Adilabad
మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం శివ్వారం గ్రామంలో బాల్క సుమన్ కు నిరసన సెగ తగిలింది. కాళేశ్వరం బ్యాక్ వాటర్ తో తమ భూములు నీట మునిగినప్పుడు రాని సుమన్ ఇప్పుడూ కూడా రావద్దని నిరసన తెలిపారు. ఇన్ని రోజులు రాని బాల్క సుమన్ ఇప్పుడు ఎం మొహం పెట్టుకొని వచ్చి ఓట్లు అడుగుతున్నావు అని రైతులు నిలదీశారు. 52 సర్వే నెంబర్ లో భూములు అన్యాక్రాంతం అవుతున్నా బాల్క సుమన్ పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. బాల్క సుమన్ గో బ్యాక్ అని రైతులు ప్లకార్డులు ప్రదర్శించారు. రైతులను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులతో రైతులు వాగ్వాదానికి దిగారు. నిరసన తెలుపుతున్న రైతులను సముదాయించి వెళ్లగొట్టిన పోలీసులు. బాల్క సుమన్ బాయ్ బాయ్ మా ఊరికి రావద్దు. మా ఓట్లు నీకు వేయము అంటు గ్రామస్తులు చెప్పారు.
మందమర్రి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ రోజు సాయంత్రం 7 గంటల సమయంలో పట్టణ అదనపు ఎస్.ఐ హరి శేఖర్ సిబ్బందితో పాలచ్చేట్టు దగ్గర దొరల బంగ్లా ఏరియా లో వెహికిల్ చెకింగ్ చేస్తూ ఉండగా ఒక కారులో మల్లికార్జున్ నగర్, రామకృష్ణ పూర్ కి చెందిన సందీప్ కుమార్ సింగ్ అనే వ్యక్తి మద్యాన్ని అక్రమంగా రవాణా చేస్తుండగా పట్టుకొని అతని వద్ద నుండి 1,36,630 రూపాయలు విలువ గల IMFL 690 క్వార్టర్ మందు బాటిల్స్ మరియు కారును సీజ్ చేసి కేసు నమోదు చేసమని మందమర్రి పోలీసులు తెలిపారు.
మంచిర్యాల జిల్లా మందమర్రిలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో భాగంగా రామగుండం కమిషనరేట్ సీపి రెమారాజేశ్వరి డిఐజీ, ఆదేశాల మేరకు ఈరోజు రామకృష్ణాపూర్ పట్టణ పోలీస్ ఆధ్వర్యంలో CRPF జవాన్ లతో పాటు మందమర్రి పోలీస్ సర్కిల్ రామకృష్ణపూర్ పోలీస్ సిబ్బంది తో సూపర్ బజారు RK4 గడ్డ నుండి రవీంద్రఖని రైల్వేస్టేషన్ రోడ్ రాజీవ్ చౌరస్తా బిజోన్ ఏరియా వివిధ బస్తి లలో పోలీస్ కవాతు నిర్వహించారు. బెల్లంపల్లి ఏసీపీ పి. సదయ్య, మంచిర్యాల డిసీపి రామ్నాద్ కొంకెన్ ఆధ్వర్యంలో CRPF అధికారులు, సీఐ మహేందర్ రెడ్డి మందమర్రి రామకృష్ణపూర్ పిఎస్ ఎస్ఐ లు పాల్గొన్నారు. మహేందర్ రెడ్డి, సీఐ మాట్లాడుతూ.. తెలంగాణ సార్వత్రిక ఎన్నికలలో భాగంగా ప్రశాంతంగా ఎన్నికల ప్రక్రియ జరిగేందుకు మరియు ప్రజలు నిర్భయంగా తమ ఓటును వినియోగించుకునేందుకు ప్రజలకు మేము వున్నాము అనే భరోసాను కల్పించుటకు గాను ఇట్టి పోలీస్ మార్చ్ కవాతు నిర్వహించటం జరిగిందని, అదేవిధంగా ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు అన్నీ రాజకీయ పార్టీలు సహకరించాలని, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు పాల్పడవద్దని, చివరి ఘట్టంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించి కేసుల పాలవద్దని పోలీస్ లకు ప్రజలు సహకరించాలని కోరారు.
