కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో కౌలు రైతు ఆత్మహత్యాయత్నం చేసాడు. కోడూరు మండలం వి.కొత్తపాలెం లో కౌలు రైతు బాదర్ల సూర్య ప్రభాకరరావు ఆత్మహత్యాయత్నం చేసాడు. 10 ఎకరాల పొలం కౌలుకు వేసిన ప్రభాకరరావు తుఫాను వలన పంట మొత్తం నేలకొరిగి మొలకలు వచ్చాయని ఆవేదనతో పురుగుల మందు తాగి ప్రభాకరరావు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వెంటనే అతన్ని దగ్గరలో ఉన్న అవనిగడ్డ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రభాకరరావుని తెలుగుదేశం పార్టీ నేతలు పరామర్శించారు. 24 గంటలు అబ్సర్వేషన్లో ఉండాలని వైద్యులు చెప్పారు. ప్రభాకరరావు కి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
krishna district news
ఎన్టీఆర్ జిల్లా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని రమణయ్య కూల్ డ్రింక్స్ దగ్గర దారుణ హత్య జరిగింది. సంఘటన స్థలానికి చేరుకున్న వెస్ట్ ఏసీపీ హనుమంతరావు మాట్లాడుతూ వాసు అలియాస్ యేసు అనే అతను క్యాటరింగ్ కాంట్రాక్టర్లు చేసుకుంటూ ఉంటాడు. బ్యాంకు అరుగు మీద టీ తాగుతున్న సమయంలో గతంలో చాలాకాలం నుండి గణేష్ అనే అతను యేసు దగ్గర పని చేస్తుంటాడు. గణేష్ 15 వేల రూపాయలు అప్పు తీసుకుని తిరిగి అసలు డబ్బులు చెల్లించి వడ్డీ నిమిత్తం ఐదు వేల రూపాయలు ఇవ్వాలన్నాడు. వడ్డీ నిమిత్తం గతకాలం కొంతకాలం నుంచి వీళ్ళిద్దరికీ గొడవ జరిగి మాట మాట పెరిగి సంచిలో ఉన్న కత్తితో మెడ మీద నరకడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.
ఆంధ్రప్రదేశ్ లో మిచాంగ్ తుపాను ప్రభావం తీవ్ర స్థాయిలో ఉంది. ముఖ్యంగా ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా వేలాది ఎకరాల్లో వరి పంట ఈదురు గాలులకు నేలకు వరగడం, దానికి తోడు భారీ వర్షాలకు పూర్తిగా గింజ మొక్కలు వచ్చి ధాన్యం పాడైపోతున్న ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం ఎటువైపు చర్యలు తీసుకోలేదని, చంద్రబాబునాయుడు విజ్ఞప్తి మేరకు కేంద్ర కమిటీ రంగంలోకి దిగి నష్టాన్ని అంచనా వేస్తున్నారని, ఎ ముఖ్యమంత్రి అయిన విపత్తు సంభవించిన వెంటనే కేంద్రానికి తెలియపరుస్తారు కానీ, ఆంధ్రప్రదేశ్ లో దానికి విరుద్ధంగా ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు ప్రజల పక్షాన కేంద్రానికి లేఖ రాశారని, తక్షణమే ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని మాజీ మండలి డిప్యూటీ స్పీకర్ బుద్ధ ప్రసాద్ కోరారు.
