వరంగల్ ఎంజీఎం హాస్పిటల్లో ఉద్యోగాలు కల్పిస్తామంటూ.. నకిలీ నియామక ఉత్తర్వులు జారీ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జనవరి 23వ తేదీతో జారీ చేసిన ఒక నకిలీ ఉత్తర్వు తాజాగా బయటకు వచ్చింది. ఓ మహిళా నిరుద్యోగిని ఐసీయూ టెక్నీషియన్‌గా నియమిస్తూ, ఫిబ్రవరి 26న విధుల్లో చేరాలని ఎంజీఎం హెల్త్ డిపార్ట్మెంట్ హాస్పిటల్ పేరున ఉత్తర్వులు ఇచ్చారు. దానిపై పచ్చపెన్నుతో సూపరింటెండెంట్ డా. యాదవ్ కుమార్ అని సంతకం ఉంది. అలాగే ఫిబ్రవరి 9వ తేదీతో మరో నియామక ఉత్తర్వు వెలుగుచూ సింది. ఆఫీస్ ఆఫ్ ది రీజినల్ మెడికల్ ఆఫీసర్ ఎంజీఎం హాస్పిటల్, వరంగల్ అని దానిపై ఉంది. ఎంజీఎంలో రెసిడెన్షియల్ మెడికల్ ఆఫీసర్ ఉంటారు. రీజినల్ మెడికల్ ఆఫీసర్ పోస్టు లేదు. దీన్నిబట్టి ఎవరో నకిలీ నియామక పత్రాలతో నిరుద్యోగులకు వల విసురుతున్నట్లు స్పష్టమవుతోంది. కాంట్రాక్టు పద్ధతిలో నెలకు రూ.25 వేల వేతన ఓ మహిళా ఓపీ రిసెప్షనిస్ట్ (ఓపీ నియమిస్తూ.. ఈ నెల 19న విధుల్లో చేరాలా ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ జె. సుధాకర్ రెడ్డి పేరుతో మరొక పత్రం వెలువడింది.
Warangal
పోలీసులు ఔదార్యం (police generous):
హైదరాబాద్ మల్కాజ్గిరి నుంచి జాతరకు వచ్చిన భక్తుడు రోహిత్ లాల్ చికలగుట్ట వెంట సుమారు 4 కిలోమీటర్ల దూరంలో సరదాగా వెళ్లి జంపన్న వాగులో స్నానం చేస్తూ నీటిలో మునిగి మృతి చెందారు. బందువులు ఇచ్చిన సంచారంతో స్పందించిన ఇంటలిజెన్స్ సీఐ సట్ల కిరణ్ కుమార్, సీసీఎస్ సీఐ అనుగుల శ్రీనివాస్, SI శ్రీకాంత్ రెడ్డి, సిబ్బంది రమేష్, మధు, సాంబయ్య, శంకర్ లు కాలినడకన భక్తుడు మృతి చెందిన చోటికి వెళ్ళారు. సుమారు 3 గంటలపాటు శ్రమించి నీటిలో మృత దేహం గుర్తించారు. మృతదేహం బయటికి తీసుకువచ్చారు. అడవి బాటలో మృతదేహం వాహనాల్లో తీసుకు వచ్చే అవకాశం లేకపోవడంతో మృత దేహాన్ని కర్రలకు కట్టుకుని బూజన మోసుకుంటూ సుమారు 4 కిలోమీటర్లు నడిచి మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. రాను పోను 8 కిలోమీటర్ల నడవడంతోపాటు మృత దేహాన్ని 4 కిలోమీటర్లు మోసిన పోలీసులను భక్తులు అభినందిస్తున్నారు.
ఇది చదవండి: బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్…
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మేడారం శ్రీ సమ్మక్క-సారలమ్మ మహాజాతర నాలుగు రోజులుగా భక్త జనంతో పులకించింది. నాలుగు రోజులుగా కోటిన్నర మంది భక్తుల మొక్కులందుకున్న వన దేవతలు మహా జాతర ముగియడంతో జనం నుంచి వనంలోకి వెళ్లిన సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులు. శనివారం సాయంత్రం గిరిజన పూజారులు ప్రత్యేక పూజల మధ్య వనప్రవేశం చేయించారు. ముందుగా గోవింద రాజు, పగిడిద్ద రాజులను స్వస్థలాలకు తీసుకెళ్లారు. తర్వాత సమ్మక్కను చిలకల గుట్టలో ఉన్న వనంలోకి, సారలమ్మను కన్నేపల్లికి తీసుకెళ్లారు. ఉద్విగ్నంగా సాగిన ఈ ఘట్టాన్ని వీక్షించేందుకు జాతర చివరి రోజు కూడా భక్తులు పోటెత్తారు. వనదేవతలు అడవికి చేరే సమయంలో వాన జల్లులు కురవడంతో భక్తుల ముఖంలో చిరునవ్వు వెల్లు విరిసింది.