మంచిర్యాల జిల్లా నీల్వాయి పోలీస్ స్టేషన్ పరిధిలోని వేమనపల్లి ప్రాణహిత ఫెర్రీ పాయింట్ వద్ద రామగుండం పోలీస్ కమీషనర్ రెమారాజేశ్వరి డ్రోన్ పెట్రోలింగ్ యూనిట్స్ ని ప్రారంభిచారు. త్వరలో జరుగబోయే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రాణహిత సరిహద్దు ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అనువభజ్ఞులైన నిపుణులచే డ్రోన్ పెట్రోలింగ్ సేవలు నిర్వహిస్తామని ఆమె పేర్కొన్నారు. ప్రజలు ఎలాంటి భయబ్రాంతులకు, ప్రలోభాలకు గురికాకుండా, తమ ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకోవాలని ఆమె స్పష్టం చేశారు. అనునిత్యం పోలీసులు ప్రజలకు అందుబాటులో ఉంటారని,మీకేమయినా ఇబ్బందులు ఉంటే మాకు తెలపాలని, గ్రామంలో అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే తమకు సమాచారం అందించాలని ఆమె తెలిపారు. అనంతరం గ్రామంలో పోలీసుల కవాతు నిర్వహించి గ్రామస్తులకు తగు సూచనలు, సలహాలు అందించారు. ఆమె వెంట మంచిర్యాల డీసీపీ, జైపూర్ ఏసీపీ, సిఐలు, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
Read Also..
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో భాగంగా ఈరోజు మందమర్రి పట్టణ పోలీస్ ఆధ్వర్యంలో CRPF జవాన్ లతో పాటు మందమర్రి పోలీస్ సర్కిల్ పరిది సిబ్బందితో cisf బ్యారక్ నుండి మందమర్రి రైల్వేస్టేషన్ రోడ్ మార్కెట్ ఏరియా వరకు వివిధ బస్తి లలో పోలీస్ కవాతు నిర్వహించారు. ఈ యొక్క కార్యక్రమం లో బెల్లంపల్లి ఏసీపీ పి. సదయ్య, మంచిర్యాల డీసీపీ సుదీర్ కేకన్ CRPF అధికారులు, సీఐ మహేందర్ రెడ్డి మందమర్రి సర్కిల్ పరిది నాలుగు పిఎస్ ఎస్ఐ లు పాల్గొన్నారు. ఇట్టి పోలీస్ కవాతు అనంతరం బెల్లంపల్లి ఏసీపీ సదయ్య మాట్లాడుతూ.. తెలంగాణ సార్వత్రిక ఎన్నికలలో భాగంగా ప్రశాంతంగా ఎన్నికల ప్రక్రియ జరిగేందుకు మరియు ప్రజలు నిర్భయంగా తమ ఓటును వినియోగించుకునేందుకు ప్రజలకు మేము వున్నాము అనే భరోసాను కల్పించుటకు గాను ఇట్టి పోలీస్ కవాతు నిర్వహించటం జరిగిందని, అదేవిధంగా ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు అన్నీ రాజకీయ పార్టీలు సహకరించాలని, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు పాల్పడవద్దని, చివరి ఘట్టంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించి కేసుల పాలవద్దని పోలీస్ లకు ప్రజలు సహకరించాలని కోరారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కలకలం రేపుతున్న మావోయిస్ట్ పార్టీ లేఖలు అధికార పార్టీ ఎమ్మెల్యేల పై పలు ఆరోపణలు చేసిన మావోయిస్టు పార్టీ జిల్లా కార్యదర్శి భాస్కర్, కోల్ బెల్ట్ కార్యదర్శి ప్రభాత్ పేరిట రెండు లేఖలు వేరువేరుగా విడుదల చేశారు. ఆ లేఖలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మావోయిస్టు పార్టీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పలువురూ రాజకీయ పార్టీ నాయకులకు హెచ్చరికలు జారీ చేశారు. బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ప్రభుత్వ భూములు కబ్జా చేస్తున్నారని, ఎమ్మెల్యే గారి అనుచరులు సహాయం అర్జించి వచ్చే మహిళలపై లైంగిక దాడులకు పాల్పడుతున్నారని ఆరోపణలు చేశారు. బూటకపు ఎన్నికలు బహిష్కరించాలని వారు ప్రజలకు పిలుపునిచ్చారు.
