విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గ పరిధిలో ఉన్న రామభద్రపురం మండలంలో మిచౌంగ్ తుఫాను విఫత్తు వలన పంటలు తీవ్రంగా నష్టపోయిన రైతులను తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ బేబి నాయన కలిశారు. అనంతరం వారిని పరామర్శిస్తూ పంట పొలాల్లోకి వెళ్లి పూర్తిగా తడిసి పాడై పోయినటువంటి పంటలను క్షేత్రస్థాయిలో పరిశీలించాలన్నారు. అలాగే నష్టపోయిన రైతులను ప్రభుత్వం గుర్తించి వారికి వెంటనే తగిన నష్టపరిహారం చెల్లించే విధంగా చర్యలు చేపట్టి ఆదుకోవాలని, తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని తెలుగుదేశం పార్టీ తరపున బేబినాయన డిమాండ్ చేశారు..
latest news
శ్రీశైలం ఘాట్ రోడ్డులో భారీగా ట్రాఫిక్ జామ్ పెరిగింది శ్రీశైలం నుంచి ముఖద్వారం వరకు భారీగా ట్రాఫిక్ జామ్ అయింది రోడ్లపై కార్లు బస్సులు నిలిచిపోయాయి. సుమారు ఆరు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది వరుస సెలువులు అందులోను కార్తీకమాసం చివరి రోజులు కావడంతో శ్రీశైలం ఆలయానికి భక్తులు ఆంధ్ర, తెలంగాణ, మహారాష్ట్ర నుంచి వాహనాలలో భారీగా తరలి వస్తున్నారు. భక్తులరద్దిని దృష్టిలో ఉంచుకుని ఆలయ అధికారులు స్వామివారి స్పర్శ దర్శనం అభిషేకాలు పూర్తిగా రద్దు చేశారు. భక్తులందరికి స్వామివారి దర్శనం కల్పించేందుకు అందరికి అలంకార దర్శనం మాత్రమే కల్పిస్తున్నారు. ఆంధ్ర, తెలంగాణ నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు భారీగా సొంత కార్లలో తరలి వస్తున్నారు. శ్రీశైలం ఘాట్ రోడ్ మొత్తం సింగిల్ రోడ్డు కావడంతో వచ్చి వెళ్లె వాహనాలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. శ్రీశైలం నుండి హటకేశ్వరం వరకు భారీగా ట్రాఫిక్ జామ్ అవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖద్వారం నుండి శ్రీశైలానికి సుమారు రెండు గంటల సమయం పడుతుంది. అయితే ట్రాఫిక్ జామ్ క్లియర్ చేసేందుకు పోలీసులు ప్రత్యేక టీమ్స్ తో అష్టకష్టాలు పడుతూ ట్రాఫిక్ ని అదుపు చేయడంలో నిమగ్నమయ్యారు.
చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం బైరెడ్డిపల్లి మండలం రామసముద్రం గ్రామంలో శనివారం సాయంత్రం ఓ కొండచిలువ గొర్రె పిల్లని అమాంతం చుట్టుకుని మింగడానికి ప్రయత్నించగా గమనించిన గ్రామస్తులు కొండచిలువ భారీ నుండి గొర్రె పిల్లని విడదీశారు. కానీ అప్పటికే నిమిషాల వ్యవధిలోనే గొర్రె పిల్ల ప్రాణాలు కోల్పోయింది, బాధితులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు, విష సర్పాల బారి నుండి రక్షించాలని కోరారు.
డా.బి.ఆర్.అంభేద్కర్ కోనసీమ జిల్లా, ముమ్మిడివరం మండలంలో ఇంకా ముంపు లోనే ఉన్న వరిచేలు, ఎనిమిది రోజులుగా ముంపులో ఉండటంతో చేలల్లోనే మొలకెత్తిన పంట. ముమ్మిడివరం మండలం అనాతవరం గ్రామంలో ఇంకా ముంపులోనే ఉన్న వరిచేలను పరిశీలించిన అధికార జనసేన పార్టీ ఇన్చార్జి పితాని బాలకృష్ణ. రాజమండ్రి నాళంవారి సత్రం భూములను కౌలుకు తీసుకుని సాగు చేసామని ముంపుతో పంట పూర్తిగా దెబ్బతిని కౌలు కూడా చెల్లించలేని పరిస్థితిలో ఉన్నామని, అధికారులుగాని, అధికార పార్టీ నాయకులు గాని కనీసం వచ్చి రైతులను పలకరించిన వాళ్లు లేరని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎటువంటి షరతులు లేకుండా రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేయాలని, ఎకరాకు రూ.25 వేలు పరిహరం అందించాలని బాలకృష్ణ డిమాండ్ చేసారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి రైతుల బాధలు తెలియవని, సొల్లు కబుర్లు చెప్పుకుంటూ తిరుగుతున్నారని విమర్శించారు. టిడిపి, జనసేనపార్టీ లు అధికారంలోకి వచ్చాక రైతులను ఆదుకుంటామని భరోసా ఇచ్చారు.