Sammakka- Saralamma Jathara :
ములుగు జిల్లా మేడారం కాకతీయులతో జరిగిన యుద్ధంలో పోరాడి వీర వనితలైన వన దేవతలు మేడారం సమ్మక్క- సారలమ్మ జాతరకు మావోయిస్టులు వచ్చే అవకాశం ఉంటుందని భావించిన పోలీసులు మేడారం జాతర పరిసరాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు కనబడుతుంది. మేడారం జాతర జరిగే సమయంలో మావోయిస్టులు జాతర పరిసర ప్రాంతాల్లో సంచరించి వీర వనితలైన సమ్మక్క సారలమ్మలతో పాటు ఉద్యమంలో అమరులైన మావోయిస్టులకు కూడా నివాళులర్పిస్తారని గత కొన్నేండ్లుగా జాతర సమయంలో ప్రచారం జరుగుతుంటుంది.
Follow us on : Facebook, Instagram & YouTube.
సమ్మక్క కొలువైన చిలుకలగుట్టపై 2002 లో మావోయిస్టులు అమరవీరుల రెడీమెడ్ స్థూపాన్ని నిర్మించి అప్పట్లో సంచలనాన్ని రేకెత్తించారు. అప్పటి నుంచి గడిచిన జాతరలలో ప్రతీ జాతరకు మావోయిస్టులు మేడారం జాతర పరిసర ప్రాంతాలలోకి వచ్చి ఏదో ఒక రకంగా తమ ఉనికిని చాటుకునే వారని జాతర సమయాల్లో ప్రచారం జరిగేది. మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులు ఆజాద్, సోమన్న, పటేల్ సుధాకర్‌రెడ్డి, యాదన్న, మధు తదితరులు మేడారం పరిసర ప్రాంతాల్లో జరిగిన ఎన్ కౌంటర్లలోనే మృతి చెందారు. రెండేళ్లకొక్కసారి జరిగే మేడారం జాతరకు లక్షలాది మంది భక్తులు తరలివస్తుంటారు. సమ్మక్క సారలమ్మలు చేసిన పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకుంటూ తమ ఉద్యమాన్ని ముందుకు తీసుకపోయేందుకు మేడారాన్ని మావోయిస్టులు ఒక వేదికగా చేసుకుంటున్నారనే ప్రచారం కూడా ఉంది.
వీర వనితలకు, మావోయిస్టు అమరవీరులకు మేడారం జాతర సమయంలో మేడారం జాతర పరిసర ప్రాంతాల్లో నివాళులర్పించేందుకు మావోయిస్టులు మేడారం జాతర పరిసర ప్రాంతాలకు వచ్చే అవకాశం ఉంటుందని భావించి అటవీ ప్రాంతాలతో పాటు చత్తీస్ గడ్ నుండి మేడారం జాతరకు వచ్చే భక్తులతో కలిసి మావోయిస్టులు మేడారం వచ్చే అవకాశాలు ఉంటాయని, ముఖ్యంగా భూపాలపల్లి జిల్లా మహాముత్తారం, ముకునూరు, నీలంపల్లి ములుగు జిల్లా వాజేడు, వెంకటాపురం(నూగూరు), కన్నాయిగూడెం, ఏటూరునాగారం, మంగపేట నుండి మేడారం వెళ్లే వాహనాలపై, అటవీ ప్రాంతాలపై, ఫెర్రీ పాయింట్లపై పోలీసులు ప్రత్యే దృష్టి సారించినట్లు తెలుస్తుంది.
