తెలంగాణ అసెంబ్లీ ఎనికల నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా రైతుబంధు పంపిణికి ప్రభుత్వం ఈసీకి విజ్ఞప్తి చేసింది. అందుకు ఈసీ సానుకూలంగా స్పందించి తెలంగాణ రైతులకు శుభవార్త అందించింది ఎన్నికల కమిషన్. రాష్ట్రంలో రైతుబంధు సాయానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వం ఈసీని కోరింది. దీనిని పరిశీలించిన కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు ఇది పాత పథకం కావడంతో రైతుబంధు సాయం పంపిణీకి అనుమతి ఇచ్చారు. దీంతో త్వరలో రైతుల ఖాతాల్లో రైతుబంధు మొత్తం జమ కానుంది. ఈ నెల 28వ తేదీ లోపు మాత్రమే రైతుల ఖాతాల్లో ఈ మొత్తాన్ని జమ చేయాలని ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది.
#telangana
కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ శనివారం తెలంగాణకు రానున్నారు. నాందేడ్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో ఆయన ఉదయం11.30 గంటలకు బోధన్‌లోని సభకు హాజరవుతారు. ఆ తర్వాత నిజామాబాద్, 1.30కు ఆదిలాబాద్ పబ్లిక్ మీటింగ్, సాయంత్రం 3.30 గంటలకు వేములవాడ, రాజన్న సిరిసిల్లా నియోజకవర్గాల్లోని ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. అనంతరం హెలికాప్టర్లో బేగంపేటకు చేరుకుంటారు. రాష్ట్రంలోని కీలక నేతలతో ఎన్నికల పరిస్థితులపై చర్చిస్తారు.
తెలంగాణ ఎన్నికల ప్రచారం ముగింపునకు ఇంకా 4 రోజుల సమయం మాత్రమే మిగిలివుండడంతో అన్ని పార్టీలు ప్రచార కార్యక్రమాల్లో మరింత జోరు పెంచాయి. ఈ క్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటనకు వస్తున్నారు. ఇవాళ సాయంత్రం ఆయన హైదరాబాద్ చేరుకుంటారు. నగరంలో ఆయన ప్రయాణించే ప్రాంతాల్లో ఇబ్బందులు ఎదురవ్వకుండా హైదరాబాద్ నగరంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ప్రధాని మోదీ శనివారం సాయత్రం 5:20 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకోనున్నారు. వై జంక్షన్, పీఎన్టీ ఫ్లైఓవర్, బేగంపేట ఫ్లైఓవర్ మీదుగా ప్రధాని రాజ్‌భవన్ చేరుకోనున్నారు. దీంతో ఆ సమయంలో ఆ ప్రాంతంలో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి. ఇక 26న ఆదివారం ఉదయం 10:35 – 11:05 మధ్య ప్రధాని రాజ్‌భవన్ నుంచి ఎంఎంటీఎస్, యశోద ఆసుపత్రి, బేగంపేట ఫ్లైఓవర్ మీదుగా బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. ఆ సమయాల్లో కూడా ఆంక్షలు అమల్లో ఉంటాయి. ట్రాఫిక్ దారి మళ్లింపులు, నిలిపివేత ఉంటాయని హైదరాబాద్ పోలీసులు సూచించారు. ప్రధాని షెడ్యూల్‌కు అనుగుణంగా శనివారం సాయంత్రం, ఆదివారం ఉదయం నగరంలోని కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని ట్రాఫిక్ అదనపు పోలీస్ కమిషనర్ జీ.సుధీర్ బాబు వెల్లడించారు. ఈ మేరకు వివరాలు వెల్లడించారు.
