పెళ్లి చేసుకుంటానంటూ యువతిని నమ్మించాడు. శారీరకంగా లోబర్చుకొని ఎనిమిదేళ్లుగా చిత్రహింసలకు గురిచేస్తున్నాడు. తాజాగా మరో యువతితో సంబంధం పెట్టుకున్న ఆ యువకుడిని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు. పోలీసుల కథనం ప్రకారం కోదాడకు చెందిన గంగినేని గణేశ్ (27) పదేళ్ల కిందట నగరానికి వచ్చి యూసుఫ్‌గూడలో ఉంటున్నాడు. ఎనిమిదేళ్ల కిందట అతడికి ఓ యువతి పరిచయమైంది. ప్రేమిస్తున్నానని ఆమెను నమ్మించి సన్నిహితంగా మెలిగిన గణేశ్. ఆమెను గదికి తీసుకెళ్లి శారీరకంగా లోబర్చుకున్నాడు. ఆమె వద్ద నుంచి డబ్బులు తీసుకొని జల్సాలు చేశాడు. బాధిత యువతిని పెళ్లి చేసుకుంటానని, ఉద్యోగం వచ్చిన తర్వాత తీసుకున్న డబ్బులు తిరిగి ఇస్తానంటూ నమ్మించాడు. అతడి మాటలు నమ్మిన యువతి సర్వస్వం అర్పించింది. ఆమె గర్భం దాల్చగా మూడుసార్లు అబార్షన్ చేయించాడు. ఇదిలా ఉండగా వరంగల్‌కు చెందిన మరో యువతితో సుమారు ఏడేళ్లుగా గణేశ్ శారీరక సంబంధం కలిగి ఉన్నట్లు ఇటీవల బాధితురాలికి తెలిసింది. ఈ విషయం పై నిలదీసేందుకు ఈనెల 8న అతడి గదికి వెళ్లింది. అలాంటిదేమీ లేదని, పెళ్లి చేసుకుందామంటూ గణపతి కాంప్లెక్స్ వద్దకు తీసుకొచ్చి స్నేహితులతో కలిసి దాడికి పాల్పడ్డాడు. ఆమె ఫోన్ పగలగొట్టారు. ఈ ఘటనపై బాధితురాలు రెండురోజుల కిందట జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా. కేసు నమోదు చేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా. నేరం అంగీకరించాడు. అయితే, ఆమెను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని తేల్చి చెప్పాడు. బాధితురాలు బుధవారం మరో ఫిర్యాదును జూబ్లీహిల్స్ పోలీసులకు ఇచ్చింది. దీంతో గణేశ్‌తో పాటు ఇతర నిందితులపై పోలీసులు కేసు నమోదు చేసి, ప్రధాన నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
technology news
అనధికార లావాదేవీల ద్వారా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సనత్ నగర్ శాఖ మేనేజర్ గా పని చేసిన వ్యక్తి రూ.4.75 కోట్ల నిధుల స్వాహా. సనత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సనత్ నగర్ డివిజన్లో ఉన్న SBI బ్యాంకులో ఖాతాదారుల ఫిక్స్డ్ డిపాజిట్ డబ్బును ఖాతాదారులకు తెలియకుండా డ్రా చేసుకున్న బ్యాంక్ మేనేజర్ కార్తీక్ రాయ్. సుమారుగా 4.75 లక్షల రూపాయలు ఖాతాదారుల సొమ్ము కాజేసినట్లు పలువురు బాధితులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు. ఒక సాఫ్ట్వేర్ అమ్మాయి ఖాతాలోనే సుమారుగా 48 లక్షలు కాజేసినట్లు ఆ అమ్మాయి ఆరు నెలలుగా అడుగుతున్న ఇవ్వకపోవడంతో సనత్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసిన మహిళ. ఖాతాదారుల నగదును మాయం చేసిన బ్యాంక్ మేనేజర్ తో పోలీసులు విచారణ చేపట్టారు. లక్షలాది రూపాయలు ఖాతాదారుల డిపాజిట్ నుంచి విత్ డ్రా చేసుకున్న బ్యాంక్ మేనేజర్ పై చర్యలు తీసుకోవాలని పలువురు పోలీసులను ఆశ్రయించారు. బాధితుల ఫిర్యాదు మేరకు సనత్ నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు.