కాకినాడ జిల్లా తునిలో యువగళం పాదయాత్ర సందర్భంగా టీడీపీ నాయకుడు నారా లోకేష్ అక్కడి మత్యకారులతో మాట్లాడుతూ… మత్యకారులకు నాడు చంద్రబాబు ఎంతో మేలు చేస్తే.. నేడు సైకో జగన్ ప్రభుత్వం అన్నీ రద్దు చేసిందని ఆయన అన్నారు. మత్స్యకారుల తరపున బహిరంగ చర్చకు నేను సిద్ధమని, మత్యకార మంత్రి అప్పలరాజు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు. టీడీపీ అధికారంలోకి వచ్బిన వంద రోజుల్లోపు జీవో 217 రద్దు చేస్తామని, బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టం తీసుకువస్తామని ఆయన అన్నారు. కెమికల్ ఫ్యాక్టరీల వ్యర్థాల వల్ల మత్స్యకారులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, టీడీపీ అధికారంలోకి వచ్చాక పొల్యూషన్ లేని కంపెనీలు తీసుకువస్తామని ఆయన భరోసా ఇచ్చారు.
పల్నాడు జిల్లా కలెక్టర్ ని కలిసిన టీడీపీ నేతలు జివి ఆంజనేయులు, జూలకంటి బ్రమ్మారెడ్డి, చదలవాడ అరవింద్ బాబు జిల్లాలో ఓట్ల అవకతవకలపై కలెక్టర్ కి ఫిర్యాదు…..
మాజీ ఎమ్మెల్యే జివి ఆంజనేయులు మాట్లాడుతూ
BLO ల మీద వైసీపీ నేతలు ఒత్తిడి చేసి మా ఓట్లను అక్రమంగా తొలగిస్తున్నారని, అధికారులు మా ఫిర్యాదులపై కనీస చర్యలు తీసుకోవడం లేదని ఆయన అన్నారు. మత్తుకుమల్లిలో బ్రతికున్న నలబై మంది ఓట్లు తొలగించారని, తొలగించిన ఓట్ల గురించి మేము పూర్తి ఆధారాలతో పిర్యాదు ఇస్తున్నా చర్యలు తీసుకోవడం లేదని ఆయన మండిపడ్డారు. వైసీపీ నేతలు భారీ ఎత్తున ఓట్ల అవకతవకలకు పాల్పడ్డారని, వైసీపీ నేతలు ఫిర్యాదు ఇవ్వగానే వెంటనే మా ఓట్లను అధికారులు తొలగిస్తున్నారని ఆయన అన్నారు. వెల్లటూరు గ్రామంలో వైసీపీ నేతలు 160 దొంగ ఓట్లను చేర్చారని, ఓటమి భయంతోనే అధికార పార్టీ వారు దొంగ ఓట్లను చేర్చుకుంటున్నారని ఆయన అన్నారు. తప్పలు చేసిన అధికారులపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని నూతన జాబితాలో మాకు అన్యాయం జరిగితే తప్పకుండా మేము కోర్టుకి వెళతామని, ఇప్పుడు తప్పు చేసిన ఏ ఒక్క అధికారిని విడిచిపెట్టమని ఆయన తెగేసి చెప్పారు.
మాచర్ల టీడీపీ ఇంఛార్జి జూలకంటి బ్రమ్మారెడ్డి మాట్లాడుతూ
మేము దొంగ ఓట్లపై ఫిర్యాదు చేస్తున్నా ఫలితం లేదనిం, ఓట్ల విషయంలో అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని ఆయన అన్నారు. మా ఓట్ల విషయంలో అధికారులు న్యాయంగా వ్యవహరించడం లేదని, నరసరావుపేట టీడీపీ ఇంచార్జి చదలవాడ అరవింద్ బాబు, మేము గడిచిన ఆరు నెలలుగా దొంగ ఓట్లపై పోరాటం చేస్తున్నా అధికారులు స్పందిoచడం లేదని ఆయన మండిపడ్డారు. వైసీపీ ఎమ్మెల్యేల కనుసన్నల్లోనే ఓటర్ లిస్ట్ వ్యవహారం జరుగుతుందని ఈరోజు ఉన్న ఓటు రేపు ఉంటుందో లేదో అర్థం కావడం లేదని ఆయన అన్నారు. ఓట్లపై సామాన్యులు కూడా బాధ్యతగా వ్యవహరించాలని మీ ఓటుపై మీరు జాగ్రత్త పడితే మంచిదని ఆయన అన్నారు.