మేడారం లాంటి పెద్ద జాతరలకు కూడా మహిళలకు ఉచిత ప్రయాణం అందించడమనేది రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయమని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ బస్ స్టాండ్ ను మంత్రి పొన్నం ప్రభాకర్ ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా రోజువారి ప్రయాణికులతో పాటు, మేడారం వెళ్తున్న ప్రయాణికులతో కాసేపు మాట్లాడారు. ప్రయాణికులు, ఆర్టీసీ ఉద్యోగులతో మాట్లాడి సంస్థ నుండి అందుతున్న సౌకర్యాల పై అడిగి తెలుసుకున్నారు. మేడారానికి ప్రత్యేక బస్సులు నడుపుతున్న ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లకు దాతలు అందిస్తున్న అల్పాహారాన్ని పంపిణీ చేశారు. అక్కడే ఉన్న ఆటో డ్రైవర్ల తో మాట్లాడి ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వారి సమస్యలు పరిష్కరిస్తామన్నారు. మాజీ మంత్రి హరీష్ రావు ఆటో డ్రైవర్లకు నెలకు పది పదిహేను వేయిలు ఇవ్వాలని అర్థం పర్థం లేని డిమాండ్ చేస్తున్నారని ఆటో డ్రైవర్లతో మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే వాహనాల ఇంజన్ల పై ట్యాక్స్ ను నాలుగు వెయిల నుండి పదివేలకు పెంచారని ఈ సందర్భంగా మంత్రి ఎదుట ఆటో డ్రైవర్లు వాపోయారు.
తెలంగాణ కుంభమేళా, మేడారం జాతరను సీఎం రేవంత్ రెడ్డి సందర్శించారు. సీఎంకు మంత్రి సీతక్క, అధికారులు స్వాగతం పలికారు. సీఎం హోదాలో రేవంత్ రెడ్డి తొలిసారి అమ్మవార్లను దర్శించుకున్నారు. అమ్మవార్లకు రేవంత్ రెడ్డి నిలివెత్తు బంగారం సమర్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు సీతక్క, కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్ బాబు, సీఎస్ శాంతి కుమారి పాల్గొన్నారు. మేడారం సమ్మక్క సారక్కలను దర్శించుకున్న అనంతరం ఆరు గ్యారెంటీల అమలు పై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఫిబ్రవరి 27న రూ. 500కే గ్యాస్, 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ అమలు చేస్తామని చెప్పారు. పథకం అమలు కార్యక్రమానికి ప్రియాంక గాంధీ వస్తారని తెలిపారు. గతంలో కేసీఆర్ దర్శించుకోలేదు కాబట్టే ఓడిపోయారని అన్నారు. జాతరకు కోటిన్నరకు పైగా భక్తులు వస్తే ఈ పండుగను జాతీయ పండుగగా మార్చమని కేంద్రాన్ని కోరామని కానీ అందుకు కేంద్రం పట్టించుకోలేదని చెప్పారు. దక్షిణాది కుంభమేళాకు కేంద్రం ఇచ్చేది రూ. 3 కోట్ల రూపాయలేనా అని ప్రశ్నించారు. ముఖ్యమైన ఏ కార్యక్రమం తీసుకున్న ఇక్కడి నుంచే మొదలు పెట్టామని రేవంత్ రెడ్డి చెప్పారు. హాత్ సే హాత్ జోడో యాత్ర ఇక్కడి నుంచే ప్రారంభించామని అన్నారు. సమక్క సారక్క దీవెనలతోనే ప్రజా ప్రభుత్వం ఏర్పడిందన్నారు. యాత్ర సమయంలో ఎలాంటి ఆకంటం లేకుండా జాతర జర్పిస్తామని మాట ఇచ్చామని మాట ప్రకారం జాతర కోసం రూ. 110 కోట్ల రూపాయలు నిధులు విడుదల చేశామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
మేడారం జాతర (Medaram Jathara):
మేడారంలో వనదేవతల మహాజాతర అంగరంగ వైభవంగా ప్రారంభం అయింది. చుట్టుపక్కల రాష్ట్రాలతో పాటు దేశ, విదేశాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు. నేటి నుంచి నాలుగు రోజుల పాటు జరిగే జాతర లో సుమారు కోటిన్నర మంది భక్తులు సమ్మక్క- సారలమ్మ ల దర్శనానికి వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. నాలుగు రోజులపాటు కిక్కిరిసిపోయే మేడారం జాతరలో పోలీసు వ్యవస్థే చాలా కీలకంగా వ్యవహారిస్తుంది.