ఏపీ అంగన్వాడీ కార్యకర్తలు చేస్తున్న నిరవధిక సమ్మె కృష్ణాజిల్లాలో మూడవ రోజుకి చేరింది. సమ్మెలో భాగంగా విధులకు గైర్హాజరైన అంగన్వాడీ కార్యకర్తలు కలెక్టరేట్ ధర్నా చౌక్ లో మోకాళ్లపై నిలబడి ప్రభుత్వానికి నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా ఏపీ అంగన్వాడీ వర్కర్స్ & హెల్పర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి రమాదేవి మీడియాతో మాట్లాడుతూ… అంగన్వాడీ కార్యకర్తల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి అవలంభిస్తోందని విమర్శించారు. కనీస వేతనం రూ. 26 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వేల రూపాయలు అదనంగా పెరిగిన ధరలకు అనుకూలంగా ఈ రోజు మేము వేతనాన్ని పెంచమని అడుగుతున్నాము. పదివేలు వేతనంతో ఒక కుటుంబం బతకాలంటే చాలా ఇబ్బందులు పడుతుంది. కాబట్టి వేతనం పెంచాలని ఈరోజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని అలాగే సెల్ ఫోన్లు ఇచ్చారు సపోర్ట్ చేయని సిమ్ములు ఇచ్చారు. మరి డ్యూటీల కెళ్ళి అప్లోడ్ చేసిన ఫోటోలు మాకు కావాలి అని చెప్తున్నారు. మేం పనికి వ్యతిరేకం కాదు కానీ వాళ్ళు మాకు ఇవ్వవలసినవి ఇవ్వకుండా, ఈ రోజు ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంది.. కాబట్టి ఈరోజు మచిలీపట్నం కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి రావడం జరిగింది. అధికారులు వేధింపులతో పాటు ప్రజాప్రతినిధులు వేధింపులు కూడా మాకు ఎక్కువైపోయాయి. మా యొక్క డిమాండ్ న్యాయపరమైనది వెంటనే పరిష్కరించాలి. అధికారుల వత్తిడి వల్ల ఆశ వర్కర్ చనిపోయిన పరిస్థితి ఉంది అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మా యొక్క డిమాండ్లు ఏవైతే ఉన్నాయో వెంటనే పరిష్కరించాలి అలాగే చనిపోయిన ఆశ వర్కర్‌కి ఎటువంటి బెనిఫిట్స్ ప్రభుత్వం ఇవ్వడం లేదని, కనీసం మట్టి ఖర్చులు కూడా అందరు చందాలు వేసుకుని మరి కార్యక్రమాలు చేయవలసిన దుస్థితికి దిగజారిపోయింది. సిఐటి రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా చలో విజయవాడ కార్యక్రమం చేపట్టాల్సి ఉంది.
ఓటమి భయంతో జగన్ మోహన్ రెడ్డి నియోజకవర్గ ఇంచార్జిలను మారుస్తున్నారు కానీ ప్రజలే జగన్ మోహన్ రెడ్డిని మార్చే రోజులు దెగ్గరలో ఉన్నాయని కొనకళ్ల నారాయణరావు అన్నారు. ఈ సందర్భంగా ఆయన కొన్ని పాయింట్లను చెప్పారు.
1) జగన్ రెడ్డికి ఓటమి భయం పట్టుకుంది. అందుకే అభ్యర్థులను మార్చుతున్నారు.
2) నిన్న ప్రకటించిన 11 మంది ఇంచార్జుల్లో ఒక్కరూ కూడా గెలిచే పరిస్థితి లేదు.
3) ఒక నియోజకవర్గం నుంచి మరో నియోజకవర్గానికి నాయకులను మార్చినంత మాత్రాన జగన్ రెడ్డి తలరాత మారదు.
4) దగాకోరు జగన్ రెడ్డి పాపం పండింది. జగన్ రెడ్డి అవినీతి, అక్రమాల మీద ఇప్పటికే ప్రజలు పీకలు దాకా కోపంతో ఉన్నారు.
5) మన భవిష్యత్తుకు గ్యారెంటీతో వచ్చే ఎన్నికల్లో జగన్ రెడ్డిని ప్రజలు ఇంటికి పంపడం కూడా గ్యారెంటీ.
6) వైఎస్సార్సీపీ 11 మంది ఇంచార్జుల్లో ముగ్గురు మంత్రులు ఉన్నారు. స్థానికంగా వారిపైన వ్యతిరేఖత, అవినీతి ఆరోపణలు, ప్రజలతో సత్సంబంధాలు లేకపోవడమే ఇందుకు కారణం.
7) ప్రజలను మరోసారి మోసం చేసేందుకు వైఎస్సార్సీపీ ఇంచార్జుల మార్పుల పేరుతో కొత్త నాటకం ఆడుతోంది.
8) జగన్ రెడ్డి ఇంచార్జులను మార్చుతున్నారు… కానీ ఏపీ ప్రజలు ఏకంగా జగన్ రెడ్డినే మార్చేందుకు సిద్దంగా ఉన్నారు.
9) ఇప్పటి వరకు వైసీపీ నాయకులు చేసినదంతా ఆంధ్ర ప్రదేశ్ ప్రజలను దోచుకోవడం, వారి భవిష్యత్తును అంధకారంలోకి నెట్టివేయడం. మూడు రాజధానుల పేరుతో రాష్ట్రవ్యాప్తంగా నాటకాలు ఆడిన వైసీపీ ప్రభుత్వం. అభివృద్ధి మాత్రం శూన్యం.
