Saturday, July 18, 2026
News Navigation
Saturday, July 18, 2026
News Navigation

Breaking

Saturday, July 18, 2026
Home Crime సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ బాలుడి కిడ్నాప్ కేసు సుకాంతం.

సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ బాలుడి కిడ్నాప్ కేసు సుకాంతం.

by CVR NEWS
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ బాలుడి కిడ్నాప్ కేసు సుకాంతం

హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన ఐదేళ్ల చిన్నారి కిడ్నాప్ కేసు ఎట్టకేలకు సుఖాంతమైంది. గత నెల 20న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో దాదాపు 12 రోజులుగా క్రితం అదృశ్యమైన బాలుడు నిఖిల్.. కోసం కుటుంబ సభ్యులు, పోలీసులు తీవ్రంగా గాలిస్తుండగా.. చిన్నారిని కిడ్నాప్ చేసిన వ్యక్తే జీడిమెట్ల పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చిన ఘటన ఆసక్తికరంగా మారింది. షాపూర్‌నగర్‌కు చెందిన షేక్ అహ్మద్ అలీ అనే వ్యక్తి రైల్వే స్టేషన్ నుంచి బాలుడిని తీసుకెళ్లి.. తన వద్ద ఉంచుకున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. రెండు రోజుల క్రితమే బాలుడిని జీడిమెట్ల పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చి అప్పగించడంతో పోలీసులు వెంటనే విచారణ చేపట్టారు. సికింద్రాబాద్ పరిధిలోని చిలుకానగర్‌లో నివసిస్తున్న బాలుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. దీంతో రోజుల తరబడి ఆందోళనలో ఉన్న తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే బాలుడిని కిడ్నాప్ చేయడానికి గల కారణాలేంటి? నిందితుడి ఉద్దేశం ఏమిటి? ఈ వ్యవహారంలో మరెవరైనా ఉన్నారా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Advertisements

You may also like

Our Visitor

041213
Total views : 214673

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: