చదువుతున్న యువ వైద్యురాలు డాక్టర్ ప్రియాంకపై ఇద్దరు యువకులు కారుతో ఢీకొట్టడమే కాకుండా, ఆమె తలపై నుంచి కారు వెళ్లడంతో తీవ్ర గాయాలపాలైంది. ఈ నెల 3న ప్రసాదిత్యా మాల్లో సినిమా చూసి స్కూటీపై బయలుదేరిన ప్రియాంకను ఏవీ అప్పారావు రోడ్డులో వెనుక నుంచి కారు ఢీకొట్టినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం కారు ఆమెపై నుంచి వెళ్లిపోవడంతో తీవ్రంగా గాయపడిన ప్రియాంకను ఆస్పత్రికి తరలించగా, వైద్యులు బ్రెయిన్‌డెడ్‌గా ప్రకటించారు. చివరి ప్రయత్నంగా ఆమెను హైదరాబాద్‌కు తరలించారు. ఈ ఘటనకు పాల్పడిన ఇద్దరు యువకులను ప్రకాష్‌నగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులు నామవరంకు చెందిన ఇంజినీరింగ్ విద్యార్థులుగా గుర్తించారు. ఘటనకు సంబంధించిన అన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
Tag: