పల్నాడు జిల్లా, చిలకలూరిపేట సంక్షేమ సారథి, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, పేద ప్రజల అభ్యున్నత కోసం అడుగడుగునా పరితపిస్తూ నవరత్న పథకాలతోటే పేదల తలరాత మార్చిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను, చిలకలూరిపేట నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ మల్లెల రాజేష్ నాయుడు ఆధ్వర్యంలో పట్టణంలోని వైస్సార్ పార్టీ కార్యాలయంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాజేష్ నాయుడు పార్టీ నాయకులతో, కార్యకర్తలతో కలసి జగన్మోహన్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి కేక్ కటింగ్ చేశారు. అనంతరం రాజేష్ నాయుడు మీడియా ప్రతినిధితో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి జన్మదినోత్సవాన్ని చిలకలూరిపేట నియోజకవర్గంలో కోలాహాలంగా ఏర్పాట్లు నిర్వహించామని పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో ఈ కార్యక్రమాలన్నీ నిర్వహిస్తున్నామన్నారు. అదేవిధంగా పట్టణంలోని పలు చోట్ల అన్నదాన కార్యక్రమాలు రక్తదాన శిబిరాలు నిర్వహించామన్నారు. అంతేకాకుండా సెమీ క్రిస్మస్ వేడుకలు కూడా ఎన్నార్టీ రోడ్డు లో గల పాత పశువుల సంత ప్రక్కన గోల్కొండ ప్రాంగణంలో ఘనంగా నిర్వహిస్తున్నామని ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ పాల్గొని మేము ఇచ్చే ప్రేమ విందును స్వీకరించాలని కోరారు.
ysrcp
మనసున్న మహామనిషి, మనందరి అభిమాన నాయకుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి చిరకాలం వర్ధిల్లాలని జిల్లా వైసీపీ అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ ఆకాంక్షించారు. నరసన్నపేట వైసీపీ కార్యాలయంలో ఘనంగా సీఎం వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేశారు. స్థానిక గవర్నమెంట్ హాస్పిటల్ లో రోగులకు పండ్ల పంపిణీ చేశారు. సారవకొట మండలంలో మెగా రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే ధర్మాన కృష్ణ దాస్ ప్రారంభించారు. ఈ వేడుకల్లో జిల్లా వైసీపీ అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ.. ముందుగా సీఎం వైఎస్ జగన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. మానవత్వం ఉన్న నేతగా జగన్ ఇప్పటికే రాష్ట్ర ప్రజలందరి మన్ననలు అందుకుంటున్నారని అన్నారు. టీడీపీకి ఓటు వేసినా సరే పేదరికమే కొలమానంగా భావించి రాజకీయాలకు అతీతంగా సంక్షేమపథకాలు అమలుచేస్తున్నారని అన్నారు. పేదల పెన్నిధిగా, రాష్ట్రాభివృద్ధికి అంకితమైన నేతగా సీఎం జగన్ 50 సంవత్సరాలు పూర్తిచేసుకుని 51వ ఏట అడుగుపెట్టారని, ఆయన సంపూర్ణ ఆయురారోగ్య ఐశ్వరాలతో చిరకాలం వర్ధిల్లాలని అన్నారు. ఈ రాష్ట్రానికి జగనే మళ్లీ సీఎం కావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో, పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
డా బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ప్రాధాన్యత, ప్రాముఖ్యత, విశిష్టత ఉన్న నియోజకవర్గం రామచంద్రపురం. గతంలో ఈ నియోజకవర్గానికి రెండు వర్గాలు ప్రాతినిధ్యం వహించేవి. ఇప్పుడు సీను మారింది. ఎవరికి వారే యమునా తీరేగా మారిపోయారు. గతంలో రామచంద్రపురం నియోజకవర్గం నుంచి ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్, ప్రస్తుత ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ప్రత్యర్థులుగా ఉండి పోటీపడేవారు. ఒకసారి తోట నెగ్గితే మరోసారి బోసు నెగ్గె వారు. వైసిపి ఏర్పడ్డ అనంతరం కూడా వీరిద్దరి మధ్య వివాదాలు, పోటీలు జరిగాయి. అనంతర పరిణామాల్లో అనూహ్యంగా తోట త్రిమూర్తులు వైసీపీలో చేరారు. దీంతో బద్ధ శత్రువులైన బోస్, త్రిమూర్తులు కలిసి పనిచేయాల్సిన అవసరం ఏర్పడింది. అయినప్పటికీ ఇద్దరు ఒకే పార్టీలో ఉంటూ ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. త్రిమూర్తులు టిడిపిలో ఉన్నప్పుడు బోసు భార్యపై ఉద్యోగాలు ఇప్పిస్తామని డబ్బులు తీసుకున్నట్లు కేసు పెట్టారు. ఎస్ ఎస్ టి కేసులు కూడా బోస్ కుటుంభం పై పెట్టించారు. అదే విధంగా త్రిమూర్తులు తన పార్టీలో చేరినప్పటికీ ఆయన తనకు ప్రత్యర్థి అని బోసు బహిరంగంగా వాదించారు. వీరిద్దరినీ కాదని వైసిపి అధినేత జగన్ రామచంద్రపురం టికెట్ 2019 ఎన్నికల్లో కోనసీమకు చెందిన చెల్లుబోయిన వేణుకు ఇచ్చారు. ఆయన విజయం సాధించారు. మంత్రి అయ్యారు. దీంతో మంత్రి వేణు అటు బోస్, ఇటు త్రిమూర్తులకు చెక్ పెట్టారు. తన పవర్ పెంచుకున్నారు. ఇలాంటి నేపథ్యంలో బోసు కుమారుడు రామచంద్రపురం టికెట్ తనదేనంటూ వైసీపీలో ప్రత్యేక కుంపటి పెట్టారు. దీనితో వేణు, బోసు మధ్య ఒకే పార్టీలో ఉంటూ ఒకరిపై మరొక ఆరోపణలు, సవాళ్లు, ప్రతి సవాళ్లు జరుగుతున్నాయి. తోట త్రిమూర్తులు టిడిపిని వదిలేసిన తర్వాత చాలాకాలం ఆ పార్టీకి ఇంచార్జి లేరు. దీంతో కోనసీమ జిల్లాకి చెందిన శాసనమండలి మాజీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యంను తీసుకొచ్చి ఇంచార్జిగా నియమించారు. కొంతకాలం ఆయన అసమ్మతి లేకుండా నెట్టుకు వచ్చారు. ప్రస్తుతం టిడిపి ఇన్చార్జిగా ఉన్న రెడ్డి సుబ్రహ్మణ్యం వై సి పి కి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే మంత్రి వేణు ఒకే సామాజిక వర్గానికి చెందినవారు. పైగా వీరు ఇరువురు మంచి స్నేహితులు. వీరు ఇరువురు కాంగ్రెస్ లో కలిసి పనిచేసినప్పుడు కాంట్రాక్ట్ లు కూడా చేశారు. వీరి మధ్య ఆర్థిక లావాదేవీలు జరిగేవి. ఈ నేపథ్యంలో రెడ్డి సుబ్రమణ్యంకు టిడిపి టికెట్ ఇస్తే తాము పని చేయమంటూ శెట్టిబలిజ సామాజిక వర్గం కొత్త డిమాండ్ తెరపైకి తెచ్చింది. మరోపక్క జనసేన ఈ సీటు పై కన్నేసింది. ప్రస్తుతం రామచంద్రపురం ఇన్చార్జిగా ఉన్న పోలిశెట్టి చంద్రశేఖర్ కు పార్టీలోనూ ప్రజల్లోనూ పెద్దగా ఆదరణ లేదు. దీంతో తెలుగుదేశం పార్టీకి చెందిన వ్యాపారవేత్త చిక్కాల దొరబాబును జనసేనలోకి తీసుకువచ్చారు. రామచంద్రపురాన్ని పొత్తులో భాగంగా జనసేనకు ఇస్తారు అన్న ప్రచారం జరుగుతోంది. శెట్టిబలిజ సామాజి వర్గానికి టికెట్ ఇస్తే ముమ్మిడివరానికి చెందిన జనసేన నేత పితాని బాలకృష్ణ కాపు సామాజిక వర్గానికి ఇస్తే కొత్తగా చేరిన చిక్కాల దొరబాబుకు టిక్కెట్టు ఖరారు అని చెప్తున్నారు. అయితే పితాని వద్ద ఆర్థిక బలం లేదు. ఈ రెండు దొరబాబు వద్ద ఉన్నాయి. దీంతో రెడ్డి సుబ్రహ్మణ్యానికి, ఆయన వ్యతిరేక వర్గానికి చెక్ పెట్టేందుకు ఈ టిక్కెట్టు జనసేనకు వదిలేయాలని పార్టీ అధినేత చంద్రబాబు నిర్ణయించినట్లు సమాచారం. అదే జరిగితే దొరబాబు జనసేన తరపు అభ్యర్థి అవుతారు. బోస్ లేదా ఆయన తనయుడు వైసిపి నుంచి పోటీ చేస్తారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. మంత్రి వేణును రాజమండ్రి ఎంపీ లేదా రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యేగా పంపిస్తారని నాయకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో బోస్ లేదా ఆయన తనయుడును బలంగా ఢీకొనే సత్తా జనసేనకు దక్కుతుంది. మరోపక్క రెండు పార్టీల్లో ఉంటూ స్నేహితులుగా లాలూచీ రాజకీయాలు చేస్తున్న రెడ్డి సుబ్రహ్మణ్యం, వేణులకు కూడా చెక్ పెట్టినట్లు అవుతుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఈ నియోజకవర్గంపై చర్చలు జరుగుతున్నాయి.
