రిటైర్డ్ కార్మికుల కోసం సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటియుసి) అధ్యక్షులు కామ్రేడ్ వాసిరెడ్డి సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ కొరిమి రాజ్ కుమార్ యాజమాన్యంతో మాట్లాడి వారికి రిటైర్డ్, డెత్ రావలసిన బకాయిలు సింగరేణి యాజమాన్యం కార్మికుల చేసే అడిట్ జాప్యం వలన రెండు రోజులు లేట్ కావడంతో కొన్ని సంఘాలు దుష్ప్రచారం చేస్తున్నాయి. వెంటనే రావాల్సిన బకాయిలు ఇవ్వాలని వొత్తిడి ఫలితంగా రిటైర్డ్ కార్మికులకు (Not On Roles ) వారికి రావాల్సిన లాభాల వాటా 32% PLR బోనస్ మరియు వెజ్ బోర్డ్ ఏరియల్స్ ఈ రోజు చెల్లించనున్నట్టు యాజమాన్యం తెలిపింది. కావున ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ ప్రకారము కార్మికులకు రావలసిన బకాయిలను ఇప్పించుటలో కార్మికుల సమస్యలు ఫై ఏఐటీయూసీ ఎప్పుడు ముందుంటుందని తెలిపారు.
Adilabad
మంచిర్యాల జిల్లా జన్నారం మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే బొజ్జు పటేల్, అన్ని శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అధికారులు ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని మీ స్థాయిలో కాని పనులను నా దృష్టికి తీసుకురావాలని అన్నారు, ఏ అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నా తన దృష్టి కి తీసుకు రావాలని సూచించారు. వెనుకబడిన జిల్లా ఆదిలాబాద్ అభివృద్ధి కి రేవంత్ ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలతో రూపకల్పన చేస్తోంది అని అన్నారు.
మంచిర్యాల జిల్లా చెన్నూర్ పట్టణంలోని జగన్నాథ ఆలయంలో ఘనంగా లక్ష్మీ నరసింహ స్వామి సుదర్శన హోమం నిర్వహించారు. ఈ ఆలయానికి 600 సంవత్సరాల ఘన చరిత్ర ఉంది. భారత దేశంలో జగన్నాథ ఆలయం రెండవ “పూరి” జగన్నాథ ఆలయంగా పేరుగాంచింది. సుభద్ర బలభద్ర సమేత శ్రీ జగన్నాథ ఆలయంలో స్వామి వారికి వేదమంత్రోచ్ఛరణల మధ్య, భాజా భజంత్రీలతో లక్ష్మీ నరసింహ స్వామి హోమం నిర్వహించడం ఆనవాయితిగా వస్తుంది. భక్తులు ఈ హోమానికి అధిక సంఖ్యలో విచ్చేసి భక్తి, శ్రద్దలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తీర్థ ప్రసాదాలు వితరణ చేసి, అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు.
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపల్ రాజకీయాలు ఒక్కసారిగా రసవతరంగా మారాయి. మున్సిపల్ చైర్ పర్సన్ జక్కుల శ్వేత, వైస్ చైర్మన్ బత్తుల సుదర్శన్ పై అవిశ్వాసం ప్రకటించిన బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఆ పార్టీకి రాజీనామ చేస్తున్నట్లు ప్రకటించడం సంచలనంగా మారింది. రేపు శుక్రవారం రోజున మున్సిపల్ అవిశ్వాస సమావేశం ఏర్పాటు చేసిన నేపథ్యంలో బీఆర్ఎస్ కౌన్సిలర్ 19 మంది అధిష్టానికి షాక్ ఇచ్చారు. కాంగ్రెస్‌లో చేరిన మున్సిపల్ చైర్ పర్సన్ జక్కుల శ్వేతకు మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, మున్సిపల్ వైస్ చైర్మన్ బత్తుల సుదర్శన్ మద్దతు ఇవ్వడాన్ని నిరసిస్తూ గులాబీ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు కౌన్సిలర్లు ప్రకటించడం రాజకీయ ప్రకంపణలు రేపుతుంది.
Read Also..