జూబ్లీహిల్స్ నియోజకవర్గం మధురానగర్ లోని శ్రీనివాస కాలనీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సమావేశంలో కాంగ్రెస్ అభ్యర్థి మహమ్మద్ అజారుద్దీన్ కి మద్దతుగా కాంగ్రెస్ నాయకులు తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. రానున్న ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి బరిలో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి మహమ్మద్ అజారుద్దీన్ని గెలిపించాలని కాలనీ వాసులకు పిలుపునిచ్చారు. తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలు అన్ని రంగాలలో వెనకబడి ఉన్నారని, బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసింది అని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రత్యేక తెలంగాణ ఇస్తే కెసిఆర్ కుటుంబం అక్రమపాలన కొనసాగిస్తుందని విమర్శించారు. చంద్రబాబు హాయంలో ఐటీ కంపెనీలు అభివృద్ధి చెందాయి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి మంచి పరిపాలన అందిచారాన్నారు. ప్రస్తుతం ఉన్న జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే కు రాజకీయ బిక్ష పెట్టిన ఎన్టీఆర్ నే విస్మరిస్తున్నార్నారు. తెలంగాణలో ప్రాజెక్టుల పేరుతో అవినీతికి పోయి, తెలంగాణ రాష్ట్రం అభిరుద్ధి చెందాలంటే కేసీఆర్ ప్రభుత్వాన్ని ఎన్నికల్లో ఓడించి, కాంగ్రెస్ అభ్యర్థి అజారుద్దీన్ కి ఓటు వేసి అత్యధిక మెజారిటితో గెలిపించాలని పిలుపునిచ్చారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కల్వకుంట్ల తారకరామారావు సోషల్ మీడియా ద్వారా పార్టీ శ్రేణుల్ని, సోషల్ మీడియా సైన్యాన్ని అప్రమత్తం చేశారు.
స్కాంగ్రేస్ స్కామర్ల నుంచి రాబోయే కొద్ది రోజులలో అనేక తప్పుడు, డీప్ ఫేక్ వీడియోలు, ఇతర రకాల అసంబద్ధమైన ప్రచారాలు రావొచ్చని కేటీఆర్ హెచ్చరించారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అసత్య ప్రచారాల వలలో ఓటర్లు పడకుండా చూడాలని కేటీఆర్ కోరారు. డీప్ ఫేక్ కంటెంట్ గురించి దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. డీప్ ఫేక్ వ్యాప్తి కట్టడికి కేంద్రం కఠిన చర్యలకు ఉపక్రమించింది. ఈ తరుణంలో తెలంగాణ ఎన్నికల్లోనూ ఆ తరహా కంటెంట్ వైరల్ కావొచ్చంటూ కేటీఆర్ చేసిన కామెంట్లు ఇప్పుడు ఆసక్తిని రేకేత్తిస్తోన్నాయి.
Read Also..
Read Also..
స్నేహం వేరు, రాజకీయం వేరన్నారు పవన్ కళ్యాణ్. మంత్రి కేటీఆర్ తో స్నేహం ఉన్నా, కేసీఆర్ తో పరిచయం ఉన్నా రాజకీయంగా విభేదిస్తానని చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీనే అభిమానిస్తానన్నారు. తెలంగాణలో అత్యధిక జనాభా బీసీలే అన్న జనసేనాని సీఎం పదవి వారికే దక్కాలని ఆకాంక్షించారు. అందుకే బీసీ నినాదం ఎత్తుకున్న బీజేపీకి జైకొట్టినట్లు కొత్తగూడెం ఎన్నికల ప్రచారంలో తెలిపారు. తన కుటుంబంలో కొందరు వ్యక్తులు వైసీపీని సమర్థించినా తాను మాత్రం విభేదించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