నగరి ఎమ్మెల్యే, మంత్రి ఆర్కే రోజా తిరుమల శ్రీవారిని దర్శించుకుని ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ… 175 నియోజకవర్గాలలో క్యాండెట్లు లేకుండా వైసిపి నుంచి ఎవరు బయటకు వస్తారా అని టిడిపి, జనసేన గోతి కాడ నక్కల వేచి చూస్తున్నారని ఆరోపించారు. ప్రతి రోజు గడప గడపకి వెళ్తూ.. పల్లె నిద్ర చేస్తూ.. పార్టీ కార్యక్రమాల్లో ముందు ఉన్నాను అన్నారు. పచ్చ మీడియా దిగజారుగు వార్తలు ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు. నగరిలో సీటు రోజాకు లేకుంటే.. రాధాకృష్ణ నిల్చుంటాడు.. రామోజీ రావు నిల్చుంటాడా అంటూ ఎద్దేవా చేశారు. మాలో మేము కొట్టుకొని సీటు ఇవ్వకుండా ఉంటే బాగుంటుంది. ఆ అభ్యర్థులను టిడిపికి మళ్లించేద్దాం అని గోతికాడ గుంట నక్కల వ్యవహరిస్తున్నారని, జగన్ అన్న పై ప్రజల్లో ఎంత ప్రేమ ఉందో.. అంతకు మూడింతల్లు పార్టీలో మా అందరికి ఉందని, ప్రజల వద్ద జగన్ అన్నకు వ్యతిరేకత లేదని, జగన్ ముఖ్యమంత్రి అవ్వడానికి 100% పనిచేస్తాం అన్నారు. మళ్లీ మళ్లీ జగనన్నే ముఖ్యమంత్రి కావాలని దేవుడిని ప్రార్థించా అన్నారు. ప్రజలకు అందుబాటులో లేక సీటు లేకపోతే వేరొక పదవి ఇచ్చేలా సీఎం జగన్ చూస్తున్నారని,
చంద్రబాబు., పవన్ కళ్యాణ్ లు ఒక్క చోట నిలబడటానికి భయపడుతున్నారని అన్నారు. అందుబాటులో ఉన్నా కాబట్టే రెండు సార్లు ఎమ్మెల్యే, మంత్రులు అయ్యాం అని అన్నారు. 175కి 175 పక్కాగా గెలుస్తాం అని ధీమా వ్యక్తం చేసారు. నగరిలో ఎవరికి ఇచ్చిన నేను జగన్ అన్నకు ప్రాణం ఇస్తా అన్నారు. నాకు ఎమ్మెల్యే సీటు లేదు అనే ప్రచారం కేవలం శునకానందమే అని అన్నారు.
