మార్చి 28న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తోన్న ‘హరిహర వీరమల్లు -1’ విడుదల కాబోతోంది. జ్యోతికృష్ణ డైరెక్ట్ చేస్తోన్న ఈ చిత్రాన్ని AM రత్నం నిర్మిస్తున్నాడు. ఎప్పుడో పూర్తి కావాల్సినా.. పవన్ కళ్యాణ్ పొలిటికల్ షెడ్యూల్స్ కారణంగా వాయిదా పడుతూ వస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ లో పవన్ బిజిగా ఉన్నారు. ఈ సినిమాను జనవరి వరకూ పూర్తి చేయాలని ఫిక్స్ అయ్యారు. అందుకే మార్చి 28న విడుదల అని రిలీజ్ డేట్ కూడా వేశారు. అయితే ఇదే డేట్ కు ఒక్క రోజు ముందుగా 27న మరో ప్యాన్ ఇండియా మూవీ రాబోతోంది. అదే ‘ఎంపూరన్’. మళయాలంలో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన లూసీఫర్ కు సీక్వెల్ గా వస్తోన్న సినిమా ఇది. అక్కడి స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ డైరెక్ట్ చేస్తోన్న ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి. ఈ సారి మోహన్ లాల్ తో పాటు పృథ్వీరాజ్ కూడా కీలక పాత్ర చేస్తున్నాడు. లూసీఫర్ ను తెలుగులో మెగాస్టార్ హీరోగా గాడ్ ఫాదర్ అంటూ రీమేక్ చేశారు. కానీ మళయాలం అంత హిట్ కాదు ఇక్కడ. ఈ సారి రీమేక్ కు ఛాన్స్ లేకుండా అన్ని భాషల్లో విడుదల చేస్తున్నారీ చిత్రాన్ని.
హరిహర వీరమల్లును కూడా ప్యాన్ ఇండియా రేంజ్ లో విడుదల చేయబోతున్నారు. పవన్ కు ఇది ఫస్ట్ ప్యాన్ ఇండియా మూవీ అవుతుంది. ఇలాంటి మూవీతో మోహన్ లాల్ పోటీ పడబోతున్నాడు. అంటే.. ఇతర భాషల్లో రెండు సినిమాల మధ్య గట్టి పోటీ అయితే ఉంటుందని చెప్పొచ్చు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- కొడాలి నానిపై కేసు విచారణకు ప్రభుత్వ గ్రీన్‌సిగ్నల్.మాజీ మంత్రి కొడాలి నానిపై నమోదైన కేసు విచారణకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. 2021లో పంచాయతీ ఎన్నికల సమయంలో నమోదైన కేసులో ప్రాసిక్యూషన్‌కు తాజాగా రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. 2021 ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో…
- హిమాచల్‌ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు.హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లాలో భారీ కొండచరియలు విరిగిపడ్డాయి. కొండచరియ విరిగిపడటంతో ధల్లి… సంజౌలి బైపాస్‌ను పూర్తిగా మూసివేశారు. దీంతో ఇరువైపులా వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. కొండచరియ విరిగిపడటంతో భారీగా శిథిలాలు రహదారిపైకి వచ్చిపడ్డాయి. శిథిలాలు అడ్డంకి ఉండటంతో వాహనాల రాకపోకలకు…
- అమెరికా: న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.అమెరికాలోని న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ వద్ద కాల్పులు కలకం సృష్టించాయి. కాల్పులకు తెగబడటమే కాకుండా ఓ వ్యక్తిపై కత్తితో దాడి చేశాడు. నిత్యం రద్దీగా ఉండే మాన్హాటన్ పర్యాటక ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కాల్పుల శబ్దం వినిపించడంతో పర్యాటకులు, స్థానికులు…
- అనకాపల్లి జిల్లాలో యలమంచిలిలో ప్రమాదం.ఏపీలో మరో బస్సు ప్రమాదం జరిగింది. అయితే వెంటనే అప్రమత్తం కావడంతో ప్రయాణికులంతా సురక్షితంగా బయట పడ్డారు. అనకాపల్లి జిల్లా ఎలమంచిలి మండలం రేగుపాలెం జాతీయ రహదారిపై ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. భువనేశ్వర్ నుంచి చెన్నై…
- వర్షం వస్తేనే జంకుతున్న భద్రాద్రి గిరిజన గ్రామాలు.ఆకాశం నల్లటి మబ్బులు కమ్ముకుంటుంటే అన్నదాత ఆనందంతో మురిసిపోతాడు. కానీ… భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సీతారాంపురం పంచాయతీ పరిధిలోని అన్నారం, చింతలపాడుతో పాటు మరో మూడు గిరిజన గ్రామాల ప్రజల గుండెల్లో మాత్రం వణుకు మొదలవుతుంది. వారికి వర్షం అంటే పరవశం…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




Total views : 149941