ప్రకాశం జిల్లాలో కుప్పకూలిన మూడంతస్థుల భవనం. ఈ ప్రమాదంలో ప్రాణ నష్టం జరగకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రకాశం జిల్లా దోర్నాల లో వాసవి లాడ్జి పక్కన భవన నిర్మాణం కోసం గుంతల తీస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. శ్రీశైలం రహదారిలో ఉన్నటువంటి పేక మెడల వాసవి లాడ్జి. పునాదులు బలహీన పడటం గ్రహించిన లాడ్జి నిర్వాహకులు ముందుగా లాడ్జి లో నుంచి అందరిని కాళీ చేపించారు. దీంతో తెల్లవారుజామున సమయంలో ఒక్కసారిగా కుప్ప కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
news telugu
పశ్చిమగోదావరి జిల్లా యలమంచిలి శివారు ఆర్యపేట గ్రామంలో కొబ్బరి గోదాములో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక వెంకటేశ్వర కోకోనట్ కొబ్బరికాయల వ్యాపార యజమాని కొడవటి వెంకటేశ్వరరావు నిల్వ ఉంచిన కొబ్బరి గోదాములో రాత్రి ఆకస్మికమంగా మంటలు చెలరేగాయి. గోదాములో వేలాదిగా నిల్వ ఉంచిన కురిడి కొబ్బరికాయలకు నిప్పు అంటుకుని ఒక్కసారిగా అగ్నిజ్వాలలు ఎగిసిపడ్డాయి. నాలుగు అంతస్తుల్లో నిల్వ చేసిన కొబ్బరికాయలు ఈ అగ్నిప్రమాదంలో మాడి మసైపోయాయి. మంటలు ధాటికి సమీపంలోని పలు కొబ్బరిచెట్లు కూడా దగ్ధమయ్యాయి. దీంతో ఆ ప్రాంతంలో విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. పాలకొల్లు, రాజోలు నుంచి అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను కొంతమేరా అదుపు చేశారు. ఈ ప్రమాదంలో కోటి రూపాయల వరకు నష్టం వాటిని ప్రాథమిక అంచనా వేస్తున్నారు.
టెక్నాలజీ పరిశ్రమ నిరంతరం అభివృద్ధి చెందుతోంది, కొత్త ఉద్యోగాలు ఎల్లప్పుడూ సృష్టించబడుతున్నాయి. 2024లో, అత్యధిక వేతనం పొందే ఐటీ ఉద్యోగాలు అనేకం కృత్రిమ మేధస్సు (AI), క్లౌడ్ కంప్యూటింగ్ మరియు సైబర్ సెక్యూరిటీ వంటి అభివృద్ధి చెందుతున్న రంగాలలో ఉంటాయి.
2024లో అత్యధిక వేతనం పొందే ఐటీ ఉద్యోగాలు :
1. డేటా సైంటిస్ట్ (సగటు వార్షిక జీతం: ₹15,00,000)
డేటా సైంటిస్ట్‌లు పెద్ద డేటాసెట్ల నుండి విలువైన అంతర్దృష్టులను గుర్తించడానికి మరియు విశ్లేషించడానికి గణాంకాలుగా, మెషిన్ లెర్నింగ్ మరియు ప్రోగ్రామింగ్ నైపుణ్యాలను ఉపయోగిస్తారు. డేటా సైంటిస్ట్లకు డిమాండ్ ఎక్కువగా ఉంది, ఎందుకంటే వ్యాపారాలు తమ నిర్ణయం తీసుకోవడానికి డేటా-ఆధారిత విధానాలపై ఎక్కువగా ఆధారపడుతున్నాయి.
