రాహుల్ గాంధీపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సెటైర్ వేశారు. హైదరాబాద్ రావడం బిర్యాని, పాన్ తిని ఢిల్లీకి వెళ్లడం తప్ప రాహుల్ చేస్తున్నదేమీ లేదన్నారు. ప్రతిసారి ఇలాగే తెలంగాణ ఆతిథ్యాన్ని స్వీకరించి వెళ్లిపోవాలని ఆమె సూచించారు. గాంధీ కుటుంబానికి అవసరమైనప్పుడల్లా తెలంగాణ అండగా నిలిచిన విషయాన్ని ఆమె బోధన్ ప్రచార ర్యాలీలో గుర్తు చేశారు. కాంగ్రెస్ నేతలు మాత్రం ప్రతిసారీ తెలంగాణను మోసం చేశారని ఆరోపించారు. వందలాది మంది యువత బలి దానాలకు కాంగ్రెస్ పార్టీ కారణమన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నన్నాళ్లూ శాంతి భద్రతల సమస్య ఉండేదన్నారు కర్ఫ్యూలు, మతకల్లోలాలు ఉండేవని కవిత విమర్శించారు.
#telangana
తెలంగాణ ప్రజల ఆకాంక్షలు, అవసరాలకు అనుగుణంగా చేయాల్సిన జిల్లాల పునర్విభజనను. అధికార పార్టీ నేతల స్వలాభం కోసం చేశారని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆరోపించారు. బీఆర్ఎస్ నేతల స్వప్రయోజనాల కోసం చిన్న జిల్లాలు ఏర్పాటు చేశారంటూ సీఎం కేసీఆర్ పై ఆరోపణలు గుప్పించారు. అసలు చిన్న జిల్లాలను ఏర్పాటు చేయాలని మిమ్మల్ని అడిగిందెవరంటూ కేసీఆర్ ను ఆయన నిలదీశారు. ఈమేరకు సీఎం కేసీఆర్ కు కిషన్ రెడ్డి తాజాగా మరో బహిరంగ లేఖ రాశారు. వరుసగా ఇది తన నాలుగవ లేఖ అని, దీనికి కూడా స్పందించరా అంటూ కేసీఆర్ ను ప్రశ్నించారు.
జిల్లాల విభజన జరుగుతుంటే ఒక ప్రజాప్రతినిధి పక్క జిల్లాలోని మండలాన్ని తన జిల్లాలో బలవంతంగా కలిపేసుకున్నాడని కిషన్ రెడ్డి చెప్పారు. దీనికి కారణమేంటని విచారిస్తే భవిష్యత్తులో నియోజకవర్గాల పునర్విభజన జరిగితే ఆ మండలంలో స్థిరపడిన తన బావమరిదిని ఎమ్మెల్యేగా నిలబెట్టేందుకు అడ్డంకులు ఉండకూడదనే ఈ పని చేసినట్లు తేలిందన్నారు. పలువురు ప్రజాప్రతినిధులు బినామీ పేర్లతో భూములు కొని, వాటికి విలువ వచ్చేలా జిల్లాలను ఏర్పాటు చేయించుకున్నారని కిషన్ రెడ్డి విమర్శించారు.