10) మంగళగిరిలో గెలుస్తారని తెలిసినప్పుడు సీటు రెడ్డి సామాజిక వర్గానికి ఇచ్చి ఓడిపోతారు అని తెలిసినప్పుడు మాత్రం బీసీ సామాజిక వర్గానికి చెందిన గంజి చిరంజీవికి ఇచ్చారు.
11) బీసీల మీద జగన్ రెడ్డికి ఉన్న కపట ప్రేమకు ఇదే నిదర్శనం.
ఈ కార్యక్రమంలో మోటమర్రి బాబా ప్రసాద్ ,లంకె శేషగిరి ,గోపు సత్యనారాయణ ,బచ్చుల సుబ్రహ్మణ్యం (బోస్),బత్తిన దాస్ ,పీవీ ఫణి కుమార్ ,పామర్తి లక్ష్మణ్, చిల్లిముంత ప్రవీణ్ ,జనసేన నాయకులు భీమవరపు పరమేశ్వర రావు ,ఆళ్ల మాధవ ,బడే రమణ తదితరులు పాల్గొన్నారు.
నిడమానూరు చైతన్య కాలేజీ క్యాంపస్ కేఎల్ యూనివర్సిటీ, శ్రీ చైతన్య విద్యాసంస్థలు అనుబంధంతో వినూత్న కార్యక్రమం చేపట్టడం జరిగింది, ఈ కార్యక్రమానికి కేఎల్ యూనివర్సిటీ యాజమాన్యం, చైతన్య విద్యాసంస్థల యాజమాన్యం కలిసి పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ… ఇంటర్మీడియట్ తర్వాత విద్యార్థులకు ఉండే అవకాశాలు మెరిట్ విద్యార్థులకు, మెరిట్ స్కాలర్షిప్ తీసుకుని ఒక రూపాయి కూడా తల్లిదండ్రుల దగ్గర తీసుకోకుండా ఏ విధంగా చదువుకోవాలో వివరించడం జరుగుతుంది. కేఎల్ యూనివర్సిటీ వారు ప్రతి సంవత్సరం విద్యార్థులకు 100 కోట్ల రూపాయల స్కాలర్షిప్స్ ఇస్తున్నారు. జేఈలో 95% కన్న ఎక్కువ వచ్చిన విద్యార్థులకు ఎటువంటి ఖర్చు లేకుండా నాలుగు సంవత్సరాలు ఇంజనీరింగ్ చదువుకోవచ్చు. విద్యార్థులు ఇంటర్మీడియట్ తర్వాత ఎలాంటి కోర్సు తీసుకోవాలి ఎలాంటి ఇంటెన్షిప్ తీసుకోవాలని అనే దానిపైన అవగాహన కల్పించడం జరిగింది. ఇంటర్మీడియట్ తర్వాత ఎక్కడ చదవాలి ఏ కోర్సులు చదవాలి ఉద్యోగ అర్హత గురించి, ఇంటర్నేషనల్ ఇంటర్న్ షిప్ ఎలా చేయవచ్చు, రెగ్యులర్ డిగ్రీలు ఎలా చేయవచ్చు ఆన్లైన్ డిగ్రీలు, డబల్ డిగ్రీలు ఎలా చేయవచ్చు అనే అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించడం జరిగింది. ప్రతి విద్యార్థిని భవిష్యత్తు తరాలకి ఒక ఐఐటీ గా, ఎన్ ఐ టి గా ఒక మెడికోగా తయారు చేయటం మేము మా వంతు బాధ్యతగా తీసుకోవడం మేము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాం. దీనికి కేఎల్ యూనివర్సిటీ ముందుకు రావడం చాలా అభినందనీయం. ఈ కార్యక్రమంలో సుమారు 5000 నుంచి 6000 మంది విద్యార్థులు పాల్గొన్నారు.
విజయవాడ లో బండి నిలిపితే పార్కింగ్ టోకెన్ చిరగాల్సిందే… వాహనాలు ఎక్కడ కనపడితే అక్కడకు వెళ్లి అక్రమ వసూళ్లకు పాల్పడుతూ ప్రజల సొమ్ము దోచుకుంటున్నారు. తాజాగా విజయవాడ కాళేశ్వరరావు మార్కెట్ లోని పోస్ట్ ఆఫీస్ వద్ద అనుమతి లేకుండా పార్కింగ్ వసూలు చేస్తూ సీవీఆర్ కెమెరా కు చిక్కారు. అదేమిటని ప్రశ్నించగా విజయవాడ లోని ఒక ప్రముఖ వ్యక్తి అండ తోనే ఈ వసూళ్లకు పాల్పడుతున్నట్లు స్పష్టం చేశారు. పలుమార్లు ఈ కేటుగాళ్ళను ఇదే విషయమై వాహనదారులు ప్రశ్నించగా గొడవలకు దిగి వసూళ్లకు పాల్పడుతున్నారు. విజయవాడలో ఇలాంటి అక్రమ పార్కింగ్ వసూళ్లకు పాల్పడుతున్న ముఠాలు అనేకం, ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు వీరిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు వాపోతున్నారు.
