పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను భారత్‌లో విలీనం చేస్తామంటూ రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్(Rajnath Singh) చేసిన వ్యాఖ్యలపై జమ్మూ కశ్మీర్‌కు చెందిన నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా(Farooq Abdullah) స్పందించారు. పాకిస్థాన్ గాజులు తొడుక్కొని లేదని, ఆ దేశం వద్ద అణు బాంబులు ఉన్నాయని, పాక్ ప్రతీకార దాడిలో సరిహద్దు అవతల నుంచి మన మీద బాంబులు పడతాయని అబ్దుల్లా కౌంటర్ ఇచ్చారు. దురదృష్టవశాత్తూ మన మీద అణుబాంబులు పడితే ఏంటి పరిస్థితి అని అన్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
పీవోకేని భారత్ బలవంతంగా స్వాధీనం చేసుకోవాల్సిన అవసరం లేదని అబ్దుల్లా అన్నారు. భారత్‌లో భాగం కావాలని పీవోకే ప్రజలు కోరుకుంటున్నారంటూ రాజ్‌నాథ్ వ్యాఖ్యలు చేసిన మరుసటి రోజు ఫరూక్ అబ్దుల్లా ఈ కౌంటర్ ఇచ్చారు. కాగా కశ్మీర్‌లో జరుగుతున్న అభివృద్ధిని చూసి భారత్‌లో భాగం కావాలని పీవోకే ప్రజలు కోరుకుంటున్నారని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. ప్రజలు తమంతట తాము భారత్‌లో భాగం కావాలనుకుంటున్నారని, పీఓకేను బలవంతంగా భారత్‌లో కలపాల్సిన అవసరం లేదని అన్నారు.
- ముగిసిన నీతి ఆయోగ్ పాలకమండలి సమావేశం.నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం ముగిసిన అనంతరం.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రధాని నరేంద్ర మోదీతో విడిగా భేటీ అయ్యారు. అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక పెండింగ్ ప్రాజెక్టులపై ఇరు నేతలు…
- ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో నీతి ఆయోగ్ 11వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం.ప్రధాని మోదీ అధ్యక్షతన ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో నీతి ఆయోగ్ 11వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో దేశాభివృద్ధి, సమగ్ర మానవ వనరుల పురోగతి, 2047 నాటికి అభివృద్ధి చెందిన భారత లక్ష్య సాధనపై కీలకంగా చర్చించారు.…
- కాచిగూడ రైల్వే స్టేషన్‌కు 110 ఏళ్ల చరిత్ర.హైదరాబాద్ నగర చరిత్రకు సాక్ష్యంగా నిలిచిన కాచిగూడ రైల్వే స్టేషన్ మరో అరుదైన మైలురాయిని చేరుకుంది. ఆఖరి నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఆధ్వర్యంలో నిర్మితమైన ఈ చారిత్రక కట్టడం 110 ఏళ్ల వారసత్వాన్ని పూర్తిచేసుకుంది. గోతిక్ శైలిలో…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




Total views : 140723