హైదరాబాద్ లోని ఔటర్ రింగ్ రోడ్డుపై ఓ వ్యక్తి సజీవ దహనమయ్యాడు. ఈ ఘటన శనివారం అర్థరాత్రి చోటుచేసుకుంది. ఆదిభట్ల సమీపంలోని ఓఆర్ఆర్ పై కారులో మంటలు ఎగిసిపడ్డాయి. ఈ మంటలకు కారులో ఉన్న వ్యక్తి సజీవదహనమయ్యాడు. కారు కూడా పూర్తిగా దగ్ధమైంది. మృతుడిని కోదాడకు చెందిన వెంకటేశ్ గా పోలీసులు గుర్తించారు. కారును ఎవరైనా తగులబెట్టారా? లేదా ప్రమాదం జరిగిందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
తెలంగాణ లోని స్థానిక ప్రజాప్రతినిధులకు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో స్థానిక ప్రజాప్రతినిధుల దుస్థితి గురించి రేవంత్ రెడ్డి లేఖలో వివరించారు. జడ్పీటీసీగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన తనకు స్థానిక ప్రజాప్రతినిధుల ఇబ్బందులు తెలుసన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో మీ అవస్థలు మీకు జరిగిన అవమానాలుగుర్తించానన్నారు. నిర్ణయాధికారం లేక, నిధులు రాక మీరు పడిన బాధలు గుర్తున్నాయన్నారు. ఈ ఎన్నికలతో కేసీఆర్ పాలనకు చరమగీతం పాడుదామని పిలుపునిచ్చారు. జెండాలకు, అజెండాలకు అతీతంగా మీ పల్లె రుణం తీర్చుకునే అవకాశం కాంగ్రెస్ ఇస్తుందని ఆయన అన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వాలని ఆయన కోరారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగింపు దశకు చేరుకోవడంతో జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ పార్టీల అగ్రనేతలు రాష్ట్రంలో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ తో పాటు యూపీ సీఎం యోగి ఆదిత్య నాథ్ కూడా పాల్గొన్నారు. గోషామహల్ బీజేపీ అభ్యర్థి రాజాసింగ్‌కు మద్దతుగా ఆయన ప్రచారం నిర్వహించారు. బేగంబజార్ చౌరస్తాలో ఆయన మాట్లాడుతూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే హైదరాబాద్ నగరం పేరుని ‘భాగ్యనగరం’గా మార్చుతామని హామీ ఇచ్చారు. గోషామహల్లో హిందూ ధర్మం కోసం పోరాడే వ్యక్తి రాజాసింగ్‌ను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. రాజాసింగ్‌ను గెలిపించి అయోధ్య భవ్య రామ మందిరాన్ని దర్శించుకోవాలని అన్నారు. రాష్ట్ర ప్రజానీకం కమలం గుర్తుకి ఓటు వేసి బీజేపీ అభ్యర్థులను మంచి మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు. తెలంగాణలో కూడా డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంటేనే రాష్ట్రం అన్ని విధాలా ముందుకెళ్తుందని అన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం సర్వనాశనం అయ్యిందని మండిపడ్డారు. ఈ మేరకు బేగంబజార్ చౌరస్తాలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పాలనలో అవినీతి, కుంభకోణాలు వెలుగు చూశాయని, కేంద్రంలో నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చాక అవినీతిని రూపుమాపారని అన్నారు. కాగా హైదరాబాద్‌లో బీజేపీ నిర్వహించిన పలు ప్రచార కార్యక్రమాల్లో యోగి ఆదిత్య నాథ్ పాల్గొన్నారు. మంగళ్ హట్లో ఆకాశపురి హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పురానాపూల్ గాంధీ విగ్రహం వరకు రోడ్ షో నిర్వహించారు. జుమ్మెరాత్ బజార్ చౌరస్తా వద్ద రోడ్డుకు ఇరువైపులా 6 బుల్డోజర్లను ఏర్పాటు చేసి సీఎం యోగి, బీజేపీ గోషామహల్ అభ్యర్థి రాజాసింగ్‌లపై పూల వర్షం కురిపించారు.
Read Also..
Read Also..
బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల అజెండా ఒక్కటేనని, స్వలాభం కోసమే వాళ్లు పని చేస్తారని యూపీ సీఎం యోగి అదిత్యనాథ్ విమర్శించారు. వేములవాడలో నిర్వహించిన బీజేపీ సకల జనుల విజయసంకల్ప సభలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఆయన విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ అధికారంలో ఉంటే కరోనా వ్యాక్సిన్ ఇచ్చేదా? పేదలకు ఉచితంగా కాంగ్రెస్ బియ్యం ఇచ్చేదా?అని ప్రశ్నించారు.ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ అంటే కేసీఆర్ కు భయమని ఎద్దేవా చేశారు. యూపీలో డబుల్ ఇంజన్ సర్కార్ అంటే డబుల్ ఇంజన్ స్పీడుతో ఉపాధి, శాంతిభద్రతలు కల్పించడం అని యోగి అన్నారు. తెలంగాణ పరిస్థితి మారాలంటే ఇక్కడ కూడా డబుల్ ఇంజిన్ ప్రభుత్వం రావాలని అన్నారు.