ఏపీ సీఎం జగన్పై ప్రజలు తీవ్రమైన వ్యతిరేకతతో ఉన్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. తెలంగాణలో ధరణి పేరుతో కేసీఆర్ చేసిన మోసాల కంటే.. ఏపీలో జగన్ చేసిన తప్పులే ఎక్కువని ఆరోపించారు. తెలుగు ప్రజానీకానికి భాజపా వ్యతిరేకంగా ఉందని.. అయితే, ఆ పార్టీకి అనుకూలంగా జగన్ ఉన్నారని మండిపడ్డారు. ఏపీలోనూ అధికార మార్పిడి ఖాయమని పేర్కొన్నారు. ఏపీ, తెలంగాణలో ఒక్కో ఎంపీ స్థానంలో పోటీచేస్తామని నారాయణ ప్రకటించారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు టీడీపీ హయాంలో నిర్లక్ష్యానికి గురయ్యారని ఏపీ మంత్రులు వనిత, చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ ఆరోపించారు. జగన్ సీఎం అయ్యాక సంక్షేమ ఫలాలు అందుతున్నాయని చెప్పారు. తూర్పు గోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గంలో వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్రకు జనం పోటెత్తారు. దేవరపల్లి, గోపాలపురం, నల్లజర్ల, ద్వారకా తిరుమల మండలాల నుంచి పార్టీ కార్యకర్తలు, నేతలు హాజరయ్యారు. కృష్ణంపాలెం హైవే నుంచి 6 కిలోమీటర్ల మేర బైక్ ర్యాలీ నిర్వహించారు. సీఎం జగన్ ను సంఘ సంస్కర్తగా మంత్రి వేణుగోపాలకృష్ణ అభివర్ణించారు. నాలుగన్నరేళ్ల పాలనలో అనేక సంక్షేమ పథకాల ద్వారా పేదల ఖాతాల్లోకి 2లక్షల 60 వేల కోట్ల రూపాయలు జమ చేశారని తెలిపారు. ఇక ఏపీలో వృద్ధి రేటు పెంచిన ముఖ్యమంత్రి జగన్ మాత్రమే అని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అన్నారు. పేదల ఆర్థిక స్థితిగతులు మార్చారని పేర్కొన్నారు. సామాజిక సాధికారత సాధ్యం చేసిన నేత జగన్ మాత్రమే అని హోంమంత్రి తానేటి వనిత అన్నారు. దీని కోసం దశాబ్దాలుగా ప్రజలు ఎదురు చూస్తున్న విషయాన్ని ఆమె గుర్తు చేశారు.
కృష్ణా జిల్లా, అవనిగడ్డ నియోజకవర్గం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై అనుసృత్తవ్యాఖ్యలు చేసిన రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చంద్రబాబుకు ,దత్త పుత్రుడుకు బుద్ధిచెప్పతారు. సుబ్రహ్మణ్యేర స్వామి వారి షష్ఠి మహోత్సవాలకు ప్రారంభించిన
మంత్రి,కోట్టు సత్యనారాయణ. మెపిదేవి దేవి లో కోలువైయిన్న శ్రీ వల్లి, దేవసేన సమేత సుబ్రహ్మణ్యం స్వామి వారి అంగరంగవైభవంగా ప్రారంభయిన్నాయి. రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖా మంత్రి కోటి సత్యనారాయణకుంటబ సమేతంగా స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించి ,స్వామిపుట్టలో పాలుపోసి, అనతరం ప్రతేకపూజలు నిర్వహించారు. తొలియత దేవాలయం అధికారులు, అర్చకులు బృందం అలయమర్యదులతో స్వాగతం పలికారు. అనతరం మంత్రి మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై త్రీవరస్థాయిలో మండిపడ్డారు.
వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీపై అవగాహన కార్యక్రమాన్ని తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేడు ప్రారంభించనున్నారు. ఆరోగ్యశ్రీ యాప్ను డౌన్లోడ్ చేయించడం.. అలాగే ఈ పథకం ద్వారా వైద్యం ఎలా పొందాలనే దానిపైనా అర్హులకు అవగాహన కల్పిండమే ఈ కార్యక్రమ ఉద్దేశం. దీంతో పాటు కొత్త ఫీచర్లతో మెరుగైన ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ.. ఆరోగ్యశ్రీ ద్వారా అందించే వైద్యం పరిధి రూ.25 లక్షల దాకా పెంపును సైతం ఆయన ప్రారంభిస్తారు. పేద, మధ్యతరగతి ప్రజలకు మెరుగైన ఉచిత కార్పొరేట్ వైద్యం అందించేందుకు తీసుకొచ్చిందే డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం. దీనికి మరిన్ని మెరుగులు దిద్దుతూ.. మరింత బలోపేతం చేసే కార్యక్రమాన్ని సీఎం జగన్ సోమవారం లాంఛనంగా ప్రారంభిస్తారు. ఈ పథకం కింద ఇక నుంచి రూ.25 లక్షల వరకు ఉచిత వైద్యం అందనుంది.
పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలో వైసీపీ నేతల బరితెగింపు, అధికారాన్ని అడ్డు పెట్టుకుని భూములు ఆక్రమిస్తున్న వైసీపీ నాయకులు. చర్చి భూమిని కాజేసేందుకు యత్నం అడ్డుపడ్డ సంఘస్తుల పై దాడి. రెండు కోట్ల విలువ చేసే భూమి కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్న వైసిపి నాయకులు, పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం ఇరికేపల్లి లూధరన్ చర్చి కి సంబంధించిన 2 ఎకరాల70 సెంట్ల భూమి ని వైసీపీ నేత దాచేపల్లి నగర పంచాయతీ కో ఆప్షన్ మెంబర్ అంజమ్మ భర్త వేల్పుల ధర్మదేవ్, అతని అన్న కొడుకు వైసీపీ సోషల్ మీడియా ఇంచార్జి వేల్పుల కిషోర్ కబ్జా చేసేందుకు ప్రయత్నం చేసారు నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి స్థలం లోకి jcb తో అక్రమించగా చర్చి సంఘ పెద్దల ఇదేమిటి ఇది బ్రిటీష్ వారు మా చర్చికి ఇచ్చారు ఇది మా సంఘం కి సంబంధించిన స్థలం మీరెవరూ అని ప్రస్నించగా ఇరువురి మధ్య ఘర్షణ చోటుచేసుకుంది ఈ నేపథ్యంలో వైసీపీ సోషల్ మీడియా ఇంచార్జి కిషోర్ సంఘ పెద్దల పై దాడి చేసి బలంగా కడుపులో పిడికిలితో గుద్దడంతో సంఘ పెద్దలు అందరూ కలసి దాచేపల్లి పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేసేందుకు వెళ్లారు కాని పోలీసులు కూడా మీరు ఎందుకు వెళ్లారు మీకు ఏమి సంబందం అని వైసీపీ నేతలకు వత్తాసు పలికారు సదరు విషయం పై సోమవారం జిల్లా కలెక్టర్ కి,యస్పీ కి స్పందనాలో పిర్యాదు చేయాలని సంఘస్తులు నిర్ణయం తీసుకున్నారు.
ఎన్టీఆర్ జిల్లా నందిగామలో ఆదివారం రేపు జరిగే సామాజిక సాధికారిక యాత్రకు సర్వం సిద్దం చేసినట్లు ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ మీడియా సమావేశంలో తెలిపారు. స్థానిక వైయస్సార్ సిపి కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ నియోజకవర్గం వ్యాప్తంగా సుమారు 25 వేల మంది వైయస్సార్ సిపి నాయకులు కార్యకర్తలు బస్సు యాత్రలో పాల్గొంటారని తెలిపారు. యాత్రకు సంబంధించి ఇప్పటికే నియోజకవర్గం లో ని ప్రతి గ్రామం నుంచి భారీ బస్సు యాత్రకు తరలిరాన్నుట్లు తెలిపారు. బస్సు యాత్ర అనంతరం గాంధీ సెంటర్లో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ బహిరంగ సభకు అనేక మంది మంత్రులు, విడుదల రజిని మెరుగ నాగార్జున శాసన సభ్యులు,శాసన మండలి సభ్యులు, శాసన సభ్యులతో పాటు అన్ని రకాల కార్పొరేషన్ లో ఛైర్మన్ లు పాల్గొంటారని తెలిపారు. ఈ బహిరంగ సభలో గత నాలుగున్నర సంవత్సరాలో వైయస్సార్ సిపి ప్రభుత్వం ప్రజలకు చేసిన మంచిని వివరించనున్నట్లు తెలిపారు. అలాగే మళ్ళీ తిరిగి నందిగామ నియోజకవర్గంలో డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గెలుపుకు నాంది పలుకుతుందని తెలిపారు.





Total views : 141522