శాస్త్రవేత్తలు నక్షత్రాల నుండి వచ్చే అసాధారణంగా శక్తివంతమైన కాంతి విస్ఫోటాలను అర్థం చేసుకోవడంలో ముఖ్యమైన పురోగతిని సాధించారు. ఈ విస్ఫోటాలను సూపర్ఫ్లేర్లు అని పిలుస్తారు మరియు అవి ఒక సెకనులో సూర్యుడి ఉత్పత్తి చేసే కంటే ఎక్కువ శక్తిని విడుదల చేస్తాయి.
సూపర్ఫ్లేర్లు ఎలా జరుగుతాయో ఖచ్చితంగా తెలియదు, కానీ ఒక సిద్ధాంతం అవి నక్షత్రాల కేంద్రంలోని మాగ్నెటోహైడ్రోడైనమిక్ (MHD) అస్థిరతల ద్వారా ప్రేరేపించబడతాయి. MHD అస్థిరతలు అనేవి ఒక మాగ్నెటిక్ ఫీల్డ్ మరియు దాని చుట్టూ ఉన్న ద్రవం లేదా వాయువు మధ్య ఒక అసమతుల్యత ద్వారా ఉత్పత్తి అయ్యే అస్థిరతలు.
ఈ సిద్ధాంతాన్ని పరీక్షించడానికి, శాస్త్రవేత్తలు ఒక నమూనా నక్షత్రాన్ని ఉపయోగించి MHD అస్థిరతలను అనుకరించారు. వారు నమూనా నక్షత్రం యొక్క మాగ్నెటిక్ ఫీల్డ్‌ను మరియు దాని చుట్టూ ఉన్న ద్రవం యొక్క లక్షణాలను సర్దుబాటు చేయడం ద్వారా, వారు వివిధ రకాల సూపర్ఫ్లేర్లను ఉత్పత్తి చేయగలిగారు.
వారి పరిశోధన ప్రకారం, MHD అస్థిరతలు నక్షత్రాల కేంద్రంలోని మాగ్నెటిక్ ఫీల్డ్‌ను బలంగా చేస్తాయి. ఈ బలమైన మాగ్నెటిక్ ఫీల్డ్ చివరికి విస్ఫోటానికి దారితీస్తుంది, ఇది నక్షత్రం నుండి భారీ మొత్తంలో శక్తిని విడుదల చేస్తుంది.
ఈ పరిశోధన సూపర్ఫ్లేర్ల యొక్క మూలం మరియు అవి ఎలా పని చేస్తాయో అర్థం చేసుకోవడంలో ఒక ముఖ్యమైన దశ. ఇది ఈ అసాధారణ కాంతి విస్ఫోటాల గురించి మరింత తెలుసుకోవడానికి మరియు అవి మన గెలాక్సీపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతాయో అర్థం చేసుకోవడానికి శాస్త్రవేత్తలకు సహాయపడుతుంది.
ఈ పరిశోధన యొక్క ప్రధాన రచయిత అయిన డాక్టర్ మైఖేల్ హెర్బర్ట్, “మా పరిశోధన MHD అస్థిరతలు సూపర్ఫ్లేర్లకు ఒక ముఖ్యమైన భౌతిక ప్రక్రియ అని సూచిస్తుంది,” అని చెప్పారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధ్యక్షతన నేడు శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో మాజీ సీఎం కేసీఆర్‌ను పార్టీ శాసనసభాపక్ష నేతగా ఎన్నుకోనున్నారు. ఈ సమావేశానికి 38 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హాజరుకానున్నారు. కేసీఆర్ ను శాసనసభాపక్ష నేతగా ఎన్నుకుంటూ తీర్మానం ప్రవేశపెట్టి ఆమోదించనున్నారు. కాగా, ఈ సమావేశం అనంతరం కేటీఆర్ ఇతర ఎమ్మెల్యేలతో కలిసి అల్పాహార విందులో పాల్గొంటారు. అనంతరం, ప్రత్యేక వాహనంలో అసెంబ్లీ ప్రాంగణం ఎదురుగా ఉన్న గన్ పార్క్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కలిసి తెలంగాణ అమరవీరుల స్థూపానికి నివాళులర్పిస్తారు.
