సుజనా చౌదరి (Sujana Chowdhary) :
విజయవాడ వెస్ట్ నుంచి పోటీ చేస్తున్న సుజనా చౌదరి (Sujana Chowdhary) గెలుపు దళిత బహుజనుల గెలుపు అవుతుందని అమరావతి దళిత బహుజన సేవ సమితి కన్వీనర్ రామకోటయ్య అన్నారు. అమరావతి రైతు నేతలు యుగంధర్, అమరావతి మహిళా నేత వరలక్ష్మి తో కలిసి మీడియా లో మాట్లాడారు. అమరావతి రైతుల కన్నీళ్ల ప్రవాహం లో జగన్ కొట్టుకుపోకతప్పదని రామకోటయ్య జోస్యం చెప్పారు. దళిత మేధావి డాక్టర్ సుధాకర్ నుండి కిరణ్ వరకూ మరణాలకు జగనే బాధ్యత వహించాలని అన్నారు.
ఇది చదవండి : సత్తెనపల్లిలో మంత్రి అంబటి రాంబాబు రూటే సప’రేటు’…
దళితుడైన సుబ్రహ్మణ్యం ని చంపి డోర్ డెలివరీ చేసిన నరహంతకుడు అనంతబాబుని పక్కనే పెట్టుకుని జగన్ తిరుగుతున్నారని, జగన్ దుర్మార్గుడనడానికి ఇదే నిదర్శనమని అన్నారు. అమరావతి రైతులకు అండగా నిలిచిన సుజనాని గెలిపించుకోవడం తమ బాధ్యతని అమరావతి మహిళా రైతు నేత వరలక్ష్మి చెప్పారు. పశ్చిమ నియోజకవర్గం అభివృద్ధి సుజనాతోనే సాధ్యమని అమరావతి రైతు నేత యుగంధర్ అన్నారు అమరావతి రైతులకు అండగా నిలిచిన సుజనాను గెలిపించుకోవడం తమ బాధ్యత అన్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- కొడాలి నానిపై కేసు విచారణకు ప్రభుత్వ గ్రీన్‌సిగ్నల్.
మాజీ మంత్రి కొడాలి నానిపై నమోదైన కేసు విచారణకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. 2021లో పంచాయతీ ఎన్నికల సమయంలో నమోదైన కేసులో ప్రాసిక్యూషన్‌కు తాజాగా రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. 2021 ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో… - హిమాచల్‌ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు.
హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లాలో భారీ కొండచరియలు విరిగిపడ్డాయి. కొండచరియ విరిగిపడటంతో ధల్లి… సంజౌలి బైపాస్‌ను పూర్తిగా మూసివేశారు. దీంతో ఇరువైపులా వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. కొండచరియ విరిగిపడటంతో భారీగా శిథిలాలు రహదారిపైకి వచ్చిపడ్డాయి. శిథిలాలు అడ్డంకి ఉండటంతో వాహనాల రాకపోకలకు… - అమెరికా: న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.
అమెరికాలోని న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ వద్ద కాల్పులు కలకం సృష్టించాయి. కాల్పులకు తెగబడటమే కాకుండా ఓ వ్యక్తిపై కత్తితో దాడి చేశాడు. నిత్యం రద్దీగా ఉండే మాన్హాటన్ పర్యాటక ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కాల్పుల శబ్దం వినిపించడంతో పర్యాటకులు, స్థానికులు…
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి: సుజనా గెలుపు దళిత బహుజనుల గెలుపు…







Total views : 149862