ఎన్నికల వేళ రాష్ట్రంలో కాంగ్రెస్ నేతలే టార్గెట్గా దర్యాప్తు సంస్థల రెయిడ్స్ కలకలం రేపుతున్నాయి. తాజాగా కాంగ్రెస్ నేత పొంగులేటిపై ఐటీ దాడులు రాజకీయంగా సంచలనం అవుతున్నది. ఈ నేపథ్యంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై ఐటీ దాడులను కాంగ్రెస్ సీనియర్ నేత భట్టివిక్రమార్క ఖండించారు. ప్రజాస్వామ్యంలో ఇది మంచి పద్దతి కాదన్నారు. నామినేషన్ వేళ ఐటీ దాడులతో భయపెట్టాలని చూడటం సరికాదన్న ఆయన బీజేపీ, బీఆర్ఎస్ కలిసి కుట్ర పన్నుతున్నాయని ధ్వజమెత్తారు. పొంగులేటికి పార్టీ అండగా ఉంటుందన్నారు. ఇదిలా ఉంటే గురువారం తెల్లవారుజాము నుంచే ఖమ్మం, హైదరాబాద్లోని పొంగులేటి ఇల్లు, కార్యాలయాలపై ఐటీ దాడులు కొనసాగుతున్నాయి.
Hyderabad
ఎల్బీనగర్ కాంగ్రెస్ అభ్యర్థి మధుయాష్కిగౌడ్ నామినేషన్ దాఖలు చేశారు. కొంతమంది కార్యకర్తలతో ముందుగా ఒక సెట్ నామినేషన్ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ… తెలంగాణ భవిష్యత్తు కొరకై, తెలంగాణ ప్రజల కొరకై, తెలంగాణ ను రక్షించడం కొరకై జరుగుతున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు. ఏ తెలంగాణ రాష్ట్రం కోసం అమరవీరులు తమ ప్రాణాలను అర్పించారో వారి ఆశయ సాధన కోసం బిఆర్ఎస్ పార్టీ ఏమీ చేయడం లేదని ఆయన ఆరోపించారు. వారి అమరవీరుల త్యాగాలను ఫణంగా పెట్టి బిఅర్ఎస్ అధికారం చేపట్టారని ఆరోపించారు. బిజెపి , బిఅర్ఎస్ పార్టీ లు రెండు ఒకటేనని ఆయన ఆరోపించారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని బలపరిచి తమను గెలిపించాల్సిందిగా మదు యాష్కీ కోరారు.
Read Also..
శేర్లింగంపల్లి టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అరికెపూడి గాంధీ ఇంటింటి ప్రచారం చేశారు. మహిళలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హారతులు ఇచ్చి స్వాగతం పలికారు.. మహిళలకు ప్రజలకు ఏం కావాలో మా హయాంలో చేశామన్నారు. రోడ్లు, కరెంటు వాటర్ సప్లై …డ్రైనేజీ వ్యవస్థ సంక్షేమ పథకాలు అన్ని అందించామని ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ అన్నారు. గతంలోకాలనీలు కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కాలనీలో చాలా మార్పు కనిపిస్తుంది అన్నారు. కలబొల్లి మాటలకు మోసపోవద్దని..సరైన నాయకున్ని ఎన్నుకొని ఇంకా అభివృద్ధిలో దూసుకుపోవాలని ఆయన కోరారు.
కూకట్పల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుండి బిఅర్ఎస్ పార్టి అభ్యర్థి గా పోటి చేస్తున్న మాధవరం కృష్ణారావు ఇవాళ నామినేషన్ దాఖలు నామినేషన్ కు దాఖలుకు బయలుదేరే ముందు దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనను పూజారులు ఆశీర్వదించారు. అనంతరం కార్యకర్తలతో కలిసి నామినేషన్ వేసేందుకు బయలు దేరారు.. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ నవీన్ రావు, బిఅర్ఎస్ పార్టి నియోజకవర్గం కోఆర్డినేటర్ సతీష్ అరోరా తదితరులు పాల్గొన్నారు.