ఈ తొమ్మిదిన్నరేండ్ల కాలంలో తెలంగాణ ప్రభుత్వం 1లక్ష 60వేల 83 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. రానున్న రోజుల్లో మరో 42 వేల ఉద్యోగాలు భర్తీ ప్రక్రియలో ఉన్నాయని… తమ కంటే మెరుగ్గా ఉద్యోగాలు భర్తీ చేసిన రాష్ట్రాలు ఉన్నాయా అని ప్రశ్నించారు. ఐటీసీ కాకతీయ హోటల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో కేటీఆర్ తెలంగాణ అభివృద్ధిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. తెలంగాణ పిల్లలకు చెప్పండని.. ఊరికే గావుకేకలు, పెడబొబ్బలు కాదంటూ ఎద్దేవా చేశారు. ప్రజెంటేషన్ ఇచ్చి… ఫలానా చోట ఇంత కన్న ఎక్కువ చేశామని చెప్పండన్నారు. గుజరాత్లో 6 కోట్లు, రాజస్థాన్‌లో ఎనిమిదిన్నర కోట్ల జనాభా ఉన్నా.. ఆ రాష్ట్రాల్లో ఉద్యోగాల భర్తీ అనుకున్నంత జరగలేదన్నారు. 4 కోట్ల జనాభా ఉన్న తెలంగాణలో తాము 1.60 లక్షల ఉద్యోగాలను భర్తీ చేశామన్నారు. ఎనిమిదిన్నర కోట్లు, 6 కోట్ల జనాభా ఉన్న రాష్ట్రాలు కూడా అన్ని ఉద్యోగాలను భర్తీ చేయలేదని తెలిపారు. ఇవి వాస్తవాలని.. ఉద్యోగాల భర్తీకి సంబంధించి వెబ్సైట్ కూడా పబ్లిష్ చేశామని పేర్కొన్నారు. ఇవి వాస్తవాలు కాదని రుజువు చేసే దమ్ము ప్రతిపక్షాలకు ఉందా.. అంటూ ప్రశ్నించారు. ప్రైవేటు సెక్టార్లో కూడా లక్షల ఉద్యోగాలు సృష్టించి, ఉపాధి కల్పించామని కేటీఆర్ తెలిపారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈనెల 25వ తేదీన కేంద్ర హోంమంత్రి అమిత్ షా మునుగోడులో రోడ్ షో, ఈనెల 28న నియోజకవర్గంలో మందకృష్ణ మాదిగ భారీ బహిరంగ సభ ఉంటుందని బిజెపి అభ్యర్థి చల్లమల్ల కృష్ణారెడ్డి తెలిపారు. అమిత్ షా.. రోడ్ షో లో కార్యకర్తలు, నాయకులు, అభిమానులు భారీగా పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. మునుగోడులో నిర్వహించిన మీడియా సమావేశంలో చల్లమల్ల కృష్ణారెడ్డితో పాటు బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగిడి మనోహర్ రెడ్డి, కన్వీనర్ దూడల బిక్షం పాల్గొన్నారు. మునుగోడు నియోజకవర్గంలోని 176 గ్రామాల్లో ప్రచారం పూర్తయిందని, కేవలం మున్సిపాలిటీల్లో మాత్రమే ప్రచారం మిగిలి ఉందని చల్లమల్ల అన్నారు. ప్రచారంలో ఎక్కడికి వెళ్లినా… ప్రజల నుండి విశేష స్పందన లభిస్తోందని… ఈసారి మునుగోడు గడ్డపై కచ్చితంగా కాషాయ జెండా ఎగురవేయడం ఖాయమని చల్లమల్ల కృష్ణారెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ సీనియర్ నేత భట్టి విక్రమార్కను సీఎం కేసీఆర్ టార్గెట్ చేశారు. వికరాబాద్ సభలో కేసీఆర్ భట్టి పై ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పాత వీఆర్వో వ్యవస్థను తీసుకువస్తామని భట్టి చెబుతున్నారన్నారు. వీఆర్వో వ్యవస్థ వచ్చిందంటే తెలంగాణ భూములన్నీ మాయం అవుతాయని అన్నారు. అవినీతికి ఊతం ఇచ్చేందుకు భట్టి మళ్లీ ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. వీఆర్వో లు అంటేనే లంచాలమయం అని అన్నారు. ధరణి తీసేస్తే భూముల రిజిస్ర్టేషన్ లో పారదర్శకత లోపిస్తుందన్నారు.
Read Also..
Read Also..
తెలంగాణలో అభివృద్ధి జరగాలంటే జనసేన మద్దతుతో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని పవన్ కల్యాణ్ అన్నారు. బీజేపీ పోటీ చేస్తున్న స్థానాల్లో జన సైనికులు మద్దతివ్వాలని కోరారు. కొత్తగూడెంలో జనసేన అభ్యర్థి సురేంద్రరావుకు మద్దతుగా పవన్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం 1200 మంది ఉద్యమకారుల బలిదానంతో తెలంగాణ ఏర్పడిందన్నారు. నా తెలంగాణ కోటి రతనాల వీణ అని పలికిన దాశరథి కృష్ణమాచార్యులను తాను స్ఫూర్తిగా తీసుకున్నట్లు తెలిపారు. తెలంగాణ ఉద్యమ పోరాట స్ఫూర్తితోనే ఏపీలో రౌడీలు, గూండాలను ఎదుర్కొంటున్నానని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ చెప్పారు. ఇదే నా ఇజం హ్యూమనిజం అని స్పష్టం చేశారు. అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న యువతకు జనసేన అండగా ఉంటుందని వెల్లడించారు.





Total views : 141226