కార్తీక మాహోత్సవ వేడుకలను పురస్కరించుకొని కృష్ణాజిల్లా గన్నవరం మండలంలో శ్రీ కాశీ విశాలాక్షి అన్నపూర్ణ సహిత విశ్వేశ్వర స్వామి దేవస్థానంలో అత్యంత వైభవంగా జరిగిన కార్తీక కోటి దీపోత్సవ పూజలు. కార్తీక కోటి దీపోత్సవ పూజ కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరిగాయి. దేవాలయం ప్రధాన అర్చకులు మామిళ్ళపల్లి సాంబశివరావు గారు మామిళ్ళపల్లి మారుతి శర్మ గారు ఆధ్వర్యంలో స్వామివారికి అభిషేకం జరిగింది. అనంతరం స్వామివారిని అమ్మవారి ఊరేగింపు కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారి ఆశీర్వాదాలు పొందారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన దీపోత్సవ పూజల్లో పెద్ద సంఖ్యలో మహిళా భక్తులు పాల్గొన్నారు. శివలింగం, ఓం, స్వస్తిక్, తదితర రూపాలతో అలంకరించిన దీపాలను మహిళా భక్తులు వెలిగిస్తూ దీపోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. లోక కళ్యాణార్థం గత ఐదేళ్లుగా కోటి దీపోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నామని తెలిపారు…
కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో రైతులకు నష్టపరిహారం వెంటనే అందించాలంటూ తెలుగుదేశం, జనసేన, సీపీఐ పార్టీల నేతలు ధర్నా చేపట్టారు. ధర్నాలో పాల్గొన్న మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్, సిపిఐ నేత రామకృష్ణ, జనసేన నేతలు పూషడపు రత్నగోపాల్, గుడివాక శేషుబాబు. మిచాంగ్ తుఫాన్ ధాటికి తీవ్రంగా నష్టపోయిన దివిసీమ రైతులు తడిచిన పంట మొలకలు రావడంతో 6 ఎకరాల పంటను ట్రాక్టర్ తో తొక్కించేసిన కౌలు రైతు వర ప్రసాద్. రైతులకు న్యాయం చేయాలంటూ మోపిదేవి మండలం కప్తానుపాలెం వద్ద హైవే పై నిరసన తెలిపిన అఖిలపక్ష నేతలు పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు 30,000 పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేసిన నేతలు. ధాన్యం కొనుగోలులో భారీగా అవకతవకలకు పాల్పడుతున్నారని నేతలు ఆరోపించారు. ఇది ప్రకృతి సృష్టించిన బీభత్సం కాదు ప్రభుత్వం సృష్టించిన బీభత్సం అని నేతలు ఆరోపిస్తున్నారు. సిపిఐ నేత రామకృష్ణ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నీరో చక్రవర్తిలా పాలిస్తున్నాడని, రేపు విజయవాడ లో అఖిలపక్షాలతో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటుచేస్తామని , ప్రభుత్వం మెడలు వంచుతాం, పోరాడి సాధించుకుంటాం అని ఆయన అన్నారు.
బాపులపాడు మండలం వీరవల్లి లో విజయ డైరీ నూతన ప్రాజెక్టును ప్రారంభించిన శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జీయర్ స్వామి ప్రాజెక్టు కామధేనువుతో అత్యాధునిక సాంకేతికతో అత్యున్నత నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా లక్షలాది కృష్ణ మిల్క్ యూనియన్ పాడి రైతుల ఆకాంక్షలు సహకారం విజయ డైరీ చైర్మన్ శిలసాని ఆంజనేయులు అన్నారు. వీరవల్లి లో 188 కోట్ల వ్యయంతో నిర్మించిన విజయ పాల ఫ్యాక్టరీ విజయ కామదేను శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామి దివ్య కర కమలముల మీదుగా గురువారం ప్రారంభించారు, తక్కువ ఖర్చుతో నాణ్యత ప్రమాణాలతో కూడిన పాల ఉత్పత్తులను తయారు చేసేందుకు అవసరమైన సాంకేతికత మిషనరీ ని జీయర్ స్వామికి చైర్మన్ వివరిస్తూ కారణం మొత్తం చూపించడం జరిగింది కృష్ణ మిల్క్ యూనియన్ నాలుగు సంవత్సరాల తపన రెండు సంవత్సరాల నిర్విరామ కృషితో లక్షలాది పాడి రైతుల కుటుంబాల కలల సహకారమైందని దీనికి సహకరించిన పాలకవర్గ సభ్యులకు చైర్మన్ శిలసాని కృతజ్ఞతలు తెలియజేశారు…..