సికింద్రాబాద్ సనత్ నగర్ నియోజకవర్గ బిఆర్ఎస్ అభ్యర్థి తలసాని శ్రీనివాస్ యాదవ్ నామినేషన్ వేయడానికి భారీ ర్యాలీ తో ధూమ్, ధామ్ దరువుల తో అశేష జనవాహిని మధ్య జబ్బర్ కాంప్లెక్స్ నుండి సిటీ లైట్ హోటల్ చౌరస్తా, బాట, ప్యాట్నీ మీదుగా సికింద్రాబాద్ నార్త్ జోన్ జి హెచ్ ఎం సి కార్యాలయానికి కొద్ది సేపట్లో చేరుకోనున్నారు.
Read Also..
మేడ్చల్ జిల్లా పోచారం ఐ టి కార్డర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అన్నోజిగూడ, లక్ష్మి నర్సింహా స్వామి కాలనీలో నివసిస్తున్న దారావత్ కరణ్ నాయక్, తండ్రి లక్ష్మణ్, వయస్సు 18… అదే కాలనీకీ సంబందించిన కొందరు దుండగులు కలసి కరణ్ ను అతి దారుణంగా అత్య చేయడం జరిగింది. రంగంలో దిగిన పోలీస్ లు దుండగులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించి, కరణ్ మృత దేహాన్ని, గాంధీ హాస్పిటల్ కీ తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ హత్య ప్రేమ వివాహానికి సంబంధించింది అని తెలుస్తోంది పోలీసుల అదుపులో 9 మంది, మరికొందరి కోసం గాలింపు, ఇంకా పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
Read Also..
ప్రస్తుతం సెలవులో ఉండగా దక్షిణ మధ్య రైల్వేకు సంబంధించిన శిక్షణ కోసం హైదరాబాదులోని తన ఇంటి నుంచి కాజీపేటకు వచ్చారు. శిక్షణ పూర్తి చేసుకొని తిరిగి షిరిడి ఎక్ ప్రెస్ లో సికింద్రాబాద్ కు బయలుదేరాడు. చిన్న పెండ్యాల స్టేషన్గన్పూర్ మధ్యలో మందు గోలీలు రియాక్షన్ కావడంతో స్పృహ తప్పి పడిపోయాడు. ఒళ్లంతా దద్దుర్లు రావడంతో ప్యాసింజర్ భోగి లో ఉన్న అతని లాస్ట్ కంపార్ట్మెంట్ గార్డు విధులు నిర్వహించే బ్రేక్ పాయింట్ కు తరలించారు. అంతకుముందే జనగామ రైల్వే స్టేషన్ కు సమాచారం అందించగా జిఆర్పీల సహాయంతో అంబులెన్సును సిద్ధంగా ఉంచారు. అక్కడ నుంచి జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించగా వైద్యులు చికిత్స చేస్తున్నారు. లోకో పైలట్ ఆరోగ్యం నిలకడగా ఉందని డాక్టర్లు చెప్పారు.
Read Also..
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 7 న ఎల్బీస్టేడియంలో జరిగిన బీసీల ఆత్మగౌరవ సభకు హాజరైన ప్రధాని మోదీ.. ఈ నెల 11న మరోసారి తెలంగాణకు రానున్నారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించనున్న మాదిగ ఉప కులాల ‘విశ్వరూప మహాసభ’కు హాజరుకానున్నారు. రెండు రోజుల వ్యవధిలో ప్రధాని మరోసారి హైదరాబాద్ కు వస్తుండటంతో సభ ఏర్పాట్లపై రాష్ట్ర నాయక త్వం దృష్టి పెట్టింది.
సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పద్మారావు గౌడ్ ఈ రోజు నార్త్ జోన్ మున్సిపల్ కార్యాలయంలో ఎలాంటి హంగు, ఆర్భాటం లేకుండా, సాదాసీదా గా వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. రెండు సెట్ల నామినేషన్ పత్రాలను ఆర్వో కు సమర్పించారు.
Read Also..






Total views : 200828