర్యాదులు పరిష్కరణ దశలో ఉన్నాయని వెల్లడి. ఉమ్మడిగా ఫిర్యాదు చేయనున్న పవన్, చంద్రబాబు. వాలంటీర్లు అసలు ఉద్యోగులే కాదని చెబుతున్న వైసీపీ. సచివాలయ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులని వెల్లడి. ఎన్నికలలో ప్రభుత్వ ఉద్యోగులను వాడకూడదని ఎలా చెబుతారని అంటున్న వైసీపీ. ఉదయం చంద్రబాబు పవన్ భేటీ తర్వాత ఈసీ ని కలిసే అవకాశం. ఈసీకి ఫిర్యాదు చేయాల్సిన అంశాలపై ముందుగా చర్చించునున్న ఇరువురు నేతలు. ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు ఈసీ తో సమావేశం.
విజయవాడ ఎంపీ కేశినేని నాని కుమార్తె కేశినేని శ్వేత విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 11వ డివిజన్ కార్పొరేటర్ గా ఎన్నికయ్యారు. కేశినేని నాని నిర్ణయంతో ఈరోజు కార్పొరేటర్ పదవికి తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నారు. ఈరోజు ఉదయం 8:30 గంటలకు విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కార్యాలయానికి వెళ్లి గడిచిన కార్పొరేషన్ ఎన్నికల్లో తనకు సహకరించినందుకు ధన్యవాదాలు చెబుతారు. 9 గంటలకు అక్కడ కార్పొరేషన్ పరిధిలో తనకు సహకరించిన వారికి ధన్యవాదాలు చెబుతారు. 10:30 గంటలకు విజయవాడ కార్పొరేషన్ కార్యాలయానికి వెళ్లి మేయర్ మున్సిపల్ కమిషనర్‌ను కలిసి తన కార్పొరేటర్ పదవికి రాజీనామా ఇచ్చి ఆమోదింప చేయాలని కోరుతారు.
డా.బి.ఆర్.అంభేద్కర్ కోనసీమ జిల్లా, ముమ్మిడివరం 3వ రోజుకు చేరుకున్న మున్సిపల్ కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, కార్మికులు సమ్మె. సమ్మెలో భాగంగా చెవులో పువ్వులు పెట్టుకుని నిరశన తెలిపిన ఉద్యోగులు, కార్మికులు. సంఘీభావం తెలిపిన టిడిపి ముమ్మిడివరం ఇంచార్జీ దాట్ల బుచ్చిబాబు,మాజీ ఎమ్మెల్యే చెల్లి వివేకానంద, నాయకులు. అన్ని వర్గాలను ఇబ్బంది పెడుతున్న జగన్ పాలన. పెరిగిన ధరలకు అనుగుణంగా జీతాలు పెంచాలని అంగన్వాడీలు, ఉద్యోగులు, కార్మికులు కోరుతున్న న్యాయమైన డిమాండ్ ను కూడా పట్టించుకోక పోవడం జగన్ నిరంకుశ పాలనకు అద్దం పడుతుంది అని దాట్ల బుచ్చిబాబు అన్నారు.
ఆన్లైన్ జూదం విద్యార్థులను, ఉద్యోగులను, వ్యాపారస్తులను ప్రతి ఒక్కరినీ ప్రభావితం చేస్తూ వస్తున్నది. కరోనా కాలంలో ఆన్లైన్లో ఖాళీగా ఉన్న విద్యార్థులు, వ్యాపారాలు ఆగిపోయిన వ్యాపారస్తులు, ఉద్యోగాలు కోల్పోయిన నిరుద్యోగులు ఇంటర్ నెట్ లో పార్ట్ టైం ఉద్యోగాలు, మొబైల్ ఫోనుతో డబ్బులు ఎలా సంపాదించాలి అని గూగుల్‌ను ఆశ్రయించడం ఎక్కువైంది. ఈ సమాచారాన్ని ఆన్ లైన్ గేమ్స్, బెట్టింగ్ నిర్వహించే వారు, సైబర్ నేరగాళ్లు కొనుక్కుంటారు. ఈ సమాచారాన్ని ఆధారం చేసుకుని రిజిస్టర్ ఎలా అవ్వాలి, ఎలా డబ్బులు డిపాజిట్ చెయ్యాలి, ఎలా ఆటలలో ఇన్వెస్ట్ చెయ్యాలి, ఎంత డబ్బు పెడితే ఎంత డబ్బు వస్తుంది, అనే పూర్తి వివరాలు అందిస్తారు. 100 రూపాయల నుండి మొదలుకొని ఎంత డబ్బు అయినా అందులో డిపాజిట్ చేయవచ్చు. ఈ విధంగా యువత ఆన్ గేమింగ్ వైపు మళ్లి బలయిపోయారు. తాజాగా వరంగల్ జిల్లా నర్సంపేటలో ఆన్లైన్ గేమ్ ఆడి ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పులు చేసి సుమారు రూ. 2 లక్షలు పోగొట్టుకున్న విద్యార్ధి ప్రశాంత్. ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
Read Also..
Read Also..





Total views : 90341