శ్రీ సత్య సాయి జిల్లా, ముగ్గురి పై పిచ్చి కుక్క దాడి. గోరంట్ల మండలం కనగానపల్లి లో ముగ్గురి పై పిచ్చి కుక్క దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డ సంఘటన చోటు చేసుకుంది. మండలంలోని కాగానపల్లి గ్రామంలో బుధవారం సాయంత్రం రెండేళ్ల ధనుష్ అనే బాలుడి పై పిచ్చి కుక్క కరుస్తుండగా అడ్డు వెళ్లినటువంటి అవ్వ బురగ గంగులమ్మ తో పాటు మనుమరాలు గౌతమి ( 11) పై కూడా దాడి చేయడంతో గంగులమ్మ తలకు తీవ్ర గాయాలయ్యాయి, దీంతో వెంటనే చుట్టు ప్రక్కల వారు పిచ్చి కుక్క ను తరిమివేసి, వెంటనే గాయపడిన వారిని గోరంట్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. డాక్టర్ వినోద్ కుమార్ ప్రథమ చికిత్సలు అనంతరం మెరుగైన వైద్యం కోసం హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
కాకినాడ, ముద్రగడ ను కలిసిన జనసేన నేత బొలిశెట్టి శ్రీనివాస్. పవన్ కళ్యాణ్ నాలుగు రోజుల క్రితం రాసిన లేఖ అంశాన్ని ముద్రగడ దగ్గర ప్రస్తావించిన బొలిశెట్టి. పవన్ రాసిన లేఖను స్వాగతిస్తున్నానని, కాపు జాతి కలిసి పని చేయాల్సిన అవసరం ఉందని చెప్పిన ముద్రగడ. పవన్ కళ్యాణ్ మా ఇంటికి వస్తే ఆహ్వానిస్తానని బొలిశెట్టి కి చెప్పిన ముద్రగడ. త్వరలో జనసేనలోకి ముద్రగడ చేరే అవకాశము.
మంచిర్యాల జిల్లా, మందమర్రి పట్టణం లోని ప్రవేట్ హై స్కూల్ లో ముందస్తు సంక్రాంతి సంబరాల సందర్భంగా విద్యార్థులకు మెహందీ (మైదాకు) పోటీలు నిర్వహించరు. 4 నుంచి 9వ తరగతి వరకు 74 మంది విద్యార్థులు ఈ పోటీలో పాల్గొన్నారు. ఈ పోటీలు ప్రైమరీ కోఆర్డినేటర్ శ్రీమతి ఫరీదా ఆధ్వర్యంలో జరిగాయి. ఇలాంటి మెహందీ పోటీలలో పాల్గొన్న విద్యార్ధినులు, తల్లి తండ్రులు ఆనందం వ్యక్తం చేసారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు చంద్రమోహన్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ఈ యాప్‌ను ఫిన్లాండ్కు చెందిన స్టార్టప్ డబుల్‌పాయింట్ డెవలప్ చేసింది. ఈ యాప్‌ను “వావ్ మౌస్ ” అంటున్నారు. పేరు తగినట్లే ఇది మౌస్ లాగా పని చేస్తుంది. ఈ యాప్ ద్వారా స్మార్ట్‌వాచ్‌తో టీవీని ఆన్ చేయవచ్చు. నెట్‌ఫ్లిక్స్ కూడా కంట్రోల్ చేయవచ్చు లేదా సింపుల్ జెస్టర్స్‌తో, కంటి కదలికలతో లైట్లను డిమ్ చేయవచ్చు. ఫోన్లు, ట్యాబ్లెట్లు, కంప్యూటర్లకు కూడా కనెక్ట్ అవుతుంది. లాస్ వెగాస్‌లో జరిగిన అతిపెద్ద టెక్ ఈవెంట్ కన్స్యూమర్ టెక్నాలజీ అసోసియేషన్ లో ఈ యాప్‌ను డబుల్‌పాయింట్ సంస్థ ప్రదర్శించింది. డబుల్‌పాయింట్ టీమ్ CES అన్‌వీల్డ్‌లో రెండు డెమోలను చూపించింది. వాటిలో లైట్ కంట్రోల్ ఒకటి. యాప్ ఇన్స్టాల్ చేసిన వాచ్ ధరించినప్పుడు మణికట్టును లైట్ మీద అటూ ఇటూ తిప్పగానే, ఆ లైట్ కాంతిని కంట్రోల్ చేసింది. లైట్ కంట్రోల్, యూజర్ల కదలికల మధ్య ఫీడ్‌బ్యాక్‌లో దాదాపు ఎటువంటి ల్యాగ్ కనిపించలేదు. లైట్‌కు వాచ్ చూపగానే, అది ఆన్ అయింది, రిస్ట్ ఫ్లిక్‌తో ఆఫ్ అయింది. ఈ యాప్ ఆండ్రాయిడ్ వేర్ఓఎస్ స్మార్ట్‌వాచ్‌లపై పని చేస్తుంది. ఇల్లు లేదా ఆఫీస్‌లోని వివిధ డివైజ్‌లకు స్మార్ట్‌వాచ్‌ను కనెక్ట్ చేయడానికి యాప్ బ్లూటూత్‌పై ఆధారపడుతుంది. కనెక్ట్ చేశాక, కమాండ్స్ ఇవ్వడానికి వేలితో నొక్కాలి లేదా మణికట్టు తిప్పడం వంటి ఫీచర్లు ఉపయోగించవచ్చు. స్క్రీన్‌పై వర్చువల్ కర్సర్‌ను మూవ్ చేయడానికి ఐ ట్రాకింగ్‌ని కూడా ఉపయోగించవచ్చు. ఇన్ని అదిరిపోయే ఫీచర్లు అందిస్తున్న ఈ యాప్‌కు మీడియా నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.
ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికీ ఈమెయిల్స్ అవసరం. స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్, కంప్యూటర్ ఉన్న ప్రతి ఒక్కరికీ మెయిల్లో అకౌంట్ ఉంటుంది. Google Maps యాప్‌తో ఫ్యూయల్ ఎలా ఆదా చేసుకోవచ్చో తెలుసుకోండి. మీ ఆండ్రాయిడ్ ఫోన్లో లేదా ల్యాప్‌టాప్‌లో జీమెయిల్ ఓపెన్ చేయండి. అందులోని Search ఆప్షన్లో is:unread అని టైప్ చేయండి. పైన కనిపించే టిక్ బాక్స్‌ను సెలెక్ట్ చేయడం ద్వారా మీరు అక్కడ కనిపించే 50 మెయిల్స్‌ను మాత్రమే సెలక్ట్ చేయగలరు. దాని పక్కనే ‘select all conversations that match this search’ అనే ఆప్షన్ కూడా కనిపిస్తుంది. దాన్ని సెలెక్ట్ చేయండి. మీ మెయిల్ బాక్స్ లో మీరు చదవని మెయిల్స్ అన్నీ సెలెక్ట్ చేసుకోండి. అయితే అందులో మీకు అవసరమైన మెయిల్స్ ఏమీ లేకుండా చూసుకోండి. పైన కనిపించే డిలీట్ గుర్తుపై క్లిక్ చేయడం ద్వారా వాటన్నింటినీ ఒకేసారి డిలీట్ చేసుకోండి. అయితే అవన్నీ ట్రాష్ లో 30 రోజుల పాటు ఉండి తర్వాత అవన్నీ ఆటోమేటిక్‌గా డిలీట్ అయిపోతాయి. అసలు అవన్నీ అవసరం లేదు అనుకుంటే వెంటనే వాటిని డిలీట్ చేసుకోవచ్చు.