2. క్లౌడ్ ఆర్కిటెక్ట్ (సగటు వార్షిక జీతం: ₹14,00,000)
క్లౌడ్ ఆర్కిటెక్ట్‌లు క్లౌడ్-ఆధారిత సిస్టమ్‌లు మరియు అనువర్తనాలను రూపొందించడం, అమలు చేయడం మరియు నిర్వహించడం లాంటి బాధ్యతలు వహిస్తారు. క్లౌడ్ కంప్యూటింగ్ యొక్క పెరుగుతున్న ప్రజాదరణ కారణంగా క్లౌడ్ ఆర్కిటెక్ట్‌లకు డిమాండ్ ఎక్కువగా ఉంది.
3. సైబర్ సెక్యూరిటీ ఇంజనీర్ (సగటు వార్షిక జీతం: ₹13,00,000)
సైబర్ సెక్యూరిటీ ఇంజనీర్లు కంప్యూటర్ సిస్టమ్‌లు మరియు నెట్‌వర్క్‌లను హ్యాకర్లు మరియు ఇతర దుర్వినియోగదారుల నుండి రక్షించడానికి బాధ్యత వహిస్తారు. సైబర్ నేరాల పెరుగుతున్న ముప్పు కారణంగా సైబర్ సెక్యూరిటీ ఇంజనీర్లకు డిమాండ్ ఎక్కువగా ఉంది.
4. మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్ (సగటు వార్షిక జీతం: ₹12,00,000)
మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్లు మెషీన్ లెర్నింగ్ అల్గారిథంలు మరియు అనువర్తనాలను రూపొందించడం, అమలు చేయడం మరియు నిర్వహించడం లాంటి బాధ్యతలు వహిస్తారు.
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సుక్మా-బీజాపూర్ జిల్లాల సరిహద్దుల్లో సీఆర్పీఎఫ్ కోబ్రా బలగాలపై మావోయిస్టుల మెరుపుదాడి ఘటనలో విస్మయం కలిగించే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. టేకులగూడెం అటవీప్రాంతంలోని సీఆర్పీఎఫ్ బేస్‌క్యాంపు సమీపంలో మూడు రోజుల క్రితం భద్రతబలగాలపై చేసిన దాడిలో మావోయిస్టులు బ్యారెల్ గ్రెనేడ్ లాంచర్లను వినియోగించారు. అయితే వాటిని సొంతంగానే తయారు చేస్తున్నట్లు తేలడం ఆందోళన కలిగించే అంశంగా మారింది. బీజీఎల్తోపాటు ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైజ్‌లను సొంతంగానే కర్మాగారాల్లో తయారు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. టేకులగూడెం అడవుల్లో దాడి అనంతరం మావోయిస్టుల సొరంగాన్ని పోలీసులు గుర్తించిన సంగతి తెలిసిందే. ఆ ప్రాంతానికి సమీపంలోనే భారీగా ఆయుధాల డంప్‌ను భద్రతబలగాలు స్వాధీనం చేసుకోగా వీటిలో పదుల సంఖ్యలో బీజీఎల్‌లు లభించడం గమనార్హం. వాటి నిర్మాణశైలిని బట్టి మావోయిస్టులు సొంతంగానే తయారు చేస్తున్నట్లు గుర్తించారు. దండకారణ్యంలోని అబూజ్మడ్ అడవుల్లో వీటిని తయారు చేస్తున్నట్లు భావిస్తున్నారు.
విజయవాడ ఎంపీగా రెండుసార్లు గెలిచిన సిట్టింగ్ ఎంపీ కేశినేని నాని టీడీపీ నుంచి వైసీపీలో చేరిన సంగతి తెలిసిందే. దీంతో కేశినేనికి అదేస్థానం నుంచి వైసీపీ తరుపున పోటీకి రెడీ అని ప్రకటనలు వచ్చాయి! అయితే తాజాగా చేయిస్తున్న సర్వేల్లో కొత్త పేర్లు తెర మీదకు వస్తున్నాయని తెలుస్తుంది. ఇందులో భాగంగా ఈసారి విజయవాడ లోక్ సభ స్థానం నుంచి ఎస్సీ సామాజికవర్గానికి చెందిన నేతను బరిలోకి దింపాలనే ఆలోచన చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. దీంతో బెజవాడ రాజకీయాల్లో సరికొత్త సమీకరణలు తెరపైకి వస్తున్నాయి.