Read Also..
మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండలంలోని కిష్టంపేట గ్రామంలో గల వరి కొనుగోలు కేంద్రంలో అకాలంగా కురిసిన వర్షానికి ఆరబెట్టిన ధాన్యం తడిసి ముద్దయింది. తడిసిన ధాన్యం ఆరడానికి పది నుంచి పదిహేను రోజుల సమయం పడుతుందని, ధాన్యం కాంట వేయడానికి మరికొన్ని రోజులు ఆగాల్సిందేనని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతు పంట పండించడం ఒక ఎత్తయితే ఆ పంటను అమ్ముకోవడం మరొక ఎత్తవుతుందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అనేక కష్టనష్టాలు, చీడపీడలను ఓర్చి పండించిన పంటను విక్రయించేంతవరకు వివిధ దఫాలుగా కష్టాలను ఎదుర్కొంటున్నామని వారు పేర్కొన్నారు. వాతావరణ మార్పుల వల్ల, అకాల వర్షాల వల్ల తాము తీవ్ర ఇబ్బందులు ఎదురుకుంటున్నామని తెలిపారు. అధికారులు స్పందించి ఎలాంటి ఆక్షేపణలు లేకుండా తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని వేడుకుంటున్నారు.
Read Also..
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి BRS అభ్యర్ధి దుర్గం చిన్నయ్యకు నిరసన జ్వాలలు ఎదురవుతున్నాయి. ఎటు వెళ్లినా ఓటర్లు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. అధికారంలో ఉండగా జరిగిన పొరపాట్లు ఇప్పుడు ఆయన పాలిట శాపంగా మారిపోతున్నాయి. నాడు మౌనంగా ఉన్న వారు కూడా ఎన్నికల వేళ నిలదీసే పరిస్థితులు వచ్చేశాయి. చిన్నయ్యపై భూ కబ్జాలు, ప్రభుత్వ భూములను ధరదాత్తం చేశారనే ఆరోపణలు వచ్చాయి. సొంత గ్రామం జెండా వెంకటాపూర్ ను అయినా అభివృద్ధి చేయలేదనే విమర్శలు ఉన్నాయి. ఇక బెల్లంపల్లి పట్టణంలో సొంత పార్టీ నాయకులు పార్టీని వీడారు. ఇద్దరు మున్సిపల్ కౌన్సిలర్లు కూడా కారు దిగిపోయారు. మరికొందరు అదే బాటన సాగుతారన్న ఊహాగానాలు వస్తున్నాయి. హాట్రిక్ విజయం ఎమ్మెల్యే చిన్నయ్య విపరీతంగా శ్రమిస్తున్నారు. ఓటర్ల కరుణ కోసం ఆరాటపడుతున్నారను.
తెలంగాణతో పాటు ఏపీలోని పలు ప్రాంతాలకు వర్ష సూచన ఉంది. ఈ మేరకు వాతావరణ శాఖ వివరాలను వెల్లడించింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతానికి ఆనుకుని వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఎఫెక్ట్ తో వర్షాలు కురుస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ, రేపు పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. చాంద్రాయణగుట్ట, ఫలక్నుమా, బార్కాస్, మియాపూర్, చందానగర్, మదీనాగూడ, మాదాపుర్, గచ్చిబౌలి, రాయదుర్గం, కొండాపుర్ ప్రాంతాల్లో పడిన వర్షానికి రోడ్లన్నీ జలమయం అయ్యాయి. రాజేంద్రనగర్, అత్తాపూర్, బండ్లగూడ జాగిర్, మణికొండ, నార్సింగి, శంషాబాద్ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణశాఖ హెచ్చరించింది. ఈ మేరకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, జగిత్యాల జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడొచ్చని తెలిపింది.




Total views : 194234