ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh) దండకారణ్యంలో భారీ ఎన్కౌంటర్.. 40 మంది మావోయిస్టుల మృతి ! పక్కా సమాచారంతో కూంబింగ్…
ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh) లోని బస్తర్ అడవుల్లో రక్తం ఏరులై పారింది…
పార్లమెంట్ ఎన్నికల వేళ ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh) లోని బస్తర్ అడవుల్లో రక్తం ఏరులై పారింది. పచ్చని అడవులు ఎర్రని రక్తంతో ఎరుపెక్కాయి. బస్తర్ రీజియన్‌లోని కాంకేర్ జిల్లాలో మావోయిస్టులు, భద్రతా దళాల మధ్య జరిగిన భారీ ఎన్కౌంటర్లో దాదాపు 40 మంది మావోయిస్టులు మరణించినట్లు సమాచారం.! ఇప్పటి వరకూ 29 మంది మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇక భద్రతా దళాలకు చెందిన ముగ్గురు జవాన్లు గాయపడ్డారు. మృతుల్లో ఇప్పటివరకు ముగ్గురిని గుర్తించారు. వారిలో ఇద్దరు తెలంగాణకు చెందిన వారిగా పోలీసులు చెబుతున్నారు. మృతుల్లో మరికొందరు తెలంగాణ వాసులు ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
రాష్ట్రంలో అతిపెద్ద ఎన్ కౌంటర్…
కాగా మరో రెండు రోజుల్లో సార్వత్రిక ఎన్నికలు ప్రారంభం కానుండగా ఆ రాష్ట్రంలో అతిపెద్ద ఎన్ కౌంటర్ చోటు చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. దీంతో ఈ ఏడాదిలో 4 నెలల వ్యవధిలో వేర్వేరు ఎన్కౌంటర్లలో 79 మంది మావోలు మృతి చెందారు. మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు బీఎస్ఎఫ్, డీఆర్ బలగాలు- మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 40 మంది మావోయిస్టులు మృతి చెంది ఉంటారని బస్తర్ ఐజీ పి సుందర్రాజ్, ఎస్పీ కళ్యాణ్ ఎలిసెల్లి రాత్రి వేర్వేరు ప్రకటనల్లో వెల్లడించారు. మృతుల్లో మావోయిస్టు అగ్రనేత, దండకారణ్యం స్పెషల్ జోన్ కమిటీ సుగులూరి చిన్నన్న అలియాస్ విజయ్, అలియాస్ శంకర్ రావు ఉన్నట్లు పోలీసులు ప్రకటించారు.
ఆయుధ సామగ్రిని స్వాధీనం చేసుకున్న పోలీసులు…
ఏపీలోని కర్నూలు జిల్లా ఆత్మకూరు మండలం వడ్ల రామపురం గ్రామానికి చెందిన ఆయనపై రూ. 25 లక్షల రివార్డు ఉంది. ఎన్ కౌంటర్ ఘటనాస్థలి నుంచి భారీ యెత్తున మారణాయుధాలు పట్టుబడ్డాయి. ఏకే – 47 లు, ఎస్ఎల్ఆర్, ఇన్సాస్ రైఫిళ్లు, కార్బైన్, 303 రైపిల్స్ వంటి ఇతర ఆయుధ సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. ఈ ఘటనలో బీఎస్ఎఫ్ ఇన్స్పెక్టర్ సహా ఇద్దరు జవాన్లకు కూడా గాయాలయ్యాయి. దండకారణ్యం స్పెషల్ జోన్ స్టేట్ మిలటరీ కమిషన్ ఇన్చార్జి రాంధర్ అలియాస్ మజ్జిదేవ్ కూడా మరణించినట్లు సమాచారం. గత పదిహేనేళ్లలో బస్తర్ అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లలో ఇదే అతి పెద్దదిగా పోలీసు వర్గాలు చెబుతున్నాయి.
మాడ్ ప్రాంతంలో మావోయిస్టు నేతలు సమావేశం…
లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో మాడ్ ప్రాంతంలో మావోయిస్టు నేతలు సమావేశం అయ్యారన్న సమాచారంతో పోలీసు బలగాలు కూంబింగ్ చేపట్టాయి. ఈ సమావేశానికి సీపీఐ (మావోయిస్టు) బస్తర్ డివిజన్ నేతలు శంకర్, లలిత, రాజు తదితరులు హాజరవుతున్నట్లు తెలిసింది. దీంతో బీఎస్ఎఫ్, జిల్లా రిజర్వు గార్డు (డీఆర్టీ), రాష్ట్ర పోలీసులు, ఇతర భద్రతా దళాలు సంయుక్తంగా చోటేబేథియా పోలీస్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో యాంటీ మావోయిస్టు ఆపరేషన్ చేపట్టారు. ఈ ఎన్కౌంటర్ మృతుల్లో దండకారణ్యం అగ్రనేత మజ్జిదేవ్, ఆయన భార్య లలిత ఉన్నట్లు తెలుస్తోంది.
ఇది చదవండి : ఎమ్మెల్సీ కవిత రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా..!
- సెమీకాన్ ఇండియా-2026 ప్రారంభించిన మోదీ.
భారత్‌ను ప్రపంచ సెమీకండక్టర్ తయారీ హబ్‌గా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఢిల్లీలోని యశోభూమి కన్వెన్షన్ సెంటర్లో గురువారం ‘సెమీకాన్ ఇండియా-2026’ సదస్సును ప్రారంభించారు. సెప్టెంబర్ 17 నుంచి 19 వరకు మూడు రోజుల పాటు… - ప్రఖ్యాత బెంగాలీ రచయిత శరత్చంద్రకు ప్రధాని మోదీ నివాళి.
ప్రముఖ బెంగాలీ రచయిత, బహుముఖ ప్రజ్ఞాశాలి శరత్చంద్ర ఛటోపాధ్యాయ 150వ జయంతి సందర్భంగా ప్రధాని మోదీ ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. ఈ మేరకు ప్రధాని సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. శరత్చంద్ర సాహిత్య వైభవాన్ని, సామాజిక సంస్కరణల పట్ల ఆయనకున్న అంకితభావాన్ని… - ఉద్యోగులకు కేంద్రం కీలక నిర్ణయం.
ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో EPFO వేతన పరిమితిని రూ.15 వేల నుంచి రూ.25 వేలకు పెంచేందుకు ఆమోదం లభించింది. 2014 తర్వాత తొలిసారిగా ఈ పరిమితిని…
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి: ఛత్తీస్‌గఢ్ దండకారణ్యంలో భారీ ఎన్కౌంటర్.. 40 మంది మావోయిస్టుల మృతి..!