యువతను దగా చేసిన సైకో మామ జగన్మోహన్ రెడ్డి అని టీడీపీ మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ విమర్శించారు. 50 వేల 250 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీ ఉంటే 6,100 పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్ ఇచ్చారు. మెగా డీఎస్సీ కాదు దగా డీఎస్పీ అని ఆగ్రహం వ్యక్తం చేసారు. ఏపీని గంజాయి రాష్ట్రంగా మార్చిన ఘనత సీఎంకే చెల్లుతుందని, పోలీసులే గంజాయిని విక్రయిస్తుండడం బాధాకరం అని అన్నారు. ఏపీకి పెట్టుబడులు తీసుకురాలేదు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కరువయ్యాయని, రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్ గా మార్చారని అన్నారు. రాష్ట్ర ప్రజలు టీడీపీ-జనసేన పరిపాలన కోరుకుంటున్నారని, దొంగ ఓట్లతోనే వైసీపీ నేతలు ప్రతి ఎన్నికల్లోను గెలుస్తున్నారని మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ దుయ్యబట్టారు.
ప్రజా ప్రభుత్వం అని గొప్పలు చెప్పుకుంటున్న కాంగ్రెస్ నేతలు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలని ఎమ్మెల్సీ కవిత హితవు పలికారు. జ్యోతిరావ్ ఫూలే భవన్లో స్వీకరిస్తున్న అర్జీల ప్రోగ్రామ్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒకే ఒక్క రోజు పాల్గొన్నారని విమర్శించారు. ఇంద్రవెల్లిలో జరిగిన కాంగ్రెస్ పార్టీ కార్యక్రమానికి ప్రభుత్వ నిధులు ఎలా ఉపయోగిస్తారని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలు రేవంత్ రెడ్డిని యూటర్న్ ముఖ్యమంత్రి అని పిలుచుకుంటున్నారని తెలిపారు. చెప్పిన ఏ ఒక్క మాట కూడా పాటించకపోవడం వల్లే ఇలా పిలుచుకుంటున్నారని దెప్పి పొడిచారు. కచ్చితంగా వందరోజులు ఓపిక పడుతామని, వందరోజులు పూర్తయ్యాక ఎట్టి పరిస్థితుల్లో వదిలపెట్టబోమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల్లోని అన్నీ లోపాలను, లొసుగులను తప్పకుండా ప్రజలకు వివరిస్తామని చెప్పారు. కేసీఆర్‌కు ఉన్న అపారమైన రాజకీయ అనుభవంతో రేవంత్‌కు ఏమాత్రం పోలిక లేదని కవిత తెలిపారు. ప్రజాపాలన పేరుతో ప్రజల వద్దకే పాలన తీసుకురావాలని కెసిఆర్ కోరుకునే వారని… నేడు రేవంత్ రెడ్డి కూడా కెసిఆర్ చూపిన మార్గంలో నడుస్తుండటం సంతోషదాయకమని కవిత అన్నారు.
అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో రోడ్డు రవాణా శాఖ భద్రత మాసోత్సవాలు జరుగుతున్నాయి. జనవరి 14వ తేదీన ప్రారంభమైన రోడ్డు భద్రతా మాసోత్సవాలను.. ఫిబ్రవరి 15వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు తాడిపత్రి రవాణాశాఖ ఇన్స్పెక్టర్ పేర్కొన్నారు. ఈ మేరకు RTO ఆఫీసులో ఆయన రోడ్డు భద్రత మాసోత్సవాలను ప్రారంభించారు. రోడ్డు సేఫ్టీ గురించి ప్రతి ఒక్కరు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు. ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించాలని.. దేశంలో ప్రతి నిమిషానికి ఒక రోడ్డు ప్రమాదం జరుగుతుందన్నారు. ప్రతి మూడు నిమిషాలకు అదే రోడ్డు ప్రమాదంలో ఒకరు మృత్యువాత పడుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో రవాణా శాఖ అధికారి రాజా గోపాల్, ఆర్టీసీ డిపో మేనేజర్, తాడిపత్రి డీఎస్పీ గంగయ్య, ట్రైని డీఎస్పీ హేమంత్, తదితరులు పాల్గొన్నారు.