మంచిర్యాల మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్లపై కాంగ్రెస్ కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన నేపథ్యంలో వారిద్దరు తమ పదవులకు రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ కు మెజారిటీ సభ్యుల సంఖ్యా బలం ఉండడంతో అవిశ్వాసం నెగ్గడం ఖాయమైంది. దీంతో మున్సిపల్ చైర్మన్ పెంట రాజయ్య, వైస్ చైర్మన్ గాజుల ముఖేశ్ గౌడ్ తమ పదవులకు రాజీనామాలు సమర్పిండంతో అవిశ్వాస తీర్మానం లాంఛనమే కానుంది. చైర్మన్, వైస్ చైర్మన్ రాజీనామాలు ఇంకా ఆమోదం పొందకపోవడంతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ తమ పదవులకు రాజీనామా చేసినప్పటికీ అవి ఇంకా ఆమోదం పొందలేదు. దీంతో ప్రత్యేక సమావేశాన్ని యథావిధిగా నిర్వహించడానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ ఉన్నప్పటికీ ముందు జాగ్రత్తగా క్యాంపు ఏర్పాటు చేశారు. కౌన్సిలర్లు రెండు రోజుల కింద హైదరాబాద్‌లోని క్యాంపుకు తరలివెళ్లారు. అవిశ్వాస తీర్మానం కోసం నేరుగా మున్సిపల్ సమావేశానికి హాజరై అవిశ్వాసానికి మద్దతు తెతియజేస్తున్నారు. కొత్త చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక కోసం మరోసారి ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ఆదేశాలతో చైర్మన్‌గా కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ రావుల ఉప్పలయ్య, వైస్ చైర్మన్‌గా చల్లా నరేశ్‌ను ఎన్నుకునే అవకాశం ఉంది.
నిర్మల్ జిల్లా కేంద్రంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పార్లమెంట్ ఎన్నికల సమీక్ష సమావేశానికి మంత్రి సీతక్క హాజరయ్యారు. ఆదిలాబాద్ జిల్లా అక్షర క్రమంలో ముందుండి అభివృద్ధిలో మాత్రం వెనుకబడిందని తెలిపారు. సరస్వతి దేవి కొలువైన ప్రాంతంలో ఎందరో మహనీయులు పుట్టారని పేర్కొన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు నన్ను ఇన్చార్జిగా నియమించడం నా అదృష్టం అన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి ఆదిలాబాద్ పై ఎంతో ప్రేమ ఉందని, ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటి జిల్లాల పర్యటనలో సైతం ఇక్కడి నుంచే ప్రారంభిస్తున్నారని తెలిపారు. హైదరాబాదులో అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి ఈ జిల్లాపై ప్రత్యేక చొరవ తీసుకోవాలని ఆదేశించామన్నారు. నియోజకవర్గాల్లో ఓడిన అభ్యర్థులు సైతం ప్రజల్లో ఉండి వారి కష్ట సుఖాలు తీర్చేందుకు ముందుండాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 గ్యారంటీల్లో మొదటి గ్యారంటీ ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తే ఆటో సంఘాలతో ఆందోళన చేయించిన ఘనత బి ఆర్ ఎస్ పార్టీదన్నారు. అధికారంలోకి వచ్చిన రెండు రోజుల నుంచే కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ దూషించడం మొదలుపెట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సింగరేణి కార్మికులకు జనవరి నెల లో రావలసిన SLP (స్లూ) ప్రమోషన్ విషయంలో కొంత ఆలస్యం జరిగినది. ఏఐటీయూసీ యూనియన్ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య చోరువతో ఈ రెండు రోజులలో SLP (స్లు) ప్రమోషన్ లెటర్స్ ఇవ్వడానికి సింగరేణి యాజమాన్యం అంగీకరించారని మంచిర్యాల జిల్లా మందమర్రి గుర్తింపు సంఘము ఏఐటీయూసీ యూనియన్ కార్యాలయ సమావేశం లో బ్రాంచి కార్యదర్శి సలంద్ర సత్యనారాయణ తెలిపారు. అదే విధంగా కాసిపేట 2 గనిలో ప్రమాదానికి గురి అయ్యి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ట్రీట్మెంట్ పొందుతూ మరణించిన కాసిపేట 2మైన్ మైనింగ్ సర్దార్ మచ్చ రమేష్ కి AITUC పోరాట ఫలితంగా అతని కుటుంబానికి న్యాయం జరిగే విధంగా యాజమాన్యం పై ఒత్తిడి తెచ్చి కృషి చేయడం జరిగిందని అన్నారు. గుర్తింపు సంఘము గా AITUC కార్మికుల పట్ల చిత్తశుద్ధితో పని చేస్తూ సింగరేణి కార్మిక హక్కులను కాపాడటంలో ముందు వరుసలో ఉంటామని తెలిపారు. ఈ సమావేశం లో బ్రాంచ్ ఉపాధ్యక్షులు బి. సుదర్శన్, జాయింట్ సెక్రెటరీ కంది శ్రీనివాస్ పాల్గొన్నారు.
