ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీలో రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ఇటీవల వైసీపీకి రాజీనామా చేసిన బాలశౌరీ జనసేనలో చేరనున్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ని హైదరాబాద్ లో మర్యాద పూర్వకంగా కలిశారు. జనసేన పార్టీలో 4 వ తారీకు చేరికకు రంగం సిద్ధం చేసుకున్నారు. అయితే బాలశౌరి గుంటూరు పార్లమెంట్ టికెట్ ఆశిస్తున్నారు. మంగళగిరిలో ఉన్న జనసేన పార్టీ కార్యాలయం కు అనుచరులతో కలిసి భారీ ర్యాలీతో వెళ్లి పవన్ కల్యాణ్ సమక్షంలో పార్టీలో చేరనున్నారు.
pawan kalyan
టీడీపీ- జనసేన పొత్తుపై పవన్ కళ్యాణ్ అసహనం వ్యక్తం చేశారు. మండపేటలో చంద్రబాబు టీడీపీ అభ్యర్థిని ప్రకటించడాన్ని తప్పుపట్టారు. పొత్తు ధర్మం ప్రకారం ఏకపక్షంగా అభ్యర్థులను ప్రకటించకూడదన్నారు. టీడీపీకి బలం ఇచ్చేవాళ్లం అవుతున్నాం కానీ తీసుకునే వాళ్లం కాలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇద్దరు వ్యక్తులను కలపడం కష్టం కానీ విడదీయం తేలికని నర్మగర్భంగా వ్యాఖ్యానించారు. ఒంటరిగా పోటీ చేస్తే కొన్ని స్థానాలు వస్తాయి. కానీ అధికారంలోకి వస్తామో లేదో తెలియదన్నారు. అందుకే తెలుగుదేశం పార్టీకి పోటీగా జనసేన కూడా అభ్యర్థులను ప్రకటిస్తోందని స్పష్టం చేశారు. టీడీపీ రెండు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది కాబట్టి తాము కూడా రాజోలు, రాజానగరంలో పోటీ చేస్తున్నట్లు జనసేనాని పవన్ కల్యాణ్ తెలిపారు. చంద్రబాబు లాగే నాకు ఒత్తిడి ఉందని, అందుకే రెండు నియోజకవర్గాల్లో జనసేన పోటీ చేస్తుందని ప్రకటించారు. టీడీపీలో పొత్తులో భాగంగా మూడో వంతు సీట్లు తీసుకుంటున్నామని పార్టీ నేతలకు క్లారిటీ ఇచ్చారు. లోకేష్ సీఎం పదవిపై మాట్లాడినా తాను పట్టించుకోలేదని, రాష్ట్ర ప్రయోజనాల కోసం మౌనంగా ఉన్నానని జనసేనాని తెలిపారు.
పశ్చిమ గోదావరిజిల్లా నరసాపురం జనసేన కార్యాలయంలో నియోజకవర్గ సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. రాష్ట్రంలో వైసీపీ పాలనను అంతమొందించేందుకు టీడీపీ-జనసేన పార్టీలు సమన్వయంతో ముందుకు సాగుతున్నాయి. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా పార్టీ అధినేతలు చంద్రబాబు, పవన్ కల్యాణ్ సమిష్టిగా కృషి చేస్తున్నారు. వైసీపీ అరాచక పాలనతో రాష్ట్రం చిన్నాభిన్నంగా మారిందని ఆ పార్టీల ఇన్చార్జిలు పొత్తూరి రామరాజు, బొమ్మిడి నాయకర్, కొవ్వలి యతిరాజా రామ్మోహన్నాయుడు అన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన ఐక్యమత్యంగా పనిచేస్తాయన్నారు. నరసాపురం నియోజకవర్గంలో ఇంకా ఎవరికి టిక్కెటు కేటాయించలేదన్నారు. అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి పనిచేస్తామన్నారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం ఒక్కటైన టీడీపీ-జనసేన అధినేతలు టిక్కెటు ఎవరికి కేటాయించినా ఐక్యమత్యంగా పనిచేసి విజయం సాధిస్తామన్నారు. 50 వేల మెజారిటీతో విజయం సాధించేందుకు కృషి చేస్తామన్నారు. నియోజకవర్గంలో ఇరుపార్టీల నుంచి సమన్వయ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో ఆరుగురికి స్థానం కల్పించారు. కమిటీ, ఇరుపార్టీల కార్యకర్తలకు నియోజకవర్గంలో పార్టీ పటిష్టతకు చేపట్టాల్సిన చర్యలపై పలు సూచనలు చేశారు.
Read Also..