సమ్మక్క- సారలమ్మ తల్లులను గద్దెలకు చేర్చడం నుంచి ప్రముఖులకు బందోబస్తు ఇవ్వడం, మేడారం తరలి వచ్చే వాహనాలకు ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చేయడం, జాతరలో రష్ ను కంట్రోల్ చేయడం, ఎలాంటి ఆవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా చూడటం, దొంగతనాల నియంత్రణ ఇలా ప్రతి ఒక్క పనీ పోలీసుల పైనే ఆధారపడి ఉంటుంది. అందుకే మేడారం మహాజాతరలో పోలీసు బలగాలే కీలకంగా పని చేస్తాయి. మేడారం సమ్మక్క–సారలమ్మ మహాజాతరలో పోలీస్ ఫోర్స్ నేటి నుంచి రంగంలోకి దిగి చర్యలు చేపట్టారు. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన చర్యలు చేపట్టమని స్పష్టం చేస్తున్నారు.
Follow us on : Facebook, Instagram & YouTube.
మేడారం అంటేనే పోలీసులకు సవాల్ గా మారే జాతర గా చెప్తుంటారు. జాతరలో ఏం కొంచెం నిర్లక్ష్యం వహించినా.. తీవ్ర ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రతిచోటా పోలీస్ నిఘా ఉండేలా ఈసారి పెద్ద మొత్తంలో పోలీసులు మోహరిస్తున్నారు. జాతర పూర్తయ్యే వరకు 14 వేల మందితో భారీ బందోబస్తు నిర్వహించనున్నారు. ఇప్పటికే ఐజీ డా.తరుణ్ జోషి మేడారం మహాజాతర బందోబస్తు, నిఘాపై దృష్టి పెట్టారు. గతంలో మేడారం ట్రాఫిక్ ఇంచార్జి గా పని చేసిన అనుభవం ఉండటంతో ఆయన జాతరపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. జాతర మొత్తం మీద ఐజీ, డీఐజీలతో పాటు రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన 20 మంది ఎస్పీలు, 42 మంది ఏఎస్పీలు, 140 డీఎస్పీలు, 400 సీఐలు, వెయ్యి మంది ఎస్సైలు, దాదాపు 12 వేల మంది కానిస్టేబుళ్లకు జాతర విధులు కేటాయించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోసుకోకుండా ఉండేందుకు పకడ్బందీ చర్యలు చేపట్టినట్లు ములుగు జిల్లా ఎస్పీ తెలిపారు.
నేటి నుంచి 24వ తేదీ వరకు మేడారం మహా జాతర వైభవంగా జరుగుతుంది. ఈ నాలుగు రోజుల్లోనే దాదాపు కోటిన్నర మంది భక్తులు తల్లుల దర్శనానికి వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇంతా భారీ ఎత్తున తరలివచ్చే భక్తుల రద్దీని కంట్రోల్ చేయడం కత్తిమీద సాము లాంటి పని… జాతర సమయంలో చిన్నాచితకా దొంగతనాలు జరిగే అవకాశం కూడా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే భద్రతా పరమైన చర్యలతో పాటు జాతర క్రౌడ్ కంట్రోల్ కు పోలీసులు ఎక్కడికక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. జాతర పరిసరాల్లో మొత్తంగా 500 కు పైగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్టు,కమాండ్ కంట్రోల్ రూం ఏర్పాటు చేసి మేడారం జాతరను పర్యవేక్షణ చేస్తున్నాం అని ములుగు ఎస్పీ శబరీష్ చెబుతున్నారు.
సమ్మక్క-సారలమ్మ లను దర్శించుకోవడానికి ఈసారి ప్రముఖుల ఎక్కువ సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి 23 న జాతరకు వస్తున్నారు.. ఈ నేపథ్యంలో అధికారులు ఫోకస్ పెట్టారు. రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి సీతక్క మేడారం జాతర సక్సెస్ పై దృష్టి పెట్టారు. రాష్ట్రంలోని అందరూ మంత్రులు మేడారం వచ్చే అవకాశం ఉంది. వీఐపీల తో పాటు సాధారణ భక్తుల దర్శనం కోసం పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశాలు ఉన్నాయి. Read Also..
