శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర Tehsildar Murshawaliని మెలవాయి పంచాయతీకి చెందిన ఓ రైతు తన సొంత పొలం సమస్యను తహశీల్దార్ ముందుకు తీసుకువస్తే మీ క్రింది స్థాయి అధికారులు డబ్బులు లేనిదే పని చేయరా అని తన ఆవేదన వెల్లబోసుకున్నాడు. రైతుతో తహశీల్దార్ వెటకారంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి లాంటి వారే డబ్బులు తీసుకుని ఫ్రాడ్ చేస్తున్నారు మేమెంత అని అన్నారు. మాపై అధికారులు మాకు డబ్బులు ఇవ్వరు అందుకు మీలాంటి రైతుల దగ్గర తీసుకొని వాళ్ళు వచ్చినప్పుడు ఖర్చు చేస్తున్నామని అన్నారు. ఈ నెల 13వ తేదీ టెక్స్టైల్ ప్రిన్సిపల్ సెక్రటరీ సునీత వచ్చినప్పుడు వారి భోజనం కోసం లక్ష 70 వేల రూపాయలు ఖర్చు అయ్యిందని అన్నారు. నా జీతం డబ్బులు ఇవ్వాలా అందుకే రైతుల దగ్గర డబ్బులు తీసుకొని వారి పని చేసి పెడుతుంటాం అని అన్నారు. పై స్థాయి అధికారులు వచ్చినప్పుడు వాటికి ఖర్చు పెడతాం అంటూ ఆ రైతుకు సమాధానం చెప్పాడు.
పైసా లేనిదే పని చేయను అంటున్న తహసీల్దార్…
94
previous post