రామకృష్ణాపూర్ పట్టణ కేంద్రం లో ఈ రోజు రామగుండం పోలీస్ కమీషనర్ ఆదేశాల మేరకు వాహనాలు తనిఖీ నిర్వహించారు. స్పెషల్ డ్రైవ్ మందమర్రి సీఐ మహేందర్‌రెడ్డి, మందమర్రి సర్కిల్ పరిధిలోని ఎస్ఐలు, పట్టణం లోని ప్రధాన కూడళ్ళు క్యాతనపల్లి రైల్వే గేట్ దగ్గర లో వాహనాల తనిఖీలు నిర్వహించారు. వాహనాల తనిఖీలు నిర్వహించి ధ్రువీకరణ పత్రాలు, డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్, నెంబర్ ప్లేట్ నిబంధనల ప్రకారం లేని వాహనాలపై కేసులు నమోదు చేశారు. రోడ్డు భద్రత నియమాలు, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేయడంతో పాటు జరిమానాలు విధిస్తున్నారు. వాహనదారులు తప్పనిసరిగా వాహన ధ్రువీకరణ పత్రాలు, లైసెన్సులు, ఇన్సూరెన్స్ పత్రాలు కలిగి ఉండాలన్నారు. ర్యాష్ డ్రైవింగ్ చెయ్యడం, డ్రైవింగ్ లైసెన్స్ లేని వారికి బండి ఇవ్వడం, మైనర్ పిల్లలకు వాహనాలు ఇవ్వడం, నెంబర్ ప్లేట్ లేకుండా వాహనాలు నడపడం, మద్యం సేవించి వాహనాలు నడపడం చేసే వారిపై కేసులు నమోదు చేయడం జరుగుతుందని సీఐ మహేందర్ రెడ్డి తెలిపారు. ఈ తనిఖీ లో రామకృష్ణాపూర్ ఎస్సై రాజశేఖర్ , దేవాపూర్ ఎస్సై ఆంజనేయులు, మందమర్రి ఎస్సై చంద్రకుమార్, కాసిపేట ఎస్సై గంగారాం పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలంలోని ఇంద్రనగర్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రెబ్బెన మండలం లోని అన్నపూర్ణ హై స్కూల్ కు చెందిన స్కూల్ బస్ 30 మంది పిల్లలతో వెళ్తున్న క్రమంలో ఇంద్రనగర్ గ్రామంలో పది మంది పిల్లలను దింపి మరో 20 మంది పిల్లల్ని కొండపల్లి గ్రామంలో దింపాల్సి ఉండగా యూటర్న్ తీసుకుంటే లాంగ్ పడుతుందని డ్రైవర్ రాంగ్ రూట్ వెళ్లడంతో ఎదురుగా వస్తున్న లారీ, బస్సును ఢీ కొట్టడంతో బస్సులో ప్రయాణిస్తున్న విద్యార్థులకు గాయాలుకాగా వారిలో కొంతమందిని కాగజ్ నగర్ ఆస్పత్రికి కొందరిని, మంచిర్యాల ఆస్పత్రికి తరలించారు, బస్సు నడుపుతున్న డ్రైవర్ రెండు కాళ్లకు తీవ్ర గాయం కావడంతో చికిత్స నిమిత్తం మంచిర్యాల ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి డ్రైవర్ రాంగ్ రూట్లో రావడమే కారణమని స్థానికులు చెబుతున్నారు.
మంచిర్యాల జిల్లా చెన్నూర్ పట్టణంలోని ఆర్యవైశ్య భవన్ లో కొలువుదీరిన వాసవి మాత అమ్మవారికి 3,33,333/- రూపాయల కరెన్సీతో ప్రత్యేక అలంకరణ చేసిన ఆర్యవైశ్య సంఘ సమాజం.. అనంతరం మహిళలు కుంకుమ పూజలు నిర్వహించి ప్రత్యేక పూజలు చేసి అమ్మవారి కరుణా కటాక్షాలు ఉండాలని వేడుకున్నారు. ప్రతి రోజు ఉదయం సాయంత్రం అమ్మవారికి వివిధ రకాలుగా పూజలందిస్తూ, అలంకరణలతో భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తూ, సంఘ సభ్యులు ముందుకు సాగారు. మహిళలు అమ్మవారికి ప్రీతి ప్రదమైన నైవేద్యాలు సమర్పిస్తూ, మంగళ హారతులతో భజన కార్యక్రమాలు నిర్వహిస్తూ, భక్తులను అలరిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు..



Total views : 194098