తెలుగు రాష్ట్రాల్లో మైకులు మూగబోయాయి.. దేశవ్యాప్తంగా జరుగుతున్న లోక్‌సభ ఎన్నికల్లో(Lok Sabha Elections) భాగంగా నాలుగో దశ పోలింగ్ సోమవారం అంటే మే 13న జరగనుంది. నాలుగో దశలో 10 రాష్ట్రాల్లోని 96 స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఈ నేపధ్యంలో ఈరోజు సాయంత్రం 6 గంటల నుంచి నాలుగో విడత ఎన్నికల ప్రచారానికి తెరపడింది. ఎన్నికల ప్రచారం ముగిసిన తర్వాత అభ్యర్థులు తమకు అనుకూలంగా ప్రచారం చేయలేరు. ఇలాంటి పరిస్థితుల్లో ఈరోజు అభ్యర్థులందరూ ముమ్మరంగా ప్రచారం చేసేందుకు ప్రయత్నించనున్నారు.
నాలుగో దశలో మొత్తం 10 రాష్ట్రాల్లోని 96 పార్లమెంట్ స్థానాలకు పోలింగ్ జరగనుండగా 1717 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. నాలుగో దశలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఒడిశా, జమ్మూ కశ్మీర్.. ఈ 10 రాష్ట్రాల్లోని 96 స్థానాలకు మే 13న ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో అత్యధికంగా తెలంగాణ నుంచి 525 మంది అభ్యర్థులు 17 ఎంపీ స్థానాల బరిలో నిలిచారు. ఇక ఆంధ్రప్రదేశ్‌లోని 25 స్థానాలకు 454 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఇక బీహార్‌లోని 5 పార్లమెంట్ స్థానాలకు పోలింగ్ జరగనుండగా 55 మంది పోటీలో నిలిచారు. జమ్మూకాశ్మీర్‌లో ఒక్క పార్లమెంటు స్థానానికి 24 మంది పోటీపడుతున్నారు. ఝార్ఖండ్‌లోని 4 పార్లమెంట్ స్థానాలకు పోలింగ్ జరగనుండగా 45 మంది పోటీలో ఉన్నారు. మధ్యప్రదేశ్‌లోని 8 పార్లమెంటు స్థానాలకు గానూ 74 మంది పోటీపడుతున్నారు. అటు మహారాష్ట్రలో 11 పార్లమెంటు స్థానాలకు పోలింగ్ జరగనుండగా 209 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఒడిశాలో 4 పార్లమెంట్ స్థానాలకు 37 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని 13 స్థానాలకు పోలింగ్ జరగనుండగా 130 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఇక పశ్చిమ బెంగాల్లో 8 స్థానాల్లో 75 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు.
నాలుగో దశలో ఐదుగురు కేంద్ర మంత్రులు, ఒక మాజీ ముఖ్యమంత్రి, ఇద్దరు క్రికెటర్లు, ఒక నటుడు సహా 1717 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఓటర్లు నిర్ణయిస్తారు. ఈ ఎన్నికలు ఫలితాలు జూన్ 4న రానున్నాయి. మొత్తం 96 స్థానాలకు 4264 నామినేషన్లు రాగా.. స్క్రుటినీ తర్వాత ఆ సంఖ్య 1970కు చేరుకుంది. ఇక ఉపసంహరణ గడువు ముగిసిన అనంతరం మొత్తం 1717 మంది మే 13న జరగనున్న పోలింగ్‌లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
ఈ నేపధ్యంలో పోలింగ్‌కు 48 గంటల ముందునుంచే సైలెన్స్ పీరియడ్ అమలు అవుతుందని గుర్తు చేశారు.సైలెన్స్ పీరియడ్ కాలంలో 144 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- నవీ ముంబైలో ‘మహా గణేష్ మూర్తి వర్క్‌షాప్’.గణేశ్ చతుర్థి వేడుకలకు ముందే మహారాష్ట్రలో పర్యావరణ హిత గణపతి విగ్రహాల తయారీపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. నవీ ముంబైలో రాష్ట్ర ప్రభుత్వ పర్యావరణ, వాతావరణ మార్పుల శాఖ ఆధ్వర్యంలో జరిగిన ‘మహా గణేష్ మూర్తి వర్క్‌షాప్’లో ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్…
- తమిళనాడు సీఎం విజయ్ పాలనపై స్టాలిన్ ఫైర్.తమిళనాడు రాజకీయాల్లో అధికార, విపక్షాల మధ్య విమర్శలు మరింత తీవ్రంగా మారుతున్నాయి. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌పై డీఎంకే నేత స్టాలిన్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. అసెంబ్లీని సినిమాలు తీసే ప్రదేశంగా మార్చేశారని ఆరోపించారు. పరిపాలనను కూడా సినిమా షూటింగ్‌లా నడుపుతున్నారని ఎద్దేవా…
- ఢిల్లీ వేదికగా 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు.భారత్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు సెప్టెంబర్ 12, 13 తేదీల్లో న్యూఢిల్లీలో జరగనుంది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన భారత్ మండపంలో ఈ సదస్సు నిర్వహించనున్నారు. 2026 సంవత్సరానికి బ్రిక్స్ అధ్యక్ష బాధ్యతలను భారత్ చేపట్టడంతో…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.