బీజేపీ అగ్రనేత లాల్ కృష్ణ అద్వానీకి భారత రత్న అవార్డు దక్కింది. 1990వ దశకం ప్రారంభంలో అయోధ్యలోని రామ మందిరం కోసం రథ యాత్రతో..బీజేపీ నాయకుడు లాల్ కృష్ణ అద్వానీ పార్టీని జాతీయ స్థాయికి చేర్చారు. ఆయనకు భారత దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న రావడం పట్ల.. ప్రముఖ నాయకులంతా హర్షం వ్యక్తం చేశారు. అదే విధంగా అయోధ్య రామ మందిర నిర్మాణానికి ఆయన కృషి ఎనలేనిదని ప్రధానమంత్రి మోదీ అన్నారు. దేశ అభివృద్ధిలో అద్వానీది కీలక పాత్ర అని కొనియాడారు. ఆయనను కలిసి ప్రధాని మోదీ తన అభినందనలు తెలియజేశారు.
తాజాగా బీఆర్ఎస్ కు భారీ ఎదురు దెబ్బ తగిలింది. మాజీ డిప్యూటీ సీఎం, మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య బీఆర్ఎస్ పార్టీ కు రాజీనామా చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల వరకు ఆయన స్టేషన్ ఘన్ పూర్ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. మరో సారి కూడా ఆయన అక్కడి నుంచి టికెట్ ఆశించారు. కానీ బీఆర్ఎస్ రాజయ్యకు టికెట్ ఇవ్వలేదు. మాజీ డిప్యూటీ సీఎం, ఎమ్మెల్సీ కడియం శ్రీహరికి ఆ స్థానాన్ని కట్టబెట్టింది. ఈ నిర్ణయంపై రాజయ్య మొదట్లో కొంత అసంతృప్తి వ్యక్తం చేసినా.. తరువాత పార్టీ అభ్యర్థి గెలుపు కోసం పని చేశారు. కడియం శ్రీహరిని గెలిపించేందుకు నియోజకవర్గం అంతా ప్రచారం చేశారు. బీఆర్ఎస్ మొదటి హయంలో డిప్యూటీ సీఎంగా తాటికొండ రాజయ్య సేవలు అందించారు. అయితే కొంత కాలం తరువాత ఆయన పదవిని కోల్పోయారు. ఇది అప్పట్లో రాజకీయంగా చర్చనీయాశం అయ్యింది. కానీ ఎమ్మెల్యేగా తన నియోజకవర్గం ప్రజలకు అందుబాటులో ఉండి, సేవలు అందించారు. బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రాకపోవడం, ఎమ్మెల్యే టికెట్ త్యాగం చేసినప్పటికీ ఇప్పట్లో మరే పదవీ దక్కే అవకాశం లేకపోవడంతో ఆయన పార్టీని వీడేందుకు మొగ్గు చూపారు. వాస్తవానికి టికెట్ నిరాకరించినప్పటి నుంచే ఆయన బీఆర్ఎస్ అధిష్టానంపై అసంతృప్తితో ఉన్నారు. ఇలాంటి సమయంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇంచార్జ్ దీప్ దాస్ మున్సి మరియు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కలసి చర్చలు జరిపారని తెలుస్తోంది. దీంతో రాజయ్య బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పారు. ఆ పార్టీకి రాజీనామా చేశారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి.




Total views : 141778