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
సిద్దిపేట పట్టణంలోని ముస్తాబాద్ చౌరస్తా వద్ద ఉన్న 220 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్‌లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మంటలు పెద్ద ఎత్తున ఎగసిపడ్డాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేసేందుకు ప్రయత్నించినప్పటికీ ట్రాన్స్ఫార్మర్లు పేలడంతో ప్రమాద తీవ్రత మరింత పెరిగింది. ట్రాన్స్ఫార్మర్లు పెద్ద శబ్దంతో పేలడంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు.
ప్రధాన పార్టీ నాయకులు మధ్య డైలాగ్ వార్..!
వెంటనే సంఘటనా స్థలానికి మంత్రి పొన్నం ప్రభాకర్ చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. రెండు, మూడు రోజులు విద్యుత్ సరఫరాకు ఆటంకం కలుగుతుందని తెలిపారు. సాధ్యమైనంత త్వరగా మరమ్మతులు చేస్తామన్నారు. రైతులకు ఇబ్బంది లేకుండా చూస్తామని పొన్నం హామీ ఇచ్చారు.
Follow us on : Facebook, Instagram & YouTube.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మేడారం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.. భక్తిభావంతో పులకించిపోతోంది. జయజయ ధ్వానాలతో మారుమోగుతోంది.. అటు జంపన్నవాగులో స్నానాలు, ఇటు అమ్మల దర్శనానికి బారులు భక్తజనం బారులు తీరారు. మాఘశుద్ధ పున్నమి వెన్నెల్లో సమ్మక్క సారక్క దేవతలు గద్దెలపై కొలువుదీరే శుభ గడియలు వచ్చేశాయి. నేడు మేడారం జాతరలో అసలు ఘట్టం ఆవిష్కరణ కానుంది. వనం నుంచి జనంలోకి సమ్మక్క దేవత ఆగమనం కానుంది. చిలుకల గుట్ట నుంచి కుంకుమ భరణి రూపంలో సమ్మక్క దేవతను తీసుకొచ్చి గద్దెలపై ప్రతిష్టించనున్నారు.
శ్రీ భీమేశ్వర స్వామి వారి దివ్య కళ్యాణ మహోత్సవములు
ప్రభుత్వం తరఫున మంత్రి సీతక్క సమ్మక్క దేవతకు స్వాగతం పలకనున్నారు. గాల్లోకి కాల్పులు జరిపి అధికారిక లాంఛనాలతో.. ఎస్పీ, కలెక్టర్ సమ్మక్కకు స్వాగతం పలకనున్నారు. సమ్మక్క తల్లికి గౌరవ సూచకంగా ఎస్పీ గాల్లో మూడు రౌండ్లు తుపాకీ పేల్చుతారు. గుట్టపై నుంచి సమ్మక్క కిందకు వచ్చే సమయంలో ఆదివాసీ కళాకారులు సాంస్కృతిక ప్రదర్శనలు చేస్తారు. అర్ధరాత్రి గద్దెలపై సారలమ్మ కొలువుదీరారు. గద్దెలపై గోవిందరాజు, పగిడిద్దరాజు కొలువుదీరారు. ఇక, మేడారం పరిసరాలు లక్షల మంది భక్తులతో కిటకిటలాడుతున్నాయి.
శారదాపీఠం వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న జగన్
Follow us on : Facebook, Instagram & YouTube.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మేడారం సమ్మక్క సారలమ్మ మహా జాతర ట్రస్ట్ బోర్డ్ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. మేడారం నూతన ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ గా అర్రెమ్ లచ్చు పటేల్ తోపాటు 14 మంది సభ్యులను మంత్రి సీతక్క ప్రమాణ స్వీకారం చేయించారు. నూతన ట్రస్ట్ బోర్డ్ సభ్యులను గజమాలతో సన్మానించారు. కమిటి సభ్యులు మంత్రిని శాలువతో సన్మానించారు. ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఆదివాసుల ఇలవేల్పు మహా జాతర విజయవంతం చేయాడానికి ట్రస్ట్ బోర్డ్ సభ్యులు పని చేయాలని సీతక్క అన్నారు. అన్ని సామాజిక వర్గాల వారికి ట్రస్ట్ బోర్డులో ఆవకాశం కల్పించామని మంత్రి అన్నారు. జాతర విజయవంతం కోసం అధికారులతో పాటు.. ట్రస్ట్ బోర్డ్ సభ్యులు కష్టపడి పనిచేయాలన్నారు.






Total views : 90582