ఇవాళ ఉదయం 11 గంటలకు హైదరాబాద్ లో పవన్ తో మర్యాదపూర్వకంగా కలవనున్న బాలశౌరి. సాయంత్రం 5.30 నుంచి 6 గంటల ప్రాంతంలో సంబరాలు చేయనున్న పార్టీ శ్రేణులు. జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని మచిలీపట్నం ఎంపీ బాలశౌరి గారు ఇవాళ ఉదయం 11 గంటలకు కలవనున్నారు. ఈ సందర్బంగా ఈరోజు సాయంత్రం 5 నుంచి 6 గంటల ప్రాంతంలో కృష్ణా, గుంటూరు జిల్లాలోని అన్ని మండలాల్లో బాణసంచా కాల్చి సంబరాలు చేయనున్న జనసేన నాయకులు, కార్యకర్తలు, బాలశౌరి గారి అభిమానులు, అనుచరులు. గుంటూరు పట్టణంలోని లాడ్జి సెంటర్లో ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద సాయంత్రం 6 గంటలకు దాదాపు 20 డివిజన్లకు చెందిన నాయకులు కలిసి పెద్దఎత్తున ఎంపీ బాలశౌరి గారికి మద్దతుగా బాణసంచా కాల్చనున్నారు.
రాజమండ్రి విమానాశ్రయం వద్ద ఎంపీ రఘురామ కృష్ణంరాజుకు ఘన స్వాగతం పలికిన నాయకులు కార్యకర్తలు. గత మూడున్నర ఏళ్ల తర్వాత సౌంత ప్రాంతానికి రావడం చాలా సంతోషంగా ఉందని మాటల్లో చెప్పలేనంత అనుభూతి అని, నేను జైలులో ఉన్నప్పుడు చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ అందించిన సహకారం జీవితంలో మరువలేను అని అన్నారు. అభిమానులు, తెదేపా, జనసేన నాయకులు చూపిన ప్రేమ, ఆదరణ నా జీవితంలో మరువలేను సొంత వారు ఎవరో, పరాయి వారు ఎవరో అర్థమవుతోంది మా నానమ్మ చనిపోయినప్పుడు కూడా నేను మా ఊరు రాలేదు అని నేను రాకుండా చాలా ప్రయత్నించారు కోర్టు రక్షణతో వచ్చానని పోలీసులు కూడా చాలా సహకరించారు అర్హత ఉన్నా లేకపోయినా జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు.
కాకినాడ, ముద్రగడ ను కలిసిన జనసేన నేత బొలిశెట్టి శ్రీనివాస్. పవన్ కళ్యాణ్ నాలుగు రోజుల క్రితం రాసిన లేఖ అంశాన్ని ముద్రగడ దగ్గర ప్రస్తావించిన బొలిశెట్టి. పవన్ రాసిన లేఖను స్వాగతిస్తున్నానని, కాపు జాతి కలిసి పని చేయాల్సిన అవసరం ఉందని చెప్పిన ముద్రగడ. పవన్ కళ్యాణ్ మా ఇంటికి వస్తే ఆహ్వానిస్తానని బొలిశెట్టి కి చెప్పిన ముద్రగడ. త్వరలో జనసేనలోకి ముద్రగడ చేరే అవకాశము.
విజయవాడ, ఏపీలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల నిర్వహణ పై రెండో రోజు కేంద్ర ఎన్నికల సంఘం సమీక్ష. నిన్న గుర్తింపు పొందిన పార్టీల నుండి వినతుల స్వీకరణ చేపట్టిన సీఈసీ రాజీవ్ కుమార్. విడతలవారీగా కలెక్టర్లు, ఎస్పీలు , ఉన్నతాధికారులతో సమావేశం ఏర్పాటు చేసిన కేంద్ర ఎన్నికల సంఘం. ఎన్నికల సన్నద్దత పై అధికారులకు దిశానిర్దేశం చేసిన సీఈసీ. నేడు పార్టీలు ఇచ్చిన వినతులు, ఫిర్యాదుల పై, ఎన్నికలకు అధికార యంత్రాంగం ఉన్నతస్దాయి చర్చ జరుపనున్న కేంద్ర ఎన్నికల సంఘం బృందం.