Read Also..
రాష్ట్రంలో ఖరీఫ్ లో పండిన ధాన్యాన్ని వచ్చే ఏడాది మార్చి నెల వరకు కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, రైతులు ఈ విషయంలో ఎటువంటి ఆందోళన చెందవద్దని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమీషనర్ హెచ్. అరుణ్ కుమార్ చెప్పారు. ఏలూరు జిల్లా పెదపాడు మండలం కొక్కిరపాడు, వట్లూరు, రైతు భరోసా కేంద్రాలలో ధాన్యం కొనుగోలును, సీతారాంపురంలో దెబ్బతిన్న పంట పొలాలను, అధికారులతో కలిసి పరిశీలించి అక్కడ రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అరుణ్ కుమార్ మాట్లాడుతూ తూఫాన్ కారణంగా రైతులకు ఎటువంటి నష్టం వాటిల్లకుండా చూడడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన ఉద్దేశ్యమన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 37 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించడం లక్ష్యంగా నిర్ణయించామని, అయినప్పటికీ ఎంత మేర ధాన్యం వచ్చినా సేకరించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. గత రెండు రోజుల నుండి రాష్ట్రవ్యాప్తంగా 1.10 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైతుల నుండి కొనుగోలు చేశామన్నారు. కోత కోసిన ధాన్యాన్ని రైతుల కల్లాల నుండి నేరుగా ఆఫ్ లైన్ విధానంలో రైస్ మిల్లులకు తరలిస్తున్నామన్నారు. తేమశాతం పై రైతులను ఇబ్బంది పెట్టకుండా ధాన్యం తీసుకోవాలని రైస్ మిల్లర్లు కోరడం జరిగిందన్నారు. కోత కోయవలసిన పంట లో మొలకలు వచ్చిన ధాన్యం కొనుగోలుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి తీసుకోవలసి ఉందని, ఇందుకోసం ఫుడ్ కొర్పొరేషన్ ఆఫ్ ఇండియా వారితో టెస్ట్ మిల్లింగ్ చేసి నివేదికను కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తామన్నారు. రంగుమారిన ధాన్యం, నూకశాతం పై రైతుకి, మిల్లర్లకు నష్టం కలగకుండా చర్యలు తీసుకుంటామన్నారు.
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం శివానగర్ కొడకంచి శివారు ప్రాంతంలో డ్రగ్స్ తయారు చేస్తున్న ప్రాంతాన్ని ఎస్ ఓ టి పోలీసులు. గుర్తించారు గత 6నెలలుగా గుట్టు చప్పుడు కాకుండా ఆల్ఫా జోలం, హేరైన్, కోకైన్, పలు రకాల డ్రగ్స్ ను తయారు చేస్తున్నట్లుగా పోలీసులకు విశ్వసనీయ సమాచారం. దీంతో ఎస్ ఓ టి పోలీసులు అక్రమంగా డ్రగ్స్ తయారుచేస్తున్న ప్రాంతంపై నిఘా పెట్టారు.అదునుచూసుకున్న పోలీసులు డ్రగ్ తయారీ కేంద్రంపై చాకచక్యంగా వ్యవహరించి 14 కిలోల ఆల్ప్రా జోలం ను స్వాధీనం చేసుకున్నారు. కాగా ఓ బిఆర్ఎస్ జిల్లా నేత కనుసన్నల్లో ఈ డ్రగ్స్ వ్యాపారం జరుగుతోందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. డ్రగ్ తయారి కేంద్రం వద్ద ఐదుగురు నిందుతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులను మహ్మద్ యూనస్ ఆలియాస్ జక్కరాజు, బోరపట్ల,శ్రీనివాస్ గౌడ్,గ్రామం గుండ్ల,మ్యాచునుర్, నిర్మల్ గౌడ్, గ్రామం కొడకంచి, మణిక్యల రావు, గ్రామం ఇస్సాపూర్
శివశంకర్ గౌడ్, గ్రామం కొడకంచిరాహుల్ రెడ్డి, గ్రామం బిరంగుడ , శ్రీశైలం యాదవ్, గ్రామం గుండ్లమాచునుర్ గా పోలీసులు గుర్తించారు. ఈ మేరకు ఎస్ పి చెన్నూరు రూపెష్ మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు.





Total views : 199245