ప్రతిరోజు ఆరు లక్షల లీటర్లు పాలు పోరాసిసింగ్ చేయడంతో పాటు అవసరమైతే 8 లక్షల లీటర్ల పాలను కూడా ప్రాసెసింగ్ చేసే విధంగా పరిమితి పెంచేందుకు వీలుగా ప్రాజెక్టును నిర్మించడం జరిగిందని ఎండి కొల్లి ఈశ్వర బాబు వివరించారు. విజయవాడలో 59 సంవత్సరాలుగా సేవలందిస్తున్న పాల ఫ్యాక్టరీ నిర్వహణ వ్యయం పెరుగుతుందని అందుకే తక్కువ నిర్వహణ వ్యయంతో అత్యంత నాణ్యత ప్రమాణాలతో కూడిన బాల ఉత్పత్తులను ప్రజలకు అందించాలని లక్ష్యంతో ఈ ప్రాజెక్టు కామధేను నిర్మించడం జరిగిందన్నారు.అత్యున్నత నాణ్యత ప్రమాణాలను అందించాలని లక్ష్యంతో ఈ ప్రాజెక్టు కామదేను నిర్మించడం జరిగిందన్నారు.
అత్యున్నత నాణ్యత ప్రమాణాలతో పాల ఉత్పత్తుల మార్కెట్‌ను వివరిస్తూ 1500 కోట్ల టర్నోవర్ లక్ష్యాన్ని అందుకునే విధంగా వచ్చిన లాభాలను పాడే రైతులకు అందించే విధంగా కార్యచరణ రూపొందించి ముందుకు సాగామన్నారు. ఒక్క చుక్క పాలు కూడా వృధా కాకుండా అత్యధిక సాంకేతికతో గంటకు పదివేల లీటర్ల పెరుగు తదితర పాల ఉత్పత్తులను తయారు చేస్తూ ప్రస్తుత కాంపిటేటివ్ మార్కెట్లో మనదైన ముద్ర వేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. 1,50,000 మంది పాడి రైతులు చేస్తున్న అభిరామ కృషి చేసే వారికి సేవలు అందించే విధంగా మండల జానకి రామయ్య గారి అడుగుజాడల్లో కృష్ణ మిల్క్ యూనియన్ లో పనిచేయడం అనేది పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని చైర్మన్ అన్నారు. ప్రపంచానికే తల మాణికమైన రామానుజ విగ్రహాన్ని నిర్మించడం సేవ పరమావధితోనే సాధ్యమైందని అదే స్ఫూర్తితో ప్రాజెక్ట్ కామధేను మొదలు పెట్టడం జరిగిందన్నారు.
శ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి మాట్లాడుతూ….
కృష్ణా మిల్క్ యూనియన్ చైర్మన్ గా చలసాని ఆంజనేయులు ఉత్సాహం కలిగిన రైతు అన్నారు. తల్లిని మరిపించే శక్తి తల్లి ఇచ్చే పోషణ పాలకు ఉందని అలాంటి పాలను పాల ఉత్పత్తులను నాణ్యతతో అందించడం ద్వారా ప్రజలకు మంచి వాత్సల్యంతో కూడిన హస్తాన్ని అందించే శక్తిని పాడి రైతు కుటుంబాలకు ఈ ప్రాజెక్టు కామదైన ద్వారా కల్పించిన చైర్మన్ , చలసాని ఆంజనేయులు చేస్తున్న కృషి అభినందనీయమని జీయర్ స్వామి కొనియాడారు. ఈ కార్యక్రమంలో కృష్ణ మిల్క్ యూనియన్ పాలకొరక సభ్యులు ట్రస్ట్ సభ్యులు పాల సంఘాల అధ్యక్షులు వాటి రైతులు కృష్ణ మిల్క్ యూనియన్ సిబ్బంది పాల్గొన్నారు.