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు పోలీసులకు కత్తిమీద సాములా మారాయి. ఓవైపు శాంతి భద్రతల అమలు, మరోవైపు రాజకీయ పార్టీల ప్రలోభాలను ఏకకాలంలో అదుపు చేయాల్సి రావడంతో ఉరుకులు పరుగులు తీస్తున్నారు. ఇందులోనే ప్రధాని, ముఖ్యమంత్రి వంటి వీవీఐపీల రక్షణ వారికి అదనపు భారంగా మారింది. ఈ తరుణంలో స్వేచ్ఛగా ఓటేసేలా పరిస్థితులు కల్పించడం. ఓటర్లను చైతన్యం చేయడం వారికి సవాలుగా మారింది. వాటిని ఎలా ఎదుర్కొంటున్నారు? ప్రధాని సభకు ఎలాంటి ఏర్పాట్లు చేయబోతున్నారు. అన్నదానిపై కరీంనగర్ పోలీసు కమిషనర్ అభిషేక్ మహంతి.
హైదరాబాద్ పాతబస్తీలో ఐటీ సోదాలు జరిగాయి. బడా వ్యాపారులే టార్గెట్ గా ఐటీ దాడులు నిర్వహించారు. సోదాలలో భాగంగా కింగ్స్ ప్యాలెస్ యజమాని ఇంట్లో సోదాలు నిర్వహించారు. కోహినూర్ గ్రూప్స్ ఎండీ మజీద్‌ఖాన్ ఇళ్లు, కార్యలయాల్లో విస్తృతంగా తనిఖీలు జరిపారు. కోహినూర్, కింగ్స్ గ్రూపుల పేరుతో ఫంక్షన్ హాల్స్, హోటల్స్ నిర్వహిస్తున్నారు. షాన్వాజ్ ఇళ్లు, ఆఫీసులపై ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. ఏకకాలంలో ఫలక్ నామా, శాస్ర్తీపురంలో సోదాలు జరిగాయి. ఓ రాజకీయ పార్టీకి పెద్ద మొత్తంలో డబ్బులు సమకూర్చుతున్నట్లు అనుమానం రావడంతో దాడులు జరిపారు.
Read Also..
Read Also..
ఎన్నికల ప్రచారం ముమ్మరంగా జరుగుతున్న నేపథ్యంలో లంగాణలో ఐటీ సోదాలు కూడా ఊపందుకున్నాయి. ఓ వైపు పాతబస్తీలో బడా వ్యాపారులే లక్ష్యంగా ఐటీ దాడులు నిర్వహించారు. మరోవైపు అధికారపార్టీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు జరిగాయి. వికారాబాద్ జిల్లా తాండూరులోని రోహిత్ రెడ్డి నివాసంలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. రోహిత్ ఇంట్లో రూ.20 లక్షల నగదు, పలు రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనుచరుడిని ఐటీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పలువురు నేతలు, వారి అనుచరుల ఇళ్ళల్లో సోదాలు జరుగుతున్నాయి. తాజాగా మంత్రి మల్లారెడ్డి అనుచరుడు, బీఆర్ఎస్ బోడుప్పల్ పార్టీ అధ్యక్షుడు మంద సంజీవరెడ్డి ఇంట్లో సోదాలు జరిగాయి. ఎన్నికల అధికారులు, ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. సంజీవరెడ్డి నివాసానికి మల్లారెడ్డికి చెందిన డబ్బు భారీ మొత్తంలో చేరిందన్న ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో సోదాలు జరిగాయి. సంజీవరెడ్డి ఇంటి నుంచి బయటకు వెళ్లకుండా అడ్డుకుని సోదాలు చేశారు. అయితే, సోదాల్లో ఎలాంటి డబ్బు దొరకకపోవడం గమనార్హం. సోదాల సందర్భంగా సంజీవరెడ్డి ఇంటి ముందు బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు పరస్పరం నినాదాలు చేసుకున్నారు.
Read Also..
Read Also..





Total views : 141537