ఐ పోలవరం మండలం మురమళ్ళ స్థానిక శ్రీ సాయి స్కూల్లో సంక్రాంతి సంబరాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. స్కూల్ చైర్మన్ వాసురాజు దంపతులు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కనుమరుగైపోతున్న సంక్రాంతి సాంప్రదాయాలు ఈతరం విద్యార్థిని విద్యార్థులకు కళ్ళకి కట్టినట్టుగా నిర్వహించారు. స్కూల్ ఆవరణలో భోగి మంటలు, హరిదాసు కీర్తనలు, గంగిరెద్దు ఆటల విన్యాసాలు, తెలుగింటి వస్త్రధారణలు, రంగురంగుల రంగవల్లులు, కోడిపందాల కార్యక్రమాలు నిర్వహించారు. భోగిమంటల చుట్టు పాటలు పాడుతూ డాన్సులు వేస్తూ ఆనందోత్సాహాలతో సంబరాలు జరిగాయి.
శ్రీకాకుళం, ఆరోగ్య ప్రదాత, అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలోని ఇంద్ర పుష్కరిణి వద్ద సామూహిక సూర్యనమస్కారముల కార్యక్రమం ఘనంగా జరిగింది. వందలాది మంది జిల్లాలో ఉన్న యోగా విద్యార్ధులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ సూచనల మేరకు జిల్లాలోని అరసవల్లి ఆలయ ప్రాంగణంలో అధికారులు, యోగా మాస్టర్లు ఆధ్వర్యంలో సూర్యనమస్కారములు నిర్వహించారు. 12 సెట్లగా విద్యార్ధినీ విద్యార్ధులు సూర్యనమస్కారములు చేశారు. ఒక్క సూర్యనమస్కారములే కాకుండా వివిధ రకముల యోగాసనాలను చేశారు. ఆర్ట్ ఫుల్ సంస్థ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించినట్లు ఆయుష్ శాఖ అధికారి అన్నారు. మకర సంక్రాంతి పండగను పురష్కరించుకొని సూర్యనమస్కారముల కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు, యోగా విద్యార్ధులు పాల్గొన్నారు. మొత్తం 5 సెషన్స్ గా నిర్వహించడం జరిగిందన్నారు.
అన్నమయ్య జిల్లా, ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాయచోటి నియోజకవర్గంలో విజయవంతంగా ముగిసిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం. నియోజకవర్గంలోని 98 సచివాలయ పరిధిలోని లక్ష గడపలకు వెళ్లిన ఎమ్మెల్యే. 186 రోజుల్లో పూర్తి. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం పూర్తైన సందర్భంగా సంబేపల్లి మండలం, నారాయణరెడ్డిపల్లి సచివాలయం కాంప్లెక్స్ లో శిలాఫలకం ఆవిష్కరణ. కెక్ కట్ చేసి సంబరాలు నిర్వహించిన వైఎస్ఆర్ సిపి ప్రజా ప్రతినిధులు, సచివాలయ సిబ్బంది. పాల్గొన్న రెవిన్యూ, పోలీస్ శాఖ అధికారులు. విజయవంతంగా పూర్తి కావడానికి సహకరించిన నియోజకవర్గంలోని స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులకు కృతజ్ఞతలు తేలిపిన ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ మంచి చేశాం కాబట్టే ప్రజల్లోకి వేళ్ళగలిగాం. ప్రతి ఒక్కరూ అదరించారు. తమతమ స్తోమతకు తగ్గట్లు స్వాగతాలు పలకడం, అల్పాహారాలు అందించారు. ఎమ్మెల్యే గా 15 ఏళ్లు ఉన్నప్పటికీ తమ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయగలిగా. రెండున్నర సంవత్సరం కరోనా లేకుంటే మరింత ఆభివృద్ది జరిగేది. మళ్లీ ప్రజలు అదరిస్తారన్న నమ్మకం ఉంది.





Total views : 141819