విమాన ప్రయాణికులకు పౌరవిమానాయాన శాఖ ఓ శుభవార్త అందించింది. విశాఖపట్నం నుంచి విజయవాడ మధ్య మరో రెండు విమాన సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ రెండు నగరాల మధ్య ప్రయాణాలు చేసే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం విశాఖ టు విజయవాడ మధ్య ఒక్క సర్వీసు మాత్రమే రాకపోకలు సాగిస్తోంది. దాంతో ఎక్కువగా అడ్వాన్స్ బుకింగ్‌లు అవుతున్నాయి.
అందుకే కొత్తగా మరో రెండు విమాన సర్వీసులను అందుబాటులోకి తెస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ విషయాన్ని స్వయంగా విశాఖ విమానాశ్రయం డైరెక్టర్ రాజారెడ్డి వెల్లడించారు. ఈ మేరకు ఓ ప్రకటన చేశారు. ఇండిగో, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ సంస్థల విమాన సర్వీసులను నేడు (ఆదివారం) కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కే రామ్మోహన్నాయుడు చేతుల మీదుగా ప్రారంభిస్తున్నట్లు విశాఖ విమానాశ్రయం డైరెక్టర్ తెలిపారు.
ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ సర్వీసు ఉదయం 9.35 గంటలకు విశాఖపట్నంలో బయలుదేరుతుంది. 10.35 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్టుకు (విజయవాడ) చేరుకుంటుంది. తిరిగి రాత్రి 7.55 గంటలకు విజయవాడలో బయలుదేరుతుంది. అదేరోజు రాత్రి తొమ్మిది గంటలకు విశాఖపట్నం చేరుతుంది. మరో ఫ్లైట్ సర్వీసు అయిన ఇండిగో విమానం రాత్రి 7.15 గంటలకు విజయవాడలో బయలుదేరుతుంది. రాత్రి 8.20 గంటలకి విశాఖపట్నం చేరుతుంది.
అదే సర్వీసు తిరిగి రాత్రి 8.45 గంటలకు విశాఖలో బయలుదేరి 9.50 గంటలకు విజయవాడ విమానాశ్రయానికి చేరుకుంటుంది. ఈ రెండు కొత్త విమాన సర్వీసులతో కలిపి విశాఖ టు విజయవాడ మధ్య తిరిగే ఫ్లైట్ సర్వీసుల సంఖ్య మూడుకు చేరింది. ఈ ఫ్లైట్ సర్వీసులతో విశాఖ టు విజయవాడ మధ్య ప్రయాణించే వారి ఇబ్బందులు తొలగిపోనున్నాయి.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- రఘునాథ స్వామి ఆలయ భూములపై అక్రమాలు ..రఘునాథ స్వామి ఆలయ భూములపై అక్రమాలు. ఏలూరు జిల్లా నూజివీడు మండలం గొల్లపల్లి… ఇది సాధారణ గ్రామం కాదు. త్రేతాయుగంలో శ్రీరాముడు సీతా లక్ష్మణులతో కలిసి వనవాసం చేసిన పవిత్ర భూమిగా భక్తులు విశ్వసించే ఆధ్యాత్మిక క్షేత్రం. ఇక్కడ కొలువుదీరిన సీతా…
- అమెరికా కాలిఫోర్నియాలో కాల్పుల కలకలం..అమెరికా కాలిఫోర్నియాలో కాల్పుల కలకలం.. కాలిఫోర్నియాలోని శాన్ డియాగోలో కాల్పులు కలకలం సృష్టించాయి. స్థానిక ఇస్లామిక్ సెంటర్ దగ్గర ఇద్దరు టీనేజర్లు జరిపిన కాల్పుల్లో సెక్యూరిటీ గార్డు సహా ముగ్గురు మృతి చెందారు. ఈ ఘటనను విద్వేషపూరిత దాడి కోణంలో పోలీసులు…
- నెల్లూరు టీడీపీలో ముదురుతున్న గ్రూపు రాజకీయాలు..నెల్లూరు టీడీపీలో ముదురుతున్న గ్రూపు రాజకీయాలు ఏ రాజకీయ పార్టీకైనా అధిష్టానమే సుపీరియర్ .కానీ ఆ జిల్లా టిడిపిలో మాత్రం వేరే లెక్క . సిట్యుయేషన్ కి తగ్గట్టుగా ఎదుటివారి బలహీనతలను క్యాష్ చేసుకుంటూ వ్యూహరచన చేస్తూ… అధిష్టానానికి సుపిరియర్ అన్నట్లగా…
- ఉత్తరాఖండ్‌లో రైలు ప్రమాదం..ఉత్తరాఖండ్‌లో రైలు ప్రమాదం జరిగింది. రిషికేశ్‌లో ఉజ్జయినీ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పింది. ఈ ఘటనలో మూడు బోగీలు ధ్వంసమయ్యాయి. ఐతే ప్రమాదం సమయంలో రైల్లో ప్రయాణికులు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. యోగ్నగరి ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. షంటింగ్ చేస్తుండగా..…
- హైదరాబాద్‌లో మరో భారీగా అవినీతి తిమింగలం..హైదరాబాద్‌లో మరో భారీగా అవినీతి తిమింగలం భాగ్యనగరంలో మరో అవినీతి తిమింగలం ఏసీబీ వలకు చిక్కింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో హైదరాబాద్ రెడ్ హిల్స్ జలమండలి జనరల్ మేనేజర్ కుమార్ నివాసమే లక్ష్యంగా అవినీతి నిరోధక శాఖ అధికారులు తెల్లవారుజాము…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి





Total views : 80633