శాసనసభ వ్యవహారాలపై ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు నేడు, రేపు రెండు రోజులపాటు మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నారు. సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్, మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి తరగతుల ఏర్పాట్లను మంగళవారం వారు పరిశీలించారు. దిల్లీకి చెందిన పబ్లిక్ రీసెర్చ్, స్టడీస్ లెజిస్లేటివ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నిపుణులు శాసనసభ విధానాలు, వ్యవహారాలు, నిబంధనలు, నియంత్రణలు, సంప్రదాయాలను సభ్యులకు వివరించనున్నారు. ఈ రోజు ఉదయం 10.30 గం.లకు కార్యక్రమం ప్రారంభమవుతుంది. అసెంబ్లీ లో జరిగే.. జీరో అవర్, తీర్మానాలు, వాయిదా తీర్మానాలు, ప్రత్యేక ప్రస్తావనల వినియోగం, ప్రశ్నోత్తరాల కార్యక్రమాలపై నిపుణుల ప్రసంగాలు ఉంటాయి. రెండోరోజు శాసనసభ బిల్లులపై చర్చ, బడ్జెట్, శాసనసభ కమిటీలపైనా శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తారు. తరగతులకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు విధిగా హాజరుకావాలని స్పీకర్, మండలి చైర్మన్ లు కోరారు. కాగా స్పీకర్ తీరును నిరసిస్తూ ఓరియంటేషన్ ప్రోగ్రాం ను బహిష్కరిస్తున్నట్లు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- హైదరాబాద్: జీడిమెట్ల పరిధిలో బంగ్లాదేశీయుల అరెస్ట్.హైదరాబాద్‌లో మరోసారి అక్రమ వలసదారుల గుట్టు రట్టయింది. హైదరాబాద్ నగర శివార్లలోని ప్రముఖ పారిశ్రామిక ప్రాంతమైన జీడిమెట్లలో అక్రమంగా నివసిస్తున్న ఏడుగురు బంగ్లాదేశీయులను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. పాస్‌పోర్టులు, వీసాలు లేకుండా దేశంలోకి చొరబడిన వీరు… కొంతకాలంగా ఇక్కడే ఉంటూ…
- స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదంపై చర్యలకు ఉపక్రమించిన ప్రభుత్వం.విశాఖ స్టీల్ ప్లాంట్‌లో జరిగిన ప్రమాదంపై ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. ప్రమాదానికి కారణమైన వారిగా భావిస్తున్న 15 మందిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసి… మరికొందరిని బదిలీ చేసింది. నాసిరకం మెటీరియల్ కొనుగోలు, పర్యావేక్షణ లోపం, ముందస్తు భద్రతా చర్యలు…
- మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్రలో ఎమ్మెల్యే మధుసూదన్ పర్యటన.మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మున్సిపాలిటీలో ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా సోలార్ ప్లాంట్‌కు ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. మహిళా సాధికారతే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. సోలార్ ప్లాంట్ ద్వారా నెలకు లక్ష…
- కాకినాడ జిల్లాలో చిన్నారి అదృశ్యం కేసులో కీలక పరిణామం.కాకినాడ జిల్లాలో చిన్నారి అదృశ్యం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో చిన్నారితో వెళ్లిన పెంపుడు కుక్క తోట నుంచి తిరిగొచ్చిన తర్వాత మృతి చెందడంపై అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. చిన్నారి జాహ్నవి వెంట వెళ్లి తిరిగి వచ్చిన కుక్క.. రెండ్రోజులుగా…
- ‘ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు’ చిత్రంట్రైలర్ లాంచ్ ఈవెంట్లో వి. వి. వినాయక్.వడ్డే జిష్ణు సమర్పణలో వడ్డే క్రియేషన్స్ బ్యానర్ మీద వడ్డే నవీన్ హీరోగా, నిర్మాతగా రూపొందించిన చిత్రం ‘ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు’. కమల్ తేజ నార్ల దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ సినిమాలో వడ్డే నవీన్, రాశి సింగ్, శిల్పా తులస్కర్, వివేక్ రఘువంశీ,…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి





Total views : 141727