జనసేనాని పవన్ కల్యాణ్ కు తమిళనాడుకు చెందిన వేల్స్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ ప్రకటించింది. గతంలో పవన్ చేసిన సామాజిక సేవలకు గాను ఈ డాక్టరేట్ ఇస్తున్నట్టు చెన్నైలోని వేల్స్ యూనివర్సిటీ తెలిపింది. ఈ నెలలో జరిగే తమ 14వ స్నాతకోత్సవానికి హాజరై, డాక్టరేట్ అందుకోవాలని వర్సిటీ వర్గాలు పవన్ కల్యాణ్ ను ఆహ్వానించాయి. అయితే, వేల్స్ యూనివర్సిటీ ఆహ్వానాన్ని పవన్ కల్యాణ్ సున్నితంగా తిరస్కరించారు. తనకు గౌరవ డాక్టరేట్ ప్రకటించడం సంతోషం కలిగించే అంశమే అయినా, తనకంటే గొప్పవారు చాలామంది ఉన్నారని, అలాంటివాళ్లను గుర్తించి వారికి డాక్టరేట్ ఇవ్వడం సబబుగా ఉంటుందని పవన్ పేర్కొన్నారు. ఈ మేరకు పవన్ కల్యాణ్ వేల్స్ యూనివర్సిటీ యాజమాన్యానికి లేఖ రాశారు. అంతేకాదు, ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్నందున రాజకీయ కార్యక్రమాలతో తాను బిజీగా ఉన్నానని, యూనివర్సిటీ స్నాతకోత్సవానికి తాను హాజరుకాలేకపోతున్నానని లేఖలో తెలిపారు.
Read Also..
Read Also..
మచిలీపట్నం పార్లమెంట్ కార్యాలయంలో జెండా ఊపి జయహో బీసీ రథాలను మాజీమంత్రి కొల్లు రవీంద్ర, మాజీ పార్లమెంటు సభ్యులు కొనకళ్ళ నారాయణరావు, జనసేన ఇంచార్జ్ బండి రామకృష్ణ, తెదేపా బిసి నాయకులు ముందుకు పంపించారు. అనంతరం మాజీ మాత్రి కొల్లు రవీంద్ర మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రజలను మరోసారి చైతన్య వంతులుగా చేసేందుకే జయహో బీసీ కార్యక్రమమని ఆయన అన్నారు. జయహో బీసీ కార్యక్రమం ద్వారా రాబోయే తెలుగుదేశం ప్రభుత్వంలో బీసీలకు చేయబోయే కార్యక్రమాలను వివరించడంతో ప్రజలు వారికి అడుగడుగునా నీరాజనాలు పలుకుతున్నారని అన్నారు. జగన్ ని తరిమికొట్టడం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వల్లే సాధ్యమని, జగన్ ఓటమికి సిద్ధమయ్యాడని అన్నారు. జగన్ చెస్ గేమ్ ఆడుతున్న అనుకుంటున్నాడు కానీ తను ఆడుతుంది వైకుంఠపాళీ అని అతనికి తెలియడం లేదని ఆయన ఎద్దేవా చేశారు. ఐదేళ్ల ప్రభుత్వంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను పావులుగా వాడుకున్నాడని, బీసీలు పక్కన పెట్టాడని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్యోగస్తులను మారుస్తున్నట్టు MLA లను పక్క నియోజకవర్గాలకు జగన్ బదిలీ చేస్తున్నాడని అన్నారు. MLA క్యాండెట్స్ మార్చడం కాదు ముందు జగన్ ని మార్చాలని, సూపర్ సిక్స్ ద్వారా ప్రజల్లోకి వెళుతున్నామని ఆయన అన్నారు. పంచాయతీ రాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేశారని, టీడీపీ వచ్చాక మళ్ళి పంచాయతీ రాజ్ వ్యవస్థను బలోపేతం చేస్తామని అన్నారు. బీసీలకు జగన్ అన్ని రకాలుగా అన్యాయం చేశాడని, లక్షాధికారులను చేస్తానని చెప్పి 56 కార్పొరేషన్లు పెట్టి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని అన్నారు. బీసీలను దగా చేస్తున్నాడని, 300 మంది బీసీలను పొట్టన పెట్టుకున్నాడని ఆయన జగన్ పై మండిపడ్డారు. ఈ నెల 7 వ తేదీన నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో తిరువూరులో రా కదలిరా అనే నినాదంతో భారీ బహిరంగ సభ జరగనున్నది. 18వ తేదీన మచిలీపట్నం పార్లమెంట్, గుడివాడ నియోజకవర్గం లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో బిసి ప్రధాన కార్యదర్శి వీరంకి గురుమూర్తి, చిత్తజిల్లు నాగ రాము, అక్కు మహాంతి రాజా, గోపు సత్యనారాయణ, లంకె నారాయణ ప్రసాద్ , పళ్లపాటి సుబ్రమణ్యం , వూకంటి రాంబాబు, లంకే శేషగిరి, తిరుమణి నారాయణ, కాగిత గోపాలరావు, తదితర బీసీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.




Total views : 141738